Current Affairs | ఏ దేశంలో గౌలియన్-బరే సిండ్రోమ్ విజృంభిస్తుంది?
1. ఏ రోజున అంతర్జాతీయ మలాల రోజుగా నిర్వహిస్తారు? (3)
1) జూలై 10 2) జూలై 11
3) జూలై 12 4) జూలై 13
వివరణ: ఏటా జూలై 12న అంతర్జాతీయ మలాల రోజుగా నిర్వహిస్తారు. 1997లో పాకిస్థాన్‌లోని మింగోరాలో మలాల జన్మించారు. ఆ ప్రాంతం 2007లో తాలిబాన్ల చేతిలోకి వెళ్లడంతో వాళ్లు బాలికలు చదువుకోరాదంటూ ఆదేశాలు జారీ చేశారు. 2009లో బీబీసీ చానల్ వేదిక ద్వారా బాలికల విద్య, మహిళల హక్కులకు సంబంధించి వ్యాసాలు రాశారు. 2012 అక్టోబర్ 12న ఆమెపై హత్యాయత్నం జరిగింది. 2014లో నోబెల్ బహుమతి పొందారు. ఈ అవార్డును పొందిన అతిచిన్న వయస్కురాలు ఆమె. ఆమె పుట్టిన రోజును మలాల రోజుగా నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది.
2. రూపాయల్లో నగదు మార్పిడి చేయాలని ఇటీవల భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? (4)
1) ఇండోనేషియా 2) కెనడా
3) శ్రీలంక 4) బంగ్లాదేశ్
వివరణ: యూఎస్ డాలర్‌తో పాటు ఇతర కరెన్సీలపై ఆధారపడకుండా రూపాయల్లో లావాదేవీలు నిర్వహించాలని భారత్, బంగ్లాదేశ్ నిర్ణయించాయి. స్థానిక కరెన్సీని కూడా దీని ద్వారా బలోపేతం చేసేందుకు వీలుంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ‘టాకా-రూపాయి’ కరెన్సీ కార్డ్ అందుబాటులోకి రానుంది. వాణిజ్యం చేసే వాళ్లకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు కూడా బలపడతాయి.
3. హెచ్ఏఎల్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు? (3)
1) టాంజానియా 2) మాల్దీవులు
3) మలేషియా 4) సెనెగల్
వివరణ: మలేషియాలోని కౌలాలంపూర్‌లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ప్రాంతీయ కార్యాలయాన్ని జూలై 11న ప్రారంభించారు. భారత్, మలేషియా రక్షణ సంబంధ అంశాల్లో కలిసి పనిచేసేందుకు వీలుంటుంది. ఆగ్నేయాసియా ప్రాంతంలో ఇతర దేశాలకు రక్షణ ఎగుమతులు చేసేందుకు కూడా ఈ కార్యాలయం ప్రయోజనకరంగా ఉంటుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను 1940, డిసెంబర్ 23న ఏర్పాటు చేశారు. వాల్చంద్ హీరాచంద్ దీని వ్యవస్థాపకుడు. 1941లో భారత ప్రభుత్వం ఇందులో ప్రధాన వాటాదారుగా మారింది. 1942లో యాజమాన్య బాధ్యతను భారత ప్రభుత్వమే స్వీకరించింది. 1951లో దీన్ని రక్షణ రంగ మంత్రిత్వ శాఖ పరిధిలోకి తెచ్చారు.
4. ప్రాజెక్ట్ 75 (ఐ)లోకి నవంతియా చేరనుంది. ఇది ఏ దేశానికి చెందిన సంస్థ? (2)
1) ఫిన్లాండ్ 2) స్పెయిన్
3) ఇజ్రాయెల్ 4) థాయిలాండ్
వివరణ: ప్రాజెక్ట్ 75 (ఐ-ఇండియా)లో చేరేందుకు స్పెయిన్‌కు చెందిన నవంతియా, భారత్‌కు చెందిన లార్సన్ అండ్ టూబ్రో సంయుక్తంగా నిర్ణయించాయి. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రాజెక్ట్ 75(ఐ)లో భాగంగా ఆరు ఆధునిక సబ్మెరైన్లను వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా అందుబాటులోకి తీసుకొస్తారు. ఇవి డిజిటల్-ఎలక్ట్రిక్ ఆధారితమై ఉంటాయి. వీటిని తయారు చేసే భారత సంస్థలు, విదేశీ సంస్థలతో కచ్చితంగా ఒప్పందం కుదుర్చుకోవాలి. తయారు చేయబోయే తొలి సబ్‌మెరైన్‌లో 45 శాతం భారతీయీకరణ ఉండాలి. తర్వాత దీన్ని 60 శాతానికి పెంచాలి. ప్రస్తుతం కుదిరిన కాంట్రాక్ట్ ప్రకారం రక్షణ రంగంలో అతిపెద్దదిగా చెబుతున్నారు.
5. ఏ దేశంలో గౌలియన్-బరే సిండ్రోమ్ విజృంభిస్తుంది? (1)
1) పెరూ 2) వెనెజులా
3) బ్రెజిల్ 4) చిలీ
వివరణ: దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ దేశంలో గౌలియన్-బరే అనే వ్యాధి విజృంభిస్తుంది. దీంతో 90 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని ఆ దేశం ప్రకటించింది. దేహంలోని నిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థపై దాడి చేసే వ్యాధిగా దీన్ని చెబుతున్నారు. ఇప్పటికే పెరూలో అగ్ని పర్వతం బద్ధలు కావడంతో కొన్ని ప్రాంతాల్లో 60 రోజుల అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
6. లిసా దేనికి సంబంధించి ఇటీవల వార్తల్లో నిలిచింది? (3)
1) అంతరిక్షానికి వెళ్లనున్న తొలి అరబ్ మహిళ
2) ఈ ఏడాది నోబెల్‌కు నామినేట్ అయిన అత్యంత పిన్న వయస్కురాలు
3) ఏఐ ఆధారిత న్యూస్ యాంకర్
4) పైవేవీ కాదు
వివరణ: కృత్రిమ మేధ ఆధారిత భారతదేశ మొట్టమొదటి యాంకర్ లిసా. ఒడిశా టెలివిజన్ కార్పొరేషన్లో ప్రవేశపెట్టారు. ఒడియా భాషతో పాటు ఇంగ్లిష్‌లో కూడా సందేశాలను చదవగలదు. రెండు నెలల కిందట యూఏఈ కూడా ఈ తరహా యాంకర్‌ను ఫెదా అనే పేరుతో ప్రవేశపెట్టింది.
7. ఏ నగరంలో నిర్వహించిన జీ-20 సమావేశంలో లంబని వస్తువుల అతిపెద్ద ప్రదర్శన ద్వారా గిన్నిస్ రికార్డును నెలకొల్పారు? (4)
1) ముంబై 2) విశాఖపట్నం 3) హైదరాబాద్ 4) హంపి
వివరణ: జూలై 9న హంపిలో నిర్వహించిన జీ-20 సమావేశంలో గిన్నిస్ బుక్ రికార్డ్‌ను నెలకొల్పారు. దాదాపుగా 450 లంబని మహిళలను వీటిని చేతితో తయారు చేశారు. దాదాపుగా 1755 వస్తువులను ప్రదర్శించారు. లంబని కళకు 2010లో కర్ణాటక ప్రభుత్వం జీఐ ట్యాగ్‌ను ఇచ్చింది. జీ-20 దేశాల కూటమి మూడో సాంస్కృతిక సమావేశాన్ని కర్ణాటకలోని హంపిలో నిర్వహించారు. జీ-20 తొలి సాంస్కృతిక సమావేశాన్ని ఖజురహోలో, రెండో సమావేశాన్ని భువనేశ్వర్‌లో నిర్వహించారు.
8. కింది వాటిలో దేన్ని మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు? (4)
1) కాగ్ ఆడిట్ విధానాలు
2) రాష్ట్ర స్థానిక సంస్థల ఆడిటింగ్
3) సంస్థల లావాదేవీలు
4) జీఎస్టీఎన్
వివరణ: జీఎస్టీఎన్ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్)ను మనీలాండరింగ్ పరిధిలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఈ చట్టం పరిధిలోకి క్రిప్టోకరెన్సీ, చార్టెర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్ అండ్ వర్క్ అకౌంటెంట్లను కూడా తీసుకొచ్చారు. జీఎస్టీ మండలి 50వ సమావేశం జూలై రెండో వారంలో నిర్వహించారు. క్యాన్సర్‌ను నయం చేసే ఔషధాలు, అరుదైన రోగాలకు వినియోగించే ఔషధాలు, వైద్యం నిమిత్తం వాడే ఆహార పదార్థాలను జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలని ఇందులో నిర్ణయించారు. జీఎస్టీ మండలి అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 279ఎ లో దీన్ని చేర్చారు.
9. యాంటీ బ్రైబరీ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ పొందిన తొలి పీఎస్‌యూ ఏది? (3)
1) ఎన్టీపీసీ 2) హెచ్‌పీసీఎల్
3) ఓఎన్జీసీ 4) బీపీసీఎల్
వివరణ: అమెరికాకు చెందిన ఇంటర్సెర్ట్ అనే సంస్థ యాంటీ బ్రైబరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సర్టిఫికెట్ ఇస్తుంది. అంటే లంచ రహిత నిర్వహణ వ్యవస్థగా చెప్పుకోవచ్చు. ఈ సర్టిఫికెట్‌ను పొందిన భారత తొలి ప్రభుత్వ రంగ సంస్థగా ఓఎన్జీసీ నిలిచింది. ఈ సంస్థను 1956 ఆగస్ట్ 14న ప్రారంభించారు. 2019-20 సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కువ లాభాలు సాధించిన సంస్థగా ఇది నిలిచింది. దేశంలో ప్రభుత్వ సంస్థలో అతిపెద్ద గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి సంస్థగా ఓఎన్జీసీని చెప్పుకోవచ్చు. 2010 నవంబర్‌లో ఈ సంస్థ నవరత్న హోదాను పొందింది.
10. ఫోర్బ్స్ విడుదల చేసిన 100 మంది సంపన్నుల జాబితాలో భారత సంతతి మహిళలు ఎంతమంది ఉన్నారు? (1)
1) 4 2) 3 3) 2 4) 1
వివరణ: ఫోర్బ్స్ విడుదల చేసిన 100 మంది ఆమెరికా మహిళల జాబితాలో భారత సంతతికి చెందిన నలుగురికి చోటు దక్కింది. ఆరిస్టా నెట్‌వర్క్స్‌లో సీఈవోగా ఉన్న జయశ్రీ ఉల్లాల్ ఈ జాబితాలో 15వ స్థానంలో నిలిచారు. అలాగే ఐటీ కన్సల్టింగ్-ఔట్సోర్సింగ్ సంస్థలో పనిచేస్తున్న నీరజ సేథి 25వ స్థానంలో ఉండగా.. సీటీవో సహ వ్యవస్థాపకురాలైన నెహా నర్కేడే 50వ స్థానంలో, పెప్సికో చైర్పర్సన్ ఇంద్రానూయి 77వ స్థానంలో ఉన్నారు. ఈ 100 మంది మహిళల సంపద 124 బిలియన్ డాలర్లకు చేరిందని ఫోర్బ్స్ తన నివేదికలో ప్రకటించింది.
11. దాదాపు ఏ సంవత్సరం నాటికి శూన్య ఉద్గారాలు సాధించాలని ఐఎంవో నిర్ణయించింది? (2)
1) 2030 2) 2050
3) 2025 4) 2035
వివరణ: ఇంటర్నేషనల్ మారిటైం ఆర్గనైజేషన్ అనే సంస్థ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. జూలై 7న నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాన్ని వెలువడించింది. దాదాపు 2050 నాటికి శూన్య ఉద్గారాలు ఈ రంగంలో సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. అయితే కచ్చితమైన సంవత్సరాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ సంస్థను 1958, మార్చి 17న ఏర్పాటు చేశారు. 1948లో జెనీవాలో నిర్వహించిన సమావేశంలో ఐఎంవో తరహా వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయానికి వచ్చారు. ఇది 1957లో ఐఎంవో రూపంలో నిజరూపం దాల్చింది. ఇందులో ప్రస్తుతం 175 దేశాలకు సభ్యత్వం ఉంది.
12. ఈ ఏడాది ఆగస్టులో ఏ దేశంతో కలిసి భారత్ ఇంటర్నేషనల్ మిల్లెట్ ఫెస్టివల్‌ను నిర్వహించనుంది? (3)
1) యూకే 2) ఫ్రాన్స్
3) కెన్యా 4) కెనడా
వివరణ: ఈ ఏడాది ఆగస్ట్ నెలలో 30, 31 తేదీల్లో భారత్-ఆఫ్రికా ఇంటర్నేషనల్ మిల్లెట్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నాయి. భారత్, ఆఫ్రికా అంతర్జాతీయ తృణధాన్యాల వేడుకగా దీన్ని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ప్రతినిధులతో పాటు రైతులు, పెట్టుబడిదారులు, పరిశ్రమల ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొంటారు. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా యూఎన్వో ప్రకటించిన సంగతి తెలిసిందే. పోషకాలు అందించడంతో పాటు చిరుధాన్యాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
13. పార్థ్ సాలుంకే ఏ క్రీడతో ముడిపడి ఉన్నారు? (1)
1) ఆర్చరీ 2) స్కాష్
3) క్రికెట్ 4) ఫుట్‌బాల్
వివరణ: పార్థ్ సాలుంకే ఆర్చరీతో ముడిపడి ఉన్నారు. ఈ ఏడాది జూలై 1 నుంచి 9 వరకు ఐర్లాండ్‌లో ఆర్చరీ యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్ నిర్వహించారు. భారత్ ఇందులో మొత్తం 11 పతకాలను దక్కించుకుంది. ఈ పోటీలో బంగారు పతకాన్ని సాధించిన భారత తొలి క్రీడాకారుడిగా పార్థ్ నిలిచారు.
4. ఇటీవల పూర్తి స్థాయిలో రసాయన ఆయుధాలను ధ్వంసం చేసిన దేశం ఏది? (4)
1) రష్యా 2) టర్కీ
3) సిరియా 4) అమెరికా
వివరణ: తన వద్ద ఉన్న అన్ని రకాల రసాయన ఆయుధాలను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. నిజానికి ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి అన్ని రసాయన ఆయుధాల విధ్వంసాన్ని ప్రకటించింది. అంతకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసింది. అంతర్జాతీయ రసాయన ఆయుధాల ఒప్పందం అమలులో భాగంగా దీన్ని చేపట్టింది. ఈ ఒప్పందంపై భారత్ 1993లో సంతకం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా 1997లో ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్‌ను ఏర్పాటు చేశారు. నెదర్లాండ్స్‌లోని హేగ్ కేంద్రంగా ఇది పనిచేస్తుంది.
15. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీకి చైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు? (3)
1) అశుతోష్ దీక్షిత్
2) రాజీవ్ ధార్
3) రాజా రామన్ 4) రవ్నీత్ కౌర్
వివరణ: గుజరాత్‌లోని జీఐఎఫ్టీలో ఉన్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీకి చైర్‌పర్సన్‌గా రాజా రామన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ పదవిలో ఇంజేటి శ్రీనివాస్ ఉన్నారు. ఈ వ్యవస్థకు తొలుత నేతృత్వం వహించింది కూడా ఇంజేటి శ్రీనివాసే. రెండో వ్యక్తిగా రాజారామన్ ఎంపికయ్యారు. ఆయన మూడు సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
21st సెంచరీ ఐఏఎస్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు