Economic system | ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం .. సామాజిక ప్రయోజనం
జూన్ 18 తరువాయి
మిశ్రమ ఆర్థిక వ్యవస్థ (Mixed Economy)
- ఆర్థిక వ్యవస్థ రకాలలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఒకటి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల కలయికనే ‘మిశ్రమ ఆర్థిక వ్యవస్థ’ అంటారు.
- పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థల మధ్య మార్గాన్ని సూచించేదే ‘మిశ్రమ ఆర్థిక వ్యవస్థ’.
- ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, ఉత్పత్తి కారకాల యాజమాన్యం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు రెండు కలిసి నిర్వహిస్తే అలాంటి ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు.
- మిశ్రమ ఆర్థిక వ్యవస్థను జె.ఎం. కీన్స్ (1883-1946) ప్రతిపాదించారు.
- మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఉదా: భారతదేశం, యూకే, ఫ్రాన్స్, స్వీడన్, ఐస్‌ల్యాండ్.
- పారిశ్రామిక విప్లవం ఫలితంగా ప్రపంచంలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ బలపడి, ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగం ఆధిక్యతను కనబరిచి ప్రభుత్వ రంగం చాలా వరకు దేశ పరిపాలన, రక్షణ వరకే పరిమితమైంది.
- సుమారు 150 సంవత్సరాల పాటు laissez faire సిద్ధాంతం ఆధారంగా క్యాపిటలిజం ఆర్థిక విధానాలు కొనసాగాయి
- 1929లో ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన గొప్ప ఆర్థిక మాంద్యం ఆడమ్‌స్మిత్ ప్రతిపాదించిన లెజాఫెయర్ సిద్ధాంతం ఆధారంగా పనిచేసే మార్కెట్ ఆర్థిక వ్యవస్థ విధానం సరైనది కాదని రుజువు చేసింది. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగం ప్రధాన పాత్ర పోషించాలనే అభిప్రాయం బలపడింది.
- 1936లో సంవత్సరంలో బ్రిటిష్ ఆధునిక ఆర్థికవేత్త జాన్ మెనాల్డ్ కీన్స్ చేత రచించిన (The General theory of employ ment Interest and Money) ఉద్యోగితా వడ్డీ ద్రవ్య సాధారణ సిద్ధాంతం ద్వారా ప్రపంచానికి నూతన ఆర్థిక వ్యవస్థ మోడల్‌గా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ(mixed economy)ను పరిచయం చేశారు. దీంతోపాటుగా ప్రభుత్వ విత్తశాస్త్రం (Public Finance) కు ప్రాదాన్యం ఏర్పడింది.
- ఫాదర్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ – జె.ఎం. కీన్స్
- 1944లో ఫ్రాన్స్ తొలి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ దేశంగా అవతరించింది.
- 1948లో మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ప్రకటించారు.
మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు (Features of mixed Economy)
1) ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం: ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ ఉత్పత్తి కారకాల యాజమాన్యం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలసి నిర్వహిస్తాయి.
2) ఆర్థిక ప్రణాళిక: మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు రెండింటికి అనుకూల చర్యలు తీసుకుంటుంది. వాటి ఉత్పాదక శక్తికి అనుకూలంగా వనరుల కేటాయింపు ఉంటుంది.
3) వినియోగదారుల హక్కుల పరిరక్షణ: ఈ రకమైన ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల ప్రయోజనాలు రక్షించబడతాయి. వినియోగదారులు తమకు నచ్చిన ఉత్పత్తులు, సేవలను కొనుగోలు చేయడానికి స్వేచ్ఛను అందిస్తారు. ప్రభుత్వం ఉత్పత్తుల ధరలను నియంత్రిస్తుంది. తద్వారా ప్రైవేటు సమూహాలు వాటిని దోపిడీ చేయకుండా ఉంటాయి.
4) కార్మికుల హక్కుల రక్షణ: మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు దారుల దోపిడి నుంచి కార్మిక వర్గాన్ని ప్రభుత్వం కాపాడుతుంది.
ఉదా: కర్మాగారాల చట్టం, కనీస వేతనాల చట్టం
5) సామాజిక సంక్షేమం: మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ముఖ్య లక్షణాల్లో సామాజిక సంక్షేమం ఒకటి. ఇది పౌరులకు ముఖ్యంగా వికలాంగులకు నిరుద్యోగులకు, వృద్ధులకు సామాజిక భద్రతను అందిస్తుంది. అంతేకాకుండా విద్య, వైద్యం, ఆరోగ్య సంరక్షణ మొదలైన వాటిని కూడా అందిస్తుంది.
- మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు నిర్వహించే పాత్రలు దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి.
- ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగం లాభార్జన ధ్యేయంతో వివిధ రకాల వస్తు సేవలను ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తుంది. అవసరమైతే ప్రభుత్వ రంగం కూడా వీటి ఉత్పత్తి పంపిణీ నిర్వహించవచ్చు.
- ఆర్థిక వ్యవస్థలో కొన్ని వస్తు, సేవల ఉత్పత్తి, పంపిణీ విషయంలో ప్రైవేట్ రంగం ముందుకు రాదు. కాబట్టి ఈ బాధ్యతను ప్రభుత్వ రంగం నిర్వహిస్తుంది. కొన్ని సందర్భాల్లో అవసరమైతే ప్రవేట్ రంగం కూడా నిర్వహించవచ్చు.
- స్థూలంగా ఆర్థిక వ్యవస్థ నియంత్రణను ప్రభుత్వం చూసుకుంటుంది.
మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు (Advantages of mixed economy)
- మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు రెండు మనుగడ సాధించగలవు. ఇది ప్రైవేట్ వ్యాపార వృద్ధికి ప్రాధాన్యం ఇస్తూనే ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తుంది.
- ఈ వ్యవస్థలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు రెండు వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటాయి. ప్రభుత్వ రంగం సామాజిక ప్రయోజనం కోసం ప్రైవేట్ రంగం గరిష్ఠ లాభార్జన కోసం ఉపయోగించుకుంటుంది.
- పెట్టుబడిదారీ విధానంలో ఆర్థిక అసమానతలు ఎక్కువ. కానీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ చర్యల ద్వారా అసమానతలను నియంత్రించవచ్చు.
- ఈ వ్యవస్థలో సమర్థవంతమైన ఆర్థిక ప్రణాళికల ద్వారా సామాజిక సంక్షేమానికి ప్రధాన పాత్ర ఇవ్వబడుతుంది.
- ఈ వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు రెండూ సామాజిక, ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికోసం పనిచేస్తాయి.
- పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి చెందడానికి వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ సరైన ఎంపికగా చెప్పవచ్చు.
మిశ్రమ ఆర్థిక వ్యవస్థ -లోపాలు (Disadvantages of mixed Economy)
స్థిరత్వం లేనిది: కొంతమంది ఆర్థికవేత్తలు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది అస్థిరంగా ఉందని/ స్థిరత్వం లేనిదని పేర్కొన్నారు. ఎందుకంటే ప్రైవేట్‌రంగం గరిష్ఠ ప్రయోజనాలను పొందుతుంది. కాని ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది.
రంగాల అసమర్థత: ఈ వ్యవస్థలో రెండు రంగాలు అసమర్థతమైనవి. ఎందుకంటే ప్రైవేటు రంగానికి పూర్తి స్వేచ్ఛ లభించదు. అందువల్ల అది అసమర్థంగా మారుతుంది. ఇది ప్రభుత్వ రంగంలో అసమర్థతకు దారి తీస్తుంది.
అసమర్థమైన ప్రణాళిక: మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఒక సమగ్ర ప్రణాళిక లేదు. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థ పెద్ద రంగం ప్రభుత్వ నియంత్రణకు వెలుపల ఉంది.
సమర్థత లేకపోవడం: ఈ వ్యవస్థలో రెండు రంగాల్లో సమర్థత లేకపోవడం వల్ల నష్టపోతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఉద్యోగులు తమ కర్తవ్యాన్ని బాధ్యతగా నిర్వర్తించలేకపోవడమే కాకుండా ప్రైవేటు రంగంలో నియంత్రణ అనుమతులు మొదలైన వాటి రూపంలో ప్రభుత్వం పరిమితులు విధించడం వల్ల సామర్థ్యం తగ్గిపోతుంది.
ఆర్థిక నిర్ణయాల్లో జాప్యం: ఈ వ్యవస్థలో నిర్దిష్ట నిర్ణయాలు తీసుకోవడంలో ఎల్లప్పుడు జాప్యం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ విషయంలో జరుగుతుంది. తద్వారా ఆర్థికాభివృద్ధికి అటంకం ఏర్పడుతుంది
వనరుల వృథా ఎక్కువ: ఈ వ్యవస్థలో వనరుల వృథా ఎక్కువ. ఎందుకంటే ప్రభుత్వరంగం లోని వివిధ ప్రాజెక్టులు నిర్మాణాలకు కేటాయించిన నిధులలో కొంత భాగం మధ్య వర్తుల జేబుల్లోకి కమీషన్ రూపంలో వెళుతుంది. తద్వారా వనరుల దుర్వినియోగం జరుగుతుంది.
అవినీతి & బ్లాక్‌మార్కెట్: రాజకీయ పార్టీలు, స్వార్థపరులు ప్రభుత్వ రంగం నుంచి అనవసర ప్రయోజనాలను పొందుతారు. అందువల్ల అది లంచం, నల్లధనం, పన్ను ఎగవేత మొదలైన చట్ట విరుద్ధ కార్యకలాపాలు వంటి చెడు ఆవిర్భావానికి దారితీస్తుంది.
జాతీయాదాయానికి ముప్పు: ప్రైవేటు రంగంలో వనరులను సాధారణ ప్రయోజనాల కోసం ఉపయోగించరు. ఎందుకంటే అధిక లాభార్జనే వారి ధ్యేయం. కావున ప్రైవేటు రంగం జాతీయవాదానికి నిరంతరం ప్రమాదం/ భయంగా ఉంటుంది.
మిశ్రమ ఆర్థిక వ్యవస్థ సమీక్ష
- 1929లో ఏర్పడ్డ ఆర్థిక మాంద్యం నుంచి తప్పించడానికి అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, జె.ఎం.కీన్స్ ప్రతిపాదించిన ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ సూత్రాలననుసరించి న్యూడీల్ ప్రోగ్రాంను రూపొందించి, అమలు చేశారు.
- తద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యం నుంచి బయట పడింది.
- 1997-98 వరకు తూర్పు ఆసియా దేశాలు మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అనుసరించాయి. కానీ ఈ దేశాల్లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఆయా దేశాలు ప్రపంచానికి నూతన మిశ్రమ ఆర్థిక వ్యవస్థను పరిచయం చేశాయి.
- ఈ నూతన మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఒక దేశ ఆర్థిక సాంఘిక, సామాజిక, రాజకీయ పరిస్థిలను బటి,్ట కాలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, నియంత్రిత ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ విధానాలను అవలంబించారు.
న్యూమిక్స్డ్ ఎకానమీ= క్యాపిటలిజం+ స్టేట్ ఎకానమీ+ మిక్స్డ్ ఎకానమీ
ప్రాక్టీస్బిట్స్
1. ప్రభుత్వ ప్రైవేటు రంగాల కలయికతో రూపొందిన ఆర్థిక వ్యవస్థ?
ఎ) మార్కెట్ ఆర్థిక వ్యవస్థ
బి) సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
సి) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
డి) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
2. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, ఉత్పత్తి కారకాల యాజమాన్యం ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు కలిసి నిర్వహించే ఆర్థిక వ్యవస్థను ఏమంటారు?
ఎ) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
బి) మార్కెట్ ఆర్థిక వ్యవస్థ
సి) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
డి) సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
3. మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రతిపాదించినది ఎవరు?
ఎ) ఆడంస్మిత్ బి) మార్షల్
సి) జె.ఎం. కీన్స్ డి) రికార్డో
4. ఏ సిద్ధాంతం ఆధారంగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థను రూపొందించారు?
ఎ) దేశాల సంపద బి) ఆర్థిక సూత్రాలు
సి) ఉద్యోగితా సిద్ధాంతం
డి) ఉద్యోగిత వడ్డీ ద్రవ్య సాధారణ సిద్ధాంతం
5. ‘ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ’ గ్రంథ రచయిత?
ఎ) జె.బి. కీన్స్ బి) జె.ఎం. కీన్స్
సి) ఎ.సి. పిగూ డి) జె.బి. క్లార్క్
6. ప్రపంచంలో తొలి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గల దేశం ఏది?
ఎ) అమెరికా బి) కెనడా
సి) ఫ్రాన్స్ డి) ఇండియా
7. భారతదేశంలో ఏ పారిశ్రామిక విధాన తీర్మానంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రకటించారు?
ఎ) 1948 పారిశ్రామిక విధాన తీర్మానం
బి) 1956 పారిశ్రామిక విధాన తీర్మానం
సి) 1977 పారిశ్రామిక విధాన తీర్మానం
డి) 1991 పారిశ్రామిక విధాన తీర్మానం
8. మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణ గల దేశాలేవి?
ఎ) భారతదేశం బి) ఫ్రాన్స్
సి) యూకే డి) పైవన్నీ
9. ఉద్యోగిత, వడ్డీ, ద్రవ్య సాధారణ సిద్ధాంతాన్ని ఏ సంవత్సరంలో రచించారు?
ఎ) 1929 బి) 1930
సి) 1932 డి) 1936
10. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ మద్యేమార్గం గల ఆర్థిక వ్యవస్థ ఏధి?
ఎ) మార్కెట్ ఆర్థిక వ్యవస్థ
బి) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
సి) సంప్రదాయ ఆర్థిక వ్యవస్థ
డి) పైవన్నీ
11. కిందివాటిలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లక్షణం ఏది?
ఎ) ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల భాగస్వామ్యం
బి) వినియోగదారుల హక్కుల పరిరక్షణ
సి) సామాజిక రక్షణ
డి) పైవన్నీ
12. ఏ వ్యవస్థలో అయినా నియంత్రణ అధికారం ఎవరికి ఉంటుంది?
ఎ) ప్రైవేటు రంగం బి) ప్రభుత్వ రంగం
సి) మిశ్రమ రంగం డి) ఏదీకాదు
13. 1929లో ఆర్థిక మాంద్యం సమయంలో అమెరికా అధ్యక్షులు ఎవరు?
ఎ) ప్రాంక్లిన్ రూజ్వెల్ట్
బి) రూథర్‌ఫర్డ్
సి) క్లింటన్ డి) రిచర్డ్ నిక్సన్
14. అమెరికా ఆర్థిక మాంద్యంను అధిగమించడానికి రూపొందించిన కార్యక్రమం ఏది?
ఎ) న్యూ డెమోక్రటిక్ ప్రోగ్రాం
బి) న్యూడీల్ ప్రోగ్రాం
సి) న్యూ విజన్ ప్రోగ్రాం
డి) న్యూ పాలసీ ప్రోగ్రాం
15. 1997-98 సం. వరకు తూర్పు ఆసియా దేశాలు ఏ రకమైన వ్యవస్థను అనుసరించాయి?
ఎ) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
బి) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
సి) సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
డి) మార్కెట్ ఆర్థిక వ్యవస్థ
16. న్యూమిక్స్డ్ ఎకానమీ
ఎ) క్యాపిటలిజం+స్టేట్ ఎకానమీ + మిక్స్డ్ ఎకానమీ
బి) సోషలిజం+స్టేట్ ఎకానమీ+ఎకానమీ
సి) మిక్స్డ్ ఎకానమీ + స్టేట్ ఎకానమీ+ సోషలిజం
డి) స్టేట్ ఎకానమీ + క్యాపిటలిజం
17. జె.ఎం. కీన్స్ ఏ దేశానికి చెందినవారు?
ఎ) అమెరికా బి) బ్రిటన్
సి) కెనడా డి) స్వీడిష్
18. లెజాఫెయర్ సిద్ధాంత రూపకర్త?
ఎ) ఆడమ్ స్మిత్ బి) కీన్స్
సి) మార్షల్ డి) జేబీసే
19. ఫ్రాన్స్ తొలి మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఏ సంవత్సరంలో అవతరించింది?
ఎ) 1940 బి) 1945
సి) 1944 డి) 1948
సమాధానాలు
1-డి 2-సి 3-సి 4-డి
5-బి 6-సి 7-ఎ 8-డి
9-డి 10-బి 11-డి 12-బి
13-ఎ 14-బి 15-బి 16-ఎ
17-బి 18-ఎ 19-సి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు