Current Affairs | వార్తల్లో వ్యక్తులు
షమీనా సింగ్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సర్కారులో భారత సంతతికి చెందిన షమీనా సింగ్ కీలక పదవి లభించినట్లు జూలై 17న మీడియా వెల్లడించింది. ఆమె ఎగుమతుల మండలి (ఎక్స్పోర్ట్ కౌన్సిల్) సభ్యురాలిగా నియమితులయ్యారు. ఆమె ‘మాస్టర్‌కార్డ్ సెంటర్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్’ వ్యవస్థాపకురాలు. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా అధ్యక్షుడికి ఎక్స్పోర్ట్ కౌన్సిల్ జాతీయ సలహా కమిటీగా వ్యవహరిస్తుంది.
మోక్షారాయ్
భారత సంతతికి చెందిన బ్రిటన్ బాలిక (7) మోక్షరాయ్కు ప్రతిష్ఠాత్మక బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు జూలై 18న లభించింది. మైక్రోప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి చేపట్టిన కార్యక్రమం కోసం ఆమె మూడేండ్ల నుంచే స్వచ్ఛందంగా పనిచేస్తుంది. దీంతో ఆమె సేవలకు గుర్తింపుగా బ్రిటన్ ఉప ప్రధాని అలీవర్ డౌడెన్ ఈ అవార్డును అందజేశారు.
రాకేశ్ పాల్
ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) 25వ డీజీ (డైరెక్టర్ జనరల్)గా జూలై 19న నియమితులయ్యారు. ఆయన ఇండియన్ నేవల్ అకాడమీలో విద్యనభ్యసించి, ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 1989లో చేశారు. గన్నరీ అండ్ వెపన్స్ సిస్టమ్స్ స్పెషలైజేషన్‌లో కొచ్చిలోని ఇండియన్ నేవల్ స్కూల్ ద్రోణాచార్యలో, ఎలక్ట్రో ఆప్టిక్ ఫైర్ కంట్రోల్ సొల్యూషన్ కోర్సును యూకేలో పూర్తి చేశారు. అదేవిధంగా ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో మొదటి గన్నర్‌గా గుర్తింపు పొందారు. 2013లో తత్క్ష్రక్ మెడల్‌ను, 2018లో ప్రెసిడెంట్ తత్క్ష్రక్ మెడల్‌ను అందుకున్నారు.
నివృతి రాయ్
ఇన్వెస్ట్ ఇండియా డైరెక్టర్, సీఈవోగా నివృతి రాయ్ జూలై 19న నియమితులయ్యారు. ఈమె గ్లోబల్ బిజినెస్ అండ్ టెక్నాలజీ లీడర్‌గా ఇంటెల్‌లో 29 ఏండ్లు పని చేశారు. ఇంటెల్ ఇండియా కంట్రీ హెడ్‌గా వ్యవహరించారు. టెక్నాలజీలో ఆమె చేసిన సేవలకు ప్రతిష్ఠాత్మక నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు