Gurukula Special | ధ్రువుడి వృత్తాంతం భాగవతంలోని ఏ స్కంధంలో ఉంది?
1. పురాణం పంచలక్షణం అన్నదెవరు?
ఎ) భరతుడు బి) అమరసింహుడు
సి) విశ్వనాథుడు డి) భామహుడు
2. మహాపురాణం దశ లక్షణ సమన్వితమని చెప్పిన గ్రంథం?
ఎ) భాగవతం బి) భారతం
సి) రామాయణం డి) పైవన్నీ
3. వృత్తి, రక్ష, సంస్థలు, హేతువు, ఆపాశ్రయం అనే ఐదు అదనపు లక్షణాలు గల పురాణం ?
ఎ) మార్కండేయ పురాణం
బి) అగ్నిపురాణం
సి) భాగవతం డి) నారద పురాణం
4. కింది వాటిలో పురాణం ఏది?
ఎ) రామాయణం బి) భారతం
సి) భాగవతం డి) మనుచరిత్ర
5. సృష్టి పూర్వోత్తరాలను తెలిపే పురాణ లక్షణం ఏది?
ఎ) సర్గ బి) ప్రతిసర్గ
సి) వంశం డి) మన్వంతరం
6. కిందివాటిలో మిత్ర సమ్మితాలు ఏవి?
ఎ) వేదాలు బి) పురాణాలు
సి) కావ్యాలు డి) ప్రబంధాలు
7. కన్నడంలో ‘ఆదిపురాణం’ అనే జైన పురాణాన్ని రచించిన కవి?
ఎ) పొన్నకవి బి) రన్నకవి
సి) పంపకవి
డి) పాల్కురికి సోమనాథుడు
8. తమిళంలో వెలువడిన జైన పురాణం ఏది?
ఎ) ఆదిపురాణం బి) శాంతి పురాణం
సి) అజిత పురాణం డి) పెరియ పురాణం
9. తెలుగులోనికి అనువదించిన తొలి పురాణం ఏది?
ఎ) అగ్నిపురాణం బి) నారద పురాణం
సి) మార్కండేయ పురాణం
డి) స్కాంద పురాణం
10. వరూధినీ ప్రవరుల కథాఘట్టం గల పురాణం
ఎ) శివపురాణం
బి) మార్కేండేయ పురాణం
సి) వాయుపురాణం
డి) పద్మపురాణం
11. భాగవతంలోని స్కంధాల సంఖ్య ఎంత?
ఎ) 12 బి) 15 సి) 18 డి) 21
12. కింది వాటిని జతపరచండి.
ఎ) సర్గ 1) సృష్టి
బి) ప్రతిసర్గ 2) 14 మంది మనువుల వృత్తాంతం
సి) వంశం 3) ప్రతి సృష్టి
డి) మన్వంతరం 4) దేవతల, రాక్షసుల వృత్తాంతం
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-1, బి-3, సి-4, డి-2
సి) ఎ-4, బి-3, సి-2, డి-1
డి) ఎ-3, బి-1, సి-4, డి-2
13. భాగవతం ప్రకారం భగవంతుడి అవతారాల సంఖ్య ఎంత?
ఎ) 10 బి) 15 సి) 18 డి) 21
14. కపిల మహర్షి వృత్తాంతం భాగవతంలో ఏ స్కంధంలో ఉంది?
ఎ) 2వ స్కంధం బి) 3వ స్కంధం
సి) 5వ స్కంధం డి) 7వ స్కంధం
15. బలరాముడి తల్లి ఎవరు?
ఎ) దేవకి బి) కుంతి
సి) రోహిణి డి) యశోద
16. కంసుని మామ ఎవరు?
ఎ) కాలయవనుడు బి) హింబాసురుడు
సి) జరాసంధుడు డి) బకాసురుడు
17. పలికించెడువాడు రామభద్రుండట అని చెప్పిందెవరు?
ఎ) మొల్ల బి) తాళ్లపాక తిమ్మక్క
సి) శ్రీనాథుడు డి) పోతన
18. ‘కొందరకు తెనుగు గుణములు… కొందరకు సంస్కృతంబు గుణమగు’ అని ఏ కవి చెప్పాడు?
ఎ) పోతన బి) తిక్కన
సి) నాచన సోమన డి) నన్నయ
19. ‘చేతులారంగ శివుని పూజింపడేని…. కలుగ నేటికి తల్లుల కడుపు చేటు’ ఏ గ్రంథంలోనిది?
ఎ) మహాభారతం బి) భాగవతం
సి) రామాయణం డి) హరివంశం
20. “ ఓ యమ్మ నీ కుమారుడు మా యిండ్లను పాలు పెరుగు మననీడమ్మా” అని భాగవతంలో ఎవరు ఎవరితో అంటారు?
ఎ) గోపికలు దేవకితో
బి) దేవకి యశోదతో
సి) గోపికలు యశోదతో
డి) యశోద దేవకితో
21. ఇవటూరి సోమనారాధ్యుని దీవెనలతో పోతన రచించిన గ్రంథం ఏది?
ఎ) భాగవతం
బి) నారాయణ శతకం
సి) భోగినీ దండకం
డి) వీరభద్ర విజయం
22. భాగవతం పరమ లక్ష్యం ఏది?
ఎ) దశావతారాల కథనం
బి) కృష్ణావతార కథనం
సి) అద్వైత సిద్ధాంతం
డి) ద్వైత సిద్ధాంతం
23. కుచేలుని భక్తి ఏ మార్గంలోకి వస్తుంది?
ఎ) శ్రవణం బి) ఆత్మ నివేదనం
సి) సఖ్యభక్తి డి) దాస్యం
24. ‘ఎవ్వనిచే జనించు, జగమెవ్వనిలోపల నుండు ’ ఈ పద్యం భాగవతంలో ఏ ఘట్టంలోనిది?
ఎ) ప్రహ్లాద చరిత్ర
బి) రుక్మిణీ కళ్యాణం
సి) గజేంద్ర మోక్షం
డి) వామనావతారం
25. ‘కలడు కలండనెడువాడు కలడో లేడో – మాటలు భాగవతంలో ఎవరన్నారు?
ఎ) మొసలి బి) ప్రహ్లాదుడు
సి) గజేంద్రుడు డి) బలి చక్రవర్తి
26. ‘నీవె తప్ప నిత: పరంబెరుంగ మన్నింపదగున్ దీనునిన్’ అన్న భాగవత కథలో దీనుడెవరు?
ఎ) ప్రహ్లాదుడు బి) అంబరీషుడు
సి) గజేంద్రుడు డి) బలి చక్రవర్తి
27. శ్రీ కృష్ణుడిపై యశోదకు గల భక్తి ఏది?
ఎ) సఖ్య భక్తి బి) దాస్యభక్తి
సి) వాత్సల్య భక్తి డి) ఆత్మనివేదన
28. ‘ఇంతింతై వటుడింతయై మరియు తానింతై’ అనే పద్యం భాగవతంలో ఏ కథలోనిది?
ఎ) రుక్మీణి కల్యాణం బి) గజేంద్ర మోక్షం
సి) ప్రహ్లాద చరిత్ర డి) వామన చరిత్ర
29. ‘అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్న రావన్న’ అని భాగవతంలో ఎవరు పలికారు?
ఎ) అంబరీషుడు బి) రంతి దేవుడు
సి) బలి చక్రవర్తి డి) ప్రహ్లాదుడు
30. ‘అమ్మల గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ’ ఈ పద్యం ఏ గ్రంథంలోనిది?
ఎ) భారతం బి) భాగవతం
సి) రామాయణం డి) హరవిలాసం
31. ‘కమలాక్షు నర్పించు కరములు కరములు’ అని భాగవతంలో ఎవరన్నారు?
ఎ) బలి చక్రవర్తి బి) రంతి దేవుడు
సి) ప్రహ్లాదుడు డి) రుక్మిణి
32. ‘ఆర్యా: మహాదేవియున్ నను రక్షింపనెరుంగునో నెరుంగదో ’ అని భాగవతంలో అన్న దెవరు?
ఎ) యశోద బి) దేవకి
సి) రుక్మిణి డి) సుభద్ర
33. కింది వాటిని జతపరచండి?
ఎ) పోతన 1) 5వ స్కంధం
బి) బొప్పరాజు గంగన 2) 10వ స్కంధం
సి) ఏర్చురి సింగన 3) 11వ స్కంధం
డి) వెలిగందల నారన 4) 6వ స్కంధం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-4, బి-3, సి-2, డి-1
34. నల్లనివాడు పద్మ నమయనంబుల వాడు’ – ఈ పద్యం భాగవతంలో ఏ స్కంధంలోనిది?
ఎ) అష్టమస్కంధం బి) నవమస్కంధం
సి) దశమ స్కంధం డి) ఏకాదశ స్కంధం
35. బలి చక్రవర్తి శుక్రుడు చెప్పిన హితవును పాటించక చెప్పిన పద్యమేది?
ఎ) ఇంతింతై వటుడింతయై
బి) రవి బింబంబుపమింప
సి) ఆదిన్, శ్రీసతి కొప్పుపై తనువుపై
డి) ఓ కమలాక్ష యో వరద
36. ‘లేమా, దనుజుల గెలువగ లేమా’ అని ఎవరు ఎవరితో అన్నారు?
ఎ) శ్రీకృష్ణుడు సత్యభామతో
బి) శ్రీకృష్ణుడు రుక్మిణితో
సి) శ్రీకృష్ణుడు భూదేవితో
డి) నరకాసురుడు సత్యభామతో
37. లావొక్కింతయు లేదు- అని భగవంతునితో మొర పెట్టుకున్నదెవరు?
ఎ) మొసలి బి) గజేంద్రుడు
సి) ప్రహ్లాదుడు డి) రంతిదేవుడు
38. ‘మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు’ – అని భాగవతంలో ఎవరన్నారు?
ఎ) శుక్రాచార్యుడు బి) ప్రహ్లాదుడు
సి) లీలావతి డి) హిరణ్యకశివుడు
39. ధ్రువుడి వృత్తాంతం భాగవతంలోని ఏ స్కంధంలో ఉంది?
ఎ) తృతీయ బి) చతుర్థ
సి) పంచమ డి) సప్తమ
40. ధ్రువుడి తండ్రిపేరు?
ఎ) ఉత్తాన పాదుడు బి) ఉత్తముడు
సి) పరీక్షిత్తు డి) జడ భరతుడు
41. సుధాముడు ఎవరి పేరు?
ఎ) రంతిదేవుడు బి) కుచేలుడు
సి) అక్రూరుడు డి) ప్రహ్లాదుడు
42. అర్జునుని మనుమడు ఎవరు?
ఎ) అభిమన్యుడు బి) పరీక్షిత్తు
సి) జయంతుడు డి) జయపాలుడు
43. కిందివాటిని జతపరచండి?
ఎ) రాక్షస గురువు 1) శుక్రాచార్యుడు
బి) దేవతల గురువు 2) శ్రీకృష్ణుడు
సి) కుచేలుని స్నేహితుడు 3) అభిమన్యుడు
డి) అర్జునుని కుమారుడు 4) బృహస్పతి
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-1, బి-4, సి-2, డి-3
డి) ఎ-2, బి-3, సి-4, డి-1
44. కిందివాటిని జతపరచండి?
ఎ) తృతీయ స్కంధం 1) గజేంద్ర మోక్షం
బి) సప్తమ స్కంధం 2) శ్రీకృష్ణ చరిత్ర
సి) అష్టమ స్కంధం 3) ప్రహ్లాద చరిత్ర
డి) దశమ స్కంధం 4) కపిలమహర్షి వృత్తాంతం
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-1, డి-2
సి) ఎ-4, బి-3, సి-2, డి-1
డి) ఎ-3, బి-4, సి-1, డి-2
45. త్రిమూర్తులతో మోహినీరూపం ధరించినదెవరు?
ఎ) విష్ణువు బి) బ్రహ్మ
సి) శివుడు డి) కృష్ణుడు
46. శ్రీకృష్ణ కుచేలుల గురువు ఎవరు?
ఎ) ద్రోణుడు బి0 సాంచీవుడు
సి) భీష్ముడు డి) కృపాచార్యుడు
47. రోహిణీ వసుదేవుల కుమార్తె ఎవరు?
ఎ) సుభద్ర బి) రాధ
సి) రుక్మిణి డి) కాళింది
48. అశ్వత్ధామ తండ్రి ఎవరు?
ఎ) కృపాచార్యుడు బి) ద్రోణుడు
సి) దుర్యోధనుడు డి) ద్రుపదుడు
49. ప్రహ్లాధుని తండ్రిపేరు?
ఎ) హిరణ్యాక్షుడు
బి) హిరణ్యగర్భుడు
సి) హిరణ్య వర్ధుడు
డి) హిరణ్యకశిపుడు
50. నరసింహావతారంలో విష్ణువు దేని నుంచి బయటికొచ్చాడు?
ఎ) స్తంభం బి) గోడ
సి) సింహాసనం డి) భూమి
51. భారతీయ ఇతిహాసాలు ఎన్ని?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
52. నన్నయ శైలీ విధానం ఎటువంటిది?
ఎ) నాటకీయ శైలి బి) వర్ణనాత్మక శైలి
సి) కథాకథన శైలి డి) దేశి కవితా శైలి
53. సంస్కృత భారతంలోని పర్వాల సంఖ్య ఎంత?
ఎ)18 బి) 25
సి) 50 డి) 100
54. నన్నయ, ఎర్రనలు రచించిన పర్వం?
ఎ) అది బి) సభా
సి) అరణ్య డి) విరాట
55. ఆంధ్ర మహా భారతాన్ని ప్రారంభిస్తూ నన్నయ చెప్పిన శ్లోకం?
ఎ) శుక్లాంబరధరం విష్ణుం
బి) శ్రీవాణీ గిరిజాశ్చిరాయ
సి) ఏకదంతం మహాకాయమ్
డి) దేవరాజ్య సేవ్యమాన
56. నన్నయ ఉభయ వాక్ప్రౌఢిని కొనియాడిన కవి?
ఎ) శ్రీనాథుడు
బి) పోతన
సి) అల్లసాని పెద్దన
డి) తెనాలి రామకృష్ణుడు
57. కవి వృషభులు భారతాన్ని ఏమన్నారు?
ఎ) నీతి శాస్త్రం బి) మహాకావ్యం
సి) పురాణం డి) ప్రబంధం
58. పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబె విసంగ నబీషంటమెమ్మెయిన్’ అని ఎవరు ఎవరితో అన్నారు?
ఎ) వేదవ్యాసుడు నారదునితో
బి) కృష్ణుడు అర్జునుడితో
సి) రాజరాజ నరేంద్రుడు నన్నయతో
డి) నారదుడు వేద వ్యాసునితో
59. శ్రీ కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన పర్వం?
ఎ) ఉద్యోగపర్వం బి) భీష్మ పర్వం
సి) ద్రోణ పర్వం డి) శాంతి పర్వం
60. నల దమయంతుల వృత్తాంతంగల పర్వం?
ఎ) అరణ్య పర్వం బి) విరాట పర్వం
సి) ఉద్యోగ పర్వం డి) సభా పర్వం
సమాధానాలు
1-బి 2-ఎ 3-సి 4-సి
5-ఎ 6-బి 7-సి 8-డి
9-సి 10-బి 11-ఎ 12-బి
13-డి 14-బి 15-సి 16-సి
17-డి 18-ఎ 19-బి 20-సి
21-డి 22-బి 23-సి 24-సి
25-సి 26-సి 27-సి 28-డి
29-బి 30-బి 31-సి 32-సి
33-సి 34-సి 35-సి 36-ఎ
37-బి 38-బి 39-బి 40-ఎ
41-బి 42-బి 43-సి 44-బి
45-ఎ 46-బి 47-ఎ 48-బి
49-డి 50-ఎ 51-ఎ 52-సి
53-డి 54-సి 55-బి 56-ఎ
57-బి 58-సి 59-బి 60-ఎ
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు