NTA PhD Entrance Test 2023 | ఎన్టీఏ పీహెచ్డీ ఎంట్రన్స్‌టెస్ట్
NTA PhD Entrance Test 2023 | పీహెచ్డీ చేయాలనుకుంటున్నారా? దేశంలో పేరుగాంచిన విద్యాసంస్థల్లో పరిశోధకులుగా చేరాలనే వారికి మంచి అవకాశం. దేశంలోని వివిధ యూనివర్సిటీల్లో పీహెచ్డీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా…
పరీక్ష పేరు: ఎన్టీఏ పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్-2023
విభాగాలు: కామర్స్, ఫైనాన్స్, ఆర్ట్ అండ్ కల్చర్, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్, సైన్సెస్, ఇంటర్ డిసిప్లినరీ సైన్సెస్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ తదితరాలు
ప్రవేశాలు కల్పించే సంస్థలు : ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, బాబా భీమ్రావ్ అంబేద్కర్
యూనివర్సిటీ
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత సబ్జెక్టులో పీజీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోట్: వయో పరిమితి నిబంధనలు లేవు
నోట్: ఎన్టీఏ నిర్వహించే ఈ ఎంట్రన్స్ టెస్ట్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా పైన పేర్కొన్న నాలుగు యూనివర్సిటీలు దేనికి అవే ప్రవేశాలను కల్పిస్తాయి.
పరీక్ష విధానం
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.
- దీనిలో రెండు సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్లో రీసెర్చ్ మెథడాలజీ, రెండో సెక్షన్లో సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఇస్తారు.
- మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు
- పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు
- ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది
- ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు కోత విధిస్తారు
నోట్: ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీల్లో ఆయా కోర్సులకు సంబంధించి అర్హతల్లో కొంత తేడా ఉంది. దరఖాస్తు సమయంలో ఆయా యూనివర్సిటీల వెబ్సైట్లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసువచ్చు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 8
వెబ్సైట్:
https://phd-entrance.
samarth.ac.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు