Indian History | ‘గాంధార శిల్పకళ’ఎవరి కాలంలో వృద్ధి చెందింది?
భారతదేశ చరిత్ర
1. ఇండోగ్రీకుల రాజ్యాన్ని అంతం చేసినదెవరు?
1) యూచేచి 2) పార్థియన్లు
3) శకులు 4) కుషాణులు
2. పుష్యమిత్ర శుంగుడి మత విధానానికి సంబంధించి, కిందివాటిలో సరైన అంశం ఏది?
1) ఈయన బౌద్ధ భిక్షువులను హింసించాడు
2) పరమత సహన విధానాన్న పాటించాడు
3) శాక్యులకు చెందిన బౌద్ధ భిక్షువులను సన్యాసినులను హింసించాడు
4) ఈయన బౌద్ధమత వ్యతిరేకి
3. జతపరచండి.
1. వాయవ్య భారతదేశాన్ని పాలించిన రాజ్యవంశాలు ఎ) సంగమ రాజ్యాలు (చోళ,చేర, పాండ్య)
2. ద్వీపకల్ప దక్షిణ ప్రాంతాన్ని పాలించిన రాజ్యవంశాలు బి) ఇండో గ్రీకులు, పార్థియన్లు, శకులు, కుషాణులు
3. ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన రాజ్యవంశాలు సి) శాతవాహనులు
4. కళింగ ప్రాంతాన్ని పాలించిన రాజ్యవంశాలు డి) ఛేది వంశస్థులు (మహా మేఘవాహన)
1) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి 2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి 4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4. ఇండియాలో శకరాజ్య స్థాపకుడెవరు?
1) మౌజ్ 2) ఎజస్
3) యాజల్జెస్ 4) రెండవ ఎజస్
5. శక రాజ్యాన్ని అంతం చేసినదెవరు?
1) గొండొఫర్నిస్ 2) లైక
3) చష్టన్ 4) భుమక
6. జతపరచండి.
1. కుషాణుల్లో ఎ) కుజల కాడ్ పైజస్ మొదటివాడ
2. శకుల్లో మొదటివాడు బి) డెమిట్రియస్
3. ఇండోగ్రీకుల్లో మొదటివాడు సి) మౌజ్
4. పార్థియన్లలో మొదటివాడు డి) వావెనస్
1) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
2) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-ఎ, 2-సి 3-బి, 4-డి
7. ‘గాంధార శిల్పకళ’ ఎవరి కాలంలో వృద్ధి చెందింది?
1) కుజల కాడ్పీసెస్ 2) కనిష్కుడు
3) సముద్రగుప్తుడు 4) హర్షుడు
8. అతిప్రాచీనమైన బుద్ధ ప్రతిమలను ఏయే ప్రాంతాల్లో దాదాపు ఒకే కాలంలో రూపొందించడం జరిగింది?
1) గాంధార – అజంతా
2) గాంధార – కావేరీ పట్టణం
3) గాంధార – అమరావతి
4) గాంధార – మధుర
9. జతపర్చుము.
1) ఇండోగ్రీకుల రాజధాని ఎ) జునాగఢ్ (గిర్నార్), ఉజ్జయని
2) శకులు (సిథియన్లు) రాజధాని బి) సియోల్ కోట్ (సాకల)
3) పార్టియన్లు (పహ్లవులు) సి) పురుషపురం (పెషావర్)
4. కుషాణుల రాజధాని డి) కాబూల్, కాందహార్ ఆధిపత్యం వహించినది
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి 2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 4) 1-బి, 2-డి 3-ఎ, 4-సి
10. పుష్య మిత్రుడు స్థాపించిన రాజవంశం
1) కణ్వ 2) శుంగ
3) చోళ 4) చేర
11. భారతదేశంలోని వస్త్రధారణ శైలిలో మార్పులు ప్రవేశపెట్టిన విదేశీయులు ఎవరు?
1) ఇండో – గ్రీకులు
2) పాశ్చాత్య క్షాత్రవులు
3) కుషాణులు 4) పల్ల్లవులు
12. శక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైంది?
1) క్రీ.శ. 58 2) క్రీ.శ. 68
3) క్రీ.శ. 78 4) క్రీ.పూ.78
13. ప్రాచీన భారతదేశంలో శాతవాహనులు వ్యవసాయ స్వరూపంలో నూతన దశకు నాంది పలికారు. కిందివాటిలో సరైన స్టేట్మెంట్లను గుర్తించండి.
ఎ. రైతుల కోసం భూమిశిస్తు వసూలు చేశారు
బి. గ్రాంటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు
సి. అసైన్మెంట్ పద్ధతిని ప్రవేశపెట్టారు
డి. వారెప్పుడూ అధికారులకు నగదు రూపం లో వేతనాలు చెల్లించలేదు
1) ఎ, బి 2) బి
3) సి, డి 4) బి, సి, డి
14. హెలియోడోరస్ (గ్రీకు రాయబారి) బేస్నగర్లో ఏ స్తంభాన్ని ప్రతిష్ఠించాడు?
1) గరుడ స్తంభం 2) ఇనుపమోలి స్తంభం
3) పై రెండు 4) ఏదీ కాదు
15. శాతవాహన రాజు పులోమావి-1 ఏ కణ్వవంశం రాజును ఓడించి మగధను శాతవాహన రాజ్యంలో విలీనం చేశాడు?
1) భూమిమిత్ర 2) నారాయణ
3) సుశర్మ 4) వాసుదేవ కణ్వ
16. పుష్యమిత్ర శుంగుడి ఆస్థానంలోని పతంజలి రచించిన గ్రంథం ఏది?
1) అష్టాధ్యాయి 2) మహాభాష్యం
3) హర్షచరిత్ర
4) మాళవికాగ్నిమిత్రం
17. కనిష్కుడు బౌద్ధమతాన్ని అనుసరించాడు. మధ్య ఆసియాలో బౌద్ధమత వ్యాప్త్తికి ఈయన కారకుడు. ఇతని ప్రేరణ వల్లనే కశ్మీర్లోని కుందన వనంలో నాలుగో బౌద్ధమత సంఘాల పరిషత్తు జరిగింది. కనిష్కుడు బౌద్ధమతం పట్ల ఇంతటి ఆసక్తి చూపడానికి కారణం ఏమిటి?
1) ఆయనకు బౌద్ధమతం పట్ల గల అభిమానం
2) బౌద్ధమతానికి గల ప్రజాదరణ పట్ల ఆకర్షితుడు కావడం
3) తన రాజకీయ లక్ష్యాల సాధనలో ముందుకు సాగడానికి బౌద్ధమతానుయాయుల మద్దతు పొందడం
4) ఆయనకు హిందూమతం పట్ల గల ద్వేషం
18. ఏ శుంగ వంశ రాజు కాలంలో గ్రీకు రాయబారి హెలియోడోరస్ శుంగ రాజ్యాన్ని సందర్శించినాడు?
1) అగ్నిమిత్రుడు 2) దేవభూతి
3) భాగుడు
4) పుష్యమిత్ర శుంగుడు
19. కుషాణు రాజ్య స్థాపకుడెవరు?
1) కుజల కాడ్పీసెస్
2) వీమా కాడ్పీసెస్
3) హవిష్క 4) వాసిష్కక
20. కళింగ ఖారవేలుడు అవలంబించిన మతం ఏది?
1) బౌద్ధమతం 2) జైనమతం
3) అజీవక మతం 4) వైష్ణవ మతం
21. జైన మతస్థుల కోసం ఉదయగిరిలో గుహలను తొలిపించిన కళింగ రాజు ఎవరు?
1) కాలా అశోకుడు
2) చంద్రగుప్త మౌర్యుడు
3) ఖారవేలుడు 4) ఎవరూ కాదు
22. కనిష్కుడు 4వ బౌద్ధమత సమావేశం ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశాడు?
1) పురుషపురం 2) పాటలీపుత్రం
3) కశ్మీర్ 4) తక్షశిల
23. విక్రమశక యుగం ఎప్పుడు మొదలైంది?
1) క్రీ.శ. 78 2) క్రీ.శ. 58
3) క్రీ.పూ 58 4) క్రీ.శ. 48
24. ఏ రాజవంశ కాలంలో ‘కర్మమార్గ’ గురించి వివరించే ‘భాగవత మతం’ ప్రారంభమైనది?
1) ఇండోగ్రీకులు 2) కణ్వవంశం
3) శుంగ వంశం 4) శాతవాహనులు
25. ఎవరి కాలంలో గాంధార శిల్పకళ అత్యున్నత స్థాయికి చేరింది?
1) కుషాణులు 2) పార్థియన్లు
3) గుప్తులు 4) శకులు
26. ప్రతిపాదన) (A) గాంధార కళాశైలిని ‘ఇండో- గ్రీక్ శైలి’ అని కూడా పిలుస్తారు.
కారణం (R ) గాంధార కళాశైలి గ్రీక్ – రోమన్ సంప్రదాయాల వల్ల బాగా ప్రభావితమయ్యింది.
1) (A), (R ) రెండూ నిజం. కానీ (A)(R ) నకు సరైన వివరణ కాదు
2) (A) నిజం కానీ (R ) తప్పు
3) (A) తప్పు కానీ (R ) నిజం
4) (A), (R ) రెండూ నిజం. కానీ (A)(R ) నకు సరైన వివరణ
27. ఆంధ్రులు శక్తిమంతమైన ప్రజలు, అనేక గ్రామాలు, 30 పట్టణాలను కలిగి ఉన్నారని పేర్కొన్న విదేశీయుడు ఎవరు?
1) ప్లీనీ 2) స్ట్రాబో
3) ప్లూటార్క్ 4) జస్టిస్
28. సహపాణుని నాణేలు పెద్ద ఎత్తున ఎక్కడ కనుగొన్నారు?
1) ఉదయపురం 2) ఉజ్జయిని
3) మధుర 4) నాసిక్
29. కుషాణుల రాజ్యాన్ని ఇండియాలోకి విస్తరించినదెవరు?
1) కనిష్కుడు 2) సహపాణుడు
3) వీమా కాడ్పీసెస్ 4) వశిష్కుడు
30. కుషాణుల రాజధాని ఏది?
1) తక్షశిల 2) మధుర
3) పురుషపురం 4) శాకాల
31. ఇండోగ్రీకుల రాజధాని ఏది?
1) హీరాట్ 2) కాబూలు
3) కాందహార్ 4) శాకాల
32. 4వ బౌద్ధ సంగీతిని కుందలవనం (జలంధర్ -కశ్మీర్)లో నిర్వహించిన కుషాణుల రాజు ఎవరు?
1) కనిష్కుడు 2) 2వ కనిష్కుడు
3) హవిష్కుడు 4) ఎవరూ కాదు
33. పుష్యమిత్ర శుంగుడిని ఓడించి మగధ నుంచి జైన విగ్రహం తీసుకెళ్లిన కళింగరాజు ఎవరు?
1) దేవభూతి
2) కళింగ ఖారవేలుడు
3) మేఘ వాహనుడు
4) కళింగ దేవదత్తుడు
34. భారతదేశంలో మొదటిసారిగా బంగారు నాణేలను ప్రవేశపెట్టిన రాజ్యవంశం ఏది?
1) పార్థియన్లు 2) శకులు
3) కుషాణులు 4) ఇండోగ్రీకులు
35. మీనాండర్, నాగసేనుడి మధ్య జరిగిన సంభాషణపై మిళిందపన్హో అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం ఏ మతానికి
సంబంధించినది?
1) జైనమతం 2) అజీవక మతం
3) వైష్ణవ మతం 4) బౌద్ధ మతం
36. ఎవరి కాలంలో భారతదేశానికి పశ్చిమ దేశాలతో సన్నిహిత సంబంధం ఏర్పడింది?
1) హరప్పా
2) పర్షియన్
3) కుషాణుల 4) గ్రీకుల
37. మధ్యప్రదేశ్లోని ప్రముఖ బారుత్ బౌద్ధస్థూపం ఏ వంశ రాజుల కాలంలో నిర్మించారు?
1) శుంగ వంశం
2) కణ్వ వంశం
3) శాతవాహన వంశం
4) ఏదీకాదు
38. భారతదేశ భూభాగంపై మొదటిసారిగా విదేశీ ఆధిపత్యాన్ని స్థాపించినవారు ఎవరు?
1) కుషాణులు 2) శకులు
3) యవనులు 4) అపనులు
39. పుష్యమిత్ర శుంగుని పాలన కాలంలో విస్తరించబడి, ద్వారం ఏర్పాటు చేసిన స్మారక కట్టడం ఏది?
1) సాంచి స్థూపం 2) బర్దూన్ స్థూపం
3) సారనాథ్ స్థూపం 4) 1, 2
40. పుష్యమిత్ర శుంగుడు బౌద్ధులను అణచివేసినట్లు తెలియజేసిన గ్రంథం ఏది?
1) మహావంశం 2) దీపవంశం
3) దివ్యవదన 4) ఏదీకాదు
41. ఖారవేలుడు ఎవరు నిర్మించిన పురాతన కాలువను పొడిగించాడు?
1) మహా పద్మనందుడు
2) కాలా అశోకుడు
3) చంద్రగుప్త మౌర్యుడు
4) అశోకుడు
42. ఏ పాలకుని నాణేలపై త్రిశూలం ధరించిన శివుడు, నంది బొమ్మలు ఉండేవి?
1) కుజల కాడ్పీసెస్
2) వీమా కాడ్ పైసెన్
3) కనిష్కుడు 4) హవిష్కుడు
43. క్రీ.శ. 78లో కనిష్కుడు ప్రారంభించిన శకం ఏది?
1) శక శకం
2) యువ శకం
3) ఇండోగ్రీకు శకం
4) పార్థియన్ శకం
44. గాంధార శిల్పకళను భారతదేశంలో ప్రవేశపెట్టిన రాజ్యవంశం ఏది?
1) పార్థియన్లు 2) కుషాణులు
3) ఇండోగ్రీకులు 4) శకులు
45. చంద్రగుప్త మౌర్యుని సామంతరాజు నిర్మించిన సుదర్శన తటాకం ఆనకట్టను రుద్ర దమనుడు బాగు చేయించాడు. ఆ ఆనకట్ట ఎక్కడ కలదు?
1) పాటలీపుత్రం 2) ఉజ్జయిని
3) కౌశాంబి 4) కథియావాడ్
46. అత్యధికంగా వెండి నాణేలను ముద్రించిన శకుల రాజు ఎవరు?
1) సహపాణుడు 2) మౌజ్
3) వృషభ దత్తుడు 4) ఎవరు కాదు
47. కనిష్కుడు పోషించిన బౌద్ధమత శాఖ ఏది?
1) వజ్రయానం 2) హీనయానం
3) మహాయానం 4) ఏదీ కాదు
48. శాతవాహనులు దేని పునరుద్ధరణకు, అలంకరణకు గణనీయంగా దానాలు చేసేవారు?
1) సాంచీ స్థూపం
2) సారనాథ్ స్థూపం
3) నాగార్జున స్థూపం 4) ఏదీ కాదు
49. మహాభాష్యం దేన్ని వ్యాఖ్యానిస్తుంది?
1) బృహస్పతి స్మృతి
2) యజ్ఞవాక్య స్మృతి
3) పాణిని అష్టాధ్యాయి
4) ఏదీ కాదు
50. కళింగ ఖారవేలుడు వేయించిన శాసనం ఏది?
1) హాథిగుంఫా శాసనం
2) జునాగఢ్ శాసనం
3) పాటలీపుత్ర శాసనం
4) ఏదీ కాదు
సమాధానాలు
1-3 2-3 3-4 4-1
5-1 6-4 7-2 8-4
9-2 10-2 11-3 12-3
13-2 14-1 15-3 16-2
17-3 18-3 19-1 20-2
21-3 22-3 23-2 24-3
25-1 26-4 27-1 28-4
29-3 30-3 31-4 32-1
33-2 34-4 35-4 36-3
37-1 38-3 39-4 40-3
41-1 42-2 43-1 44-2
45-4 46-1 47-3 48-1
49-3 50-1
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్,
హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు