Current Affairs JULY | అంతర్జాతీయం
ఫైర్ పవర్ ఇండెక్స్
వివిధ దేశాల సైనిక శక్తికి సంబంధించిన నివేదికను గ్లోబల్ ఫైర్ పవర్ (జీఎఫ్‌పీ) సంస్థ జూలై 10న విడుదల చేసింది. ప్రపంచంలోని దేశాల రక్షణ రంగంపై జీఎఫ్‌పీ సర్వే నిర్వహించి ర్యాంకులను కేటాయిస్తుంది. 145 దేశాలతో ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదికలో ప్రపంచంలో అత్యధిక సైనిక శక్తిగా అమెరికా మొదటి స్థానంలో నిలువగా.. రష్యా 2, చైనా 3, భారత్ 4, యూకే 5, దక్షిణ కొరియా 6, పాకిస్థాన్ 7, జపాన్ 8, ఫ్రాన్స్ 9, ఇటలీ 10వ స్థానంలో నిలిచాయి. తక్కువ సైనిక శక్తి కలిగిన దేశాల్లో భూటాన్ మొదటి స్థానంలో ఉండగా.. బెనిన్ 2, మాల్డోవా 3, సోమాలియా 4, లిబియా 5, సురినామ్ 6, బెలిజె 7, సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ 8, ఐస్లాండ్ 9, సియెర్రా లియోన్ 10వ స్థానాల్లో ఉన్నాయి.
ఎ డబ్ల్యూఈబీ
అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్ (ఎ-డబ్ల్యూఈబీ) ఎగ్జిక్యూటివ్ బోర్డ్ 11వ సమావేశంలో కొలంబియాలోని కార్టజెనాలో జూలై 12న నిర్వహించారు. ‘ఏ గ్లోబల్ వ్యూ ఆన్ ది చాలెంజెస్ ఆఫ్ రీజినల్ ఎలక్షన్ 2023’ అనే థీమ్‌తో ఈ సమావేశాన్ని చేపట్టారు. ఈ సమావేశానికి భారత ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ హాజరయ్యారు. ఎన్నికల సమగ్రతను దెబ్బతీసే సవాళ్లు, పరిష్కారాలపై చర్చించారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ (ఈఎంబీఎస్)లలో ప్రపంచంలోనే ఇది పెద్దది. దీనిలో 119 ఈఎంబీఎస్లు, 20 ప్రాంతీయ అసోసియేషన్స్/ ఆర్గనైజేషన్స్లు సభ్యులుగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యంలో సుస్థిరత సాధించడానికి ఎ-డబ్ల్యూఈబీని 2013, అక్టోబర్‌లో సియోల్‌లో ఏర్పాటు చేశారు.
పుట్టిన రోజు.. గిన్నిస్ రికార్డు
ఒకే తేదీన పుట్టినరోజు జరుపుకొని ఒక కుటుంబంలోని 9 మంది జూలై 12న గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లోకి ఎక్కారు. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని లర్కానా నగరానికి చెందిన అమీర్ అలీ, ఖదీజా దంపతులకు 1992, ఆగస్ట్ 1న మొదటి పాప పుట్టింది. తర్వాత వరుసగా ఆరుగురు సంతానం అదే తేదీన పుట్టారు. ఏడుగురు తోబుట్టువులతో పాటు వారి తల్లిదండ్రుల పుట్టినరోజు, పెళ్లి రోజు ఒకే తేదీ కావడం విశేషం. దీంతో ఈ పాకిస్థానీ కుటుంబం గిన్నిస్ గుర్తింపు పొందింది. గతంలో అమెరికాకు చెందిన కమిన్స్ కుటుంబం పేరిట ఫిబ్రవరి 20న పుట్టినరోజు ఐదుగురి పిల్లలతో ఈ రికార్డు ఉంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు