Physics | స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం నిశ్చల స్థితికి వచ్చే దిశ?
ఫిజిక్స్
1. కింది వాటిలో విద్యుత్ బంధకం?
1. రబ్బరు 2. ఇనుము
3. రాగి 4. అల్యూమినియం
2. విద్యుత్‌ను కనుగొన్న శాస్త్రవేత్త?
1. థేల్స్ 2. న్యూటన్
3. గిల్బర్ట్ 4. పైవేవీకాదు
3. వస్తువులపై విద్యుదావేశం ఏర్పడిన చోట స్థిరంగా ఉండటాన్ని ఏమంటారు?
1. అస్థిర విద్యుత్ 2. స్థిర విద్యుత్
3. వాహక విద్యుత్ 4. పైవేవీ కాదు
4. ధన విద్యుదావేశాన్ని, రుణ విద్యదావేశాన్ని ఎలా సూచిస్తారు?
1. +v -v 2. +t -t
3. +s,-s 4.+q,-q
5. విద్యుదావేశాన్ని ఎలా కొలుస్తారు?
1. మీటర్లలో 2. వోల్ట్‌లలో
3. కులూంబ్ల్లో 4. ఆంపియర్లలో
6. విద్యుత్ ప్రవాహం I =?
1. q/t 2.t/q
3. v/q 4. పైవేవీ కాదు
7. కింది వాటిలో మన రాష్ట్రంలో విద్యుదుత్పత్తి కేంద్రం ఏది?
1. నిజామాబాద్ 2. హైదరాబాద్
3. నల్లగొండ 4. రామగుండం
8. ఆంపియర్=?
1. సెకన్/కులూంబ్స్
2. కులూంబ్స్/సెకన్
3. 1, 2 4. పైవేవీకాదు
9. విద్యుత్ ఘటాలు ఉన్న వలయాలు ఏ పరికరాల్లో ఉపయోగించవచ్చు?
1. టి.వి. 2. రేడియో
3. టేప్‌రికార్డర్ 4. 2,3
10. ఘటాల్లో ఉన్న విద్యుత్ పీడన భేదాన్ని ఏమంటారు?
1. విద్యుత్ బలం
2. విద్యుదావేశం
3. విద్యుచ్ఛాలక బలం
4. పైవేవీ కాదు
11. విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం?
1. సెకన్ 2. ఆంపియర్
3. కులూంబ్ 4. పైవన్నీ
12. వలయంలో విద్యుత్ జనకం?
1. స్విచ్ 2. వైరు
3. బల్బు 4. ఘటం
13. టార్చ్‌లైట్‌లో భాగం?
1. స్విచ్ 2. బల్బు
3. బ్యాటరీలు 4. పైవన్నీ
14. తెరిచి ఉంచిన వలయంలో విద్యుత్ ప్రవాహం?
1. జరుగదు 2. జరుగును
3. మార్పు ఉండదు 4. పైవేవీకాదు
15. కింది వాటిలో విద్యుత్ ప్రవాహం జరిగే వాటికి ఉదాహరణ?
1. దారం 2. రబ్బరు
3. ఇనుపతీగ 4. పైవేవీ కాదు
16. విద్యుత్‌ను తమ ద్వారా ప్రవహింపనీయని పదార్థాలను ఏమంటారు?
1. విద్యుత్ బంధకాలు
2. విద్యుత్ అవాహకాలు
3. విద్యుత్ వలయాలు
4.1, 2
17. ఒక సెకనులో ప్రవహించే విద్యుదావేశమే?
1. కులూంబ్ 2. కరెంట్
3. వోల్టేజ్ 4. పైవన్నీ
18. ధృవీకరణం నివారణకు దేన్ని ఉపయోగిస్తారు?
1. పాదరసం పూత 2. ఇత్తడి టోపి
3. ఆక్సీకరణి 4. జింక్
19. నిర్జల ఘటం దేని రూపాంతరం?
1. వోల్టాఘటం 2. బైక్రోమేట్ ఘటం
3. సచ్ఛిద్ర పాత్ర 4. ఏదీకాదు
20. యాంత్రికశక్తి నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు?
1. టర్బైన్లు 2. డైనమోలు
3. ఘటాలు 4. అయస్కాంతం
21. జింక్ ఆమ్లంలో కలిసేటప్పుడు విడుదలయ్యే వాయువు?
1. నైట్రోజన్ 2. ఆక్సిజన్
3. హైడ్రోజన్ 4. కార్బన్ డై ఆక్సైడ్
22. వోల్టాఘటం విద్యుచ్ఛాలక బలం
1. 61 వోల్టు 2. 1.46. వోల్టులు
3. 2 వోల్టులు 4. 1.5 వోల్టులు
23. వలయాలను పూర్తి చేయడానికి అవసరమయ్యే ముఖ్య పనిముట్టు?
1. సోల్డరింగ్సన్ 2. ఎలక్ట్రిక్ బల్బు
3. ఐరన్ బాక్స్ 4. పైవేవీ కాదు
24. లెక్లాంచి ఘటంలో డీపోలరైజర్
1. అమ్మోనియం క్లోరైడ్
2. మాంగనీస్ డై ఆక్సైడ్
3. సచ్ఛిద్ర పాత్ర 4. కార్బన్ పొర
25. విద్యుత్ నుంచి ఉన్న పలక గాడుల్లో ఉండే తీగ దేనితో తయారై ఉంటుంది?
1. రాగి 2. అల్యూమినియం
3. ఇనుము 4. నిక్రోమ్
26. విద్యుత్ కుంపటిలో విద్యుత్‌శక్తి దేనిగా మార్పు చెందుతుంది?
1. యాంత్రిక శక్తి 2. ఉష్ణశక్తి
3. గతి శక్తి 4. అయస్కాంత శక్తి
27. సమాంతరంగా ఉన్న బల్బులో ఒక బల్బును తొలగిస్తే మిగిలిన బల్బులు?
1. ఆరిపోతాయి
2. వెలుగుతూనే ఉంటాయి
3. వెలిగి ఆరిపోతాయి
4. ఆరి వెలుగుతాయి
28. మన ఇండ్లలో బల్బులను అమర్చిన పద్ధతి?
1. శ్రేణి పద్ధతి
2. సమాంతర పద్ధతి
3. ఎదురెదురు పద్ధతి 4. ఏదీకాదు
29. విద్యుత్ ఉష్ణ ఫలితంపై ఆధారపడి పనిచేసేది?
1. విద్యుత్ విశ్లేషణం 2. టెలిఫోన్
3. ఎలక్ట్రిక్ బెల్ 4. ఇస్త్రీపెట్టె
30. టెలీగ్రామ్ యంత్రాల్లో వాడే అయస్కాంతం రకం?
1. వృత్తాకార 2. దండయస్కాంతం
3. గుర్రపునాడా 4. పైవన్నీ
31. వాహకం ద్వారా విద్యుత్ నిరోధం దాని పొడవుకు, మధ్యచ్ఛేద వైశాల్యానికి ఎలా ఉంటుంది?
1. విలోమానుపాతంలో, అనులోమానుపాతంలో
2. అనులోమానుపాతంలో, విలోమానుపాతంలో
3. సమానంగా
4. పైవేవీకాదు
32. విద్యుదావేశ కణాలు ఎలా ప్రవహిస్తాయి?
1. తక్కువ నుంచి ఎక్కువ స్థాయికి
2. కణాలు ఒకే స్థాయిలో ఉంటాయి
3. ఎక్కువ నుంచి తక్కువ స్థాయికి
4. మార్పు ఏమీ ఉండదు
33. గాజు బల్బు ఏయే వాయువులతో నిండి ఉంటుంది?
1. ఆక్సిజన్, నియాన్
2. హీలియం, నియాన్
3. హీలియం, ఆర్గాన్
4. పైవేవీకాదు
34. ప్రాథమిక ఘటంలో శక్తి ఎలా మారుతుంది?
1. రసాయనిక శక్తి ఉత్పత్తి అవుతుంది
2. విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతుంది
3. రసాయన శక్తి విద్యుచ్ఛక్తిగా ఉత్పత్తి అవుతుంది
4. మార్పు ఏమీ వుండదు
35. లెక్లాంచి ఘటాన్ని కనుగొన్న శాస్త్రవేత్త?
1. థామస్ 2. థేల్స్
3. జార్జి లెక్లాంచి
4. పై ఎవరూకాదు
36. ఘనవాహకం నుంచి కొంచెం విద్యుత్ ప్రవహించినపుడు?
1. రసాయనిక ఫలితం ఏర్పడుతుంది
2. ఉష్ణఫలితం ఏర్పడుతుంది
3. అన్ని ఫలితాలు కలుగుతాయి
4. అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది
37. జింక్ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో గాని, అమ్మోనియం క్లోరైడ్‌తో గాని చర్య జరిపి ఏ అయానులను ఏర్పరుస్తుంది?
1. రుణ అయానులు
2. ధన అయానులు
3. పై రెండు 4. పైవేవీ కాదు
38. కాపర్ ఎలక్ట్రోడ్, జింక్ ఎలక్ట్రోడ్ మధ్యనున్న పొటెన్షియల్ బేధాన్ని ఏమంటారు?
1. అయస్కాంత బలం 2. ఘర్షణ బలం
3. విద్యుచ్ఛాలక బలం
4. పైవేవీకాదు
39. విద్యుత్‌ను దేనిలో కొలుస్తారు?
1. వోల్టులలో 2. కెల్విన్
3. ఆంపియర్ 4. డిగ్రీలలో
40. అయస్కాంతత్వానికి, విద్యుత్ ప్రవాహానికి మధ్య గల సంబంధం గురించి చెప్పిన శాస్త్రవేత్త?
1. థేల్స్ 2. థామస్
3. అయర్‌స్టెడ్ 4. గెలీలియో
41. అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
1. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం
2. దక్షిణ ధ్రువం,ఉత్తర ధ్రువం
3. ఉత్తర ధ్రువం,ఉత్తర ధ్రువం
4. దక్షిణ ధ్రువం,దక్షిణ ధ్రువం
42. కరెంట్ శోధకంగా పనిచేసే పరికరం?
1. మైక్రోస్కోప్ 2. టెలిగ్రాఫ్
3. గెల్వనోస్కోప్ 4. పైవేవీకాదు
43. విద్యుత్‌ను ప్రవహింపచేసే ద్రావణాలను ఏమంటారు?
1. విద్యుత్ వాహకాలు
2. విద్యుత్ విశ్లేషాలు
3. విద్యుత్ ద్రావణాలు 4. పైవేవీ కాదు
44. బ్యాటరీ ధన ధ్రువానికి కలిపిన రాగి పలకను ఏమంటారు?
1. ఎలక్ట్రోడ్ 2. కేథోడ్
3. ఆనోడ్ 4. పైవేవీ కాదు
45. బ్యాటరీ రుణధ్రువానికి కలిపిన రాగి పలకను ఏమంటారు?
1. కాథోడ్ 2. ఆనోడ్
3.ఎలక్ట్రోడ్ 4. పైవేవీ కాదు
46. రుణావేశిత ఆక్సిజన్ అయానులు ధనావేశిత ఆనోడ్తో ఆకర్షించి, తటస్థీకరణం చెందితే వెలువడే వాయువు?
1. హైడ్రోజన్ 2. ఆక్సిజన్
3. నైట్రోజన్ 4. పైవేవీ కాదు
47. ఏ పద్ధతి ద్వారా గ్రామ్‌ఫోను రికార్డులు, ఎలక్ట్రిక్ ప్రింటింగ్ చేస్తారు?
1. ఎలక్ట్రో ప్లేటింగ్
2. లోహ సంగ్రహణం
3. విద్యుద్విశ్లేషణం 4. పైవేవీ కాదు
సమాధానాలు
1-1 2-3 3-2 4-4
5-3 6-1 7-4 8-2
9-4 10-3 11-2 12-4
13-4 14-1 15-3 16-4
17-2 18-3 19-3 20-2
21-1 22-3 23-1 24-2
25-4 26-2 27-2 28-2
29-4 30-3 31-2 32-3
33-3 34-3 35-3 36-4
37-2 38-3 39-1 40-3
41-1 42-3 43-2 44-3
45-1 46-2 47-3
1. కింది వాటిలో అయస్కాంత పదార్థానికి ఉదాహరణ?
1. ఇనుము 2. కోబాల్ట్ట్
3. నికెల్ 4. పైవన్నీ
2. అయస్కాంత ఆకృతి?
1. గుర్రపునాడ 2. వలయాకారం
3. బిళ్ల 4. పైవన్నీ
3. సహజ అయస్కాంతం?
1. లోడ్‌స్టోన్
2. గుర్రపునాడ అయస్కాంతం
3. వలయాకారపు అయస్కాంతం
4. బిళ్ల అయస్కాంతం
4. సహజ అయస్కాంతాన్ని మొదట గుర్తించిన గొర్రెల కాపరి?
1. డాల్టన్ 2. మాగ్నస్
3. మేఘనాథ్ 4. జైసింగ్
5. అనయస్కాంత పదార్థానికి ఉదాహరణ?
1. మేకు 2. పేపర్క్లిప్
3. ఇనుపబోల్టు 4. కాగితం
6. సజాతి ధ్రువాలు?
1. ఆకర్షించుకుంటాయి 2. ఉండవు
3. వికర్షించుకుంటాయి 4. పైవన్నీ
7. స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం నిశ్చలస్థితికి వచ్చే దిశ?
1. N-S దిశ 2. E-W దిశ
3. పైకి కిందకు 4. ఏ దిశలోనైనా
8. ఒక దండాయస్కాంతాన్ని ఇనుపరజను దగ్గరకు తీసుకువస్తే ఎక్కువ ఇనుపరజను అంటుకునే స్థానం?
1. అయస్కాంత చివరల
2. అయస్కాంత మధ్య భాగం
3. అయస్కాంతం అంతా సమానంగా
4. మధ్య భాగం, చివరలు
9. ఏ ధ్రువాలు ఆకర్షించుకుంటాయి?
1. సజాతి అయస్కాంత ధృవాలు
2. విజాతి అయస్కాంత ధ్రువాలు
3. అయస్కాంతం, కాగితం
4. అయస్కాంతం, ఇత్తడి
10. భూమి ఎలా ప్రవర్తిస్తుంది?
1. ఉత్తర ధ్రువం
2. దక్షిణ ధ్రువం
3. అయస్కాంతం 4. పైవన్నీ
11. కింది వాటిలో లోడ్‌స్టోన్ ఫార్ములా?
1. Fe2O 2. FeO
3. FeO2 4. Fe2Oబ
12. విద్యుదయస్కాంతం తయారీకి వాడే పదార్థం?
1. కోబాల్ట్ 2. నికెల్
3. మెత్తని ఇనుము 4. పైవన్నీ
13. అయస్కాంతానికి కచ్ఛితమైన పరీక్ష?
1. వికర్షణ 2. ఆకర్షణ
3. తటస్థ బిందువులు 4. ఏదీకాదు
14. అయస్కాంతం ఇనుప వస్తువులను ఆకర్షించడానికి కారణం?
1. అయస్కాంత అభివాహం
2. అయస్కాంత ధ్రువసత్వం
3. అయస్కాంత ప్రేరణ
4. ఏదీకాదు
15. భూ అయస్కాంత తీవ్రత శీతల (ఫ్రిజ్) అయస్కాంత తీవ్రత కన్నా ఎన్ని రెట్లు శక్తిమంతమైనది?
1. 20 2. 10 3. 2 4. 5
16. ఒక దండయస్కాంతం దక్షిణ ధ్రువం ధ్రువసత్వం m1, ఉత్తర ధ్రువం ధ్రువసత్వం m2 అయిన
1. m1 > m2 2. m2, <m1
3.m1=m2 4. m1=2m1
17. అయస్కాంత భ్రామకం ఒక?
1. అదిశ 2. సిద్ధాంతం
3. శూన్యాంకం 4. సదిశ
18. అయస్కాంత క్షేత్రం?
1. ద్విమితీయం 2. త్రిమితీయం
3. వికర్షణీయం 4. ఏదీకాదు
19. అయస్కాంత బలరేఖ అనేది అయస్కాంత క్షేత్రంలో?
1. ప్రమాణ దక్షిణ ధ్రువం చలించే పథం
2. ప్రమాణ ఉత్తర ధ్రువం చలించే పథం
3. ఒక సరళరేఖ 4. ఏదీకాదు
20. భూ అయస్కాంత ప్రభావం భూ ఉపరితలం నుంచి ఎన్ని కి.మీ.ఎత్తు వరకు వ్యాపించి వుంటుంది?
1. 6400 2. 3200
3. 84,600 4. 5, 28,000
సమాధానాలు
1-4 2-4 3-1 4-2
5-4 6-3 7-1 8-1
9-2 10-3 11-4 12-3
13-1 14-3 15-1 16-3
17-4 18-2 19-2 20-4
ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు