Current Affairs July | జాతీయం
కెర్ పూజ
త్రిపురలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటిగా పరిగణిస్తున్న ‘కెర్ పూజ’ను జూలై 11న నిర్వహించారు. ఈ పండుగను 5వ శతాబ్దం క్రితం అప్పటి రాజులు ప్రారంభించారని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు వాస్తు దేవతను ఆరాధిస్తారు. ఈ పండుగ నిర్వహించే ప్రాంతంలో సరిహద్దులను మూసివేస్తారు. బయటివారు ఇక్కడికి రాకుండా, ఇక్కడివారు బయటికి వెళ్లకుండా ఆంక్షలు విధిస్తారు. వీటిని అతిక్రమిస్తే జరిమానా విధిస్తారు. త్రిపురలోని రాజభవనం ప్రధాన వేదికగా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.
ఫ్లయింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్
తమిళనాడులో మొదటి ఫ్లయింగ్ ట్రెయినింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌టీవో)ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) జూలై 11న అనుమతి ఇచ్చింది. సేలం విమానాశ్రయంలోని EKVI ఎయిర్ ట్రెయినింగ్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎఫ్‌టీవో ఏర్పాటుకు అనుమతి లభించింది. ఇది ఆ రాష్ట్రంలోని ఏకైక ఫ్లయింగ్ ట్రెయినింగ్ ఆర్గనైజేషన్. దేశంలో డీజీసీఏ ఆమోదించిన 36వ ఫ్లయింగ్ ట్రెయినింగ్ ఆర్గనైజేషన్ ఇది.
కామికేజ్ డ్రోన్
స్వదేశీ పరిజ్ఞానంతో ఏఐ ఆధారిత కామికేజ్ (సూసైడ్) డ్రోన్‌ను అభివృద్ధి చేసినట్లు ఐఐటీ కాన్పూర్ జూలై 11న వెల్లడించింది. ఇది ఆరు కిలోల బరువు గల పేలోడ్‌ను 100 కి.మీ. వరకు మోసుకెళ్లగలదు. జీపీఎస్ సపోర్ట్ లేకపోయినా ఈ డ్రోన్లు శత్రు లక్ష్యాలను నిర్వీర్యం చేయగలవు. రాడార్ల కన్నుగప్పేలా స్తెల్త్ టెక్నాలజీని అమర్చారు. డీఆర్డీవోకు చెందిన యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ ప్రాజెక్ట్ కింద ఈ డ్రోన్‌ను గతేడాది నుంచి అభివృద్ధి చేస్తున్నారు. ఆరు నెలల్లో వీటిని పరీక్షించనున్నారు.
బయాలజీ ఒలింపియడ్
ఇంటర్నేషనల్ బయాలజీ ఒలింపియాడ్‌లో బంగారు పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 34వ ఇంటర్నేషనల్ బయాలజీ ఒలింపియాడ్ (ఐబీవో)ను జూలై 3 నుంచి 11 వరకు యూఏఈలోని అల్ ఐన్లో నిర్వహించారు. దీనిలో ప్రతి విభాగం నుంచి బంగారు పతకం గెలుచుకున్నారు. ఈ ఒలింపియాడ్‌లో పతకాల పట్టిలో భారత్ అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి. సింగపూర్ కూడా నాలుగు బంగారు పతకాలు గెలిచి రెండో స్థానంలో నిలిచింది. చైనా, చైనీస్ తైపీ మూడు బంగారు పతకాలు గెలిచి రెండో స్థానంలో ఉన్నాయి. బంగారు పతకాలు గెలిచినవారు ధ్రువ్ అద్వానీ (బెంగళూరు, కర్ణాటక), ఇషాన్ పెడ్నేకర్ (కోట, రాజస్థాన్), మేఘ చబ్ద (జాల్నా, మహారాష్ట్ర), రోహిత్ పాండా (రిసాలి, ఛత్తీస్‌గఢ్). దీనిలో 76 దేశాల నుంచి 293 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
చంద్రయాన్-3
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంలో మొదటి దశ జూన్ 14న విజయవంతంగా పూర్తయ్యింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్లతో కూడిన చంద్రయాన్-3 వ్యోమనౌక ఎల్వీఎం3-ఎం4 మధ్యాహ్నం 2:35 గంటలకు అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఆగస్టు 23న సాయంత్రం 5:47 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై దిగుతుందని ఇస్రో అధికారులు వెల్లడించారు. ఈ మిషన్ విజయవంతంగా పూర్తయితే భారత్ చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాలుగో దేశంగా, చందమామ దక్షిణ ధ్రువానికి చేరుకున్న తొలి దేశంగా రికార్డు సాధిస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు