Current Affairs JULY | వార్తల్లో వ్యక్తులు
కార్తికి గోన్సాల్వెస్
‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డైరెక్టర్ కార్తికి గోన్సాల్వెస్‌కు ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ సంస్థ అందించే పర్యావరణ పురస్కారం ‘తారా’ అవార్డును బ్రిటన్ రాజు చార్లెస్, రాణి కెమీలియా జూలై 1న ప్రదానం చేశారు. కెమీలియా సోదరుడు మార్క్ షాండ్ 2003లో స్థాపించిన ఎలిఫెంట్ ఫ్యామిలీని స్థాపించారు. షాండ్ పెంపుడు ఏనుగు తారా పేరు మీద ఈ అవార్డును ఏర్పాటు చేశారు. దీంతో పాటు షాండ్ పేరు మీద నెలకొల్పిన మార్క్ షాండ్ అవార్డును 70 మంది ఆదివాసీ కళాకారుల సంఘం ‘ది రియల్ ఎలిఫెంట్ కలెక్టిక్ (ట్రెక్)’ సభ్యులకు ప్రదానం చేశారు. ట్రెక్ తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఏనుగులు, మానవుల సహజీవనం కోసం పాటుపడుతుంది.
కామేశ్వరరావు
ఎస్బీఐ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా కొడవంటి కామేశ్వరరావు జూలై 1న నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న చరణ్‌జీత్ సురిందర్ సింగ్ అత్రా తన పదవికి రాజీనామా చేశారు. కామేశ్వరరావు 1991 నుంచి ఎస్బీఐలో పనిచేస్తున్నారు. ఎస్బీఐని 1955, జూలై 1న స్థాపించారు.
ఎంయూ నాయర్
నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ (ఎన్సీఎస్సీ) అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఎంయూ నాయర్ జూలై 3న నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) డాక్టర్ రాజేశ్ పంత్ ఉన్నారు. నాయర్ ఎన్సీఎస్సీలో అదనపు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన సిగ్నల్ ఇంటెలిజెన్స్ అధిపతిగా, కార్ప్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, కమాండ్‌గా పనిచేశారు.
ఉజ్జల్ భూయాన్
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం జూలై 5న కేంద్రానికి సిఫారసు చేసింది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తుల పోస్టులకు 31 మంది ఉన్నారు. ఖాళీల భర్తీ కోసం ఇద్దరు హైకోర్టు చీఫ్ జస్టిస్‌లకు సుప్రీంకోర్టు జస్టిస్‌లుగా పదోన్నతి కల్పించారు. భూయాన్‌తో పాటు ఏపీకి చెందిన కేరళ హైకోర్టు సీజే జస్టిస్ వెంకటనారాయణ భట్టిని సుప్రీంకోర్టు జస్టిస్‌గా పదోన్నతి కల్పించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు