Lenovo : జనవరి 1న లెనోవా లీజియన్ వై90 గేమింగ్ ఫోన్ లాంఛ్!


Lenovo : కొత్త ఏడాది కొత్త ఫోన్లతో స్మార్ట్‌పోన్ బ్రాండ్లు మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తుండగా 2022 నూతన సంవత్సరం తొలి రోజునే లెనోవా తన న్యూ గేమింగ్ ఫోన్‌ను లాంఛ్ చేస్తోంది. జనవరి 1న లెనోవా లీజియన్ వై90 గేమింగ్ ఫోన్ కస్టమర్ల ముందుకు రానుంది. వీబోలో నూతన గేమింగ్ ఫోన్ లాంఛ్‌ను పోస్టర్ ద్వారా వెల్లడించింది.

టాప్ఎండ్ గేమింగ్ పీసీలు, ల్యాప్‌టాప్‌లు, యాక్సెసరీస్‌లో పేరొందిన లీజియన్ తాజాగా మొబైల్ గేమర్స్‌ను టార్గెట్ చేస్తూ లీజియన్ వై90ని లాంఛ్ చేస్తోంది. తొలుత చైనాలో ఎంట్రీ ఇవ్వనున్న ఈ గేమింగ్ ఫోన్ ఇండియా లాంఛ్‌పై ఇంకా స్పష్టత రాలేదు. ఇక లెనోవా లీజియన్ వై90 గేమింగ్ ఫోన్ 6.92 ఇంచ్ ఈ4 అమోల్డ్ స్క్రీన్‌తో డిస్ప్లే హెచ్‌డీఆర్‌ను సపోర్ట్ చేస్తుంది.
యాంటీ బ్లూ లైట్ ప్రొటెక్షన్
గేమర్లు తమ కండ్లు దెబ్బతింటాయనే ఆందోళన లేకుండా ఎక్కువ సమయం ఫోన్‌పై గడిపేందుకు అనువుగా యాంటీ బ్లూ లైట్ ప్రొటెక్షన్ పీచర్‌ను లెనోవా అందుబాటులోకి తీసుకువచ్చింది. లీజియన్ వై90 డ్యూయల్ ఇంజన్ ఎయిర్ కూల్డ్ సిస్టమ్‌తో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్తో ఈ గేమింగ్ ఫోన్ కస్టమర్ల ముందుకు రానుంది.
- Tags
- lenova
- new launch
- smart phone
Latest Updates
డిగ్రీలో జాబ్ గ్యారెంటీ కోర్సులు!
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో యుజీ, పీజీ ప్రవేశాలు
మాడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలు
కొత్తగా మరో 1,663 కొలువులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత?
కొత్తగా వచ్చిన చిన్నవాడి వయస్సు ఎంత?
మాంట్రియల్ ప్రొటోకాల్ అంతర్జాతీయ ఒప్పందానికి కారణం?
తూర్పు, పశ్చిమ కనుమల దక్కన్
సికింద్రాబాద్ నైపెడ్లోకాంట్రాక్టు పోస్టుల భర్తీ
సీడాక్‌లో450 పోస్టుల భర్తీ