SSC JE Recruitment | స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 1324 ఉద్యోగాలు
SSC JE Recruitment 2023 | సివిల్, ఎలక్ట్రికల్ & మెకానికల్, ఎలక్ట్రికల్, మెకానికల్ తదితర విభాగాలలో జూనియర్ ఇంజినీర్ (Junior Engineer) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (CPWD), సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), బ్రహ్మపుత్ర బోర్డు, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (MES), నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (NTRO) తదితర కేంద్ర శాఖలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ, బీఈ, బీటెక్ లేదా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు సంబంధిత రంగంలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 1324
పోస్టులు : జూనియర్ ఇంజినీర్
విభాగాలు : సివిల్, ఎలక్ట్రికల్ & మెకానికల్, ఎలక్ట్రికల్, మెకానికల్
శాఖలు : బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ వాటర్ కమిషన్, బ్రహ్మపుత్ర బోర్డు, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తదితరాలు
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ, బీఈ, బీటెక్ లేదా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు సంబంధిత రంగంలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
ఎంపిక : కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
జీతం : రూ.35400 నుంచి రూ.112400 వరకు
ఏజ్ లిమిట్ : ఆగష్టు 01 2023 నాటికి 32 ఏండ్లు మించకుడదు.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు సమర్పించడానికి ప్రారంభ తేదీ : జూలై 26
దరఖాస్తులకు చివరి తేదీ : ఆగష్టు 16
ఆన్లైన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ : ఆగష్టు 16
దరఖాస్తు ఫారమ్ దిద్దుబాటు తేదీ : ఆగష్టు 17
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ (పేపర్-I) : అక్టోబర్ 2023
వెబ్సైట్ : www.ssc.nic.in.
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

