ఎఫ్ బీలోని వీడియోలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే…?
హైదరాబాద్, మే 5: ఫేస్బుక్ లో వీడియోలను డౌన్లోడ్ చేయడం గానీ, ,యూట్యూబ్ వీడియోలను డౌన్లోడ్ చేయడం గానీ అంత సులభమైన పని కాదు. అయితే ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన వీడియోలను ఆఫ్‌లైన్‌లో వీక్షించడానికి వీడియోలను డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్, ఐఫోన్, ఐప్యాడ్, మాక్ లేదా విండోస్‌లో ఫేస్బుక్ వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదెలా అంటే…?
విండోస్, మాక్‌లో ఫేస్బుక్ వీడియోలను డౌన్లోడ్ చేసే విధానం
ఫేస్బుక్ వీడియోలను డౌన్లోడ్ చేయడానికి ప్రస్తుతం ఇంటర్నెట్లో అనేక వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో fbdown.net వెబ్సైట్ అందుబాటులో ఉన్న ఉత్తమ ఎంపికలలో ఒకటి.
- మొదట మీరు డెస్క్‌టాప్‌లో డౌన్లోడ్ చేయాలనుకుంటున్నఫేస్బుక్ వీడియోపై రైట్ క్లిక్ చేయాలి. వీడియో URL ను కాపీ చేసి. తరువాత fbdown.net వెబ్సైట్లో లింక్‌ను పేస్ట్ చేయండి. తరువాత డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. అక్కడ SD లేదా HD నాణ్యతను ఎంచుకొని
వీడియోపై రైట్ క్లిక్ చేసి మీ డెస్క్‌టాప్‌లో సేవ్ చేసుకోవాలి.
ఆండ్రాయిడ్ లో ఫేస్బుక్ వీడియోలను డౌన్లోడ్ చేసే విధానం
-మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్న ఫేస్బుక్ వీడియోను ఓపెన్ చేయండి.
-షేర్ ఎంపికపై క్లిక్ చేసి ఆపై కాపీ లింక్‌ను ఎంచుకోండి.
-తరువాత fbdown.net వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, అవసరమైన విభాగంలో లింక్‌ను పేస్ట్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
-మీరు ఫేస్బుక్ వీడియోను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్న వీడియో నాణ్యతను ఎంచుకొని ,తరువాత Chrome లో డౌన్లోడ్ లింక్‌ను ఎంచుకోండి, ఫైర్‌ఫాక్స్‌లో వీడియోను సేవ్ చేయండి.
-ఫేస్బుక్ వీడియో ఆటోమేటిక్ గా డౌన్లోడ్ ఫోల్డర్లో సేవ్ అవుతుంది.
- Tags
- download
- technology
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు