JNTUH పరిధిలో 16న జరగాల్సిన పరీక్షలు వాయిదా..!
రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం గురువారం నుంచి మరో మూడు రోజుల పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ పరిధిలో 16న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 16న బీటెక్, బీఫార్మసీ 4వ సంవత్సరం రెండవ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు జరగాల్సిఉండగా వాటిని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. బీటెక్/బీఫార్మసీ 3వ సంవత్సరం రెండవ సెమిస్టర్ మిడ్‌టర్మ్ పరీక్షలనూ వాయిదా వేశారు. పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో వెల్లడిస్తామని యూనివర్సిటీ పేర్కొంది. అదే సమయంలో.. 21వ తారీఖు నుంచి జరిగే పరీక్షలన్నీ యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంది.
Previous article
EAMCET అగ్రికల్చర్ పరీక్ష వాయిదా.. ఇంజినీరింగ్ యథాతథం
Next article
ఇంటి వద్దకే విద్య …EDUCATION FOR ALL
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






