IBPS Clerk 2023 Notification | ఐబీపీఎస్‌లో 4545 క్లర్క్ పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు
IBPS Clerk 2023 Notification | 2023 సంవత్సరానికి గానూ క్లర్క్ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే దరఖాస్తు గడువు నిన్నటితో ముగియగా.. జులై 28 వరకు పొడిగిస్తూ.. ఐబీపీఎస్ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ తదితర బ్యాంకులలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ (సీబీటీ) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 4545
పోస్టులు : క్లర్క్ పోస్టులు
అర్హతలు : ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయస్సు : 20-28 ఏండ్ల మధ్య ఉండాలి.
పోస్టులను భర్తీ చేయనున్న బ్యాంకులు: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితరాలు.
ఎంపిక : రెండు దశల్లో కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ (సీబీటీ) ఉంటుంది. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ : జులై 28
దరఖాస్తు ఫీజు : రూ. 850. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ. 175)
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2023 ఆగస్టు లేదా సెప్టెంబరు నెలలో ఉంటుంది.
మెయిన్స్ పరీక్ష తేదీ: అక్టోబరు, 2023లో ఉంటుంది.
వెబ్సైట్: https://www.ibps.in/
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






