General Studies | ‘హైదరాబాద్ ఒక సువిశాల చెరసాల’ అని పేర్కొన్నవారు?
115. సరైన జవాబును గుర్తించండి.
ప్రతిపాదన (ఎ): భారతదేశ చివరి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ కానింగ్ 1858లో భారతదేశ మొదటి వైస్రాయ్గా నియమితులయ్యారు.
కారణం (ఆర్) : 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారత గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేశారు
ఎ) ప్రతిపాదన ఎ) కారణం(ఆర్) రెండూ సరైనవే, (ఆర్)(ఎ)కు సరైన వివరణ
బి) ప్రతిపాదన ఎ) కారణం(ఆర్) విడివిడిగా రెండూ సరైనవే, కానీ (ఆర్) (ఎ) కు సరైన వివరణ కాదు
సి) ఎ సరైనదే , కాని ఆర్ తప్పు
డి) ఎ తప్పు, ఆర్ సరైనదే
116. ఏ చట్టం ప్రకారం భారతదేశంలో మొట్టమొదటి సారిగా స్వేచ్ఛాయుత వ్యాపారం (ఫ్రీ ట్రేడ్) ప్రారంభమయింది?
ఎ) 1784 పిట్స్ ఇండియా చట్టం
బి) 1793 చార్టర్ చట్టం
సి) 1813 చార్టర్ చట్టం
డి) 1833 చార్టర్ చట్టం
117. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరిన తొలి రాజకీయ పార్టీ?
ఎ) కాంగ్రెస్ బి) కమ్యూనిస్టు
సి) స్వతంత్ర పార్టీ డి) సోషలిస్ట్
118. గాంధీజీని జవహర్లాల్ నెహ్రూ మొదటిసారిగా ఎక్కడ కలిశారు?
ఎ) 1901 కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో
బి) 1916 లక్నోలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో
సి) 1915 గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి రాగానే విమానాశ్రయంలో కలిశారు
డి) 1924లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో
119. కింది వాటిలో సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలను గుర్తించండి.
1. గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని స్వాతంత్య్ర పోరాటంలో తొలి ప్రజా ఉద్యమంగా పేర్కొంటారు. ఎందుకంటే తొలిసారిగా గ్రామీణ ప్రాంతాల్లోని అట్టడుగు వర్గాల వారు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు.
2. 1920, ఆగస్టు 1న గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు.
3. సహాయ నిరాకరణ ప్రణాళికను చర్చించి ఆమోదించడానికి జాతీయ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశాన్ని 1920 సెప్టెంబర్ 4 నుంచి 9 వరకు లాలా లజపతి రాయ్ అధ్యక్షతన కలకత్తాలో నిర్వహించారు. ఈ ప్రత్యేక సమావేశంలోనే కాంగ్రెస్ రాజకీయాల్లో గాంధీయుగం ప్రారంభమయ్యింది.
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) 1, 2, 3
120. ఏ ఉద్యమానికి మద్దతుగా సుభాష్ చంద్రబోస్ తన ఐపీఎస్ పదవిని వదులుకున్నారు?
ఎ) శాసనోల్లంఘన ఉద్యమం
బి) సహాయ నిరాకరణ ఉద్యమం
సి) శాసన సభల బహిష్కరణ
డి) క్విట్ ఇండియా ఉద్యమం
121. శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ ఏ సమావేశంలో నిర్ణయం తీసుకుంది?
ఎ) 1934 మే 19 పాట్నా సమావేశంలో
బి) 1935 మే 19 అహ్మదాబాద్ సమావేశంలో
సి) 1932, నవంబర్ 17 కలకత్తా సమావేశంలో
డి) 1937 ఎన్నికల సందర్భంగా జరిగిన సమావేశం
122. గాంధీతో భేదాభిప్రాయాల కారణంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సుభాష్చ్రందబోస్ 1939లో ఏర్పాటు చేసిన పార్టీ పేరు?
ఎ) డెమొక్రటిక్ పార్టీ
బి) స్వరాజ్య పార్టీ
సి) ఫార్వర్డ్ బ్లాక్ డి) హింద్
123. అసఫ్‌జాహీ వంశం గురించి కింది వాటిని జతపరచండి
1. మూల పురుషుడు ఎ) ఖ్యాజా అబిద్
2. రాజ్య స్థాపకుడు బి) మీర్‌కమ్రుద్దీన్ (నిజాం – ఉల్ ముల్క్)
3. రెండవ రాజధాని సి) ఔరంగాబాద్
4. మొదటి రాజధాని డి) హైదరాబాద్
ఎ) 1-ఎ,2-బి, 3-సి, 4-డి
బి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
సి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
డి) 1-బి,2-ఎ, 3-డి, 4-సి
124. కింది వాటిని జత పరచండి
1. బేగంబజార్ కుట్రకేసు ఎ) 1862
2. రాంజీగోండు బి) 1860 తిరుగుబాటు
3. నయాపూల్ సి) 1859 (అఫ్జల్‌గంజ్) నిర్మాణం
4. నిజాం సంస్థానంలో డి) 1862 పోస్టాఫీసులు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
డి) 1-బి, 2-డి, 3-ఎ, 4-డి
125. కింది వాటిని జతపరచండి.
1. జాగీర్ భూములు ఎ) బహుమతిగా ఇచ్చే భూములు
2. దివానీ భూములు బి) వీటి ఆదాయం నిజాం వ్యక్తిగత ఖర్చులకు వెచ్చిస్తారు
3. సర్ఫేఖాస్ భూములు సి) వీటి ఆదాయం సంక్షేమ పథకాలకు వెచ్చిస్తారు
4. ఇనాం భూములు డి) నిజాం సేవ చేసిన అధికారులకు ధారాదత్తం
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-బి, 4-సి డి) 1-సి, 2-డి, 3-డి, 4-బి
126. సరైన వ్యాఖ్యను గుర్తించండి.
1. నిజాం పాలనలో తెలంగాణ రాజ్యంలో వచ్చిన మొదటి భూ సంస్కరణ చట్టం మల్ ఘజారీ ల్యాండ్ రెవెన్యూ చట్టం
2. ఈ చట్టం ప్రకారం వరుసగా 12 సంవత్సరాలు సాగు చేస్తున్న కౌలుదారులు శాశ్వత కౌలుదారులు అవుతారు
3. ఈ చట్టాన్ని 1930లో ప్రవేశపెట్టారు
ఎ) 1 బి) 2 సి) 1, 3 డి) 1, 2
127. ‘హైదరాబాద్ ఒక సువిశాల చెరసాల’ అని పేర్కొన్న ఆర్య సమాజ్ నాయకుడు ఎవరు?
ఎ) స్వామి దయానంద సరస్వతి
బి) వందేమాతరం రామచంద్రారావు
సి) పండిట్ నరేంద్ర జీ
డి) స్వామి శ్రద్ధానంద
128. కింది వాటిని జత చేయండి.
1. ముత్యాలు ఎ) అంకాపూర్
2. కాగితం తయారీ బి) చందంపేట
3. విత్తనాలు సి) గద్వాల
4. జరీ చీరలు డి) కోరుట్ల
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
డి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
129. కిందివాటిని జతపరచండి
1. సమ్మక్క – సారక్కజాతర ఎ) సిద్దిపేట జిల్లా
2. నాగోబా జాతర బి) మెదక్ జిల్లా
3. ఏడుపాయల జాతర సి) ఆదిలాబాద్ జిల్లా
4. కొమురవెల్లి మల్లన్న జాతర డి) ములుగు జిల్లా
ఎ) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
డి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
130. కింది వాటిలో సరైన వ్యాఖ్య/ వ్యాఖ్యలను గుర్తించండి.
1. తెలంగాణ బిల్లును ఏపీ చట్ట సభలు తిరస్కరించినప్పటికీ రాజ్యాంగం ప్రకారం వాటికి పార్లమెంట్ కట్టుబడి ఉండాల్సిన పని లేదని కేంద్ర హోంశాఖ వెల్లడించింది
2. తెలంగాణ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014, ఫిబ్రవరి 18న లోక్‌సభ ఆమోదించింది, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదించింది. ఆమోదిత బిల్లుపై మరుసటి నెల మార్చి 1న రాష్ట్రపతి సంతకం చేశారు.
3. దశాబ్దాల పోరాటం ఫలించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 2014, జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా, భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది.
ఎ) 1, 2, 3 బి) 1
సి) 2 డి) 3
131. తెలంగాణ ఉద్యమ తుది దశలో ఉద్యమాన్ని బలపరుస్తూ ప్రచురితమైన మొదటి దినపత్రిక అయిన ‘నమస్తే తెలంగాణ’ను కేసీఆర్ ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2011, జూన్ 12
బి) 2011, జూన్ 6
సి) 2011, జూన్ 26
డి) 2011, జూన్ 10
132. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటైన వివిధ కమిటీలకు సంబంధించి సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలను గుర్తించండి.
1. మహిళల భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూనం మాలకొండయ్య కమిటీని ఏర్పాటు చేసింది
2. తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగల (ఎస్టీల) సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్.చెల్లప్ప కమిటీని నియమించింది.
3. తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం స్థితిగతులను అధ్యయనం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జి.సుధీర్ కమిటీని
నియమించింది.
ఎ) 1 బి) 2 సి) 1, 2, 3 డి) 3
133. కింది వాటిలో గ్రామీణ మహిళలల్లో పొదుపును ప్రోత్సహించే పథకాన్ని గుర్తించండి.
ఎ) జవహర్ రోజ్‌గార్ యోజన
బి) మహిళా సమృద్ధి యోజన
సి) రాష్ట్రీయ మహిళా కోష్
డి) ఇందిరా మహిళా యోజన
134. కేంద్ర పథకం వాటి లక్ష్యాలను సరిగా జత చేయండి.
1. మిషన్ ఇంద్రధనుష్ ఎ) అందరికీ టీకాలు వేసే కార్యక్రమం
2. వనబంధు కల్యాణ్ యోజన బి) గిరిజనులు, ఇతర ప్రజల అంతరం తగ్గించడం
3. హృదయ్ సి) వారసత్వ నగరాల అభివృద్ధి
4. మానస్ డి) అల్పసంఖ్యాక వర్గాల యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే కార్యక్రమం
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
135. నూతన జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానానికి సంబంధించి కింది సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలను గుర్తించండి.
1. నూతన జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానానికి కేంద్రం 2019, ఫిబ్రవరి 19న ఆమోదముద్ర వేసింది.
2. ఎలక్ట్రానిక్ రంగంలో దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించి, ఎగుమతులను పెంచడం ద్వారా ఈ రంగం టర్నోవర్‌ను
2025 నాటికి 400 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.26,00,000 కోట్లకు) చేర్చడం ఈ విధాన లక్ష్యం.
3. ఈ విధానం ద్వారా దేశంలో సుమారు కోటి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా
ఎ) 1 బి) 2 సి) 1, 2, 3 డి) 3
136. మన ఊరు – మనబడి/ మన బస్తీ – మనబడి పథకానికి సంబంధించి కింద సరైన వ్యాఖ్య/ వ్యాఖ్యలను గుర్తించండి.
1. గురుకుల విద్యకు మొదటి దశలో పెద్ద పీట వేసిన ప్రభుత్వం రెండో దశలో ఇతర ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా దృష్టి కేంద్రీకరిస్తూ మన ఊరు – మనబడి అనే బృహత్తర పథకాన్ని ప్రారంభించింది.
2. ఈ పథకం గ్రామ స్థాయిలో మన ఊరు – మనబడి అనే పేరుతో, పట్టణాల్లో అయితే మన బస్తీ – మనబడి అనే పేరుతో
అమలవుతుంది
3. 2021-22 నుంచి మూడు సంవత్సరాల వ్యవధిలో 26,067 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ గదులతో సహా సకల మౌలిక సదుపాయాలను ఈ కార్యక్రమం ద్వారా కల్పిస్తారు.
ఎ) 2, 3 బి) 1, 3
సి) 1, 2, 3 డి) 1, 2
137. శిశు మరణాల రేటు, ప్రసూతి మరణాల రేటును తగ్గించడానికి వ్యవస్థీకృత ప్రసవాలను ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం?
ఎ) ఆరోగ్య లక్ష్మి
బి) తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య ప్రొఫైల్ స్కీమ్
సి) ఆరోగ్య శ్రీ
డి) కేసీఆర్ కిట్
138. పథకాలు ప్రారంభించిన ప్రదేశాలను సరిగా జత చేయండి.
1. తెలంగాణ పల్లె ప్రగతి పథకం ఎ) భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి
2. బాలికా ఆరోగ్య రక్ష బి) నిజామాబాద్ జిల్లా, బీజీపేట గ్రామ పంచాయతీ
3. నేతన్నకు చేయూత సి) మెదక్ జిల్లా, కౌడిపల్లి
4. ఈ-పంచాయతీ డి)హనుమకొండ జిల్లా హసన్‌పర్తి గురుకుల పాఠశాల
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
139. పల్లె పాలనలో పారదర్శకత, సౌలభ్యం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది?
ఎ) ఈ-సాక్షరత
బి) తెలంగాణ డిజిథాన్
సి) ఈ-పంచాయతీ
డి) గ్రామజ్యోతి
140. కింది వాటిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పథకం ఏది?
ఎ) రైతుబంధు
బి) మిషన్ కాకతీయ
సి) మిషన్ భగీరథ
డి) గ్రామ జ్యోతి
సమాధానాలు
115. బి 116. డి 117. సి 118. బి
119. డి 120. బి 121. ఎ 122. సి
123. బి 124. ఎ 125. బి 126. డి
127. సి 128. డి 129. ఎ 130. ఎ
131. బి 132. సి 133. సి 134. సి
135. సి 136. సి 137. డి 138. ఎ
139. సి 140. సి
బీవీ రమణ
డైరెక్టర్, ఏకేఆర్ స్టడీ సర్కిల్,
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు