EMRS Recruitment 2023 | ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 4062 పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరితేదీ
EMRS Recruitment 2023 | దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న.. ప్రిన్సిపల్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ తదితర టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మరాఠి, ఒడియా, తెలుగు, బెంగాలి, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జియోగ్రఫీ తదితర సబ్జెక్టుల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రిన్సిపల్ పోస్టులకు బీఈడీ, మాస్టర్స్ డిగ్రీ చేసి స్కూళ్లలో 12 ఏండ్ల పాటు పనిచేసి ఉండాలి. పీజీటీ పోస్టులకు బీఈడీ, పీజీ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంఈ/ ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణత, అకౌంటెంట్ పోస్టులకు డిగ్రీ అర్హత, ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.. ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 4062
పోస్టులు : ప్రిన్సిపల్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ తదితరాలు.
విభాగాలు : మరాఠి, ఒడియా, తెలుగు, బెంగాలి, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జియోగ్రఫీ తదితరాలు.
అర్హతలు : ప్రిన్సిపల్ పోస్టులకు బీఈడీ, మాస్టర్స్ డిగ్రీ చేసి స్కూళ్లలో 12 ఏండ్ల పాటు పనిచేసి ఉండాలి. పీజీటీ పోస్టులకు బీఈడీ, పీజీ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంఈ/ ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణత అకౌంటెంట్ పోస్టులకు డిగ్రీ అర్హత, ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : పోస్టులను బట్టి 30 నుంచి 50 ఏండ్లు మించకుడదు.
జీతం : 1. ప్రిన్సిపల్ పోస్టులకు.. నెలకు రూ.78800 నుంచి రూ.209200 వరకు
2. పీజీటీ పోస్టులకు.. నెలకు రూ.47600 నుంచి రూ.151100 వరకు
3. అకౌంటెంట్ పోస్టులకు నెలకు రూ.35400 నుంచి రూ.112400 వరకు
4. జేఎస్ఏ పోస్టులకు నెలకు రూ.19900 నుంచి రూ.63200 వరకు
5. ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు నెలకు రూ.18000 నుంచి రూ.56900 వరకు
ఎంపిక : ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: ప్రిన్సిపల్ పోస్టులకు : రూ.2000.
పీజీటీ పోస్టులకు : రూ.1500.
నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులకు : రూ.1000.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూలై 31
వెబ్సైట్ : emrs.tribal.gov.in.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు