Current Affairs | వార్తల్లో వ్యక్తులు
ఎడ్గార్ రింకీవిక్స్
లాత్వియా అధ్యక్షుడిగా ఎడ్గార్ రింకీవిక్స్ జూలై 8న ప్రమాణం చేశారు. ఆయన 2011 నుంచి విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో చాలామంది గే (స్వలింగ సంపర్కుడు) ప్రభుత్వాధినేతలు ఉన్నారు. కానీ ఒక దేశానికి గే అధ్యక్షుడు కావడం ఇదే మొదటిసారి. ఈయూలోని బెల్జియం మాజీ ప్రధాని ఎలియో డి రూపో మొదటి గే ప్రభుత్వాధినేత. 1990లో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన తర్వాత 2004లో ఈయూలో చేరి లిథువేనియా, ఎస్తోనియా సహా మూడు బాల్టిక్ రాష్ర్టాల్లో లాత్వియా ఒకటి.
ప్రీతి అఘలయం
టాంజానియాలోని జాంజిబార్‌లో ఏర్పాటు చేయనున్న ఐఐటీ మద్రాస్ అంతర్జాతీయ క్యాంపస్ డైరెక్టర్ ఇన్చార్జిగా ప్రీతి అఘలయం జూలై 10న నియమితులయ్యారు. ఐఐటీల చరిత్రలో ఓ మహిళను డైరెక్టర్‌గా నియమించడం ఇదే మొదటిసారి. ఆమె ఐఐటీ మద్రాస్‌లోనే 1995లో కెమికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తిచేసింది. కేంబ్రిడ్జిలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్‌గా పని చేశారు. 2010లో ఐఐటీ మద్రాస్‌లో లెక్చరర్‌గా చేరారు. అదేవిధంగా అంతర్జాతీయ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్న తొలి ఐఐటీగా ఐఐటీ మద్రాస్ గుర్తింపు పొందింది. 2026 నాటికి జాంజిబార్ ద్వీపంలో 200 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్‌ను నిర్మించనున్నారు.
చంద్రకాంత్
గ్లోబల్ ఫోరం ఆఫ్ క్యాన్సర్ సర్జన్స్ (జీఎఫ్సీఎస్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా డా. చంద్రకాంత్ జూలై 10న నియమితులయ్యారు. ఈయన ప్రముఖ ఆంకాలజిస్ట్ సర్జన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డు సభ్యుడు. అదేవిధంగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా మెడికల్ సెంటర్‌కు డీన్‌గా వ్యవహరిస్తున్నారు.
గుళ్లపల్లి ఎన్ రావు
ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావు అరుదైన గౌరవం పొందారని ఆస్పత్రి డాక్టర్లు జూలై 12న వెల్లడించారు. ఆయన యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో 106వ ఆప్తల్మాలజీ కాంగ్రెస్‌లో ఆయన ‘డోయిన్ స్మారకోపన్యాసం’ ఇచ్చారు. దీంతో వందేళ్లకు పైగా డోయిన్ స్మారకోపన్యాస చరిత్రలో ప్రసంగం చేసిన తొలి భారతీయ ఆప్తల్మాలజిస్ట్గా ఆయన రికార్డు సృష్టించారు. ఆయన ‘ఏ కార్నియా కేర్ సిస్టమ్, ఎవల్యూషన్’ అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. ప్రొఫెసర్ రాబర్ట్ డోయిన్ ఆక్స్ఫర్డ్ ఐ ఆస్పత్రిలో మొట్టమొదటి అకడమిక్ కంటి విభాగం వ్యవస్థాపకుడు, నేత్ర వైద్యశాస్త్రంలో మొట్టమొదటి బోధకుడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు