Physics | సముద్రంలో దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం?
భౌతికశాస్త్రం
1. భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహానికి కావాల్సిన అభికేంద్ర బలం ఎక్కడి నుంచి లభిస్తుంది?
1. సౌర పలకలు 2) భూమి
3) సూర్యుడు
4) భూమి, కృత్రిమ ఉపగ్రహం మధ్య ఉండే విశ్వగురుత్వాకర్షణ బలం
2. గురుత్వ త్వరణం(g)లో మార్పుల వల్ల వస్తువులో జరిగే మార్పునకు కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) ‘g’ తగ్గితే ద్రవ్యరాశి తగ్గుతుంది
2) ‘g’ తగ్గితే ద్రవ్యరాశి పెరుగుతుంది
3) ‘g’ తగ్గితే భారం తగ్గుతుంది
4) ‘g’ తగ్గితే భారం పెరుగుతుంది
3) భూమిపై నుంచి విసిరిన వస్తువు మళ్లీ భూమిపైకి తిరిగి రాకుండా ఉండటానికి వస్తువుకు అవసరమైన కనీస వేగం?
1) గురుత్వ వేగం 2) పలాయన వేగం
3) తత్కాల వేగం 4) కక్ష్యా వేగం
4. కింది వాటిని జతపరచండి.
A) భూమిపై గురుత్వ త్వరణం i) 1.6.మీ/సె2
B) సూర్యునిపై గురుత్వ త్వరణం ii) 27.4 మీ/సె2
C) చంద్రునిపై గురుత్వ త్వరణం iii) 9.8 మీ/సె2
1) A-i, B-ii, C-iii
2) A-iii, B-ii, C-i
3) A-ii,B-iii, C-i
4) A-ii,B-i, C-iii
5. కింది వాటిలో ప్రాథమిక బలం?
1) గురుత్వాకర్షణ బలం
2) ఘర్షణ బలం
3) స్నిగ్ధత బలం 4) సంసంజన బలం
6. భూమిపై కొంత ఎత్తు నుంచి 25 kg, 35 kg ద్రవ్య రాశులు గల రెండు వస్తువులను జారవిడిచిపుడు, వాటి వేగాల్లోని మార్పు రేటు?
1) 35 kg ద్రవ్యరాశి గల వస్తువుకు ఎక్కువ
2) 25 kg ద్రవ్యరాశి గల వస్తువుకు ఎక్కువ
3) రెండు వస్తువులకు సమానం
4) రెండు వస్తువులకు సున్న
7. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) ఒక వ్యక్తి భారం భూమిపై ఎక్కువ, చంద్రునిపై తక్కువ
2) ఒక వ్యక్తి ద్రవ్యరాశి భూమిపై తక్కువ, చంద్రునిపై ఎక్కువ
3) ఒక వ్యక్తి ద్రవ్యరాశి భూమిపై ఎక్కువ, చంద్రునిపై తక్కువ
4) ఒక వ్యక్తి భారం భూమిపై తక్కువ, చంద్రునిపై ఎక్కువ
8. చంద్రునిపై గురుత్వ త్వరణం, భూమిపై ఉండే గురుత్వ త్వరణంలో ఎన్నో వంతు ఉంటుంది?
1) 4వ వంతు 2) 6వ వంతు
3) 30వ వంతు 4) రెండూ సమానం
9. గురుత్వ త్వరణం విలువ భూమిపై సుమారు ఎంత ఉంటుంది?
1) 5 మీ/సె2 2) 10 మీ/సె2
3) 9 మీ/సె2 4) 18మీ/సె2
10. గురుత్వాకర్షణ సూత్రాలను కనుగొన్నది?
1) ఐన్‌స్టీన్ 2) న్యూటన్
3) ఎడిసన్ 4) పాస్కల్
11. భూమధ్య రేఖ కంటే ధృవాల వద్ద గురుత్వ త్వరణం విలువ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దీనికి సరైన కారణం ఏది?
1) ధృవాల వద్ద భూవ్యాసార్థం తక్కువగా ఉంటుంది
2) ధృవాల వద్ద భూవ్యాసార్థం ఎక్కువగా ఉంటుంది
3) ధృవాలు మంచుతో కప్పబడి ఉంటాయి
4) 2, 3
12. ఒక వస్తువుపై పని చేసే గురుత్వాకర్షణ బలాన్ని ఏమంటారు?
1) ద్రవ్యరాశి 2) భారం
3) ప్రతిబలం 4) ద్రవ్యవేగం
13. 2 kg ద్రవ్యరాశి గల ఒక దిమ్మెను భూమి నుంచి 2m ఎత్తుకు ఎత్తినపుడు, ఆ ఎత్తు వద్ద ఆ దిమ్మె స్థితిజశక్తి జౌల్లలో (g=9.8.ms-2
1) 39.2 2) 19.6
3) 4.0 4) 34.2
14. భూమి చుట్టూ చంద్రుడు తిరగడానికి కారణమైన ప్రాథమిక బలం?
1) గురుత్వాకర్షణ
2) విద్యుదయస్కాంత బలం
3) బలమైన కేంద్రక బలం
4) దుర్బల అన్యోన్య చర్యాబలం
15. విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం విలువ ఎంత? (న్యూటన్ – మీటర్ 2/కి.గ్రా2లలో)
1) 6.67X10-11 2) 6.25X10-18
3) 6.67X1011 4) 6.25X10-18
16. గురుత్వ త్వరణం విషయంలో కింది వాటిలో సరైన వివరణ ఏది?
1) భూమి ఉపరితలం నుంచి ఎత్తుకు వెళ్లిన కొద్దీ ‘g’ తగ్గుతుంది
2) భూమి ఉపరితలం నుంచి లోతుకు వెళ్లిన కొదీ ‘g’తగ్గుతుంది
3) భూమి కేంద్రం వద్ద g = 0
4) పైవన్నీ సరైనవే
17. గురుత్వాకర్షణ బలం వేటి ఆధారంగా ప్రసారం అవుతుంది?
1) గ్రావిటాన్లు 2) ఫోటాన్లు
3) మీసాన్లు 4) బోసాన్లు
18. గురుత్వ త్వరణం దేనిపై ఆధారపడదు?
1) వస్తువుల ద్రవ్యరాశి
2) గ్రహ ద్రవ్యరాశి
3) గ్రహ ఉపరితలం నుంచి ఎత్తు
4) గ్రహ వ్యాసార్థం
19. భూమి చుట్టూ పరిభ్రమించే కృత్రిమ ఉపగ్రహం కిందకు పడిపోదు. దీనికి కారణం భూమ్యాకర్షణ అనేది?
1) చాలా దూరంలో ఉండకపోవడం
2) చంద్రుడి ఆకర్షణ వల్ల తటస్థం కావడం
3) దాని స్థిర గమనానికి అవసరమైన వేగాన్ని సమకూర్చడం
4) దాని గమనానికి అవసరమైన త్వరణాన్ని సమకూర్చడం
20. న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం?
1) విశ్వజనీనమైనది
2) తేలికపాటి వస్తువులకే వర్తిస్తుంది
3) బరువైన వస్తువులకు వర్తిస్తుంది
4) అణువులకు మాత్రమే వర్తిస్తుంది
21. గురుత్వాకర్షణ శక్తి సూత్రం కనుగొన్నవారెవరు?
1) కెప్లర్ 2) గెలీలియో
3) న్యూటన్ 4) కోపర్నికస్
22. గురుత్వాకర్షణ సిద్ధాంతం?
1) విశ్వంలో ఎక్కడైనా వర్తిస్తుంది
2) సూర్యుడు, నక్షత్రాలకు మాత్రమే వర్తిస్తుంది
3) తెలిసిన అన్ని బలాలకు వర్తిస్తుంది
4) సౌర వ్యవస్థకు వర్తించదు
23. విశ్వగురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని చెప్పిన శాస్త్రవేత్త?
1) టాలెమీ 2) కోపర్నికస్
3) న్యూటన్ 4) కెప్లర్
24. 1 మైలు ఎన్ని కిలోమీటర్లకు సమానం?
1) 1.61 కిలోమీటర్లు
2) 1.91 కిలోమీటర్లు
3) 1.24 కిలోమీటర్లు
4) 1.31 కిలోమీటర్లు
25. భౌతికశాస్త్రంలో ఉత్పన్న ప్రమాణాలు?
1) 7 2) 8 3) 9
4) ఎన్ని అయినా ఉండొచ్చు
26. సముద్రంలో దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం?
1) ఫర్లాంగులు 2) కి.మీలు
3) మైళ్లు 4) నాటికల్ మైళ్లు
27. 1 అడుగు పొడవు ఎన్ని సెం.మీ.లకు సమానం?
1) 30 2) 12
3) 30.72 4) 30.70
28. ఒక న్యూటన్ బలం CGS ప్రమాణాల్లో ఎన్ని డైనులకు సమానం?
1) 104 2)105 3) 106 4) 107
29. క్యారీ బ్యాగుల మందాన్ని దేనితో వ్యక్తపరుస్తారు?
1) ఆంగ్‌స్ట్రామ్ 2) మైక్రాన్లు
3) నానోమీటర్లు 4) కిలోబైట్లు
30. 1 క్వింటా దేనికి సమానం?
1) 200 కిలోగ్రాములు
2) 150 కిలోగ్రాములు
3) 100 కిలోగ్రాములు
4) 250 కిలోగ్రాములు
31. పొడవుకు అతి తక్కువ కొలమానం?
1) మైక్రాన్ 2) నానోమీటర్
3) ఆంగ్‌స్ట్రామ్ 4) ఫెర్నిమీటర్
32. పేపరు నాణ్యతను GSMలలో తెలియజేస్తారు. GSM అంటే?
1) Grams second meter
2) Grams per second meter
3) Grams square meter
4) Grams per square meter
33. నది వెడల్పు కొలవడానికి సరైన పద్ధతి?
1) గొలుసులు 2) టేపులు
3) త్రిభుజీకరణ 4) ఖగోళ
34. మీటర్ దేని కొలమానం?
1) పొడవు 2) రాశి
3) కాలం 4) ఉష్ణోగ్రత
35. భౌతికశాస్త్రంలో మూల ప్రమాణాలు?
1) 3 2) 6 3) 9 4) 12
36. ప్రచోదనం SI ప్రమాణం?
1) Ns-2 2) Ns2
3) Ns 4) Ns-1
37. ఉష్ణోగ్రతను కొలిచే SI ప్రమాణం?
1) కెల్విన్ 2) క్యాండిలా
3) కేలరీ 4) జౌళ్లు
38. కింది వాటిలో భిన్నమైంది?
1) ఆంగ్‌స్ట్రామ్
2) కాంతి సంవత్సరం
3) కిలోమీటరు 4) బలం
39. 1 ఔన్స్ ఎన్ని గ్రాములకు సమానం?
1) 24.35 గ్రాములు
2) 25.35 గ్రాములు
3) 26.35 గ్రాములు
4) 28.36 గ్రాములు
40. కాలాన్ని కచ్చితంగా సూచించేవి?
1) లోలక గడియారాలు
2) డిజిటల్ గడియారాలు
3) స్ప్రింగ్ గడియారాలు
4) పరమాణు గడియారాలు
41. ఆంపియర్ అనేది దేనికి ప్రమాణం?
1) విద్యుత్‌శక్తి
2) వోల్టేజి
3) విద్యుత్ ప్రవాహం
4) విద్యుత్ నిరోధం
42. ఒక ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితం పరిమాణాన్ని దేనిలో తెలియజేస్తారు?
1) గ్రామ్లు 2) మోల్‌లు
3) ఆంగ్స్ట్రామ్లు 4) పార్సెక్లు
43. వెర్నియర్ కాలిపర్స్‌లో లేనిది?
1) తల స్కేలు 2) పిచ్ స్కేలు
3) ప్రధాన స్కేలు 4) 1, 2
44. ఫెర్మి ప్రమాణాలలో వ్యక్త పరచగలిగేది?
1) కాగితం మందం
2) తరంగ దైర్ఘ్యం
3) పరమాణు పరిమాణం
4) కేంద్రక పరిమాణం
45. ఒక కిలోబైట్ మెమరీ అంటే?
1) 1000 బైట్లు 2) 1024 బైట్లు
3) 1048 బైట్లు 4) 981 బైట్లు
46. ‘టెరా’ అంటే?
1) 109 2) 1010 3)1011 4) 012
47. స్టెరేడియన్ అనేది దేనికి ప్రమాణం?
1) కోణం
2) ఘన కోణం
3) ఖగోళ దూరం 4) భారం
48. రిజర్వాయర్లలో నీటిని TMCలలో కొలుస్తారు. TMC అంటే?
1) Thousand million cubic feet
2) Thousand meter cube
3) Ten million cubic feet
4) Ten meter cube
49. నదుల్లోని నీటి ప్రవాహాన్ని దేనిలో తెలియజేస్తారు?
1) క్యూబిక్‌లు 2) క్యూసెక్లు
3) క్యూరీలు 4) క్యూప్రమ్లు
50) బలాన్ని SI ప్రమాణాల్లో న్యూటన్లుగా, CGS ప్రమాణాల్లో డైనులుగా కొలుస్తారు. అయితే కింది వాటిలో సరైన సంబంధం?
1) డైను = 105 న్యూటన్లు
2) 1 న్యూటన్ = 105 డైను
3) 1 డైను = 100 న్యూటన్లు
4) 1 న్యూటన్ = 100 డైను
దళిత జనోద్ధరణ
- కాకతీయ రాజ్య పతనానంతరం తెలంగాణ ప్రాంతం కుతుబ్‌షాహీల, అసఫ్‌జాహీల పాలనలో కొనసాగింది. కుతుబ్‌షాహీలు చాలావరకు సంప్రదాయ పాలన వర్గాన్ని గ్రామీణ వ్యవస్థలో కొనసాగించారు. చిన్న సంస్థానాధిపతులు, నాయకులు కొనసాగారు.
- కుతుబ్‌షాహీల కాలంలోనే సుల్తాన్‌కు అత్యంత విశ్వాసపాత్రులైన వారికి, వారి సేవకు గుర్తింపుగా జాగీర్లు, ఇనాముల కింద గ్రామాలు దత్తత చేయబడ్డాయి.
- ఈ జాగీర్లు, ఇనాములపై కాలక్రమేణా వంశపారంపర్య హక్కులు సంపాదించారు.
- జాగీర్దారు చనిపోయిన తర్వాత జాగీరు అతని పెద్ద కుమారుడికి చెందేది. గోల్కొండ చుట్టుపక్కల చాలా గ్రామాలు ఈ విధంగా జాగీర్దార్ల వశమయ్యాయి.
- జాగీర్దార్లు తమ ఆడంబర ఖర్చులకు తమ గ్రామాల్లో రైతులపై అధిక భారం మోపుతూ వచ్చారు.
- అసఫ్‌జాహీల కాలంలో ఈ జాగీర్దారీ వ్యవస్థ తెలంగాణలో బాగా విస్తరించింది.
- జాగీర్దార్లే కాకుండా అమల్దార్లు, ఫౌజ్దార్లు కూడా నియమింపబడి, వారి ద్వారా జమీందార్ల నుంచి అధిక శిస్తును, జాగీర్దార్ల నుంచి నజరానా రూపంలో అధిక మొత్తాలను వసూలు చేశారు.
- అంతేకాకుండా పంట దిగుబడి తగ్గి రైతులపై భారం పెరగడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది.
- గ్రామీణ పాలక వ్యవస్థలో పటేళ్లు, పట్వారీలు, కర్నాలు, సంప్రదాయ వ్యవస్థగా కొనసాగినప్పటికీ వీరిపై అధికారం చెలాయించే గిర్దావర్లు, పేష్కార్లు, నాయబ్, తహసీల్దార్లు మొదలైన ఉద్యోగ వర్గం గ్రామ ఉద్యోగుల నుంచి అనధికార వసూళ్లు చేశారు.
- ఉద్యోగ స్వామ్య ప్రధాన దుర్గుణాలైన అలసత్వం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం వంటివి గ్రామపాలన వ్యవస్థ మైదలైనప్పటి నుంచి వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దబడ్డాయి.
- ఆ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక గ్రామ ఉద్యోగులు గ్రామ స్థితిగతులను పట్టించుకోక స్వప్రయోజనపరులయ్యారు. రైతుల దుస్థితి కారణంగా వ్యవసాయం దెబ్బతింది. ఉత్పత్తులు తగ్గుముఖం పట్టడం వల్ల రైతుల్లో పేదరికం, రుణభారం పెరిగాయి.
- గ్రామంలో పెద్దరికం వహించే కొన్ని కుటుంబాలు తప్ప ప్రజలందరు దుర్భర దారిద్య్రంలోకి తోసివేయబడ్డారు. పాలక, పాలిత వర్గాల మధ్య అంతరం పెరిగి వైరుధ్యాలకు దారి తీసింది. వ్యవసాయ రంగంపై ఆధారపడిన గ్రామీణ ప్రజల్లో వివిధ స్థాయిలు ఏర్పడ్డాయి.
సమాధానాలు
1-4 2-3 3-2 4-2
5-1 6-3 7-1 8-2
9-2 10-2 11-1 12-2
13-1 14-1 15-3 16-4
17-1 18-1 19-3 20-1
21-3 22-1 23-3 24-1
25-4 26-4 27-3 28-2
29-2 30-3 31-2 32-4
33-3 34-1 35-3 36-3
37-1 38-4 39-4 40-4
41-3 42-2 43-4 44-4
45-2 46-4 47-2 48-1
49-2 50-2
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు