Current Affairs | అంతర్జాతీయం
జస్టిస్ డే
వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ (ప్రపంచ న్యాయ దినోత్సవం)ను జూలై 17న నిర్వహించారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) పనికి మద్దతు ఇవ్వడానికి, అంతర్జాతీయంగా న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం, నేర విభాగంలో న్యాయాన్ని ప్రోత్సహించడం దీని ఉద్దేశం. రోమ్ శాసనాన్ని చరిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా జూలై 17ను ప్రపంచ న్యాయ దినోత్సవంగా 1998లో గుర్తించారు.
రష్యా
నల్లసముద్ర ఆహార ధాన్యాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు మాస్కో జూలై 17న ప్రకటించింది. ఈ ఒప్పందం గతేడాది జూలైలో ఐక్యరాజ్యసమితి, తుర్కియే మధ్యవర్తిత్వంతో కుదిరింది. క్రిమియా ద్వీపాన్ని, రష్యా ప్రధాన భూభాగాన్ని కలిపే కెర్చ్ వంతెనపై దాడి జరిగింది. ఇది జరిగిన కొన్ని గంటలకు రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షల కారణంగా తమ ఆహార, ఎరువుల ఎగుమతులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయని, ఈ సమస్యలు పరిష్కారమైతేనే తిరిగి నల్లసముద్ర ఆహార ధాన్యాల ఒప్పందంలో చేరుతామని రష్యా ప్రకటించింది.
డైమండ్ బోర్స్
గుజరాత్‌లోని సూరత్‌లో నిర్మించిన డైమండ్ బోర్స్ అనే భవనం అమెరికాలోని పెంటగాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయంగా నిలుస్తుందని అధికారులు జూలై 19న వెల్లడించారు. వజ్రాల కట్టర్లు, పాలిషర్లు, వ్యాపారులతో సహా 65,000 మంది వజ్రాల నిపుణుల కోసం ఈ భవనాన్ని నిర్మించారు. 35 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఈ భవన డిజైన్‌ను మోర్ఫోజెనెసిస్ అనే ఆర్కిటెక్చర్ సంస్థ రూపొందించింది. ఈ భవనాన్ని ప్రధాని మోదీ నవంబర్‌లో ప్రారంభించనున్నారు.
పాస్‌పోర్ట్ ఇండెక్స్
ప్రపంచంలో శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశాల సూచీ హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ జూలై 19న విడుదల చేసింది. 227 దేశాలతో ఈ సూచీని రూపొందించింది. ఈ సూచీలో ఈ ఏడాది జపాన్ను అధిగమించి సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ పాస్‌పోర్ట్ ఉన్నవారు వీసా రహితంగా, వీసా ఆన్ అరైవల్ విధానంలో ప్రపంచ వ్యాప్తంగా 192 దేశాల్లో పర్యటించవచ్చు. గత ఐదేండ్లుగా తొలి స్థానంలో కొనసాగుతున్న జపాన్ ఈసారి మూడో స్థానానికి పడిపోయింది.
సింగపూర్ తర్వాత జర్మనీ, ఇటలీ, స్పెయిన్ (190) సంయుక్తంగా 2వ స్థానంలో నిలువగా.. ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జపాన్, లక్సెంబర్గ్, సౌత్ కొరియా, స్వీడన్ (189) సంయుక్తంగా 3వ స్థానంలో నిలిచాయి. 4వ స్థానంలో డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, యూకే (188), 5వ స్థానంలో బెల్జియం, చెక్ రిపబ్లిక్, మాల్టా, న్యూజిలాండ్, నార్వే, పోర్చుగల్, స్విట్జర్లాండ్ (187), 6వ స్థానంలో ఆస్ట్రేలియా, హంగేరి, పోలాండ్ (186), 7వ స్థానంలో కెనడా, గ్రీస్ (185), 8వ స్థానంలో అమెరికా, లిథువేనియా (184), 9వ స్థానంలో లాత్వియా, స్లొవేకియా, స్లొవేనియా (183), 10వ స్థానంలో ఎస్తోనియా, ఐస్లాండ్ (182)ఉన్నాయి.
దీనిలో భారత్ 80వ స్థానంలో ఉంది. భారత పాస్‌పోర్ట్‌తో 57 దేశాల్లో పర్యటించవచ్చు. భారత్ గతేడాది 85వ స్థానంలో ఉంది. పాకిస్థాన్ 100వ స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ పాస్‌పోర్ట్ ఉన్నవారు కేవలం 27 దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లవచ్చు.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు