Current Affairs MAY 16 | నాటో సైనిక కూటమిలో 31వ సభ్యదేశం ఏది?
కరెంట్ అఫైర్స్
1. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ. భారత భూభాగంలోని అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న 11 ప్రాంతాలకు చైనా మూడో విడతలో భాగంగా చైనీస్, టిబెటన్ భాషల్లో పేర్లను 2023 ఏప్రిల్ 2న విడుదల చేసింది
బి. చైనా క్యాబినెట్ నిర్ణయం మేరకు జాంగ్సన్ పేరుతో ఈ జాబితాను ఆ దేశం విడుదల చేసింది
సి. పేర్లు విడుదల చేసిన వాటిలో 2 భూభాగాలు, 2 నివాస ప్రాంతాలు, 5 పర్వతాలు, 2 నదులున్నాయి
డి. 2017లో తొలిసారిగా అరుణాచల్ ప్రదేశ్‌లోని 6 ప్రాంతాలకు ఇలా చైనీస్ పేర్లను విడుదల చేసింది. ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలకు రెండోసారి పేర్లను విడుదల చేసింది
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) సి, డి, ఎ 4) ఎ, బి, సి, డి
2. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ. ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు వంధ్యత్వ సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2023 ఏప్రిల్ 4న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది
బి. ప్రాంతాల మధ్య వంధ్యత్వ సమస్యల్లో పెద్దగా తేడాలు లేవని సంపన్న, మధ్య తరగతి, పేద దేశాల్లో ఇదో పెద్ద సవాలుగా మారిందని నివేదిక పేర్కొంది
సి. సంపన్న దేశాల్లో 17.8 శాతం, మధ్య తరగతి, పేద దేశాల్లో 16.5 శాతం మందిలో వంధ్యత్వ సమస్య ఉందని నివేదిక వెల్లడించింది
డి. మొత్తం జనాభాలో 15.15 శాతం మందిలో ఈ సమస్య ఉందని, దీన్ని అధిగమించడానికి అత్యవసరంగా సంతాన సాఫల్య చర్యలు చేపట్టాలని, అవి అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని
సూచించింది
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) సి, డి, ఎ 4) ఎ, బి, సి, డి
3. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. ఐరోపా సమాఖ్యలో కీలక దేశం ఫిన్లాండ్ నాటో సైనిక కూటమిలో 31వ సభ్య దేశంగా 2023 ఏప్రిల్ 4న అధికారికంగా చేరింది
బి. ఇందుకు సంబంధించిన చేరిక పత్రాలను ఆ దేశ విదేశాంగ మంత్రి పెక్కా హావిస్టా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌కు అందజేశారు. నాటో సభ్యత్వానికి సబంధించిన పత్రాలను అమెరికా విదేశాంగ శాఖ భద్రపరుస్తుంది
సి. నాటోలో ఫిన్లాండ్ చేరేందుకు చివరగా ఆమోదం తెలిపిన దేశంగా తుర్కియే నిలిచింది
డి. తాజా పరిణామం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం రష్యాతో ఫిన్లాండ్కు 1,349 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉండటమే
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) సి, డి, ఎ 4) ఎ, బి, సి, డి
4. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ. మరణ శిక్ష రద్దు చేయాలంటూ ప్రతిపాదించిన బిల్లును మలేషియా ప్రభుత్వం ఆమోదించింది
బి. ఈ బిల్లు ప్రకారం కోర్టులు గరిష్ఠ శిక్షగా 30 నుంచి 40 ఏళ్ల జైలు శిక్ష, 12కు తగ్గకుండా కొరడా దెబ్బలకు ఆదేశించవచ్చు
సి. ఇప్పటి వరకు ఉన్న చట్టం ప్రకారం హత్య, అపహరణ, మాదకద్రవ్యాల రవాణా, ఉగ్రవాదం తదితర కేసుల్లో న్యాయస్థానాలు ఉరిశిక్షను తప్పనిసరిగా విధించాల్సి వచ్చేది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఏదీ కాదు
5. కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. దేశంలో మిగిలిన మూడు అణు విద్యుత్ కేంద్రాల మూసివేతకు జర్మనీ 2023 ఏప్రిల్ 15న శ్రీకారం చుట్టింది
బి. పునరుత్పాదక ఇంధనం దిశగా మళ్లేందుకు చాలాకాలం కిందట రూపొందించిన ప్రణాళికలో భాగంగా జర్మనీ ఈ చర్యను చేపట్టింది
సి. ఎమ్స్లాండ్, నెకార్స్తెయిమ్-2, ఇసార్-2, అనే మూడు రియాక్టర్లను నిలిపివేయాలని దశాబ్దం కిందటే నిర్ణయించారు
1) ఎ 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, బి, సి
6. కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023 ఏప్రిల్ 8న సుఖోయ్-30 యుద్ధ విమానంలో విహరించారు
బి. గ్రూపు కెప్టెన్ నవీన్‌కుమార్ తివారీ ఈ విమానాన్ని నడిపారు
సి. సముద్ర మట్టానికి రెండు కిలోమీటర్ల ఎత్తులో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో బ్రహ్మపుత్ర లోయ మీదుగా హిమాలయాలను వీక్షించారు
డి. గతంలో రాష్ట్రపతి హోదాలో ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్‌లు సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించారు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) సి, డి, ఎ 4) ఎ, బి, సి, డి
7. కింది వాటిలో సరైనవి?
ఎ. సముద్ర రంగంలో అవకాశాలను అందుకోవడంతో పాటు దేశ అభివృద్ధిలో పాలు పంచుకునేలా అంకురాలను స్థాపించడం. అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు వీలుగా సాగరమాల ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీని తీసుకొస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది
బి. ఇందుకు సంబంధించిన ముసాయిదాను ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ 2023 ఏప్రిల్ 10న విడుదల చేసింది
సి. ఔత్సాహికులకు సహాయం చేయడంతో పాటు, సంబంధిత సమాచారం ఉన్న కేంద్రీకృత రిపోజిటరీని అభివృద్ధి చేసేందుకూ ఇది తోడ్పడనుంది
డి. పోర్టుల్లో ఈ అంకురాలకు తగిన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతో పాటు పైలట్ ప్రాజెక్టులు చేసుకునేందుకు వీలు కల్పించేలా ఏర్పాట్లు చేసేందుకు ఈ విధానం దోహదపడనుంది
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) సి, డి, ఎ 4) ఎ, బి, సి, డి
8. కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. 2023 మార్చిలో జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) వసూళ్లు రూ.1,60,122 కోట్లకు చేరింది
బి. పరోక్ష పన్నుల్లో జీఎస్టీ వ్యవస్థ ప్రారంభమయ్యాక వసూలైన రెండో అత్యధిక మొత్తమిది
సి. 2022 ఏప్రిల్‌లో వసూలైన రూ.1,67,540 కోట్లు ఇప్పటివరకు వసూలైన అత్యధిక మొత్తం
1) ఎ 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) ఏదీ సరికాదు
9. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ. 2023 ఏప్రిల్ 8 నాటికి ప్రధానమంత్రి ముద్రా యోజన 8 ఏళ్లు పూర్తిచేసుకుంది
బి. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద గత ఎనిమిదేళ్లలో 38.82 కోట్ల ఖాతాలకు రూ.23.2 లక్షల కోట్ల హామీలేని రుణాలు అందించామని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది
సి. ఈ పథకం కింద మూడు విభాగాల్లో రుణాలు అందిస్తున్నారు. శిశు పేరుతో రూ.50 వేల వరకు, కిశోర్ పేరుతో రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు, తరుణ్ పేరుతో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కార్పొరేట్- వ్యవసాయేతర ఆదా యార్జనకు ఉపయోగపడే కార్యకలాపాల కోసం ఔత్సాహిక వాణిజ్యవేత్తలకు ఈ రుణాలను మంజూరు చేస్తున్నారు
డి. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు, సూక్ష్మ రుణ సంస్థలు, ఇతర ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ ఈ రుణాలు జారీ చేస్తున్నాయి
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) సి, డి, ఎ 4) ఎ, బి, సి, డి
10. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ. 2022లో ప్రవాస భారతీయుల నుంచి, మన దేశంలోని వారి కుటుంబీకులకు వచ్చిన మొత్తం స్థూలంగా 107.50 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8.80 లక్షల కోట్లు) అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గణాంకాలు వెల్లడించాయి
బి. ఇప్పటి వరకు ఒక ఏడాది కాలంలో వచ్చిన మొత్తాల్లో ఇదే అధికం. ప్రవాసుల నుంచి నిధుల రాక విషయంలో ప్రపంచంలోనే మనదేశం అగ్రస్థానంలో ఉంది
సి. గతంలో ప్రవాస భారతీయుల నుంచి మన దేశానికి బదిలీ అయ్యే నిధుల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అగ్రస్థానంలో ఉండేది. ప్రస్తుతం ఆ స్థానాన్ని అమెరికా ఆక్రమించిందని ప్రపంచ బ్యాంకు గణాంకాల ద్వారా తెలుస్తుంది
డి. ప్రస్తుతం భారత్‌కు ప్రవాసుల నుంచి వస్తున్న మొత్తం నిధుల్లో అమెరికా వాటా 23 శాతం
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) సి, డి, ఎ 4) ఎ, బి, సి, డి
11. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ వస్తువుల ఎగుమతులు 6 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 447.46 బిలియన్ డాలర్లకు చేరాయి
బి. పెట్రోలియం, ఔషధాలు, రసాయనాలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో గణనీయ వృద్ధి ఉండటం ఇందుకు దోహదం చేసింది
సి. భారత సేవల ఎగుమతులు 2021-22లో 254.53 బిలియన్ డాలర్లు కాగా, 2022-23లో 26.8 శాతం అధికమై 322.72 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది జీవనకాల గరిష్ఠం కావడం గమనార్హం
1) ఎ 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఏదీ కాదు
12. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ. భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో పులుల గణాంకాలు, ఇతర వివరాలను విడుదల చేశారు
బి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంతర్జాతీయ పులులు, సింహాల (బిగ్ క్యాట్) కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు
సి. ప్రధాని విడుదల చేసిన పులుల గణాంకాల ప్రకారం మన దేశంలో గత నాలుగేళ్లలో పులుల సంఖ్య 200 పెరిగింది. 2018లో దేశంలో 2967 పులులు ఉండగా 2022 నాటికి వాటి సంఖ్య 3167 కు (6.74 శాతం) పెరిగింది
డి. మన దేశంలో 2006లో 1411 పులులు ఉండగా, ఆ సంఖ్య 2010 నాటికి 1706కు పెరిగింది. ఇలా పెరుగుతూ 2014లో 2226కు 2018లో 2967కు చేరింది
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) సి, డి, ఎ 4) ఎ, బి, సి, డి
13. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ. 2024 చివర్లో చేపట్టబోయే చంద్ర మండల యాత్ర కోసం నలుగురు వ్యోమగాములను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఎంపిక చేసింది. వీరిలో ఒక మహిళ ఉన్నారు.
బి. 2023 ఏప్రిల్ 3న హ్యూస్టన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో నాసా వీరిని పరిచయం చేసింది. వీరిలో మిషన్ కమాండర్ రీడ్ వైస్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, కెనడాకు చెందిన జెరిమీ హాన్సెన్ ఉన్నారు
సి. వ్యోమగాముల్లో క్రిస్టినా కోచ్ సుదీర్ఘకాలం అంతరిక్ష యాత్ర చేపట్టిన మహిళగా గుర్తింపు పొందింది
డి. నాసాకు చెందిన ఒరాయన్ క్యాప్సూల్‌లో వీరు యాత్ర చేపడతారు. అయితే వారు చంద్రుడిపై దిగరు. చంద్రుడి కక్ష్యలోకి మాత్రమే వెళ్లి, తిరిగి భూమికి చేరుకుంటారు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) సి, డి, ఎ 4) ఎ, బి, సి, డి
14. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ. కేంద్ర జల్‌శక్తి శాఖ తొలి వాటర్ బాడీస్ సెన్సస్ నివేదికను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 1,90,777 చెరువులు తదితర జలవరనరులు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది
బి. 2017-18 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని నిర్వహించిన ఈ గణన ప్రకారం మొత్తం నీటి వనరుల్లో 99.7 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా, మిగిలినవి పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి
సి. ఇందులో అత్యధికం చెరువులు కాగా, మిగిలినవి నీటి సంరక్షణ పథకాల కింద చేపట్టిన చెక్‌డ్యాంలు, ఊటబావులు
డి. మొత్తం జలవనరుల్లో 57.2 శాతం ప్రైవేట్ యాజమాన్యం, 42.8 శాతం ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) సి, డి, ఎ 4) ఎ, బి, సి, డి
15. మియామి ఓపెన్ టైటిల్‌ను ఎవరు కైవసం చేసుకున్నారు?
1) డానియల్ మెద్వెదెవ్
2) జానిక్ సినర్
3) కార్లోస్ అల్కారజ్
4) అలెగ్జాండర్ జ్వెరెవ్
సమాధానాలు
1. 4 2. 1 3. 4 4. 3
5. 4 6. 4 7. 4 8. 3
9. 3 10. 4 11. 3 12. 4
13. 4 14. 4 15. 1
గొర్రెలు
- గొర్రెలు ఎక్కువగా గల దేశాల్లో ఆస్ట్రేలియా, రష్యా, చైనా, అర్జెంటీనా, న్యూజిలాండ్ తర్వాత మన దేశం ఆరోస్థానంలో ఉంది. దేశంలో అత్యధిక ఉన్నిని రాజస్థాన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఉన్ని మార్వారి రకానికి చెందినది. జమ్ముకశ్మీర్, గుజరాత్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మంచి రకానికి చెందిన గొర్రెలు కలు, కంగ్రా, చంబాలు కశ్మీర్లో పెరుగుతున్నాయి.
- కశ్మీర్ లోయ, బదర్వా, బహర్వార్, రాంపూర్ జాతుల గొర్రెలను జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల్లో
పెంచుతున్నారు. - జయసల్మేరి, మల్బూరి, పూగల్, ముగ్రా జాతులను రాజస్థాన్, హర్యానాల్లో పెంచుతున్నారు.
- డక్కాని, నెల్లూరు, మాంధ్య జాతులు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్నాయి.
- దేశంలో గొర్రెలు అత్యధికంగా ఉన్న రాష్ర్టాలు- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు