నిర్మాణ రారాజు ‘వాసవీ’
- క్వాలిటీ కన్స్ట్రక్షన్స్, టైమ్లీ డెలివరీకి పెట్టింది పేరు
- క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీలో షో ప్రత్యేక ఆకర్షణగా ‘వాసవీ ’ స్టాల్
- 10వ ఎడిషన్‌లోనూ పల్లాడియం స్పాన్సర్‌గా ‘వాసవీ’
నిర్మాణ రంగానికి దిశా నిర్దేశం చేస్తోన్న క్రెడాయ్ హైదరాబాద్ 10వ ఎడిషన్ ప్రాపర్టీ షో శుక్రవారం ఆట్టహాసంగా ఆరంభమైంది. హైటెక్స్ వేదికగా 13, 14, 15వ తేదీల్లో జరుగుతున్న ఈ ప్రాపర్టీ షోకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వాసవీ గ్రూప్ ‘పల్లాడియం’ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నది. గడిచిన ఆరు సంవత్సరాలుగా వాసవీ గ్రూప్ ‘పల్లాడియం’ స్పాన్సర్‌గా ఉంది. నిర్మాణ రంగంలో క్వాలిటీ కన్స్ట్రక్షన్స్, టైమ్లీ డెలివరీకి పెట్టింది పేరుగా వాసవీ గ్రూప్ నిలుస్తున్నది. సుమారు 26 ఏళ్లుగా వాసవీ గ్రూప్ నిర్మాణ రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకొని అందరినీ ఆకట్టుకుంటోంది. నాణ్యత, ప్రమాణాల విషయంలో ఈ సంస్థ రాజీపడదు. తమ సంస్థకు పాత కస్టమర్లే బిజినెస్‌గా ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారని వాసవీ గ్రూపు ఛైర్మన్ ఎర్రం విజయ్‌కుమార్ తెలిపారు.
వాసవీలో స్థిరాస్తిని కొనుగోలు చేస్తే ‘కేజీ సిల్వర్’
ప్రాపర్టీ షోలో కొవిడ్-19 భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూ 100 స్టాల్స్‌లలో 15000లకు పైగా ప్రాపర్టీలను వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా అత్యుత్తమ గృహ, వాణిజ్య ప్రాంగణాలను ఎంచుకునేందుకు అనువుగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో వాసవీ గ్రూప్‌కు చెందిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. హైదరాబాద్ వ్యాప్తంగా సంస్థకు సంబంధించిన ప్రాజెక్టుల వివరాలను పొందుపర్చారు. ప్రస్తుతం నిర్మాణ దశలో తొమ్మిది ప్రాజెక్టులు ఉండగా, గచ్చిబౌలి, విప్రో వద్ద కమర్షియల్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్ జోన్లో ఏడు చోట్ల రెండు పడక గదుల అపార్ట్మెంట్లు నిర్మాణంలో ఉన్నాయి. రూ. 40 లక్షలు మొదలుకొని రూ. 1.5 కోట్ల విలువ జేసే యూనిట్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫ్లాట్స్ కొనుగోలు చేసే వారికి ఈ సంస్థ బంఫర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 31వ తేదీలోగా ఈ సంస్థలో స్థిరాస్తిని కొనుగోలు చేసేవారికి ఒక కేజీ సిల్వర్‌ను ఉచితంగా అందజేస్తామని వెల్లడించింది.
స్పెషల్ అట్రాక్షన్‌గా ‘ వాసవీ అర్బన్ ’
హైదరాబాద్‌లో మూడున్నర వేలకు పైగా యూనిట్స్ కలిగిన ప్రాజెక్టులు చాలా తక్కువ అనే చెప్పాలి. అందులో కేవలం మధ్యతరగతి ప్రజానీకాన్ని దృష్టిలో నిర్మించినవి దాదాపు లేవనే చెప్పాలి. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని సామాన్యులకు సకల సౌకర్యాల్ని అందించాలన్న లక్ష్యంతో వాసవీ గ్రూప్ బాచుపల్లిలో వాసవి అర్బన్ అనే ప్రాజెక్టుని ప్రారంభించింది. దాదాపు 17.34 ఎకరాల్లో 12 టవర్లను నిర్మిస్తోంది. ఒక్కో టవర్‌లో 23 అంతస్తుల వరకూ ఉంటాయి. ఇందులో వచ్చే మొత్తం ప్లాట్ల సంఖ్య 3714. 70శాతం స్థలాన్ని ఓపెన్ స్పేస్‌గా ఉంచగా నిర్మాణం వచ్చేది 30 శాతం స్థలంలోనే .ఎన్నో మౌలిక వసతులతో నిర్మితమవుతున్న ఈ బడా ప్రాజెక్టు బాచుపల్లిలోనే పెద్దదిగా చెప్పొచ్చు. 875-975 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇక రన్నింగ్‌లో ఉన్న సంస్థ ఇతర ప్రాజెక్టులు… ఉప్పల్‌లో వాసవీ మెట్రోపోలిస్, హఫీజ్‌పేటలో వాసవీ లేక్ సిటీ, ఎల్బీనగర్లో శ్రీ నిలయం, గచ్చిబౌలి సర్కిల్లో స్కై సిటీ, గచ్చిబౌలి విప్రో సర్కిల్లో వాటర్ ఫ్రంట్, ఆమీర్పేటలో సోలిటైర్ హైట్స్, శామీర్‌పేటలో గ్రీన్ లీఫ్, నార్సింగిలో అట్లాంటీస్ పేరిట ప్రాజెక్టుల్ని చేపట్టింది.
- Tags
- sampada
- sampada news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు