Biology | గాలిలోని వాయువుల భాగాన్ని ఏమంటారు?
బయాలజీ
1. కింది జంతువుల్లో ఏది ‘ఉష్ణ వలస’ చేయదు?
1) కప్ప 2) మొసలి
3) మానవుడు 4) నాగుపాము
2. డాఫ్నియాలో గుండ్రటి తల ఏ కాలంలో కనిపిస్తుంది?
1) వేసవి కాలం 2) ఆకురాలు కాలం
3) చలికాలం 4) వసంత కాలం
3. శరీర పరిమాణం, ఉష్ణోగ్రతకు గల సంబంధాన్ని కింది ఏ సూత్రం వివరిస్తుంది?
1) ఎలెన్స్ సూత్రం
2) వాంట్ హాఫ్ సూత్రం
3) బెర్గ్మన్స్ సూత్రం
4) గ్లోజర్స్ సూత్రం
4. ఎలెన్స్ సూత్రం ఉష్ణోగ్రత ప్రభావం కింది వాటిలో దేన్ని వివరిస్తుంది?
1) చెవి పరిమాణం 2) వర్గీకరణ
3) జీవక్రియారేటు
4) వెన్నుపూసల సంఖ్య
5. నీటి ఆవాసాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు?
1) మంచినీటి ఆవాసం
2) సముద్ర ఆవాసం
3) నదీముఖ ద్వార ఆవాసం
4) 1, 2, 3
6. వాతావరణం, భూమి మధ్య నీటి భ్రమణాన్ని ఏమంటారు?
1) హైడ్రోలజికల్ చక్రం
2) బాష్పోత్సేకం
3) వర్షాలు 4) అవక్షేపం
7. అమీబాలో ద్రవాభిసరణ క్రమతకు కింది ఏ అవయవం సహాయపడుతుంది?
1) కేంద్రకం 2) ఆహార రిక్తికలు
3) సంకోచ రిక్తికలు 4) మిధ్యాపాదాలు
8. జీవులు వేసవి కాలంలో ప్రతికూల పరిస్థితుల నుంచి తట్టుకునే ప్రక్రియను ఏమంటారు?
1) శీతాకాల సుప్తావస్థ
2) గ్రీష్మకాల సుప్తావస్థ
3) గ్రీష్మకాల స్తరీభవనం
4) శీతాకాల స్తరీభవనం
9. ఏ భౌతిక ప్రక్రియలో శరీరం నుంచి నీరు తొలగించడం జరుగుతుంది?
1) ఎండాస్మాసిస్ 2) ఎక్సాస్మాసిస్
3) పీల్చుకోవడం 4) వ్యాపనం
10. ఎశ్చురీ అంటే?
1) కుంట నదిలో కలవడం
2) వరదనీరు నదిలో కలవడం
3) సముద్ర అలలు కుంటలో కలవడం
4) నది సముద్రంలో కలవడం
11. ఆవరణ వ్యవస్థలో నిర్జీవ కారకం కానిది ఏది?
1) కాంతి 2) ఉష్ణోగ్రత
3) వాతావరణ పీడనం
4) పరాన్నజీవి
12. హైపోక్సియా అంటే?
1) ఆక్సిజన్ అధికంగా లభించడం
2) ఆక్సిజన్ లభించకపోవడం
3) ఆక్సిజన్ దొరికినా జీవి దాన్ని తీసుకోదు
4) శ్వాసనాళానికి వ్యాధి సోకడం వల్ల శ్వాస వ్యవస్థ విఫలమవుతుంది
13. జీవ సందీప్తిని ఏమని పిలుస్తారు?
1) పరారుణ కాంతి 2) ఉష్ణకాంతి
3) చల్లని కాంతి
4) అతినీలలోహిత కాంతి
14. జీవ సందీప్తిని చూపే అనెలిడా జంతువు ఏది?
1) అరీలియా 2) కీటాప్టెరస్
3) హాటిరోనీరిస్ 4) పైరోసోమా
15. జంతువుల్లో కాంతి ఉత్పత్తి కావడానికి ఉపయోగించే రసాయనం?
1) ఆక్సీల్యూసిఫెరిన్
2) ఆక్సీల్యూసిఫెరేజ్
3) ల్యూసిఫెరేజ్ 4) ల్యూసిఫెరిన్
16. జీవ సందీప్తిలో చివరి ఉత్పన్నకాలు?
1) లూసిఫెరిన్, ఆక్సిజన్
2) ఆక్సీల్యూసిఫెరిన్, నీరు
3) ఆక్సీల్యూసిఫెరిన్, ATP
4) ఆక్సీల్యూసిఫెరిన్, నీరు, కాంతి
17. జీవావరణ వ్యవస్థలో శక్తికి మూలాధారం?
1) నీరు 2) సూర్యకాంతి
3) పిండి పదార్థం 4) ATP
18. అలెల్లోపతి అంటే ఏమిటి?
1) కణ కీలితాల ఆధారంగా జాతుల మధ్య సంబంధాలు
2) ఆహార జాలకంలోని భాగం
3) వ్యాధి నివారణకు మందులు వాడటం
4) రసాయనిక పదార్థాల ఆధారంగా జాతుల మధ్య పరస్పర సంబంధాలు
19. మొత్తం జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
1) ప్రాథమిక వినియోగదారులు
2) ద్వితీయ వినియోగదారులు
3) ప్రాథమిక ఉత్పత్తిదారులు
4) ద్వితీయ ఉత్పత్తిదారులు
20. కప్ప, కుక్క, తోడేలు వేటికి ఉదాహరణలు?
1) ప్రాథమిక వినియోగదారులు
2) ద్వితీయ వినియోగదారులు
3) ద్వితీయ ఉత్పత్తిదారులు
4) ప్రాథమిక ఉత్పత్తిదారులు
21. ఆవరణ వ్యవస్థ పనిచేయడానికి కావలసిన శక్తి మూలకం?
1) మొక్కలు 2) శాకాహారులు
3) ATP 4) సౌరశక్తి
22. మేసే ఆహార గొలుసులో మూడో పోషణ స్థాయి?
1) ప్రాథమిక వినియోగదారులు
2) ద్వితీయ వినియోగదారులు
3) ప్రాథమిక ఉత్పత్తిదారులు
4) ద్వితీయ ఉత్పత్తిదారులు
23. భూమిపైన కిందివాటిలో ఏది ప్రాథమిక ఉత్పత్తిని ప్రారంభిస్తుంది?
1) కాంతి 2) శాకాహారులు
3) విచ్ఛేదనకారులు 4) ATP
24. గద్ద, సింహం, పులి ఏ స్థాయికి చెందుతాయి?
1) ప్రాథమిక వినియోగదారులు
2) ద్వితీయ వినియోగదారులు
3) ప్రాథమిక మాంసాహారులు
4) ప్రథమ పోషక స్థాయిని ఆక్రమిస్తాయి
25. మేసే ఆహార గొలుసు గరిష్ఠ పోషకస్థాయి జీవులు?
1) పతాక మాంసాహారులు
2) శాకాహారులు
3) ప్రాథమిక మాంసాహారులు
4) విచ్ఛేదనకారులు
26. కింది వాటిలో ఏ జీవి సూక్ష్మ వినియోగకారి కాదు?
1) పూతికాహార భక్షకి
2) ప్రొటిస్ట్లు 3) డెట్రివోర్స్
4) లవణీకరణకారులు
27. ఏ సహజీవనంలో ఒక జీవికి హాని జరిగి, మరొక జీవికి ఏమీ కాదు?
1) సహభోజకత్వం
2) అన్యోన్యాశ్రయం
3) పరభక్షణ 4) ఎమెన్సలిజమ్
28. సాధారణంగా ఒక ఆహార గొలుసులో ఎన్ని పోషణ స్థాయిలు ఉంటాయి?
1) 1, 2 2) 2, 3
3) 4, 5 4) 6, 8
29. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు?
1) హెకెల్ 2) ఎ.జి.టాన్స్లే
3) రీటర్ 4) లంకాస్టర్
30. జీవావరణ శాస్ర్తాన్ని నిర్వచించి ఉపయోగించింది ఎవరు?
1) రీటర్ 2) హెకెల్
3) లంకాస్టర్ 4) టాన్స్లే
31. ఒయికాస్ అనే గ్రీకు పదానికి అర్థం?
1) స్థితి 2) ఆవాసం
3) జనాభా 4) సమాజం
32. జీవగ్రహం అని దేన్ని అంటారు?
1) చంద్రుడు 2) భూమి
3) సూర్యుడు 4) పైవన్నీ
33. గాలి, నీరు మొదలైన భౌతిక అంశాలన్నింటినీ ఏమంటారు?
1) సాంస్కృతిక పర్యావరణం
2) సామాజిక పర్యావరణం
3) జీవ పర్యావరణం
4) నిర్జీవ పర్యావరణం
34. భూమిపై గల నేలభాగాన్ని ఏమంటారు?
1) జలావరణం 2) వాతావరణం
3) శిలావరణం 4) పైవన్నీ
35. గాలిలోని వాయువుల భాగాన్ని ఏమంటారు?
1) శిలావరణం 2) జలావరణం
3) వాతావరణం 4) పైవేవీ కాదు
36. భూమిపై శక్తికి మూలాధారం ఎవరు?
1) నీరు 2) సూర్యుడు
3) గాలి 4) నేల
37. మొక్కలు ఏ వాయువును ఉపయోగించుకుని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి?
1) నైట్రోజన్ 2) ఆక్సిజన్
3) కార్బన్ డై ఆక్సైడ్ 4) పైవన్నీ
38. భూగోళ ఉపరితలం ఎంత శాతం నీరు ఆవరించి ఉంది?
1) 40 శాతం 2) 80 శాతం
3) 90 శాతం 4) 70 శాతం
39. సామాజిక, సాంస్కృతిక పర్యావరణం అని దేన్ని అంటారు?
1) జీవ పర్యావరణం
2) నిర్జీవ పర్యావరణం
3) మానవ నిర్మిత పర్యావరణం
4) పైవేవీ కాదు
40. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రదేశం?
1) ఎడారులు 2) అడవులు
3) ధ్రువాలు 4) కొలనులు
41. భూ ఉపరితలంలో నేల ఎంత భాగాన్ని ఆవరించి ఉంది?
1) 90 శాతం 2) 80 శాతం
3) 30 శాతం 4) ఏదీ కాదు
42. భూమి ఉపరితలంపై గల మెత్తని మట్టిని ఏమంటారు?
1) కృత్తిక 2) మృత్తిక
3) 1, 2 4) ఏదీ కాదు
43. గాలిలోని వాయువుల భాగాన్ని ఏమంటారు?
1) వాతావరణం 2) శిలావరణం
3) జలావరణం 4) పర్యావరణం
44. కింది వాటిలో ఉత్పత్తిదారులను గుర్తించండి.
1) మనుషులు 2) మొక్కలు
3) జంతువులు 4) పైవేవీ కాదు
45. కింది వాటిలో పరపోషకాలను గుర్తించండి.
1) జంతువులు 2) మొక్కలు
3) జంతువులు, మొక్కలు
4) పైవేవీ కాదు
46. మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి ఉపయోగించే కారకం ఏది?
1) ఉష్ణం 2) కాంతి
3) నీరు 4) ఏదీ కాదు
47. కేవలం మొక్కలను మాత్రమే ఆహారంగా తీసుకునే జంతువులను ఏమంటారు?
1) వినియోగదారులు
2) ప్రథమ వినియోగదారులు
3) ఉత్పత్తిదారులు
4) శాకాహారులు
48. కింది వాటిలో ప్రథమ వినియోగదారులను గుర్తించండి.
1) మొక్కలు 2) శాకాహారులు
3) జంతువులు 4) పైవేవీ కాదు
49. కింది వాటిలో ద్వితీయ వినియోగదారులను గుర్తించండి.
1) మేక 2) కుందేలు
3) చిలుక 4) తోడేళ్లు
50. నేలలో ఉండే కొన్ని సూక్ష్మజీవులు, జంతువులను కుళ్లింపజేసి వాటి నుంచి భిన్న మూలకాలను విడుదల చేసే వాటిని ఏమంటారు?
1) మాంసాహారులు 2) విచ్ఛిన్నకారులు
3) వినియోగదారులు 4) పైవేవీ కాదు
51. మొక్కలు, జంతువుల మధ్య ఆహారం ద్వారా ఏర్పడే బంధాన్ని ఏమంటారు?
1) ఆహారపు గొలుసులు
2) పరస్పర ఆధారం
3) 1, 2 4) పైవేవీ కాదు
52. మొక్కల పెరుగుదలకు కావలసిన ఉష్ణోగ్రత ఎంత?
1) 500-600 2) 200-300
3) 300-400 4) 00-100
53. ఎడారి మొక్కలకు ఉదాహరణ?
1) మల్లె 2) జాజి
3) తులసి 4) బ్రహ్మజెముడు
54. కింది వాటిలో ఎడారి జంతువును గుర్తించండి.
1) ఒంటె 2) జడల బర్రె
3) అడవి మృగం 4) ఏదీకాదు
55. విశ్వ ద్రావణి అంటే?
1) గాలి 2) నేల
3) నీరు 4) పైవన్నీ
56. మొక్కల పెరుగుదలకు ఉపయోగపడేది?
1) ఆక్సిజన్ 2) నీరు
3) హ్యూమస్ 4) పైవేవీ కాదు
57. సహజ వనరుల కారకాలు?
1) ఒకటి 2) రెండు
3) మూడు 4) నాలుగు
58. కింది వాటిలో పునరుద్ధరింపదగిన వనరు?
1) నీరు 2) ముడి ఖనిజాలు
3) పెట్రోలియం 4) బొగ్గు
59. పునరుద్ధరింపదగని వనరు?
1) గాలి 2) నీరు
3) మొక్కలు 4) పెట్రోలియం
60. మంచినీరు ఎక్కువ భాగం ఏ ప్రదేశంలో ఉంది?
1) సముద్రాలు 2) నదులు
3) సరస్సులు
4) ధ్రువ ప్రాంతంలోని మంచు
సమాధానాలు
1. 3 2. 3 3. 3 4. 2
5. 4 6. 1 7. 3 8. 2
9. 2 10. 4 11. 4 12. 2
13. 3 14. 2 15. 4 16. 4
17. 2 18. 4 19. 3 20. 2
21. 4 22. 2 23. 1 24. 2
25. 1 26. 2 27. 4 28. 3
29. 2 30. 2 31. 2 32. 2
33. 4 34. 3 35. 3 36. 2
37. 3 38. 4 39. 3 40. 1
41. 3 42. 2 43. 1 44. 2
45. 1 46. 2 47. 4 48. 3
49. 4 50. 2 51. 1 52. 3
53. 4 54. 1 55. 3 56. 3
57. 2 58. 1 59. 4 60. 4
పట్టు పురుగులు
- పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు.
- పట్టుపురుగుల ఆహారం- మల్బరీ ఆకులు
పట్టుపురుగు శాస్త్రీయనామం – బాంబిక్స్ మోరి - పట్టుపురుగు గుడ్లను సర్వసాధారణంగా విత్తనాలు అని పిలుస్తారు.
- పట్టుపురుగులను అమ్మే కేంద్రాలను గ్రెనేజస్ అంటారు.
- పట్టుపురుగుల డింభకాలను కొకూన్ అంటారు.
- పట్టుపురుగులు ఓక్ చెట్లపైన పెరుగుతాయి.
- పట్టు పట్టణంగా యాదాద్రి జిల్లాలోని పోచంపల్లిని పిలుస్తారు.
- పోచంపల్లి పట్టును టై అండ్ డై లేదా జిందాని పట్టు అని కూడా పిలుస్తారు.
- పట్టుపురుగు దారాల్లో సిరిసిన్, ఫైబ్రోయిన్ అనే ప్రొటీన్లు ఉంటాయి.
- పట్టు కాయల నుంచి పట్టుదారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటారు.
- పట్టు పురుగు జీవిత చరిత్రలో గుడ్డు/డింభకం/లార్వా, ప్యూపా, ప్రౌఢజీవి/ఇమాగో అనే దశలు ఉంటాయి.
ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు