General Science Biology | నిల్వ, పరిరక్షణే ఆహారానికి సురక్ష
ఆహారం
- మనం తినే ఆహార పదార్థాలు – ధాన్యాలు, చిరు ధాన్యాలు, కాయ ధాన్యాలు, గింజ ధాన్యాలు, మాంసం, చేపలు, గుడ్లు మొదలైనవి.
- గింజ ధాన్యాలు – వరి, గోధుమ, మొక్కజొన్న
- చిరుధాన్యాలు – ఉలవలు, అలసందలు, కందులు, బఠానీ, పెసలు
- నూనె గింజలు – నువ్వులు, సన్‌ఫ్లవర్, వేరుశనగలు, కుసుమలు
- ఆహార పదార్థాలను అతిగా ఉడికించడం వల్ల పోషకాలు ఆవిరి రూపంలో పోతాయి. ప్రెషర్ కుక్కర్స్‌ను ఉపయోగించడం వల్ల కొద్దిశాతం పోషకాలు నష్టం కాకుండా చూడవచ్చు.
ఆహారపదార్థాలు వండే విధానం - ఆవిరిలో ఉడికించేవి ఉదా : ఇడ్లీ, కుడుములు
- తక్కువ నూనెలో వేయించేవి. ఉదా : పూరి, బజ్జి, గారెలు, బూరెలు
- బేక్ చేయడం ద్వారా వండేవి. ఉదా : బ్రెడ్లు, కేక్‌లు, బిస్కెట్లు
- కాయగూరలన్నీ ఉప్పు నీటిలో కొంచెం సమయం ఉంచి, తరువాత మంచినీటితో కడిగి అప్పుడు పెద్ద ముక్కలుగా కోయాలి. బియ్యాన్ని తక్కువ నీటిలో కడగాలి, గంజి వార్చకూడదు. కూరగాయలను కడిగి తుడిచి తరువాత ముక్కలుగా కోసి బాగా ఆరబెట్టాలి. ఇవి గలగలమనేటట్లు ఉండాలి. వీటినే వరుగులు అంటారు. వీటికి ఉప్పు కలపకూడదు పాలిథీన్ కవర్లకు సూదితో చుట్టూరంధ్రాలు చేసి దానిలో కూరగాయలను 4 (లేదా) 5 రోజులు తాజాగా నిల్వ చేయవచ్చు. ఒక్కొక్క కవరులో ఒక రకం కూరగాయలు మాత్రమే నిల్వ ఉంచాలి. జనతా ఫ్రిజ్‌లో కూడా కూరగాయలను నిల్వచేయవచ్చు.
- ఆహార పదార్థాలను పాడు చేసేవి –
బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు
- అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు అభివృద్ధి చెందలేవు ఫ్రిజ్ పనిచేసే సూత్రం ఇదే. ఊరగాయలను నిల్వచేయడానికి, ఉప్పు, నూనెను కలుపుతారు. సూక్ష్మజీవులను ఉప్పు నాశనం చేస్తుంది. గాలిలో తేమ ఊరగాయలపై పడకుండా నూనె కాపాడుతుంది. పండ్లరసాలను నిల్వచేయడానికి పొటాషియం మెటాబైసల్ఫేట్ అనే రసాయనాన్ని కలుపుతారు.
- కేజీ పండ్లరసానికి 600 మి.గ్రా. పొటాషియం మెటాబైసల్ఫేట్ రసాయనాన్ని కలుపుతారు.
- పండ్ల రసాన్ని తయారు చేయడానికి కావలసినవి.
- పండ్లరసం – 1 భాగం
- చక్కెర – 2 భాగాలు
- నీరు – 3 భాగాలు
- సిట్రిక్ ఆమ్లం – పండ్లరసం బరువులో 1 శాతం
- నిమ్మజాతి పండ్లరసాల తయారీలో సిట్రికామ్లం కలపవలసిన అవసరం లేదు. పండ్ల రసాల తయారీలో ఉప్పు కలపరు.
- ధాన్యాలకు పురుగు పట్టకుండా నిల్వ ఉంచడానికి సీతాఫలం/వేపగింజల పొడి కలపాలి.
- పసుపు పచ్చని పండ్లలో విటమిన్ ‘ఎ’ లభిస్తుంది. కంటి, చర్మ ఆరోగ్యానికి విటమిన్ ‘ఎ’ ఉపయోగం. రక్తం ఎరుపుగా ఉండటానికి అవసరమయ్యే ఖనిజం – ఐరన్
- ఐరన్ లభించే పదార్థాలు – బెల్లం ఆకుకూరలు, ఎండుద్రాక్ష, ఎండు కర్జూరం (డ్రైఫ్రూట్స్)
- ఎముకలు పుష్టిగా పెరగడానికి కాల్షియం అవసరం.
- పాలు, రాగులలో కాల్షియం ఉంటుంది.
- పాలను సంపూర్ణాహారం అంటారు.
- బ్యాక్టీరియా వేగంగా అభివృద్ధి చెందే ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 40 డిగ్రీల సెంటిగ్రేడ్.
- కొన్ని బ్యాక్టీరియాలు ఆహార పదార్థాలపై చర్య జరిపినప్పుడు అవి విడుదల చేసే రసాయనాల వల్ల కొవ్వు, కొవ్వు ఆమ్లాలుగా, ప్రొటీన్లు అమైనో ఆమ్లాలుగా, చక్కెరను కార్బన్‌డైఆక్సైడ్, నీరుగా
మారుస్తాయి. - సరిగా నిల్వ చేయని చేప మాంసాన్ని విషపూరితం చేసే బ్యాక్టీరియా – క్లాస్ట్రీడియం బొట్యులీనం
- దీనివల్ల బయటకు ఏ విధమైన లక్షణాలు కనిపించవు. కానీ ఈ మాంసం తినడం వల్ల వాంతులు, విరేచనాలు ఏర్పడవచ్చు.
- శిలీంధ్రాలు వేడి, చీకటి, తేమ ఉండే పరిస్థితుల్లో పెరుగుతాయి.
- శిలీంధ్రాలు బాగా అభివృద్ధి చెందే ఉష్ణోగ్రత 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య.
- వేరుశనగలో శిలీంధ్రం ఎప్లోటాక్సిన్ అనే విషాన్ని ఏర్పరుస్తుంది.
- దీని వల్ల వేరుశనగ గింజ చేదుగా ఉంటుంది.
- ఇటువంటి గింజలను తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఎప్లోటాక్సిన్ కాలేయాన్ని పాడుచేస్తుంది.
- ఆహార పదార్థాలపై ఉన్న బ్యాక్టీరియాల కంటే శిలీంధ్రాలను స్పష్టంగా గుర్తించవచ్చు.
- పండ్ల రసం, చక్కెర ద్రావణం, జామ్ వంటి పదార్థాలపై ఈస్ట్ అనే శిలీంధ్రం పెరుగుతుంది.
ఆహారాన్ని సంరక్షించే పద్ధతులు
ఎండబెట్టడం – సూక్ష్మజీవులు పెరగడానికి తేమ అవసరం. ఆహారంలో తేమ తగ్గిస్తే సూక్ష్మజీవులు పెరగలేవు. - ఉదాహరణ – సముద్రపు చేపలు, రొయ్యలు, కర్జూరం, ద్రాక్ష, ఆప్రికాట్, అరటి, చిక్కుడు, బఠానీ, ధాన్యాలు, పప్పులు, అప్పడాలు మొదలైనవి.
- ఎండలో ఆరబెట్టినప్పుడు ఆహారంలో ఉండేనీరు 60-70 శాతం నుంచి 5 శాతం వరకు తగ్గుతుంది.
- ఆహార పరిరక్షణకు ఎండలో ఆరబెట్టడం చౌక, ఎంతో శ్రేష్ఠమైన పద్ధతి.
పొగబెట్టడం – మండుతున్న కట్టెల వేడి మీద ఆహారాన్ని ఉంచి ఎండబెట్టడాన్ని పొగబెట్టడం అంటారు. ఇలా చేయడం వల్ల రుచి కూడా వస్తుంది.
ఉదాహరణ – చేపలు, మాంసం
యాంత్రికంగా ఆరబెట్టడం – పరిశ్రమల్లో యాంత్రిక నిర్జలీకరణ యంత్రాలు, తుంపరలతో ఆరబెట్టాలి.
ఉదా : పచ్చ బఠానీలు, ఉల్లిపాయలు, సూప్‌లు. వీటినే డీహైడ్రేటర్స్లో ఆరబెడతారు. - తుంపర పద్ధతి ద్వారా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆరబెడతారు. ఉదాహరణ – పాలపొడి, చిన్న పిల్లల ఆహారం
ఊరబెట్టడం
ఉదాహరణ – చింత, మామిడి, ఉసిరి, చేపమాంసం - నిమ్మ, మామిడి ఊరగాయలకు 15 నుంచి 20 శాతం ఉప్పు కలిపి తయారు చేస్తారు.
ఘనీభవించి ఆరబెట్టడం – తక్కువ ఉష్ణోగ్రతల వద్ద సూక్ష్మజీవుల పెరుగుదల ఉండదు. పల్లెల్లో ధాన్యాలను పాతరలు/నేలకొట్టులలో నిల్వచేస్తారు. అటువంటి ప్రదేశాలలో 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది.
అత్యధిక ఉష్ణోగ్రత ఉపయోగించడం
ఉదాహరణ – పాలను మరిగించడం
పాశ్చరైజేషన్ - పాలను 71 డిగ్రీల సెల్సియస్ వేడి చేసి 15 సెకన్లు నిల్వ ఉంచి 10 డిగ్రీల సెల్సియస్ చల్లార్చి అప్పుడు పాలిథీన్ సంచుల్లో నింపి సీల్ వేస్తారు.
డబ్బాల్లో నిల్వ చేయడం - తాజా ఆహార పదార్థాలను ప్రెషర్ కుక్కర్లో ఉడికించి, వెంటనే సూక్ష్మజీవి రహిత డబ్బాల్లో నింపుతారు. ఉప్పు (లేదా) చక్కెర ద్రావణం కలుపుతారు. డబ్బాలోని గాలిని తీసి మూతపెట్టి సీల్ చేస్తారు. కాయగూరలు, మాంసం, చేపలు ఈ విధంగా నిల్వ చేస్తారు.
చీడ పురుగుల నుంచి ఆహార పదార్థాల సంరక్షణ - ఎలుకల వల్ల పంట ధాన్యాలకు సుమారు 30-40 శాతం నష్టం ఉంటుందని అంచనా.
- చీడ పురుగులను నాశనం చేయడం రెండు రకాలు. అవి..
1. మందులను చల్లడం
2. పొగబెట్టడం - ధాన్యం నిల్వ ఉంచిన ప్రదేశాల్లో డీడీటీ, మలాథియన్ వంటి కీటకనాశనులను చల్లి, కీటకాలను, చీడలను చంపవచ్చు.
- కీటకాలను నాశనం చేయడానికి పొగబెట్టే పద్ధతిలో ఇథలీన్బ్రోమైడ్గాని, అల్యూమినియం పాస్ఫైడ్ గాని ఉపయోగిస్తారు.
- కీటకాలను నియంత్రించడంలో పొగబెట్టడం శ్రేష్ఠమైన పద్ధతి.
- యాంత్రిక పద్ధతిలో బోనులు ఉపయోగించి ఎలుకలను పడతారు.
- ఎలుకలను చంపడానికి ఉపయోగించే
రసాయనాలు : జింక్ పాస్ఫైడ్, అమ్మోనియం పాస్ఫైడ్ మొదలైనవి. - రాటఫిన్ రక్తస్రావాన్ని కలిగిస్తుంది.
- రసాయన మందులను ఎలుకలు నేరుగా తినవు. ఎలుకల ఎరలో ఉంచి పట్టాలి.
- గోధుమపిండి, పంచదార, నూనె కలిపి ఒక ముద్దలా చేస్తారు. దీన్నే ఎలుకల ఎర అంటారు.
- ఎలుక ఈ ముద్దను 10 రోజులు తిన్న తరువాత ఎలుకల ఎరలో ఈ రసాయన ముద్దను ఉంచాలి.
- విషపూరిత ఆహారం తిన్న ఒకటి, రెండు రోజుల్లో ఎలుకలు చనిపోతాయి.
- గోధుమలో 12 శాతం, వరిలో 13 శాతం తేమ ఉన్నట్లయితే ధాన్యం సురక్షితంగా ఉన్నట్లే.
- నిల్వ ధాన్యాన్ని నష్టపరిచే శిలీంధ్రాలు – అస్పర్జిల్లస్ పెన్సీలియం, రైజోపస్.
- భారత ప్రభుత్వం ‘సేవ్గ్రెయిన్ క్యాంపెయిన్’ పేరుతో విత్తన పరిరక్షణ కార్యక్రమాన్ని దేశమంతటా ప్రవేశపెట్టింది. భారతదేశ ప్రభుత్వం ‘అగ్రికల్చరల్ ప్రొడ్యూసర్ గ్రేడింగ్, మార్కింగ్’ అనే చట్టాన్ని ఏర్పరచింది. దీన్నే మనం అగ్మార్క్ చట్టం/APGM చట్టం అంటారు. ఇది ఆహారపదార్థాల నాణ్యతను తెలుపుతుంది. కార్యాలయాలు గుంటూరు, హైదరాబాద్, విశాఖలో ఉన్నాయి.
తేనెటీగల పరిశ్రమ
- ఇవి సాంఘిక కీటకాలు. సమూహంగా జీవిస్తాయి. ఒక సమూహంలో ఒక రాణి ఈగ ఉంటుంది. వంధ్యమైన డ్రోన్ ఈగలు 200-300 వరకు ఉంటాయి.
- 20,000- 60,000 వరకు కూలీ ఈగలు ఉంటాయి.
- ఇవి మగ ఈగలు.
- రాణి ఈగ గుడ్లను పెడుతుంది.
తేనెటీగ శాస్త్రీయ నామం : ఎపిస్ ఇండికా, - ఎపిస్ డార్సేటా
- రాక్ తేనెటీగ వంధ్యంగా ఉంటుంది. ఇవి సుమారు 2.5 నుంచి 4 కేజీల తేనెను ఇస్తాయి. దేశంలో ఎపిస్ మెల్లిఫెరా అనే జాతిని మచ్చిక చేస్తున్నారు. తేనెటీగల పెంపకాన్ని ‘ఎపికల్చర్’ అంటారు.
- చాక్స్మాత్ అనే కీటకం తేనెపట్టులో మైనం తిని గదులను నాశనం చేస్తుంది.
- మైనంను జోళ్ల పాలిష్, కొవ్వొత్తుల తయారీకి, తోళ్ల పరిశ్రమలో ఉపయోగిస్తారు. తేనెటీగల విషాన్ని
కీళ్లనొప్పులను నయం చేసే మందుల్లో ఉపయోగిస్తారు.
ఎస్వీఆర్ కోచింగ్ సెంటర్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు