UPSC Success Stories | సివిల్స్‌లో మెరిసిన తెలంగాణ గిరిజన బిడ్డ
దీప్తి
2022 సివిల్స్ ఫలితాల్లో ఆల్ఇండియా 630వ ర్యాంకు
దృఢసంకల్పం ఉంటే ఎంతటి లక్ష్యమైనా సాధించొచ్చని నిరూపించింది ఓ మారుమూల తండాకు చెందిన గిరిజన బిడ్డ. ఆదిలాబాద్ అడవుల్లో గిరిజనులు, పేదల కష్టాలు చూసి చలించిపోయి కలెక్టర్ కావాలనే పట్టుదలతో చదివి చివరికి విజయం సాధించింది. కష్టపడి చదివి మూడుసార్లు విఫలమైనా కలత చెందలేదు. నాలుగోసారి లక్ష్యాన్ని ముద్దాడింది. లింగాలకు చెందిన సభావత్ చంద్రకళ, కిషన్‌నాయక్ దంపతుల కుమార్తె దీప్తి 630వ ర్యాంకు సాధించింది. ఆమె ఎందుకు కలెక్టర్ కావాలనుకుంది.. ఆమె లక్ష్యం ఏమిటో ఆమె మాటల్లోనే..
పేదలకు సేవ చేయొచ్చని..
ఆదిలాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదివాను. అక్కడ చదువుతున్నప్పుడే గిరిజనులు, పేదలు పడుతున్న బాధలు చూసి చలించిపోయా. డాక్టర్‌కు బదులు కలెక్టర్ అయితే పేదలకు సేవ చేయొచ్చని భావించా. నేను కలెక్టర్ కావాలనేది మా నాన్న కోరిక. ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యా. ఈ విషయంలో కుటుంబసభ్యుల సహకారం మరువలేనిది. 2020లో నాకు పెండ్లి కాగా నేను చదువుకుంటానని చెప్పాను. నా భర్త కావాల్సిన సహకారం అందించారు. చివరికి సివిల్స్‌లో రాణించడం చాలా సంతోషాన్నిచ్చింది. పేదలకు సేవ చేయడమే నా లక్ష్యం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు