General Science | ఇనుమును సంగ్రహించే కొలిమి పేరు?
లోహ సంగ్రహణ శాస్త్రం
1. ధాతువు, ఇంధనం రెండింటిని ఉంచడానికి వీలుగా పెద్ద చాంబర్‌ను కలిగి ఉన్న కొలిమి?
1) బ్లాస్ట్ కొలిమి
2) రివర్బరేటరీ కొలిమి
3) ఓపెన్ హార్త్ కొలిమి 4) ఏదీ కాదు
2. గాంగ్ ఆమ్ల పదార్థమైతే దాన్ని తొలగించడానికి ద్రవకారిగా ఏ పదార్థాన్ని వాడతారు?
1) CuSO4 2) HCl
3) CaO 4) KMnO4
3. 300C వద్ద ద్రవరూపంలోని లోహాలు?
ఎ. మెర్క్యురీ బి. గాలియం
సి. సీజియం డి. బ్రోమిన్
1) ఎ 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) అన్నీ
4. ముడి ఖనిజంలో కలిసిపోయి ఉన్న మలినాలను ఏమంటారు?
1) గాంగ్ 2) ద్రవకారి
3) లోహమలం 4) ఖనిజం
5. కింది వాటిలో జిప్సమ్ ఫార్ములా ఏది?
1) CuSO4.H2O
2) CuSO4.1/2H2O
3) CuSO4.5H2O
4) CuSO4.2H2O
6. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను ఏ పదార్థం నుంచి తయారు చేయవచ్చు?
1) తడిసున్నం 2) జిప్సం
3) సిమెంట్ 4) చలువరాతి ముక్కలు
7. కింది వాటిలో విద్యుత్ వాహకం ఏది?
1) సల్ఫర్ 2) అయోడిన్
3) గ్రాఫైట్ 4) డైమండ్
8. గాలి అందుబాటులో లేకుండా లోహధాతువును వేడిచేసే ప్రక్రియను ఏమంటారు?
1) దహనం 2) భర్జనం
3) శుద్ధి చేయడం 4) భస్మీకరణం
9. మానవుడు ఉపయోగించిన మొదటి లోహం ఏది?
1) రాగి (కాపర్)
2) బంగారం (గోల్డ్)
3) వెండి (సిల్వర్)
4) ఇనుము (ఐరన్)
10. ఫ్యూజు వైరుకు ఉండాల్సిన లక్షణం?
ఎ. తక్కువ నిరోధకత్వం
బి. ఎక్కువ నిరోధకత్వం
సి. అల్ప ద్రవీభవన స్థానం
డి. అధిక ద్రవీభవన స్థానం
1) ఎ, డి 2) బి, సి
3) బి, డి 4) ఎ, సి
11. ఇనుము తుప్పు పట్టకుండా గాల్వనైజేషన్ చేయడానికి ఉపయోగపడే లోహం?
1) బంగారం 2) రాగి
3) జింక్ 4) వెండి
12. ప్రకృతిలో లభించే లోహ మూలకాలు లేదా సమ్మేళనాలను ఏమంటారు?
1) ఖనిజాలు 2) ధాతువులు
3) అర్ధ లోహాలు 4) లోహ ఖనిజాలు
13. సున్నపు రాయి ఆధారిత గుహల్లో కనిపించే స్టాలైక్టెట్లు, స్టాలగ్మైట్లలో ఉండే రసాయన పదార్థం?
1) కాల్షియం క్లోరైడ్
2) కాల్షియం సల్ఫేట్
3) కాల్షియం కార్బోనేట్
4) కాల్షియం ఫాస్ఫేట్
14. సిన్నబార్ ఫార్ములా?
1) HgS 2) ZnS
3) PbS 4) Cu2S
15. రాగి ప్రధాన ఖనిజమైన కాపర్ పైరెటిస్ను వేడిచేయడం వల్ల ప్రధానంగా వాతావరణంలోకి విడుదలయ్యే వాయువు?
1) కార్బన్ డై ఆక్సైడ్
2) సల్ఫర్ డై ఆక్సైడ్
3) కార్బన్ మోనాక్సైడ్
4) నైట్రిక్ ఆక్సైడ్
16. అల్యూమినియం నిష్కర్షణకు అత్యంత లాభదాయకమైన ఖనిజం?
1) బాక్సైట్ 2) హెమటైట్
3) సిన్నబార్ 4) కాపర్ పైరెటిస్
17. లోహపు ముక్కలను/భాగాలను అంటించడానికి వాడే వాయువు?
1) ఇథిలిన్ 2) ఎసిటిలిన్
3) ప్రోఫైన్ 4) మీథేన్
18. గాలి లేకుండా ధాతువును వేడి చేసి బాష్పశీల మలినాలను తొలగించే ప్రక్రియ?
1) భస్మీకరణం 2) భర్జనం
3) నిక్షాళనం 4) పోలింగ్
19. ఇనుము తుప్పుపట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
1) ఐరన్ సల్ఫైడ్‌గా మారడం
2) ఐరన్ ఆక్సైడ్‌గా మారడం
3) ఐరన్ కార్బోనేట్‌గా మారడం
4) ఐరన్ బైకార్బోనేట్‌గా మారడం
20. ఇనుము తుప్పు పట్టడం ఎటువంటి చర్య?
1) క్షయకరణం 2) ఆక్సీకరణం
3) భస్మీకరణం 4) హైడ్రోజనీకరణం
21. మృదువుగా ఉండి కత్తితో కత్తిరించగల లోహం?
1) పాదరసం 2) సోడియం
3) బంగారం 4) వెండి
22. దృఢంగా ఉండే లోహం?
1) ప్లాటినం 2) బంగారం
3) వెండి 4) డైమండ్
23. కిరోసిన్ లేదా పారాఫిన్ తైలంలో నిల్వచేసే లోహం?
1) లిథియం 2) సోడియం
3) 1, 2 4) ఏదీకాదు
24. కింది వాటిలో లోహాలకు సంబంధించిన సరైన వాక్యం?
ఎ.లోహబంధాన్ని స్వేచ్ఛా ఎలక్ట్రాన్ సిద్ధాంతం వివరిస్తుంది
బి. తాంతవత, అఘాత వర్ధనీయత
సి. అయానిక సమ్మేళనాలను, క్షారాలను ఏర్పరుస్తాయి
డి. తళతళా మెరుస్తాయి
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) బి, సి 4) పైవన్నీ
25. గెలీనా ఏ ధాతువు?
1) Zn 2) Pb
3) Hg 4) Al
26. భూపటలంలో అతి సమృద్ధిగా లభించే లోహం?
1) ఆక్సిజన్ 2) అల్యూమినియం
3) జింక్ 4) ఇనుము
27. ఇనుమును సంగ్రహించే కొలిమి పేరు?
1) బ్లాస్ట్ ఫర్నెస్
2) ఓపెన్ హార్త్ ఫర్నెస్
3) ఓపెన్ కాస్ట్ ఫర్నెస్
4) ఎక్జాస్ట్ ఫర్నెస్
28. కార్బన్ శాతం అతి తక్కువగా ఉండే ఇనుము?
1) చేత ఇనుము 2) పోత ఇనుము
3) దుక్క ఇనుము 4) స్పాంజ్ ఇనుము
29. అగ్గినది, హార్తలు విడివిడిగా ఏర్పాటు చేసి ఉన్న కొలిమి?
1) బ్లాస్ట్ కొలిమి
2) రివర్బరేటరీ కొలిమి
3) ఓపెన్ హార్త్ కొలిమి
4) ఏదీ కాదు
30. బంగారు నగల తయారీలో బంగారానికి రాగి కలపడానికి కారణం?
1) మెరవడం కోసం
2) గట్టిదనం కోసం
3) పసుపుదనం కోసం
4) చవకైంది కాబట్టి
31. స్వచ్ఛమైన బంగారం ఎన్ని క్యారెట్లు?
1) 20 2) 22 3) 24 4) 18
32. సమతుల్యతతో కూడిన సహజ ఎరువు ఏది?
1) కంపోస్టు 2) అమ్మోనియా
3) నైట్రోలిమ్ 4) సూపర్ ఫాస్ఫేట్
33. మార్బుల్ (పాలరాయి) రసాయన సంకేతం?
1) Na2 CO3 2) CaCO3
3) MgCO3 4) K2CO3
34. పిచ్‌బ్లెండ్ అనేది దేని ఖనిజం?
1) యురేనియం 2) థోరియం
3) రేడియం 4) నెఫ్ట్యూనియం
35. ఉక్కుతో సమానమైన బలం ఉండి అందులో సగం బరువు మాత్రమే ఉండే లోహం ఏది?
1) కాపర్ 2) అల్యూమినియం
3) టిన్ 4) జింక్
36. లోహాలు మెరవడానికి కారణం?
1) తెల్లని రంగు
2) గాల్వనైజేషన్
3) లోహాల్లోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు కాంతిని పరావర్తనం చెందించడం వల్ల
4) లోహాల్లోని ప్రోటాన్లు కాంతిని శోషించుకోవడం వల్ల
37. ప్రపంచంలో తయారు చేసిన మొట్టమొదటి మిశ్రమలోహం?
1) స్టీల్ 2) కంచు
3) ఇత్తడి 4) బెల్‌మెటల్
38. పంట కోతకు వచ్చాక నేలలో అధికంగా లోపించే లోహం?
1) జింక్ 2) కాపర్
3) పొటాషియం 4) ఫాస్ఫరస్
39. కింది వాటిలో ఉత్తమ విద్యుద్వాహకం ఏది?
1) అల్యూమినియం 2) రాగి
3) ఇనుము 4) లెడ్
40. ఎప్సమ్ లవణంలోని నీటి అణువుల సంఖ్య?
1) 3 2) 4 3) 6 4) 7
41. శాశ్వత అయస్కాంతీకరణకు అనువైన లోహం
1) నికెల్ 2) కోబాల్ట్
3) ఇనుము 4) పైవన్నీ
42. ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుడ్లు, వెంట్రుకలు, చేతి గోళ్లలో ఏ మూలకం ఉంటుంది?
1) సల్ఫర్ 2) కార్బన్
3) అయోడిన్ 4) నైట్రోజన్
43. రైలు పట్టాల తయారీలో వాడే స్టీల్?
1) క్రోమియం స్టీల్
2) మాంగనీసు స్టీల్
3) టంగ్స్టన్ స్టీల్
4) స్టెయిన్లెస్ స్టీల్
44. ఇత్తడి (బ్రాంజ్)లోని లోహాలు ఏవి?
1) రాగి, తగరం (టిన్)
2) రాగి, జింక్
3) రాగి, క్రోమియం
4) రాగి, బంగారం
45. విద్యుత్ పరికరాలు, వంట పాత్రల పిడులు లోహాలతో తయారు కావు ఎందుకంటే లోహాలు?
1) విద్యుత్ వాహకాలు
2) ఉష్ణ వాహకాలు
3) విద్యుత్, ఉష్ణ వాహకాలు
4) ఏదీ కాదు
46. నగల తయారీలో బంగారానికి కలిపే లోహం?
1) రాగి 2) వెండి
3) ఇనుము 4) పాదరసం
47. కింది వాటిలో లోహం?
1) గంధకం 2) కార్బన్
3) అయోడిన్ 4) రాగి
48. ముద్రణకు ఉపయోగపడే అక్షరాలు చేయడానికి ఉపయోగపడే టైప్ మెటల్‌లోని ప్రధాన లోహం?
1) లెడ్ 2) తగరం
3) వెండి 4) కాపర్
49. కింది వాటిలో ధ్వని గుణం లేనిది?
1) కాపర్ 2) అల్యూమినియం
3) చెక్కముక్క 4) ఇనుము
50. ఏ లోహం ఉన్న మిశ్రమ లోహాన్ని అమాల్గం అంటారు?
1) ఐరన్ (ఇనుము)
2) మెర్క్యురీ (పాదరసం)
3) క్రోమియం 4) లెడ్ (సీసం)
సమాధానాలు
1. 1 2. 3 3.3 4.1
5. 4 6. 2 7.3 8.4
9.1 10.2 11.3 12.4
13.3 14.1 15.2 16.1
17.2 18.1 19.2 20.2
21.1 22.4 23.3 24.4
25.2 26.3 27.1 28.1
29.2 30.2 31.3 32.1
33.2 34.1 35.2 36.3
37.2 38.3 39.2 40.4
41.4 42.1 43.2 44.2
45.3 46.1 47.4 48.1
49.3 50.2
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్-9652578639
నత్రజని వలయం
- వాతావరణంలో నత్రజని అధిక మొత్తం లో ఉన్న మూలకం. ఇది ప్రొటీన్లు, కేంద్రకామ్లాలు ఏర్పడటంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. నైట్రోజన్ వలయం సంక్లిష్టమైన జీవ భౌగోళిక రసాయనిక వలయం. ఈ వలయంలో జడ స్వభావం కలిగి, వాతావరణంలో అణు రూపంలో ఉండే నైట్రోజన్ జీవక్రియలకు ఉపయోగపడే రూపంలోకి మారుతుంది.
- వాతావరణంలో 78 శాతం నైట్రోజన్ ఉన్నా మొక్కలు, జంతువులు దీన్ని ఆ రూపంలో ఉపయోగించుకోలేవు. అందువల్ల వాతావరణంలోని నైట్రోజన్ నేలలోని జీవ రసాయన చర్యల ద్వారా రైజోబియం, నైట్రో సోమోనాస్ వంటి బ్యాక్టీరియాల సహాయంతో అదేవిధంగా భౌతిక, రసాయనిక మెరుపు ద్వారా మొక్కలు గ్రహించే నత్రజని వివిధ సమ్మేళనాలుగా మార్పు చెందుతుంది. జంతువులు తమకు కావలసిన నైట్రోజన్‌ను మొక్కల నుంచి ప్రత్యక్షంగా గాని (శాకాహారులు) పరోక్షంగా గాని (మాంసాహారులు) గ్రహిస్తాయి. నైట్రోజన్ వలయంలో వివిధ దశలున్నాయి అవి.
నైట్రోజన్ స్థాపన: వాతావరణంలో ప్రాథమికంగా జడస్థితిలో ఉన్న లేదా క్రియారహితంగా ఉండే నైట్రోజన్‌ను కొన్ని రకాల జీవులు మాత్రమే వినియోగించుకోగలవు. అందువల్ల నైట్రోజన్ సమ్మేళనం (సంయెగ పదార్థం) స్థిర రూపంలోకి మార్చబడుతుంది. దీన్నే ‘నైట్రోజన్ స్థాపన’ అంటారు. చాలా రకాల సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు, నైట్రోజన్‌ను తమ శరీరంలో వివిధ సమ్మేళనాల రూపంలో స్థాపన చేసుకోగలవు. ఈ బ్యాక్టీరియాల్లో కొన్ని స్వేచ్ఛా స్థితిలో ఉంటాయి.
ఉదా: క్లాస్ట్రీడియం. రైజోబియం, మరికొన్ని సహజీవనం జరిపే బ్యాక్టీరియాలు - బఠాణి, చిక్కుడు, లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన మొక్కల వేర్ల బొడిపెల్లో రైజోబియం బ్యాక్టీరియా సహజీవనం జరిపి వాతావరణంలోని నత్రజనిని నైట్రేట్లుగా మార్చి మొక్కకు అందిస్తుంది. బ్యాక్టీరియాకు మొక్క వేరు బొడిపెల్లో ఆశ్రయం లభిస్తుంది. ఈ రకమైన జీవనాన్ని సహజీవనం అంటారు.
నత్రీకరణం: నేలలోని వినత్రీకరణ బ్యాక్టీరియాలు నైట్రేట్లను అమ్మోనియా రూపంలోకి మారుస్తాయి. నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఈ అమ్మోనియాను ఉపయోగించుకొని ప్రొటీన్లు, కేంద్రకామ్లాలు, నైట్రేట్లు, నైట్రైట్లుగా మార్చుకుంటాయి. నైట్రసోమోనాస్ నైట్రైట్స్ను ఉత్పత్తి చేయగా, నైట్రోబాక్టర్ నైట్రేట్లను ఉత్పత్తి చేస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు