Current Affairs | క్రీడలు
వెర్స్టాపెన్
రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్) బ్రిటిష్ గ్రాండ్‌ప్రి రేసులో విజయం సాధించాడు. జూలై 9న జరిగిన 52 ల్యాప్‌ల ఈ రేసులో పోల్ పొజిషన్‌తో ప్రారంభించిన వెర్స్టాపెన్ గంటా 25 నిమిషాల 16.938 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. లాండ్ నోరిస్ 2వ స్థానంలో, హామిల్టన్ మూడో స్థానంలో నిలిచారు. ఈ సీజన్లో వెర్‌స్టాపెన్‌కిది వరుసగా ఆరో విజయం. 22 రేసుల ఈ సీజన్లో ఇప్పటివరకు 10 రేసులు ముగిశాయి. పదింటికి పది రెడ్‌బుల్ జట్టు డ్రైవర్లే గెలుపొందారు. వెర్స్టాపెన్ ఎనిమిది రేసుల్లో గెలవగా.. రెండింటిలో రెడ్‌బుల్‌కే చెందిన సెరియో పెరెజ్ విజయం సాధించాడు.
లక్ష్యసేన్
భారత యువ షట్లర్ లక్ష్యసేన్ కెనడా ఓపెన్ టైటిల్‌ను గెలిచాడు. జూలై 10న జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ లీ షి ఫెంగ్ (చైనా)పై విజయం సాధించాడు. లక్ష్యసేన్ తన కెరీర్లో రెండో బీడబ్ల్యూఎఫ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. 2022లో ఇండియా ఓపెన్‌లో తొలిసారిగా సూపర్ 500 టైటిల్‌ను సాధించాడు.
అథ్లెటిక్స్ సమాఖ్య
భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ)కు ఆసియా ఉత్తమ అథ్లెటిక్ అసోసియేషన్ అవార్డు లభించింది. బ్యాంకాక్‌లో జూలై 10న జరిగిన ఆసియా అథ్లెటిక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో ఏఎఫ్ఐ అధ్యక్షుడు సుమరివాలా ఈ అవార్డును అందుకున్నాడు.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు