Telangana Current Affairs | ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌ను ఏ ఆస్పత్రిలో ప్రారంభించారు?
1. ఇటీవల ప్రారంభించిన తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నానికి సంబంధించి సరైనవి?
ఎ. దీన్ని సీఎం కేసీఆర్ 2023, జూన్ 24న ప్రారంభించారు
బి. స్మారక చిహ్నం రూపశిల్పి ఎంవీ రమణారెడ్డి
సి. నిర్మాణ సంస్థ కేపీసీ ప్రాజెక్టు లిమిటెడ్, ఎత్తు 150 అడుగులు
డి. ప్రపంచంలోనే అతిపెద్ద అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్ నిర్మాణంగా దీన్ని చెప్పవచ్చు
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
2. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీల్లో ఒకటైన మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ఇటీవల రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ ప్రారంభించారు?
1) కొండకల్ 2) కొంగరకలాన్
3) మహేశ్వరం 4) మొయినాబాద్
3. లండన్‌కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ సంస్థ 2023కు ప్రకటించిన ‘గ్రీన్ యాపిల్’ అవార్డులు తెలంగాణలోని ఐదు ప్రముఖ నిర్మాణాలకు లభించాయి. దీనికి సంబంధించి కింది వాటిని జతపర్చండి?
ఎ. మొజంజాహీ మార్కెట్ 1. అద్భుతమైన మతపరమైన నిర్మాణాల విభాగంలో
బి. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి 2. ప్రత్యేకమైన ఆఫీసు కేటగిరీలో
సి. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం 3. కార్యస్థల భవనాల విభాగం
డి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ 4. వంతెనల శ్రేణిలో ప్రత్యేక డిజైన్ కోసం
ఇ. యాదాద్రి ఆలయం 5. హెరిటేజ్ విభాగంలో అద్భుతమైన పునరుద్ధరణ, పునర్వినియోగం కోసం
1) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5 2) ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1
3) ఎ-2, బి-3, సి-4, డి-1, ఇ-5 4) ఎ-5, బి-4, సి-3, డి-1, ఇ-2
4. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన నాలుగో నేషనల్ వాటర్ అవార్డ్స్‌కు సంబంధించి దేశంలో ఉత్తమ గ్రామపంచాయతీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం మొదటి స్థానంలో, ఉత్తమ జిల్లా విభాగంలో ఆదిలాబాద్ మూడో స్థానంలో అవార్డులను గెలుచుకున్నాయి. కాగా ఈ అవార్డులను ప్రదానం చేసిన వారిని గుర్తించండి?
1) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
2) ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్
3) కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
4) ఎవరూ కాదు
5. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు 21 రోజులు నిర్వహించారు. దీనికి సంబంధించి కింది వాటిని జతపర్చండి?
ఎ. దశాబ్ది ఉత్సవాల రెండో రోజు 1. రైతు దినోత్సవం
బి. మూడో రోజు 2. సురక్షా దినోత్సవం
సి. ఐదో రోజు 3. పారిశ్రామిక ప్రగతి దినోత్సవం
డి. ఏడో రోజు 4. సుపరిపాలన దినోత్సవం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-1, బి-2, సి-4, డి-3
6. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో నిర్వహించిన దినోత్సవాలను కాలక్రమంలో అమర్చండి?
ఎ. సాహిత్య దినోత్సవం బి. మంచినీళ్ల పండుగ
సి. విద్యాదినోత్సవం డి. ఆధ్యాత్మిక దినోత్సవం
1) ఎ, బి, సి, డి 2) డి, బి, సి, ఎ
3) ఎ, సి, బి, డి 4) ఎ, డి, బి, సి
7. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 18వ రోజు (జూన్ 19)న నిర్వహించిన తెలంగాణ హరితోత్సవంలో సీఎం కేసీఆర్ మొక్కను ఎక్కడ నాటారు?
1) తుమ్మలూరు రిజర్వ్ ఫారెస్ట్
2) ఎదులాబాద్ రిజర్వ్ ఫారెస్ట్
3) తుర్కయాంజాల్ రిజర్వ్ ఫారెస్ట్
4) బౌరంపేట రిజర్వ్ ఫారెస్ట్
8. హైదరాబాద్‌లోని గోపన్‌పల్లిలో 9 ఎకరాల స్థలంలో రూ.2 కోట్లతో విప్రహిత (తెలంగాణ బ్రాహ్మణ సదనం) భవనాన్ని 2023, మే 31న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అయితే బ్రాహ్మణులకు ప్రభుత్వం అందజేస్తున్న వివిధ పథకాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి?
ఎ. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం వివేకానంద విదేశీ విద్యాపథకం
బి. బ్రాహ్మణ నిరుపేద విద్యార్థులకు ఇంటర్మీడియట్, ఆపై కోర్సులకు శ్రీరామానుజ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం
సి. వేదశాస్త్ర పండితులకు ప్రతి నెలా గౌరవ భృతి రూ.2500 నుంచి రూ.5000 వరకు పెంపు. దీన్ని పొందే అర్హత వయస్సు 75 నుంచి 65 సంవత్సరాలకు తగ్గించారు
డి. ధూపదీప నైవేద్యం పథకం కింద ఆలయ నిర్వహణ, అర్చకులకు ఇచ్చే గౌరవ వేతనం రూ.6000 నుంచి రూ.10,000కు పెంపు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
9. ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహవసతి సముదాయాన్ని సీఎం కేసీఆర్ 2023, జూన్ 22న ఎక్కడ ప్రారంభించారు? (రూ.1474 కోట్లతో, 15,600 డబుల్ బెడ్రూం ఇళ్లు, 145 ఎకరాల విస్తీర్ణం, 117 బ్లాకుల్లో నిర్మించారు)
1) కొల్లూరు (రంగారెడ్డి)
2) కొల్లూరు (సంగారెడ్డి)
3) శామీర్‌పేట్ (మేడ్చల్ మల్కాజిగిరి)
4) ఏదీకాదు
10. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని పరిపాలన సంస్కరణల ప్రజా ఫిర్యాదుల విభాగం విడుదల చేసిన జూన్ నెల డేటాకు సంబంధించి ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ర్టాలు?
1) ఛత్తీస్‌గఢ్, కేరళ, తెలంగాణ
2) కేరళ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ
3) కేరళ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్
4) తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కేరళ
11. ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ టీసీఎల్ తెలంగాణకు చెందిన రిసోజెట్ సంస్థతో కలిసి వినియోగదారుల ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ యూనిట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? (టీసీఎల్ ఎలక్ట్రానిక్స్ తన ప్రధాన కేంద్రమైన చైనాలోని హెఫెయి నగరం తర్వాత విదేశాల్లో ఏర్పాటు చేస్తున్న తొలి తయారీ యూనిట్ ఇదే కావడం విశేషం)
1) కొంగరకలాన్ 2) కొండకల్
3) రావిర్యాల 4) ఏదీకాదు
12. దేశంలోనే తొలిసారి ట్రాన్స్‌జెండర్ క్లినిక్ హైదరాబాద్‌లోని ఏ ఆస్పత్రిలో ప్రారంభించారు?
1) గాంధీ 2) ఉస్మానియా
3) నిమ్స్ 4) ఏదీకాదు
13. ప్రతిష్ఠాత్మక ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును 2023, జూన్ 22న తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ఏఎన్ఎం తేజావత్ సుశీలకు ఎవరు అందజేశారు?
1) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
2) ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్
3) కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
4) ఎవరూకాదు
14. రాష్ట్రంలో ఇటీవల మూడు కొత్త మండలాలను ప్రతిపాదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీటిలో సరైన వాటిని గుర్తించండి?
ఎ. జగిత్యాల జిల్లా బండలింగాపూర్
బి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం
సి. రంగారెడ్డి జిల్లా ఇర్విన్ మండలం
డి. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
15. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ. యూఏఈ కేంద్రంగా రిటైలింగ్ వ్యాపారంలో కార్యకలాపాలు సాగిస్తున్న లులూ గ్రూప్ రాష్ట్రంలో లాజిస్టిక్స్ కేంద్రాన్ని, మాంసం-చేపల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది
బి. ఫ్రాన్స్‌కు చెందిన డిజిటల్ సేవల సంస్థ ‘టెలిపర్ఫామెన్స్’ సంస్థ తమ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పడానికి ముందుకొచ్చింది
1) ఎ, బి 2) ఎ 3) బి 4) ఏదీకాదు
16. తెలంగాణ తొలి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు రాంజీగోండ్ పేరుతో మ్యూజియాన్ని రూ.25 కోట్లతో ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయనుంది?
1) ఆదిలాబాద్
2) కుమ్రంభీం ఆసిఫాబాద్
3) హైదరాబాద్ (అబిడ్స్) 4) ఏదీకాదు
17. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటికి సంబంధించి సరైనవి?
ఎ. గృహలక్ష్మి ఇంటిని మహిళ పేరుతో మంజూరు చేస్తారు
బి. ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 80 శాతం వాటా ఉండాలి
సి. పునాదుల స్థాయిలో రూ.లక్ష, పై కప్పు దశలో రూ.లక్ష, నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష మంజూరు చేస్తారు
డి. ఇంటి నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని ప్రభుత్వం సమకూరుస్తుంది
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) ఎ, సి, డి
18. సాహిత్యంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన సాహితీమూర్తులకు ఇచ్చే ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారానికి ఈ ఏడాదికి ఎవరు ఎంపికయ్యారు?
1) ఆచార్య ఎన్ గోపి 2) అందెశ్రీ
3) గద్దర్ 4) ఏదీకాదు
19. ఇటీవల విడుదలైన ‘పదేండ్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి నివేదిక ప్రకారం (రాష్ట్ర అర్థగణాంక శాఖ రూపొందించిన) తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద 2022-23కు ఎంత (రూపాయల్లో)?
1) 3,08,732 2) 3,09,732
3) 3,10,732 4) ఏదీకాదు
20. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 4న సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ 7 అంశాలను పరిగణనలోకి తీసుకొని పర్యావరణంపై నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మొదటి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ర్టాల వరుసక్రమాన్ని గుర్తించండి?
1) తెలంగాణ, గుజరాత్, గోవా
2) గోవా, గుజరాత్, తెలంగాణ
3) గుజరాత్, తెలంగాణ, గోవా
4) గోవా, తెలంగాణ, గుజరాత్
21. సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు తిరిగి అందించేందుకు తెలంగాణ సీఈఐఆర్ పరిజ్ఞానాన్ని క్రిమినల్ అండ్ క్రైమ్ నెట్వర్క్ ట్రాకింగ్ సిస్టమ్‌లో అనుసంధానించి టెలికమ్యూనికేషన్ శాఖతో కలిసి తెలంగాణ పోలీసులు కృషిచేస్తున్నారు. అయితే సీఈఐఆర్ అంటే?
1) సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రికార్డ్
2) సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్
3) సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రీసోర్స్
4) ఏదీకాదు
22. టీ హబ్ సీఈవో, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా ఎవరు ఉన్నారు?
1) ఎం శ్రీనివాస రావు, సుజిత్ జాగిర్దార్
2) ఎం లక్ష్మీనారాయణ, అజిత్ జాగిర్దార్
3) ఎం విశ్వేశ్వరరావు, లలిత్ జాగిర్దార్
4) ఎవరూకాదు
23. జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ కేంద్ర పర్యావరణ శాఖతో కలిసి రాష్ర్టాల వారీగా అటవీ అగ్నిప్రమాదాలపై విడుదల చేసిన నివేదికలో రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ 9 వరకు 11,657 అటవీ అగ్రిప్రమాదాలు సంభవించగా, ఈ ఘటనల వల్ల 23,544 ఎకరాల అటవీ ప్రాంతం కాలిపోయింది. కాగా జిల్లాల వారీగా అత్యధిక అగ్నిప్రమాదాలు జరిగిన మూడు జిల్లాలను వరుసక్రమంలో గుర్తించండి?
1) ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు
2) నాగర్ కర్నూలు, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం
3) భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు, ములుగు
4) నాగర్ కర్నూలు, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు
24. పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కింది ఏ పేరుతో ప్రత్యేక బస్సులో పులుల ఛాయాచిత్ర ప్రదర్శన కార్యక్రమానికి టీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది?
1) హైదరాబాద్ ఆన్ వీల్స్
2) టైగర్ ఆన్ వీల్స్
3) తెలంగాణ టైగర్స్ ఆన్ వీల్స్
4) ఏదీకాదు
25. మెర్సర్స్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే నివేదిక ప్రకారం ప్రపంచం మొత్తంమీద ఖరీదైన నగరాల్లో హైదరాబాద్ ఎన్నో స్థానంలో ఉంది?
1) 200 2) 201 3) 202 4) 203
26. కేంద్ర ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ విడుదల చేసిన రాష్ర్టాల ఆహార భద్రత ప్రమాణాల సూచీలో తెలంగాణ 32 మార్కులు సాధించి ఏ స్థానంలో నిలిచింది?
1) 14 2) 15 3) 16 4) 17
సమాధానాలు
1-2, 2-1, 3-2, 4-2, 5-1, 6-1, 7-1, 8-3, 9-2, 10-4, 11-3, 12-2, 13-1, 14-1, 15-1, 16-3, 17-2, 18-1, 19-1, 20-1, 21-2, 22-1, 23-1, 24-1, 25-3, 26-1.
గందె శ్రీనివాస్
విషయ నిపుణులు
Dream Warriors Academy
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు