ఇంటి వద్దకే విద్య …EDUCATION FOR ALL
ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్
ఉన్నత చదువులు చదువుకోవాలని చాలా మందికి కోరిక ఉంటుంది. కానీ అందరికీ సాధ్యం కాదు. ఈ సమస్యను అధిగమించేందుకు ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ అనే లక్ష్యంతో డా.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కుగ్రామం నుంచి మహానగరాల్లో ఉన్నవారి వరకు విద్యను అందించాలని దూరవిద్య కోర్సులను ప్రారంభించింది. తక్కువ ఫీజు, నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత ఈ యూనివర్సిటీకే దక్కుతుంది. ప్రస్తుతం యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ కోర్సుల వివరాలు…
డా. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ
– ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1982, ఆగస్టు 26న ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించారు. అనంతరం 1991, డిసెంబర్ 7న ఏపీఓయూ పేరును డా.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీగా మార్చారు. 1983 నుంచి 22 స్టడీ సెంటర్లతో రాష్ట్రంలో ఏపీఓయూ విద్యను అందించడం ప్రారంభించింది. మొదట 6,321 మంది విద్యార్థులు దీనిలో చేరారు. “Education at Your Doorstep” అనే ట్యాగ్తో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో మొత్తం 182 స్టడీ సెంటర్లు ఉన్నాయి. గతేడాది అన్ని కోర్సుల్లో ఎన్రోల్ అయిన విద్యార్థుల సంఖ్య 1,22,872. మొత్తం 37 కోర్సులను (యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు) యూనివర్సిటీ అందిస్తుంది.
యూజీ కోర్సులు
- బీఏ, బీఎస్సీ, బీకాం
- తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలలో కోర్సులను అందిస్తుంది.
- డిగ్రీ కోర్సులను చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్లో అందిస్తుంది. ప్రతి ఏడాది రెండు సెమిస్టర్లు. అంటే డిగ్రీ మొత్తానికి ఆరు సెమిస్టర్లు ఉంటాయి.
- అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన కోర్సులు ఉత్తీర్ణులు.
పీజీ కోర్సులు
– ఎంఏ (ఎకనామిక్స్, హిస్టరీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, ఉర్దూ), ఎంకాం, ఎమ్మెస్సీ (మ్యాథ్స్, అప్లయిడ్ మ్యాథ్స్, సైకాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ), ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి టీఎస్ ఐసెట్ క్వాలిఫై అయి ఉండాలి. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
నోట్: పై కోర్సులతో పాటు పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆయా కోర్సులకు సంబంధించి ఫీజు వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
ముఖ్యతేదీలు
– దరఖాస్తు: ఆన్లైన్, యూనివర్సిటీ స్టడీ సెంటర్లలో లభిస్తాయి.
– చివరితేదీ: జూలై 31
– వెబ్సైట్: https://www.braouonline.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు