ప్రస్తుతం అతడు ఎంత దూరంలో, ఏ దిశలో ఉన్నాడు?
- ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరలను ప్రధాన దిక్కులు అంటారు. వరుసగా N, S, E, Wలతో సూచిస్తారు.
మూలలు:
- ఈశాన్యం, వాయవ్యం, నైరుతి, ఆగ్నేయంల ను మూలలు అంటారు.
- తూర్పు, ఉత్తరాల మధ్య ఉండే మూలను ఈశాన్యం అంటారు.
- తూర్పు, దక్షిణాల మధ్య ఉండే మూలను ఆగ్నేయం అంటారు.
- పడమర, ఉత్తరాల మధ్య ఉండే మూలను వాయవ్యం అంటారు.
- పడమర, దక్షిణాల మధ్య ఉండే మూలను నైరుతి అంటారు.
- రెండు వరుస ప్రధాన దిక్కుల కోణం 900
- రెండు వరుస మూలల మధ్య కోణం 900
- వరుస ప్రధాన దిక్కు, మూలల మధ్యకోణం 450
- తూర్పునకు ఎడమ ఉత్తరం, ఉత్తరంనకు కుడి తూర్పు
- తూర్పునకు కుడి దక్షిణం, దక్షిణకు ఎడమ తూర్పు
- పడమరకు ఎడమ దక్షిణం, దక్షిణకు కుడి పడమర
- పడమరకు కుడి ఉత్తర, ఉత్తరకు ఎడమ పడమర
టైప్-1
1. ఒక వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరి ఉత్తరానికి 4 కి.మీ., అక్కడి నుంచి పడమరకు 15 కి.మీ., దక్షిణానికి 4 కి.మీ., తూర్పుకు 5 కి.మీ. ప్రయాణిస్తే ప్రస్తుతం అతడు ఎంత దూరంలో, ఏ దిశలో ఉన్నాడు?
ఎ. 10 కి.మీ., పడమర
బి. 10 కి.మీ., తూర్పు
సి. 20 కి.మీ., పడమర
డి. 20 కి.మీ., తూర్పు
సమాధానం: ఎ
వివరణ:
ఉ ప ద తూ 4 15 4 5
ఉత్తరం – దక్షిణం = 4-4 = 0
పడమర – తూర్పు = 15-5 = 10 కి.మీ. (పడమర)
10 కి.మీ. దూరంలో పడమర దిశలో ఉన్నాడు.
గమనిక:
a సమాన దిశలు ఉంటే కలపాలి.
a వ్యతిరేక దిశలు ఉంటే తీసివేయాలి.
2. ఒక వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరి ఉత్తరానికి 7 కి.మీ., అక్కడి నుంచి పడమరకు 10 కి.మీ., దక్షిణానికి 8 కి.మీ., తూర్పుకు 10 కి.మీ. ప్రయాణిస్తే ప్రస్తుతం అతడు ఎంత దూరంలో, ఏ దిశలో ఉన్నాడు?
ఎ. 1 కి.మీ., ఉత్తరం
బి. 1 కి.మీ.-దక్షిణం
సి. 3 కి.మీ., పడమర డి. 3 కి.మీ., దక్షిణం
సమాధానం: బి
వివరణ:
ఉ ప ద తూ 7 10 8 10
తూ-ప = 10-10 = 0
ద-ఉ = 8-7 = 1 కి.మీ. (దక్షిణ)
- దక్షిణం, ఉత్తరాల్లో దక్షిణం పెద్ద నంబర్‌ను కలిగి ఉన్నది. కాబట్టి దక్షిణ దిశను తీసుకోవాలి.
3. ఒక వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరి ఉత్తరానికి 10 కి.మీ., అక్కడి నుంచి దక్షిణానికి 14 కి.మీ., పడమరకు 17 కి.మీ., తూర్పునకు 20 కి.మీ. ప్రయాణిస్తే ప్రస్తుతం అతడు ఎంత దూరంలో, ఏ దిశలో ఉన్నాడు?
ఎ. 5 కి.మీ., ఆగ్నేయం
బి. 5 కి.మీ., ఈశాన్యం
సి. 5 కి.మీ., నైరుతి
డి. 5 కి.మీ., వాయవ్యం
సమాధానం: ఎ
వివరణ:
ఉ ద ప తూ 10 14 17 20
తూ-ప = 20-17 = 3 (తూర్పు)
ద – ఉ = 14-10 = 4 (దక్షిణం)
తూర్పు, దక్షిణానికి మధ్యలో ఉన్న దిశ ఆగ్నేయం. దూరం = = = = 5 కి.మీ.
గమనిక: రెండు వేర్వేరు దిక్కులు మిగిలినప్పుడు వాటిని పైథాగరస్ సిద్ధాంతం ద్వారా కనుగొనాలి.
- పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం లంబకోణ త్రిభుజం ABCలో కర్ణం2=భుజం2+భుజం2కర్ణంను AC అనుకొంటే AC2 = AB2+BC2
4. ఒక వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరి ఉత్తరానికి 9 కి.మీ., అక్కడి నుంచి పడమరకు 4 కి.మీ., దక్షిణానికి 16 కి.మీ., పడమరకు 9 కి.మీ., తూర్పుకు 7 కి.మీ., పడమరకు 4 కి.మీ., తూర్పుకు 3 కి.మీ., దక్షిణానికి 7 కి.మీ. ప్రయాణిస్తే ప్రస్తుతం అతడు ఎంత దూరంలో, ఏ దిశలో ఉన్నాడు?
ఎ. కి.మీ., ఆగ్నేయం
బి. కి.మీ., ఈశాన్యం
సి. కి.మీ., నైరుతి
డి. కి.మీ., వాయవ్యం
సమాధానం: సి
వివరణ:
ఉ ప ద ప తూ ప తూ ద 9 4 16 9 7 4 3 7
ఉ ప ద తూ 9 17 23 10
ప – తూ = 17-10= 7 (పడమర)
ద – ఉ = 23-9 = 14 (దక్షిణం)
దక్షిణానికి, పడమరకు మధ్యగల దిశ = నైరుతి దూరం = = = కి.మీ.
5. ఒక వ్యక్తి మొదటగా ఉత్తరానికి 30 కి.మీ. ప్రయాణించాడు. అక్కడి నుంచి సవ్యదిశలో 900 తిరిగి మరొక 30 కి.మీ. ప్రయాణించాడు. అయితే ప్రస్తుతం బయలుదేరిన స్థానం నుంచి ఏ దిశలో ఉన్నాడు?
ఎ. నైరుతి బి. ఉత్తరం
సి. దక్షిణం డి. ఈశాన్యం
సమాధానం: డి
6. ఒక వ్యక్తి మొదటగా వాయవ్యానికి 4 కి.మీ. ప్రయాణించాడు, అక్కడి నుంచి ఈశాన్యానికి 7 కి.మీ., ఆగ్నేయానికి 9 కి.మీ., నైరుతికి 10 కి.మీ., వాయవ్యానికి 4 కి.మీ., ఈశాన్యానికి 3 కి.మీ., ఆగ్నేయానికి 9 కి.మీ. ప్రయాణిస్తే ప్రస్తుతం అతడు ఎంత దూరంలో, ఏ దిశలో ఉన్నాడు?
ఎ. 10 కి.మీ., ఆగ్నేయం
బి. 10 కి.మీ., ఈశాన్యం
సి. 10కి.మీ., నైరుతి
డి. 10 కి.మీ., వాయవ్యం
సమాధానం: ఎ
వివరణ: ఇచ్చిన సమస్యలో అన్ని సమాన దిశలను కలిపితే
వా ఈ ఆ నై
8 10 18 10
ఈ-నై = 10-10 = 0
ఆ-వా = 18-8 = 10 (ఆగ్నేయం)
టైప్-2
1. ఒక వ్యక్తి మొదటగా ఉత్తరం వైపు నిల్చున్నాడు. అక్కడి నుంచి ఎడమకు, కుడికి, ఎడమకు, కుడికి, ఎడమకు తిరిగితే ప్రస్తుతం అతడు ఏ దిశలో ఉన్నాడు?
ఎ. తూర్పు బి. పడమర
సి. ఉత్తరం డి. దక్షిణం
సమాధానం: బి
వివరణ:
ఎ కు ఎ కు ఎ
- ఒక ఎడమ, ఒక కుడి దిక్కులను వరుసగా కొట్టివేయగా చివరగా ఎడమ దిక్కు మిగిలినది. ఉత్తరానికి ఎడమవైపున ఉన్న దిశ పడమర అవుతుంది.
2. ఒక వ్యక్తి మొదటగా పడమర వైపు నిల్చున్నాడు. అక్కడి నుంచి ఎడమకు, కుడికి, ఎడమకు, కుడికి, ఎడమకు, కుడికి, కుడికి తిరిగితే ప్రస్తుతం అతడు ఏ దిశలో ఉన్నాడు?
ఎ. తూర్పు బి. పడమర
సి. ఉత్తరం డి. దక్షిణం
సమాధానం: సి
వివరణ:
ఎ కు ఎ కు ఎ కు కు
- ఒక ఎడమ, ఒక కుడి దిక్కులను వరుసగా కొట్టివేయగా చివరగా ఎడమ దిక్కు మిగిలినది. పడమరకు కుడి వైపున ఉన్న దిశ ఉత్తరం అవుతుంది.
టైప్-3
1. ఒక సూర్యోదయ సమయంలో అమ్ము, కన్నయ్య ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. అమ్ము నీడ కన్నయ్యకి ఎడమవైపున పడాలంటే అమ్ము ఎటువైపు ముఖం చేయాలి?
ఎ. తూర్పు బి. పడమర
సి. ఉత్తరం డి. దక్షిణం
సమాధానం: డి
2. ఒక మిట్ట మధ్యాహ్న సమయంలో రమణ, రాజులు ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. రమణ నీడ రాజుకి కుడివైపున పడాలంటే రమణ ఎటువైపు ముఖం చేయాలి?
సమాధానం: మిట్టమధ్యాహ్నం నీడలు ఏర్పడవు.
3. ఒక సూర్యాస్తమయ సమయంలో భరత్, అమర్‌లు ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. భరత్ నీడ అమర్‌కు కుడి వైపున పడాలంటే భరత్ ఎటువైపు ముఖం చేయాలి?
ఎ. తూర్పు బి. పడమర
సి. ఉత్తరం డి. దక్షిణం
సమాధానం: డి
4. ఒక సూర్యాస్తమయ సమయంలో అభిషేక్, ఐశ్వర్యలు వీపులు ఆనించుకొని మాట్లాడుకుంటున్నారు. ఐశ్వర్య నీడ అభిషేక్‌కు కుడివైపున పడాలంటే ఐశ్వర్య ఎటువైపు ముఖం చేయాలి?
ఎ. తూర్పు బి. పడమర
సి. ఉత్తరం డి. దక్షిణం
సమాధానం: డి
టైప్-4
1. ఒక వ్యక్తి మొదటగా ఉత్తరం వైపు ముఖం చేశాడు. అక్కడి నుంచి సవ్యదిశలో 900, అపసవ్యదిశలో 1000, సవ్యదిశలో 900, అపసవ్యదిశలో 500 తిరిగితే ప్రస్తుతం అతడు ఏ దిశలో ఉన్నాడు?
ఎ. నైరుతి బి. వాయవ్యం
సి. ఈశాన్యం డి. ఆగ్నేయం
సమాధానం: సి
వివరణ:
స అస స అస
900 1000 900 500
సవ్యదిశలు, అపసవ్యదిశలను కలపగాస అస 1800 1500
సవ్య-అపసవ్య = 180-150 = 300 ఉత్తరం నుంచి సవ్యదిశలో 300 అంటే ఈశాన్యం
2. ఒక వ్యక్తి మొదటగా పడమరవైపు ముఖం చేశాడు. అక్కడి నుంచి సవ్యదిశలో 1700, అపసవ్యదిశలో 1800, సవ్యదిశలో 900, అపసవ్యదిశలో 700, సవ్యదిశలో 300, అపసవ్యదిశలో 400 తిరిగితే ప్రస్తుతం అతడు ఏ దిశలో ఉన్నాడు?
ఎ. తూర్పు బి. పడమర
సి. ఉత్తరం డి. దక్షిణం
సమాధానం: బి
వివరణ:
స అస స అస స అస
1700 1800 900 700 300 400
- సవ్యదిశలు, అపసవ్యదిశలను కలపగా స అస 2900 2900 సవ్య-అపసవ్య = 290-290 = 0పడమరవైపునే ముఖం చేసి ఉన్నాడు.
3. ఒక వ్యక్తి మొదటగా దక్షిణం వైపు ముఖం చేశాడు. అక్కడి నుంచి సవ్యదిశలో 300, అపసవ్యదిశలో 700, సవ్యదిశలో 1000, అపసవ్యదిశలో 400 తిరిగితే ప్రస్తుతం అతడు ఏ దిశలో ఉన్నాడు?
ఎ. నైరుతి బి. వాయవ్యం
సి. ఈశాన్యం డి. ఆగ్నేయం
సమాధానం: ఎ
టైప్-5
1. ఒక పరిభాషలో ఉత్తరం అంటే దక్షిణం, తూర్పు అంటే పడమర అయితే ఈశాన్యం అంటే..?
ఎ. నైరుతి బి. వాయవ్యం
సి. ఈశాన్యం డి. ఆగ్నేయం
సమాధానం: ఎ
2. ఒక పరిభాషలో ఉత్తరం అంటే ఈశాన్యం, ఈశాన్యం అంటే తూర్పు అయితే తూర్పు అంటే..?
ఎ. నైరుతి బి. వాయవ్యం
సి. ఈశాన్యం డి. ఆగ్నేయం
సమాధానం: డి
3. ఒక పరిభాషలో ఉత్తరం అంటే పడమర, పడమర అంటే దక్షిణం, దక్షిణం అంటే..?
ఎ. తూర్పు బి. పడమర
సి. ఉత్తరం డి. దక్షిణం
సమాధానం: ఎ
టైప్-6
1. ఒక గడియారంలో సమయం 2:30 అవుతుంది. నిమిషాల ముల్లు తూర్పు అయితే గంటల ముల్లు సూచించే దిశ ఏది?
ఎ. నైరుతి బి. వాయవ్యం
సి. ఈశాన్యం డి. ఆగ్నేయం
సమాధానం: బి
2. గడియారంలో సమయం 1:35 అవుతుంది. గంటల ముల్లు పడమర అయితే నిమిషాల ముల్లు సూచించే దిశ?
ఎ. నైరుతి బి. వాయవ్యం
సి. ఈశాన్యం డి. ఆగ్నేయం
సమాధానం: సి
- భారత పౌరసత్వానికి సంబంధించి రాజ్యాంగంలోని 2వ భాగంలో ప్రకరణ 5-11 వరకు ప్రస్తావన ఉంది.
- పౌరసత్వ వివరాలకు సంబంధించి పార్లమెంట్ 1955లో పౌరసత్వ చట్టాన్ని రూపొందించింది. దీనిని 1986, 1992, 2003, 2005లో సవరించారు.
- భారతదేశంలో ఏకపౌరసత్వం అమల్లో ఉంది.
భారత పౌరసత్వాన్ని 4 పద్ధతుల ద్వారా పొందవచ్చు. 1. పుట్టుక, 2. వారసత్వం, 3. రిజిస్ట్రేషన్, 4, భూభాగాల విలీనం - పౌరసత్వానికి సంబంధించి చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకే ఉంది.
- పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది.
- పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా, చట్ట ప్రక్రియ ద్వారా అలాగే బలవంతంగా రద్దు చేయవచ్చు.
- కొన్ని హక్కులు విదేశీయులకు కూడా వర్తిస్తాయి. ఉదా: చట్టం ముందు అందరూ సమానులే, అక్రమ శిక్షలకు రక్షణ, జీవించే హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు
- 2005లో ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా చట్టాన్ని చేసింది. దీంతో ఎన్ఆర్ఐ, పీఐఓలకు ద్వంద్వ పౌరసత్వ అవకాశాన్ని కల్పిస్తారు.

Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






