Current Affairs | క్రీడలు

స్పెషల్ ఒలింపిక్స్
స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్ 2023 బెర్లిన్ (Special Olympics World Games Berlin 2023) లో జూన్ 17 నుంచి 25 వరకు నిర్వహించారు. 16వ ఎడిషన్ అయిన ఇందులో 170 దేశాల నుంచి ఏడు వేల మంది అథ్లెట్స్ 24 క్రీడాంశాల్లో పాల్గొన్నారు. దీనిలో భారత్ 202 పతకాలు సాధించింది. ఇందులో 76 స్వర్ణాలు, 75 రజతాలు, 51 కాంస్యాలు ఉన్నాయి. ఈ ఒలింపిక్స్ మేధోపరమైన వైకల్యం ఉన్న వ్యక్తుల కోసం ఒకసారి సమ్మర్లో, మరొకసారి శీతాకాలంలో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఈ గేమ్స్ మస్కట్ పేరు ‘యూనిటీ’. మోటో ‘అన్‌బీటబుల్ టుగెదర్’.
జులన్ గోస్వామి
ప్రతిష్ఠాత్మక ఎంసీసీ ప్రపంచ క్రికెట్ కమిటీకి జూన్ 26న ఎంపికయ్యింది. ఆమెతో పాటు ఇంగ్లండ్ ప్లేయర్లు హెదర్ నైట్, ఇయాన్ మోర్గాన్‌లకు చోటు లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, అంపైర్లు, అధికారులు ఈ స్వతంత్ర సంస్థలో సభ్యులుగా ఉంటారు. రెండు దశాబ్దాల కెరీర్ కలిగిన జులన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎంసీసీ గౌరవ జీవితకాల సభ్యురాలిగా నియమించారు.
ఆసియా కబడ్డీ
ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భారత్ విజేతగా నిలిచింది. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని బుసాన్‌లో జూన్ 30న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 42-32 తేడాతో ఇరాన్‌పై విజయం సాధించింది. భారత కెప్టెన్ పవన్ సెహ్రావత్ 16 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ ఈ ట్రోఫీ గెలవడం ఇది ఎనిమిదోసారి. ఇప్పటి వరకు ఈ టోర్నీని 9 సార్లు నిర్వహించగా 2003లో ఇరాన్ గెలిచింది. ఈ టోర్నీలో భారత్, ఇరాన్, జపాన్, కొరియా, చైనీస్ తైపీ, హాంకాంగ్ దేశాలు పాల్గొన్నాయి.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్, శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ 9948750605
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు