పర్యావరణ పరిరక్షణే కాలుష్య నియంత్రణ
కాలుష్యంl
- పర్యావరణం కాలుష్యం వల్ల దెబ్బతింటుంది.
- ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాలు- చైనా, ఇండియా
- దేశంలోని అత్యంత కాలుష్యమైన నగరాలు- ఢిల్లీ, ముంబై
- కాలుష్యం వల్ల మనిషి సగటు జీవితకాలం తగ్గిపోతుంది.
- పురుషుడి సగటు జీవితకాలం 63 సంవత్సరాలు, స్త్రీల సగటు జీవితకాలం 66 సంవత్సరాలు.
- కాలుష్యాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. 1. విచ్ఛిన్న కాలుష్యం 2. అవిచ్ఛిన్న కాలుష్యం
విచ్ఛిన్న కాలుష్యం: ఈ కాలుష్యం మానవుడు, జంతువులకు సంబంధించిన వ్యర్థ పదార్థాల ద్వారా కలుగుతుంది.
అవిచ్ఛిన్న కాలుష్యం: ఈ కాలుష్యం ప్లాస్టిక్, రబ్బర్, పాలిథీన్ కవర్ల వల్ల కలుగుతుంది.
- కాలుష్యం కలుగజేసే కారకాల ఆధారంగా నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి.. 1. గాలి కాలుష్యం 2. నీటి కాలుష్యం 3. శబ్ద కాలుష్యం 4. భూ కాలుష్యం
గాలి కాలుష్యం / వాయువు కాలుష్యం
- గాలి కాలుష్యాన్ని కలుగజేసే వాయువులు 5.CO2
- ఈ వాయువు బొగ్గు నుంచి వెలువడుతుంది. కాబట్టి దీన్ని బొగ్గు పులుసు వాయువు అంటారు.
- వాతావరణంలో ఉండే కార్బన్ డై ఆక్సైడ్ శాతం- 0.033
- అగ్ని మాపక యంత్రాల్లో మంటలు ఆర్పివేయడానికి కార్బన్ డై ఆక్సైడ్ వాయువును వాడతారు.
- అడవులను దహనం చేయడం వల్ల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది.
- అడవులను నరకడం వల్ల వాతావరణంలో ఉండే కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరుగుతుంది. దీని వల్ల ఓజోన్ పొరకు రంధ్రాలు ఏర్పడతాయి. ఆ రంధ్రాల నుంచి అతినీలలోహిత కిరణాలు భూమిని తాకుతాయి. తద్వారా భూమి వేడెక్కుతుంది. ఈ ప్రక్రియనే గ్లోబల్ వార్మింగ్ అంటారు.
- భూమి వేడెక్కడం వల్ల మంచుతో కూడిన ప్రదేశాలు నీరుగా మారి, సముద్రంలో కలుస్తాయి. దీని వల్ల సముద్రం నీటి మట్టం పెరిగి దాని చుట్టూ ఉండే ప్రాంతాల్లో వరదలు సంభవిస్తాయి. ఈ ప్రభావాన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ (హరిత గృహ ప్రభావం) అంటారు.
- CO కార్బన్ మోనాక్సైడ్ వాహనాల పొగ నుంచి వెలువడే వాయువు.
- ఇది అత్యంత విషపూరితమైన వాయువు.
- కార్బన్ మోనాక్సైడ్ సిగరెట్ పొగలో కూడా ఉంటుంది.
- వాహనాల నుంచి వెలువడే పొగలో 0.91 శాతం కార్బన్ మోనాక్సైడ్ను మనం పీల్చుకుంటున్నాం.
- సిగరెట్లోని పొగలో 91.6 కార్బన్ మోనాక్సైడ్ను పీలుస్తున్నాం.
- CO ను పీల్చడం వల్ల మనిషి మరణానికి దారితీస్తుంది.
o2+Hb (ఆక్సీ హీమోగ్లోబిన్)
CO+Hb
(కార్బాక్సీ హీమోగ్లోబిన్)
CFC (క్లోరో ఫ్లోరో కార్బన్లు) - ఏసీ, రిఫ్రిజిరేటర్, స్ప్రే ల నుంచి క్లోరోఫ్లోరో కార్బన్లు వెలువడుతాయి.
- హరిత గృహ ప్రభావం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు కారణమయ్యే వాయువులు- కార్బన్ డై ఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్లు SO2
- సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువు థర్మల్ విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి వెలువడుతుంది.
- ఈ వాయువు థర్మల్ విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి రాత్రి సమయాల్లో మాత్రమే వెలువడుతుంది.
- ఈ సబ్ స్టేషన్ పక్కన ఉండే ఇళ్లలో ఉండేవారు మేడ మీద రాత్రి బట్టలు ఆరవేస్తే, రాత్రివేళ SO2 విడుదల అవుతుంది. ఆ సమయంలో వర్షం పడితే SO2 నీటితో చర్య జరిపి H2SO4 ఏర్పడుతుంది.
- ఆమ్ల వర్షానికి కారణమయ్యే వాయువు- సల్ఫర్ డై ఆక్సైడ్
- అగ్ని పర్వతాలు బద్దలు కావడం వల్ల విడుదలయ్యే వాయువు- SO2
- తాజ్మహల్ వంటి కట్టడాలు నాశనం అయ్యేందుకు కారణమయ్యే వాయువు- SO2
- ఈ వాయవు గోడపై పెచ్చులు రావడానికి కారణం అవుతుంది.
- గ్రంథాలయంలోని పుస్తకాలు పసుపు వర్ణంలోకి మారడానికి కారణమవుతుంది.
- లెదర్ వస్తువులు (బ్యాగులు, బెల్టులు) పగుళ్లు రావడానికి కారణం అవుతుంది.
- H2S ఇది కుళ్లిన కోడిగుడ్ల వాసన వస్తుంది.
- ఈ వాయువును పీల్చుకుంటే త్రీవమైన తలనొప్పి వస్తుంది.
- H2S వాయువు ఫ్యాక్టరీల నుంచి వెలువడుతుంది.
- ఇది పెయింటింగ్పై పడితే నల్లటి గీతలు (చారలు) ఏర్పడతాయి.
- వెండి వస్తువులపై పడితే నల్లటి చారలు ఏర్పడతాయి.
భోపాల్ సంఘటన: ఈ ఘటన 1984 డిసెంబర్ 2న మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది. యూనియన్ కార్బెడ్ ఎరువుల కర్మాగారంలో MIC (మిథైల్ ఐసో సైనైడ్) వాయువు విడుదలయ్యింది. ఈ ఘటనలో 3000 మంది చనిపోయారు. ఈ కర్మాగారం యజమాని అండర్సన్ (అమెరికా). మిథైల్ ఐసో సైనైడ్ వాయువు తీవ్రత 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
చెర్నోబిల్ ఘటన: 1986లో రష్యాలోని చెర్నోబిల్లో ఈ ఘటన జరిగింది. బాయిలర్లలోని రసాయనాలను పరిమితికి మించి ఎక్కువ వేడిచేయడం వల్ల అవి పేలిపోయి గాలిలోకి రేడియోధార్మిక పదార్థాలు విడుడదలయ్యాయి. వీటిని పీల్చడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు థైరాయిడ్ క్యాన్సర్ సంభవించి 5 మిలియన్ల మంది చనిపోయారు.
నీట్టి కాలుష్యం/జల కాలుష్యం
- భూమిపై 71 శాతం నీరుంది. ఇందులో సముద్రపు నీరు 97 శాతం, మంచి నీరు 3 శాతం.
- వర్షపు నీటిలో నైట్రోజన్ మూలకం ఉంటుంది. ఇది భూమిపై చేరినప్పుడు మంచి వాసన వస్తుంది.
- నీటి కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులు కలరా, టైఫాయిడ్, అమీబియాసిస్, పోలియో, పచ్చ కామెర్లు, మెనింజైటిస్.
- అపరిశుభ్రమైన నీటిని పరిశుభ్రమైన నీటిగా మార్చే వాయువు క్లోరిన్ (క్లోరినేషన్ ద్వారా).
- మనం తాగే నీటిలో ఫ్లోరిన్ శాతం 1.5 ppm ఉంటుంది.
- నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో తాగే నీటిలో ఫ్లోరిన్ శాతం 3-7 ppm ఉంటుంది.
- ఫ్లోరోసిస్ వ్యాధి ముఖ్య లక్షణాలు దంతాలు పసుపు పచ్చగా మారి, ఎముకలు వంకర్లు తిరగడం.
- మేఘమధనంలో ఉపయోగించే వాయువు సిల్వర్ అయోడైడ్.
శబ్ద కాలుష్యం/ధ్వని కాలుష్యం
- కృత్రిమ వర్షాలు కురిపించడంలో ఉపయోగించేది కూడా సిల్వర్ అయోడైడ్.
- ధ్వని కాలుష్యం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.
- వరిపైరు శబ్దం 0-10 డెసిబుల్స్.
- గుసగుసలు 20-30 డెసిబుల్స్.
- నేరుగా మాట్లాడినప్పుడు వచ్చే శబ్దం 50-60 డెసిబుల్స్.
- మన చెవులు 80-120 డెసిబుల్స్ వరకు వినగలవు.
భూ కాలుష్యం/ నేల కాలుష్యం
- మానవుడి చెవిపోటుకు కారణమయ్యే శబ్దం తీవ్రత 130 డెసిబుల్స్.
- భూ కాలుష్యం రేడియో ధార్మిక పదార్థాల వల్ల ఏర్పడుతుంది.
- భూ కాలుష్యం వల్ల రేడియోధార్మిక పదార్థాలు మొక్కల్లోకి చేరతాయి. అవి తినడం వల్ల మనకు జన్యు వైపరీత్యాలు సంభవిస్తాయి.
- రేడియోధార్మిక పదార్థాలు గల మొక్కలు తింటే జంతువులకు ఐదు కాళ్లతో పిల్లలు జన్మిస్తాయి. అదేవిధంగా రెండు తలల పిల్లలు పుడతాయి. మానవుల్లో ఐదు వేళ్లకు బదులు ఆరు వేళ్లతో జన్మిస్తారు.
జీవశాస్త్రం- అనుబంధ శాఖలు
జీవశాస్త్రం: మొక్కలు, జంతువుల గురించి చదివే శాస్త్రం.
వృక్షశాస్త్రం: మొక్కల గురించి చదివే శాస్ర్తాన్ని వృక్షశాస్త్రం అంటారు.
జంతుశాస్త్రం: జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
స్వరూప నిర్మాణ శాస్త్రం (మార్ఫాలజీ)
- ఒక మొక్క లేదా జంతువు నిర్దిష్టమైన నిర్మాణం, దాని విధుల గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని మార్ఫాలజీ అంటారు.
- ఇవి రెండు రకాలు 1. బాహ్య స్వరూప శాస్త్రం 2. అంతర స్వరూప శాస్త్రం
1. బాహ్య స్వరూప శాస్త్రం: ఒక మొక్క లేదా జంతువు బాహ్య భాగాలను గురించిన అధ్యయనాన్ని బాహ్య స్వరూప శాస్త్రం అంటారు.
ఉదా: కాండం, పత్రాలు, పుష్పాలు, ఫలాలు
2. అంతర స్వరూప శాస్త్రం: ఒక మొక్క లేదా జంతువు అంతర భాగాల అధ్యయనాన్ని అంతర స్వరూప శాస్త్రం అంటారు.
ఉదా: గుండె, కాలేయం, ఊపిరితిత్తులు
శరీరధర్మ శాస్త్రం
- ఒక జీవి శరీరంలో ఉండే వివిధ రకాల అవయవాలు, అవి నిర్వర్తించే విధుల గురించిన అధ్యయనాన్ని ఫిజియాలజీ అంటారు.
జీవావరణ శాస్త్రం (ఎకాలజీ)
- ఒక జీవికి, పరిసరాలకు మధ్య గల అవినాభావ సంబంధాన్ని గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని జీవావరణ శాస్త్రం అంటారు.
పిండోత్పత్తి శాస్త్రం (ఎంబ్రియాలజీ)
- ఒక జీవిలో అండ దశ నుంచి ప్రౌఢ దశ వరకు జరిగే పరిపూర్ణమైన అభివృద్ధి గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని పిండోత్పత్తి శాస్త్రం అంటారు.
జన్యుశాస్త్రం
- ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే అనువంశిక లక్షణాల గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని జన్యుశాస్త్రం అంటారు.
సూక్ష్మజీవ శాస్త్రం
- కంటికి కనిపించని బ్యాక్టీరియా, వైరస్, శైవలాలు, శిలీంధ్రాల గురించి చదివే శాస్ర్తాన్ని సూక్ష్మజీవ శాస్త్రం అంటారు.
వర్గీకరణ శాస్త్రం (టాక్సానమీ)
- కొన్ని లక్షణాలను ఆధారంగా చేసుకుని మొక్కలు, జంతువులను వర్గీకరించే విధానాన్ని టాక్సానమీ అంటారు.
పురాజీవశాస్త్రం (ఆర్కియాలజీ)/ శిలాజీవావరణ శాస్త్రం
- గతించిపోయిన జీవి అవశేషాన్ని శిలాజం అంటారు. ఇలాంటి శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ఆర్కియాలజీ అని పిలుస్తారు.
జీవ భౌతిక శాస్త్రం (బయో ఫిజిక్స్)
- జీవశాస్త్రం భౌతిక పరమైన అంశాలతో సంబంధాన్ని కలిగి ఉంటే జీవ భౌతిక శాస్త్రం అంటారు.
జీవ రసాయన శాస్త్రం (బయో కెమిస్ట్రీ)
- జీవశాస్త్రం రసాయన పరమైన అంశాలతో సంబంధాన్ని కలిగి ఉంటే దాన్ని జీవరసాయన శాస్త్రం అంటారు.
జీవ సాంకేతిక శాస్త్రం (బయో టెక్నాలజీ)
- జీవశాస్త్రం సాంకేతిక పరమైన అంశాలతో సంబంధాన్ని కలిగి ఉంటే దాన్ని జీవ సాంకేతిక శాస్త్రం అంటారు.
– టీ కృష్ణ విషయ నిపుణులు ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు