Group 2 Special- General Studies | పీఠ భూముల ఖండం అని దేనిని పిలుస్తారు?
ఆగష్టు 09 తరువాయి
67. క్యోటో ప్రొటోకాల్ దేనికి సంబంధించినది?
1) ఓజోన్ క్షీణత 2) గ్లోబల్ వార్మింగ్
3) వాయ కాలుష్యం 4) జల కాలుష్యం
68. కింది వాటిలో అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవించే ప్రాంతంగా దేన్ని గుర్తించారు?
1) ఈశాన్య భారతదేశం 2) జమ్మూకశ్మీర్
3) గుజరాత్ 4) పైవన్నీ
69. కింది కాంతి ధర్మాలను సరిగా జతపరచండి.
1) గ్రహణాలు ఎ) కాంతి వక్రీభవనం
2) వజ్రం చీకటిలో బి) కాంతి మెరవటం రుజువర్తనం
3) నీటిలోని సి) సంపూర్ణాంతర నాణెం తన పరావర్తనం పరిమాణం కంటే పెద్దదిగా కనిపించడం
1) 1-బి, 2-ఎ, 3-సి
2) 1-సి, 2-బి, 3-ఎ
3) 1-బి, 2-సి, 3-ఎ
4) 1-సి, 2-ఎ, 3-బి
70. రేడియో తరంగాలను పరావర్తనం చేసే వాతావరణ పొర?
1) స్ట్రాటో ఆవరణం 2) మీసో ఆవరణం
3) ట్రోపో ఆవరణం 4) థర్మో ఆవరణం
71. బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలమైన ద్రావణం?
1) బలమైన ఆమ్ల యానకం
2) తటస్థ – క్షార యానకం
3) తటస్థ యానకం 4) ఏదైనా ఒక్కటే
72. క్వార్ట్ (Quartz) దేనితో తయారవుతుంది?
1) కాల్షియం సల్ఫేట్
2) కాల్షియం సిలికేట్
3) సిలికాన్ డై ఆక్సైడ్
4) సోడియం సల్ఫేట్
73. వ్యాధులకు అనుసరించే చికిత్సా విధాన పద్ధతులను సరిగా జతపరచండి.
1) హెచ్ఐవీ వైరస్ (ఎయిడ్స్) ఎ) డాట్స్ (Dots) విధానం
2) టి.బి. (క్షయ) వ్యాధి బి) యాంటీ రెట్రోవైరల్ థెరపీ
3) కుష్టువ్యాధి సి) డై ఇథైల్ కార్బోమేజైన్ చికిత్స
4) బోదకాలు డి) మల్టీ డ్రగ్ థెరపీ
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
74. కొవిడ్ -19 వ్యాధి నిర్ధారణ పరీక్ష?
ఎ) ఆర్.టి.పి.సి.ఆర్ బి) సీటీ స్కాన్
సి) ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, బి
75. జాబితా – 1 (రక్షిత ప్రాంతాలు), జాబితా – 2 (రాష్త్రం) జతపరచి సరైన సమాధానం ఎన్నుకోండి.
జాబితా -1 జాబితా -2
1) గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎ) గుజరాత్
2) సుందర్బన్స్ బి) పశ్చిమ బెంగాల్
3) రాణ్ ఆఫ్ కచ్ సి) తమిళనాడు
4) నోక్రెక్ డి) మేఘాలయ
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
76. కింద ఇచ్చిన మూలకాల్లో ఏది హోలోజన్?
i) ఫ్లోరిన్ ii) బ్రోమిన్
iii) క్లోరిన్ iv) అయోడిన్
v) హైడ్రోజన్
1) v 2) i
3) i, iii, iv 4) i, ii, iii, iv
77. అత్యధిక తేలికైన మూలకం?
1) హైడ్రోజన్ 2) ఆస్మియం
3) లిథియం 4) పాదరసం
78. నర్మద, తపతి, వింధ్య, సాత్పురా పర్వత శ్రేణులను భారతదేశంలో అవి విస్తరించి ఉన్న ప్రదేశాన్ని బట్టి ఉత్తరం నుంచి దక్షిణానికి సరైన క్రమాన్ని గుర్తించండి.
1. నర్మదా – సాత్పురా-తపతి-వింధ్య
2. వింధ్య – నర్మదా – సాత్పురా – తపతి
3. నర్మదా – వింధ్య – తపతి- సాత్పురా
4. వింధ్య – తపతి – సాత్పురా – నర్మదా
79. భౌతిక శాస్ర్తానికి సంబంధించి కింది దృగ్విషయాల్లో సత్యమైన వాటిని గుర్తించండి.
ఎ) ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారంలో బంగారం స్వచ్ఛత 91.6%
బి) పీడనం పెంచితే నీరు మరిగే స్థానం పెరుగుతుందనే సూత్రంపై ప్రెషర్ కుక్కర్ పని చేస్తుంది
సి) పీడనం పెంచితే మంచు ద్రవీభవన స్థానం తగ్గుతుందనే సూత్రంపై స్కేటింగ్ బోర్డ్ పని చేస్తుంది
డి) ఇనుము తుప్పు పట్టకుండా జింక్ పూత పూసే ప్రక్రియను గాల్వనైజేషన్ అంటారు
1) బి, సి 2) ఎ, బి
3) బి, డి 4) ఎ, బి, సి, డి
80. కింది వాటిలో బంగ్లాదేశ్‌తో సరిహద్దు లేని రాష్ట్రం ఏది?
1) మేఘాలయ 2) త్రిపుర
3) పశ్చిమ బెంగాల్ 4) మణిపూర్
81. కింద పేర్కొన్న ఏ రకానికి చెందిన అడవుల్లో టేకు వృక్షాలు పెరుగుతాయి?
1) కవోష్ణ అడవులు
2) ఉష్ణమండల ఆకురాల్చే అడవులు
3) శుష్క ఆకురాల్చే అడవులు
4) బీచ్ అడవులు
82. మానవుని రక్త వర్గాలకు సంబంధించి కింది వాక్యాల్లో సరికానిది?
1) ‘AB’ గ్రూప్ వారిని విశ్వ గ్రహీతలుగా పిలుస్తారు
2) ‘O’ గ్రూప్ వారిని విశ్వ దాతలుగా పిలుస్తారు
3) రక్తాన్ని గడ్డకట్టించేవి- తెల్ల రక్త కణాలు
4) రక్త వర్గాలను మొదట కనుగొన్నది – లాండ్ స్టీనర్
84. బ్రహ్మపుత్ర నదికి గల వివిధ పేర్లలో సరికానిది?
1) ఉత్తర బంగ్లాదేశ్ – పద్మానది
2) దక్షిణ బంగ్లాదేశ్ – మేఘన
3) అసోం – సెడాంగ్
4) అరుణాచల్ ప్రదేశ్ – దిహంగ్
85. నల్ల రేగడి నేల స్వభావం ఏమిటి?
1) తేమ కలిగి ఉండటం
2) పొడిబారి ఉండటం
3) అవనాళికలు ఏర్పడి ఉండటం
4) ఖనిజాలు తక్కువగా ఉండటం
86. బైలదిల్లా గనుల్లో ఏ ఖనిజం అధికంగా లభ్యమవుతుంది?
1) రాగి 2) క్రోమైట్
3) బంగారం 4) ఇనుము
87. ఏ ఉష్ణోగ్రత వద్ద వాతావరణం నీటి ఆవిరితో సంతృప్తి చెందుతుందో ఆ ఉష్ణోగ్రతను ఏమంటారు?
1) శ్వేత తుహనం 2) తుషార స్థానం
3) హేజ్ 4) తుహినం
88. ఆర్థిక సంఘం, చైర్మన్లను జతపరచండి.
1) 15వ ఆర్థిక సంఘం ఎ) సి.రంగరాజన్
2) 14వ ఆర్థిక సంఘం బి) విజయ్ కేల్కర్
3) 13వ ఆర్థిక సంఘం సి) వై.వి. రెడ్డి
4) 12 వ ఆర్థిక సంఘం డి) ఎన్.కె. సింగ్
5) 11వ ఆర్థిక సంఘం ఇ) ఎ.ఎం.ఖుస్రో
1) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ, 5-ఇ
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ, 5-ఇ
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి, 5-ఇ
4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి, 5-ఇ
89. జాతీయ రహదారి నెం.7 ఏ రాష్ట్రం గుండా పోదు?
1) ఉత్తరప్రదేశ్ 2) కేరళ
3) ఆంధ్రప్రదేశ్ 4) తెలంగాణ
90. మధ్యప్రదేశ్‌లోని ‘పన్నా’ నేషనల్ పార్కు ద్వారా ప్రవహించే నది ఏది?
1) నర్మద 2) తపతి
3) కెన్ 4) సట్లేజ్
91. భారతదేశంలోని పెద్ద మైదానం ‘సుందర్బన్’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) పశ్చిమ బెంగాల్ 2) త్రిపుర
3) గుజరాత్ 4) కర్ణాటక
92. మలేరియా నివారణకు ఉపయోగించే క్వినైన్ ఏ చెట్టు బెరడు నుంచి గ్రహిస్తారు?
1) అట్రోపా బెల్లడోనా
2) సింకోనా అఫిసినాలిన్
3) రావల్ఫియా సర్పంటైనా
4) దతూరా స్ట్రామోనియం
93. మహదేవ్ కొండలు ఏ పర్వతాల్లో భాగం?
1) వింధ్యా పర్వతాలు
2) తూర్పు కనుమలు
3) సాత్పురా పర్వతాలు
4) పశ్చిమ కనుమలు
94. తోట పంటలకు ఏ నేల అనుకూలంగా ఉంటుంది?
1) నల్ల నేల 2) ఎర్ర నేల
3) జేగురు నేల 4) పీట్ నేల
95. 8వ ప్రణాళికలో అత్యధికంగా ఏ రంగానికి నిధులను కేటాయించి వ్యయం చేశారు?
1) వ్యవసాయం, నీటిపారుదల
2) శక్తి
3) సామాజిక సేవలు
4) రవాణా- సమాచారం
96. కింది మిశ్రమ లోహాల్లో ఉండే లోహాలను తెలిపే వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
ఎ) ఇత్తడిలో రాగి, జింక్ అనే లోహాలుంటాయి
బి) ఉక్కులో ఇనుము, మాంగనీస్, కార్బన్ మిశ్రమం ఉంటుంది
సి) జర్మన్ సిల్వర్‌లో ఉండే లోహాలు – రాగి, మాంగనీస్, సిల్వర్
డి) కంచులో రాగి, తగరం లోహాలున్నాయి
1) ఎ, బి, డి సరైనవి
2) ఎ, బి, సి సరైనవి
3) ఎ, బి సరైనవి
4) ఎ, బి, సి, డి సరైనవి
97. యునైటెడ్ నేషన్స్ ైక్లెమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ భాగస్వామ్య సదస్సులు (COP) జరిగిన ప్రదేశాలతో సరిగా జతపరచండి.
1) కాప్ 24 ఎ) మాడ్రిడ్, స్పెయిన్
2) కాప్ 25 బి) కోటోవైస్, పోలాండ్
3) కాప్ 26 సి) షర్మ్ ఎల్ షేక్, ఈజిప్ట్
4) కాప్ 27 డి) గ్లాస్గో, యూకే
1) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
98. సౌర కుటుంబంలో పరిభ్రమణ కాలం కన్నా ఆత్మభ్రమణ కాలం ఎక్కువ గల గ్రహం ఏది?
1) శుక్రుడు 2) బృహస్పతి
3) శని 4) యురేనస్
99. అతి గట్టిగా ఉన్న శిల?
1) పాలరాయి 2) డ్యూనైట్
3) డైమండ్ 4) ఎంపిబొలైట్
101. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లోని ఆదివాసీ తెగలను తెలిపే కింది జతల్లో అసత్యమైనది?
1) మోప్లాలు – కర్ణాటక
2) వర్గీలు – మహారాష్ట్ర
3) లెప్చాలు – సిక్కిం
4) సెంటెనెల్లీలు- అండమాన్ నికోబార్ దీవులు
102. మాంట్రియల్ ప్రొటోకాల్ కింది వాటిలో దేనికి సంబంధించినది?
1) ఓజోన్ పొర క్షీణతకు కారణమైన పదార్థాల తగ్గింపు
2) జీవవైవిధ్య రక్షణ
3) వాతావరణ మార్పుపై చర్చలు
4) న్యూక్లియర్ నిరాయుధీకరణ
103. పీఠభూముల ఖండం అని దేనిని పిలుస్తారు?
1) ఆసియా 2) ఆఫ్రికా
3) యూరప్ 4) దక్షిణ అమెరికా
104. భూమధ్య రేఖా మండలంలో సంవత్సరంలో 322 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం పొందే ప్రాంతం ఏది?
1) సుమత్రా దీవులు
2) జావా దీవులు (బోగోర్ వద్ద)
3) సెలిబస్ దీవులు
4) హల్మహర్ దీవులు
105. ఇళ్లలో, దుకాణాల్లోనూ వాడే జనరేటర్ (విద్యుదుత్పత్తి యంత్రం) శక్తిని కింది విధంగా రూపాంతరం చేస్తుంది?
1) యాంత్రిక శక్తి నుంచి విద్యుత్ శక్తికి
2) అణు శక్తి నుంచి విద్యుత్ శక్తికి
3) రసాయన శక్తి నుంచి విద్యుత్ శక్తికి
4) ఉష్ణ శక్తి నుంచి విద్యుత్ శక్తికి
106. మానవుల్లో గుండె నుంచి ఊపిరితిత్తులను బొగ్గు పులుసు వాయువు అధికంగా ఉన్న రక్తాన్ని ఏది చేరుస్తుంది?
1) పల్మనరీ ధమని
2) పల్మనరీ సిర
3) జతృక కింది ధమని
4) జతృక కింది సిర
83. ఆంధ్రాలో జాతీయోద్యమం గురించి తెలిపే కింది అంశాలను సంబంధిత నాయకులతో సరిగా జతపరచండి.
1) విజయవాడ కాంగ్రెస్ ఎ) పర్వతనేని వీరయ్యచౌదరి (1921) సభలో జాతీయ పతాక నమూనా రూపొందించి గాంధీజీకి ఇచ్చినది
2) చీరాల – పేరాల ఉద్యమానికి బి) కన్నెగంటి హన్మంతరావు నాయకుడు
3) పెదనందిపాడు సి) పింగళి వెంకయ్య పన్నుల నిరాకరణోద్యమ నాయకుడు
4) పల్నాడు పుల్లరి డి) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య సత్యాగ్రహంలో మరణించినది
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ 2) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి 4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
100. కింది నిరుద్యోగితలను సరిగా జతపరచండి.
1) సంఘృష్ట నిరుద్యోగిత ఎ) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడుతుంది
2) చక్రీయ నిరుద్యోగిత బి) ఆర్థిక వ్యవస్థ మార్పులకు గురైనపుడు ఒక రంగంలో ఉపాధి తగ్గటం వల్ల ఏర్పడే నిరుద్యోగం
3) ప్రచ్ఛన్న నిరుద్యోగిత సి) వ్యవసాయ రంగంలో పంటలు లేని కాలంలో ఏర్పడుతుంది
4) రుతు సంబంధ నిరుద్యోగిత డి) ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉంటుంది
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి 2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి 4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సమాధానాలు
67. 1 68. 4 69. 3 70. 4
71. 2 72. 3 73. 3 74. 3
75. 4 76. 4 77. 3 78. 2
79. 4 80. 4 81. 3 82. 3
83. 2 84. 1 85. 1 86. 4
87. 2 88. 2 89. 2 90. 3
91. 2 92. 2 93. 3 94. 3
95. 2 96. 1 97. 3 98. 1
99. 3 100. 1 101. 1 102. 1
103. 2 104. 2 105. 1 106. 1
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు