గూనలోనే గూడు
నగరాల్లో ఇండ్ల నిర్మాణం కోసం వేల చెట్లు నేలకొరిగాయి. గూళ్లు చెదిరిపోయి లక్షల సంఖ్యలో పక్షులు ఆవాసం కోల్పోయాయి.ఆ పక్షులకోసం కొన్ని సంస్థలు సరికొత్త గూనలను తయారు చేస్తున్నాయి. ఇవి ఇంటి పైకప్పుగానే కాదు, పక్షులకు ఆవాసాలుగానూ ఉపయోగపడుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 55 శాతానికి పైగా జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నది. కొత్త నివాసాలకోసం భారీసంఖ్యలో చెట్లను నరికేయాల్సి వస్తున్నది. దీంతో పర్యావరణానికి హాని కలగడంతోపాటు అనేక పక్షిజాతులు నివాసాలను (గూళ్లు) కోల్పోయి, నిర్వాసితమవుతున్నాయి. ఫలితంగా పట్టణాల్లో పక్షులసంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. దీన్ని నివారించేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు వినూత్న ఆలోచన చేశాయి. ఇంటి పైకప్పుకోసం వాడే గూనలోనే పక్షుల గూడునూ ఏర్పాటు చేస్తున్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన ‘క్లాస్ కూకైన్’ అనే సంస్థ ఈ వినూత్న గూనకు మొదటిసారిగా రూపకల్పన చేసింది. ఆ తర్వాత టర్కీలోని కోరమ్ నగరానికి చెందిన టెర్రకోట ఉత్పత్తుల తయారీదారులు ఈ గూనల ఉత్పత్తిని ప్రారంభించారు. వీటిని ఉచితంగానే పంపిణి చేస్తూ పక్షులకు నీడనిస్తున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు