Telugu TET Special | వర్ణమాలలోని అక్షరాలను ఎన్ని విభాగాలుగా విభజించవచ్చు?
నిన్నటి తరువాయి
97. ‘నేను నాదేశాన్ని ప్రేమిస్తున్నాను’ అనే వాక్యం పరోక్ష కథనంలో వెళ్లేటప్పుడు ఎలా మారుతుంది?
1) ప్రత్యక్ష వాక్యం 2) పరోక్ష వాక్యం
3) కరరి వాక్యం 3) కర్మణి వాక్యం
98. ప్రత్యక్ష కథనంలో ఉన్న నేను అనే వాక్యం పరోక్ష కథనంలో వెళ్లేటప్పుడు ఎలా మారుతుంది?
1) నన్ను 2) తాను
3) తమను 4) తమర్ని
99. ‘ఎప్పుడూ చచ్చేవాడికి ఏడ్చేదెవరు’ అని స్వాతంత్య్ర వీరులు అన్నారు’ ఇది ఏ రకమైన వాక్యం?
1) ప్రత్యక్ష వాక్యం 2) పరోక్ష వాక్యం
3) కర్తరి వాక్యం 4) కర్మణి వాక్యం
100. కింది సమాన పదాలను జతపరచండి?
1) దూడగడ్డి ఎ) ద్వితీయ తత్పురుష
2) దేశభక్తి బి) చతుర్దీ తత్పురుష
3) బుద్ధిహీనుడు సి) తృతీయ తత్పురుష
4) జలధరం డి) సప్తమీ తత్పురుష
1) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
101. ‘పంచపాండవులు’ పదానికి విగ్రహవాక్యం రాయండి?
1) 5 సంఖ్యగల పాండవులు
2) ఐదుగురు పాండవులు
3) పాండవులు ఐదుగురు
4) పాండవుల సంఖ్య ఐదు
102. ఉత్తర పద ప్రాధాన్యతను తెలిపే సమాసం ఏది?
1) కర్మధారయ సమాసం
2) తత్పురుష సమాసం
3) ద్విగు సమాసం
4) ద్వంద్వ సమాసం
103. కింది సమాస పదాల్లోని తత్పురుష భేదాలను గుర్తించండి?
1) ప్రాచీన కావ్యం 2) శక్తి సామర్థ్యాలు
3) రెండు రాష్ర్టాలు 4) సత్యదూరం
104. అన్య పదప్రాధాన్యం గల సమాసాన్ని ఏమంటారు?
1) రూపక సమాసం
2) బహువ్రీహి
3) సంభావన పూర్వపద
4) కర్మధారయ
105. అగ్నిభయం- ఈ పదానికి విగ్రహవాక్యం, సమాసం పేరు గుర్తించండి?
1) అగ్ని చేత భయం తృతీయ తత్పురుష సమాసం
2) అగ్ని కొరకు భయం చతుర్థీ తత్పురుష సమాసం
3) అగ్ని వలన భయం పంచమీ తుత్పురుష సమాసం-3
4) అగ్ని యొక్క భయం షష్ఠీతత్పురుష సమాసం
తగిలి మదంబు చే నెదిరి తన్ను నెఱుంగక దొడ్డవారిలోలు
పగగొని పోరుటెల్ల నతి పామరుడై చెడు, టింతేగాక దా
నెగడి జయింప నేరడది నిక్కము దప్పదు, ధాత్రి లోవలన్
దెగి యొకకొండతో తగరు ఢీకొని తాకిని నేమి భాస్కరా!
106. మనిషి గర్వంతో ఎప్పుడు చెడిపోతాడు?
1) ధనంతో 2) బలంతో
3) ఎదుటివారి శక్తిని గ్రహించినప్పుడు
4) తన శక్తి మీద విశ్వాసం లేనపుడు
107. పై పద్యంలో పామరుడు అనగా అర్థం?
1) మానవుడు 2) విజ్ఞాని
3) బ్రాహ్మణుడు 4) అజ్ఞాని
108. పై పద్యంలో నిక్కము అనే పదానికి అర్థం?
1) నిజం 2) గొప్పతనం
3) సాహసం 4) ఏదీకాదు
109. కొండతో తగరు ఢీకొనితాకిన అనే వాక్యములో ‘తగరు’ అంటే?
1) మనిషి 2) పొట్టెలు
3) మేక 4) ఏనుగు
110. పద్య లక్షణాలను వివరించే శాస్త్రం ఏది?
1) వ్యాకరణ శాస్త్రం
2) అలంకార శాస్త్రం
3) ఛంద శాస్త్రం 4) పైవేవీకావు
111. పద్యములు వీటితో ఏర్పడును?
1) అచ్చులు 2) హల్లులు
3) గురువు, లఘువులు
4) గణాలు
112. త్రిమాత్రాకాలికం ఏది?
1) లఘువు 2) గురువు
3) ప్లుతం 4) ఏదీకాదు
113. గురువుకు సూచించే గుర్తు?
1. U 2) a
3) 3 4) I
114. మాత్ర అంటే?
1. సెకనులో రెండో భాగం
2) సెకనులో మూడో భాగం
3) సెకనులో నాలుగో భాగం
4) సెకనులో ఐదో భాగం
115. ప్రతి పాదంలో 18 అక్షరాలుంటే అది ఏ పద్యపాదం?
1. చంపకమాల 2) మత్తేభం
3) శార్ద్దూలం 4) మత్తకోకిల
116. కింది వాటిలో ప్రాస నియమం ఎందులో ఉండదు?
1) ఉత్పలమాల 2) శార్దూలం
3) మత్తేభం 4) సీసం
117. మల్లికార్జున్ అనే పదమును గణవిభజన చేయగా?
1) UIIU 2) UIUU
3) UUII 4) ఏదీకాదు
118. మత్తకోకిల యతిస్థానం?
1) 10 2) 11 3) 13 4) 14
119. యతికి గల పర్యాయ పదం?
1) విశ్రాంతి 2) విశ్రమం
3) విరతి 4) పైవన్నీ
120. తెలుగు భాషకు వర్ణములెన్ని
1) 46 2) 16
3) 26 4) 36
121. ఆంధ్రభాషకు వర్ణము లెన్ని?
1) 36 2) 46
3) 56 4) 50
122. సంస్కృత భాషకు వర్ణములెన్ని?
1) 40 2) 20
3) 50 4) 30
123. ప్రాకృత భాషకు వర్ణములెన్ని?
1) 30 2) 50
3) 40 4) 36
124. వర్ణమాలలోని అక్షరాలను ఎన్ని విభాగాలుగా విభజించవచ్చు?
1) 2 2) 4 3) 3 4) 5
125. సరళంగా పలికేవి?
1) పరుషాలు 2) శ్వాసాలు
3) నాదాలు 4) అంతస్థాలు
126. కిందివాటిలో ఉభయాక్షరాలు ఏవి?
1) 0 2) సి 3) ః 4) పైవన్నీ
127. కింది వాటిలో అల్పప్రాణం ఏది?
1) గ 2) ఛ 3) ఘ 4) ద
128. కింది వాటిలో మహాప్రాణం ఏది?
1) ఘ 2) గ 3) చ 4) ట
129. వర్గయుక్కులు మొత్తం ఎన్ని ?
1) 8 2) 9 3) 10 4) ఏవీకావు
– వరుడికిచ్చే కట్నం వరకట్నం. దాని వల్ల సమాజంలో ఏర్పడే సమస్యని వరకట్న సమస్య అంటారు. వరకట్నం కేవలం ఆడపిల్ల తల్లిదండ్రులకే కాదు కుటుంబం మొత్తానికి కూడా అదొక దుర్భర సమస్యగా తయారైంది. అసలు కట్నం అంటే కానుక. పెళ్లి సందర్భంగా ఇచ్చే కానుక క్రమక్రమంగా కట్నమైంది. పూర్వకాలంలో కన్యాశుల్కం ఉండేది. డబ్బు ఇచ్చి కన్యల్ని కొనుక్కొనేవాళ్లు. అధునిక కాలంలో దాని స్థానంలో వరకట్నం వచ్చింది. ఇప్పుడు పెళ్లి సమయంలో పెళ్లికూతురు తల్లిదండ్రులు పెళ్లికొడుక్కి ఇచ్చే ధనం లేదా సంపదని వరకట్నం అంటున్నారు. కొందరు డబ్బు కట్నంగా ఇస్తే మరికొందరు భూములు ఇస్తారు.
130. వరకట్నం సమస్య ఎవరికి సమస్యగా తయారైంది?
1) తల్లికి 2) తండ్రికి
3) ఆడపిల్ల 4) అందరికి
131. కట్నం అంటే?
1) వస్తువు 2) కానుక
3) డబ్బు 4) పైవన్నీ
132. అమ్మాయి తల్లిదండ్రులకు ఇచ్చే కానుకను ఏమంటారు?
1) కానుక 2) కట్నం
3) కన్యాశుల్కం 4) పైవన్నీ
133. చట్టపరంగా వరకట్నం……?
1) తీసుకోవచ్చు
2) తీసుకోరాదు
3) పరస్పర అంగీకారంతో తీసుకోవచ్చు
4) ఏదీకాదు
134 కింది వాటిలో ద్రుతం?
1) న్ 2) ని
3) న 4) పైవన్నీ
135. వచ్చెన్ అనే పదంలో ద్రుతం?
1) న్ 2) చ్చె 3) వ 4) వచ్చెన్
136. ద్రుతం చివర గల పదాలను ఏమంటారు?
1) పరుషాలు 2) సరళాలు
3) ద్రుతప్రకృతికాలు 4) వర్గాలు
137. ద్రుత ప్రకృతికాలు కాని పదములను ఏమందురు?
1) కళలు 2) ద్రుతాలు
3) స్థిరములు 4) ఏవీకావు
138. నామవాచకానికి బదులుగా వాడే పదాలను ఏమంటారు?
1) క్రియలు 2) విశేషణాలు
2) అవ్యయాలు 4) సర్వనామాలు
139. కింది వాటిలో విశేషణం?
1) గోపాల్ 2) అది
3) ఆమె 4) ఏదీకాదు
140. నామవాచకాల, సర్వనామాల గుణాలను తెలిపే పదాలను ఏమంటారు?
1) విశేష్యము 2) విశేషణం
3) క్రియలు 4) అవ్యయాలు
141. కర్తచేసే పనిని తెలిపే పదాలను ఏమంటారు?
1) క్రియ 2) నామవాచకం
3) సర్వనామం 4) అవ్యయాలు
142. లింగ వచన విభక్తుల చేత మార్పు చెందని పదాలను ఏమంటారు?
1) ప్రత్యయాలు 2) సర్వనామాలు
3) విశేషణం 4) అవ్యయం
సమాధానాలు
97-1 98-2 99-1 100-1
101-1 102-2 103-4 104-2
105-3 106- 3 107-4 108-1
109-2 110-3 111-4 112-3
113-1 114-1 115-4 116-4
117-2 118-2 119-4 120-4
121-3 122-3 123-3 124-3
125-3 126-4 127-1 128-1
129-3 130-4 131-4 132-4
133-2 134-2 135-1 136-3
137-1 138-4 139-4 140-2
141-1 142-4
శివశంకర్
విషయ నిపుణులు
ఏకేఆర్ పబ్లికేషన్స్, వికారాబాద్, 9441022571
1. మన జెండా పాఠ్యభాగ రచయిత ఎవరు?
1) రాయప్రోలు 2) గురజాడ
3) శేషం లక్ష్మీనారాయణ
4) సినారె
2. శాంతి సహనం సత్యరూపమా శౌర్యకాంతితో వెలిగిన దీపమా అనే గేయం రాసినవారు?
1) గురజాడ 2) సినారె
3) శేషం లక్ష్మీనారాయణ
4) రాయప్రోలు
3. భారత కోకిల అని ఎవరిని అంటారు?
1) ఇందిరాగాంధీ 2) శారదాదేవి
3) సరోజిని నాయుడు
4) వరద సుందరీదేవి
4. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న సరోజినీ నాయుడును ఏ జైలులో నిర్బంధించారు?
1) ఎరవాడ 2) వరంగల్
3) చర్లపల్లి 4) కడప
5. యాదగిరిగుట్ట ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది?
1) యాదాద్రి 2) నల్లగొండ
3) సూర్యాపేట 4) మేడ్చల్
6. ఋష్యశృంగుని కుమారుడు ఎవరు?
1) జైమిని 2) గౌతముడు
3) యాదర్షి 4) పులస్త్యుడు
7. యాదగిరి గుట్టలో ప్రతినెలా అష్టోత్తర శత కలశాభిషేకం ఏ నక్షత్రంలో జరుపుతారు?
1) ఆరుద్ర 2) రేవతి
3) స్వాతి 4) పునర్వసు
8. స్వామి వారికి తిరువేధి సేవచేసి, పంచాంగ శ్రవణం ఏ రోజున జరుపుతారు?
1) శ్రీరామనవమి 2) దసరా
3) దీపావళి 4) ఉగాది
9. యాదగిరి గుట్టపై ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో బ్రహ్మత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి?
1) 10 రోజులు 2) 11 రోజులు
3) 15 రోజులు 4) 9 రోజులు
10. రాష్ట్ర విభజన తర్వాత సప్తగిరి ఛానల్ పేరు ఏమని మార్చారు?
1) యాదగిరి 2) ఘనగరి
3) విజయవాణి 4) దివ్యవాణి
11. ‘కొండగట్టు’ అంజన్న క్షేత్రం ఎక్కడ ఉంది?
1) కరీంనగర్ 2) వరంగల్
3) నల్లగొండ 4) మెదక్
12. కొండగట్టు అంజన్న సగం నారసింహస్వామి ముఖంతో ఏ అభిముఖుడై ఉన్నాడు?
1) ఉత్తరాభి 2) దక్షిణాభి
3) తూర్పు 4) పడమర
13. సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉంది?
1) వరంగల్ 2) మద్రాస్
3) హైదరాబాద్ 4) కోల్కతా
14. సాలార్జంగ్ మ్యూజియం మూసీనదికి ఏ ఒడ్డున ఉన్నది?
1) తూర్పు 2) పడమర
3) ఉత్తరం 4) దక్షిణం
15. సాలార్జంగ్ మ్యూజియం ఏ ఆకారంలో ఉంది?
1) వలయాకారం 2) త్రిభుజాకారం
3) దీర్ఘచతురస్రాకారం
4) అర్ధచంద్రాకారం
16. భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియాల్లో సాలార్జంగ్ మ్యూజియం ఎన్నో స్థానంలో ఉంది?
1) 2 2) 3 3) 4 4) 5
17. ప్రపంచ ప్రఖ్యాత రెబెక్కా శిల్పాన్ని చెక్కిన ఇటలీ దేశస్థుడు ఎవరు?
1) ఫ్రాంక్లిన్ 2) జి.బి. బెన్జోని
3) రూథర్ఫర్డ్ 3) స్రన్జీ
18. చెట్టునీడ పాఠ్యభాగంలోని పిసినారి ఎవరు?
ఎ) రత్తయ్య బి) కన్నయ్య
సి) సిన్నయ్య డి) పాపయ్య
19. పాపయ్యకు బుద్ధి చెప్పినవాడు ఎవరు?
1) రమణ 2) శివయ్య
3) నాగయ్య 4) ముసలయ్య
సమాధానాలు
1-3 2-3 3-3 4-1
5-1 6-3 7-3 8-4
9-2 10-1 11-1 12-1
13-3 14-4 15-4 16-2
17-2 18-4 19-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు