దోమను దోమతోనే చంపే వ్యూహం
- మలేరియా, డెంగీని అరికట్టడానికి ఆక్సిటెక్ ప్రయోగం
- అమెరికాలో తొలి దశలో 1.5 లక్షల దోమల విడుదల
న్యూఢిల్లీ, మే 7: డెంగీ, మలేరియాను అరికట్టడానికి బిల్గేట్స్ నిధులు సమకూర్చిన ఆక్సిటెక్ బయోటెక్ కంపెనీ ఆసక్తికరమైన ప్రయోగాన్ని చేసింది. దోమలను దోమలతోనే చంపేవిధంగా ఏడిస్ ఈజిప్టి మగ దోమల్లో జన్యుపరమైన మార్పులు చేసింది. అలా జన్యుమార్పులు చేసిన 1,50,000 దోమలను అమెరికాలో వదిలిపెట్టింది. యూకేకు చెందిన ఈ కంపెనీ ఈ ప్రయోగాన్ని ఇప్పటికే బ్రెజిల్, మలేషియా, పనామాలో నిర్వహించింది. తాజాగా అమెరికా ఈ ప్రయోగానికి ఆమోదం తెలుపడంతో ప్రయోగాత్మకంగా ఫ్లోరిడాలో జన్యుమార్పిడి చేసిన దోమలను వదిలింది. సాధారణంగా ఆడ ఏడిస్ ఈజిప్టి దోమలు మలేరియా లాంటి వ్యాధులకు కారణం అవుతాయి. జన్యుమార్పులు చేసిన మగ దోమలు ఆడ దోమలతో కలిసినప్పుడు… కొత్తగా పుట్టే ఆడదోమలు లార్వా దశలో చనిపోయే విధంగా జన్యువులను రూపొందించారు. మగ దోమలకు మాత్రం యథావిధిగా జన్యువులు సంక్రమణం చెందుతాయి. అంటే వ్యాధులను కలిగించే ఆడదోమలు పుట్టుకలోనే చనిపోతాయన్న మాట. మగదోమల్లో కొత్తరకమైన కృత్రిమ జన్యువులు ఉండటం వల్ల క్రమంగా ఆడ దోమల సంఖ్య తగ్గి వ్యాధులు అదుపులోకి వస్తాయి. అమెరికాలో ఈ దోమల ప్రయోగంలో భాగంగా రెండో దశలో 2 కోట్ల దోమలను విడుదల చేయనున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు