Chemistry | ఇంధనాల్లో అత్యధిక కెలోరిఫిక్ విలువ గలది?
1. జతపరచండి?
పట్టిక-I పట్టిక -II
ఎ) వాటర్ గ్యాస్ 1) కార్బన్‌డై ఆక్సైడ్ + హైడ్రోజన్
బి) ప్రొడ్యూసర్ గ్యాస్ 2) కార్బన్ మోనాక్సైడ్ + హైడ్రోజన్
సి) సహజవాయువు 3) కార్బన్ మోనాక్సైడ్+ నైట్రోజన్
డి) ఎల్పీజీ 4) మీథేన్
5) బ్యూటేన్
1) ఎ-1, బి-3, సి-4, డి-5 2) ఎ-1, బి-2, సి-4, డి-5
3) ఎ-2, బి-3, సి-4, డి-5 4) ఎ-2, బి-3, సి-1, డి-5
2. ఏవి శ్రేష్టమైన ఇంధనాలు?
1) ఘన ఇంధనాలు
2) ద్రవ ఇంధనాలు
3) వాయు ఇంధనాలు
4) శిలాజ ఇంధనాలు
3. వాతావరణానికి హాని చేయని ఇంధనం ఏది?
1) పెట్రోల్ 2) హైడ్రోజన్
3) కోక్ 4) ఎల్పీజీ
4. జాంతవ కర్బనం పొందే విధానం?
1) జంతువుల ఎముకలను నాశనం చేయడం వల్ల
2) గాలిలో జంతువుల ఎముకలను మండించడం వల్ల
3) జంతువుల మాంసాన్ని మండించడం వల్ల
4) జంతువుల ఎముకలను గాలి లేకుండా మండించడం వల్ల
5. నిశ్చితం (ఎ): వంటనూనె కంటే పెట్రోల్ త్వరగా మండుతుంది
కారణం (ఆర్): వంటనూనె జ్వలన ఉష్ణోగ్రత పెట్రోల్ కంటే ఎక్కువ
1) ‘ఎ’, ‘ఆర్’ రెండూ సరైనవి, ‘ఎ’ కు ‘ఆర్’ సరైన వివరణ
2) ‘ఎ’, ‘ఆర్’ రెండూ సరైనవి, కానీ ‘ఎ’ కు ‘ఆర్’ సరైన వివరణ కాదు
3) ‘ఎ’ సరైంది, కానీ ‘ఆర్’ సరైంది కాదు
4) ‘ఎ’ సరైంది కాదు, కానీ ‘ఆర్’ సరైంది
6. రాకెట్ ఇంధనంగా ఉపయోగపడేది?
1) అమ్మోనియా 2) పెట్రోల్
3) ఎల్పీజీ 4) ద్రవ హైడ్రోజన్
7. నిశ్చితం(ఎ) విద్యుత్ మంటలను నీటితో ఆర్పవచ్చు
కారణం (ఆర్) : నీరు విద్యుత్‌ను తనగుండా ప్రవహింపజేస్తుంది.
1) ‘ఎ’, ‘ఆర్’ రెండూ సరైనవి, ‘ఎ’ కు ‘ఆర్’ సరైన వివరణ
2) ‘ఎ’, ‘ఆర్’ రెండూ సరైనవి, కానీ ‘ఎ’ కు ‘ఆర్’ సరైన వివరణ కాదు
3) ‘ఎ’ సరైంది, కానీ ‘ఆర్’ సరైంది కాదు
4) ‘ఎ’ సరైంది కాదు, కానీ ‘ఆర్’ సరైంది
8. జంతువుల ఎముకలు దంతాల్లో ఉండే ప్రధాన రసాయన పదార్థం?
1) సోడియం క్లోరైడ్ 2) చక్కెర
3) కాల్షియం ఫాస్ఫేట్
4) కాల్షియం సల్ఫేట్
9. అణు రియాక్టర్లను ఉపయోగించి అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రక్రియ గురించి సరైన వాక్యాలేవి?
ఎ) నియంత్రిత కేంద్రక విచ్చిత్తి చర్య
బి) న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి గ్రాఫైట్ లేదా భారజలాన్ని మితకారిగా వాడతారు
సి) కాడ్మియం లేదా బోరాన్ కడ్డీలను న్యూట్రాన్లను శోషించుకోవడానికి ఉపయోగిస్తారు
డి) బ్రీడర్ రియాక్టర్లలో విచ్చిన్నశీలత లేని యురేనియం -238ను ఉపయోగించుకొని విచ్ఛిన్నశీలత గల ప్లుటోనియం -239 ఉత్పత్తి జరుగుతుంది.
1) ఎ మాత్రమే 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
10. కింది వాటిలో దేన్ని ద్రవ బంగారం అంటారు?
1) పెట్రోలియం 2) ప్లాటినం
3) పైరైన్ 4) అక్వారేజియా
11. మంటలను అదుపు చేయాలంటే?
1) దహన పదార్థాలను తొలగించడం
2) గాలి సరఫరా లేకుండా చేయడం
3) దహన పదార్థాల ఉష్ణోగ్రత జ్వలన ఉష్ణోగ్రత కంటే తగ్గించడం
4) పైవన్నీ
12. మంటలో ఏ భాగానికి అత్యధిక వేడి ఉంటుంది?
1) నీలిరంగులోని అడుగుభాగం
2) నల్లని మధ్య భాగం
3) మంట చుట్ట్టూ ప్రదేశం
4) శిఖర భాగం
13. నిశ్చితం(ఎ): ఆక్సిజన్ స్వయంగా మండదు (దహన శీలి కాదు)
కారణం(ఆర్) : ఆక్సిజన్ మండటానికి సహాయం చేస్తుంది.
1) ‘ఎ’, ‘ఆర్’ రెండూ సరైనవి, ‘ఎ’ కు ‘ఆర్’ సరైన వివరణ
2) ‘ఎ’, ‘ఆర్’ రెండూ సరైనవి, కానీ ‘ఎ’ కు ‘ఆర్’ సరైన వివరణ కాదు
3) ‘ఎ’ సరైంది, కానీ ‘ఆర్’ సరైంది కాదు
4) ‘ఎ’ సరైంది కాదు, కానీ ‘ఆర్’ సరైంది
14. వంటగ్యాస్ సమ్మేళనం?
1) కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్
2) బ్యూటేన్ & ప్రొఫేన్
3) మీథేన్ & ఇథిలీన్
4) కార్బన్ డై ఆక్సైడ్ & ఆక్సిజన్
15. సహజ ఘన ఇంధనం ఏది?
1) పెట్రోల్ 2) పిడకలు
3) బయోగ్యాస్ 4) డీజిల్
16. నీలిరంగులో మండే ఇంధనం ఏది?
1) బొగ్గు 2) ఎల్పీజీ
3) కొవ్వొత్తి 4) కిరోసిన్
17. దహన శీల (మండే స్వభావం గల) వాయువులేవి?
1) హైడ్రోజన్ 2) కార్బన్ మోనాక్సైడ్
3) మీథేన్ 4) అన్నీ
18. సిలిండర్లోని వంటగ్యాస్‌ను గ్యాస్ ఏజెన్సీవారు ఏ స్థితిలో సరఫరా చేస్తారు?
1) ద్రవ స్థితి 2) వాయు స్థితి
3) ఘన స్థితి 4) కరిగిన స్థితి
19. పసుపు రంగుల్లో ప్రకాశవంతంగా మంటనిచ్చేది ఏది?
1) మైనం 2) ఎల్పీజీ
3) బొగ్గు 4) కిరోసిన్
20. పెట్రోలియం బావుల అగ్ని ప్రమాదాలను ఆర్పేది?
1) కార్బన్ డై ఆక్సైడ్
2) నీరు 3) ఇసుక
4) సోడియం బై కార్బోనేట్
21. పొడిమంచులను రసాయనికంగా?
1) శుద్దజలంతో తయారైన మంచు
2) ఘన కార్బన్ డై ఆక్సైడ్
3) ఘన సల్ఫర్ డై ఆక్సైడ్
4) ఉపశూన్య ఉష్ణోగ్రత వద్ద గల మంచు
22. గ్యాసోలిన్ అని దేనికి పేరు?
1) ఆల్కహాల్ 2) పెట్రోల్
3) కిరోసిన్ 4) ఎల్పీజీ
23. జతపరచండి?
పట్టిక-1 పట్టిక -2
ఎ) గోబర్ గ్యాస్, సీఎన్జీ 1) మీథేన్
బి) ఎల్పీజీ 2) బ్యూటేన్
సి) వాటర్ గ్యాస్ 3) ఎసిటలీన్+ఆక్సిజన్
డి) గ్యాస్ వెల్డింగ్ 4) కార్బన్ మోనాక్సైడ్ + హైడ్రోజన్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-1, బి-2, సి-4, డి-3
24. గ్యాసోహాల్ అంటే
1) పెట్రోల్ + ఆల్క్‌హాల్ మిశ్రమం
2) పెట్రోల్ + కిరోసిన్
3) ఎల్పీజీ + పెట్రోల్
4) ఎల్పీజీ + సీఎన్జీ
25. పెట్రోల్‌కు బహుళ కాలుష్యం లేని ప్రత్యామ్నాయ వాయు ఇంధనం ఏది?
1) బ్యూటేన్ 2) ఈథేన్
3) ఎసిటలీన్ 4) ఇథిలీన్
26. కింది ఇంధనాల్లో అత్యధిక కెలోరిఫిక్ విలువ గలది?
1) ఎల్పీజీ 2) పెట్రోల్
3) సీఎన్జీ 4) హైడ్రోజన్
27. హైడ్రోజన్ ఇంధన వాహనాలు విడుదల చేసే విసర్జితంలో ఉండేది?
1) CO2 2) H2O
3) NH3 4) H2O2
28. అగ్గిపుల్లకు ఉండే పదార్థాలు?
1) యాంటిమొనీ ట్రై సల్ఫైడ్
2) పొటాషియం క్లోరైట్
3) స్టార్చ్ 4) అన్నీ
29. సూర్యుడిలోని ఇంధనం
1) హైడ్రోజన్ 2) ఆక్సిజన్
3) మీథేన్ 4) బయోగ్యాస్
30. జంతువు రబ్బరును గట్టి పరచడానికి ఉపయోగించే పదార్థం?
1) పాలిథీన్ 2) స్పాంజీ
3) సల్ఫర్ 4) క్లోరిన్
31. కోల్‌గ్యాస్, బయోగ్యాస్, సహజ వాయువు (సీఎన్జీ)లలో ఉండే ప్రధాన వాయువు?
1) మీథేన్ 2) హైడ్రోజన్
3) బ్య్యూటేన్ 4) ఎసిటలీన్
32. భూతాపానికి (గ్రీన్ హౌజ్ ప్రభావం) ప్రధాన కారణం?
1) వాహనాలు విడుదల చేసే నైట్రోజన్ ఆక్సైడ్లు
2) బొగ్గును మండించడం వల్ల విడుదలయ్యే సల్ఫర్ డై ఆక్సైడ్
3) ఇంధనాలు మండటం వల్ల విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్
4) ఏదీకాదు
33. గాలి లేకుండా (అనరోబిక్) బయోగ్యాస్ ప్లాంట్ల నుంచి విడుదలయ్యే మండే స్వభావం గల వాయువులేవి?
1) మీథేన్ 2) కార్బన్ మోనాక్సైడ్
3) హైడ్రోజన్ 4) 1, 2
34. కంది వాటిలో ఘన ఇంధనం?
1) నేలబొగ్గు 2) పెట్రోల్
3) ఎల్పీజీ 4) సీఎన్జీ
35. జీఎస్ఎల్వీ రాకెట్లో ఉపయోగించే క్రయోజెనిక్ ద్రవహైడ్రోజన్, ద్రవ ఆక్సిజన్ ఉష్ణోగ్రతలు వరుసగా?
1) -235oC-183oC
2) -183oC-253oC
3) -253oC (రెండూ)
4) -183oC (రెండూ)
36. బొగ్గు గనుల్లో మంటలతోపాటు పేలుళ్ళకు కారణమైన వాయువు?
1) హైడ్రోజన్ 2) మీథేన్
3) ఎసిటలీన్
4) కార్బన్ మోనాక్సైడ్
37. పెట్రోలియం నుంచి వివిధ అనుఘటకాలను వేరు చేసే పద్ధతి?
1) స్వేదనం 2) అంశిక స్వేదనం
3) స్ఫటికీకరణం 4) వేడి చేయడం
38. ….వంటి పదార్థాలు మండినపుడు ఆర్పడానికి నీటిని ఉపయోగించకూడదు?
1) కిరోసిన్ 2) పెట్రోల్
3) విద్యుత్ పరికరాలు
4) పైవన్నీ
39. అగ్గిపెట్టెకు ఉండే పదార్థాలు?
1) గాజుపొడి 2) ఎర్ర భాస్వరం
3) తెల్ల భాస్వరం 4) 1, 2
40. ప్రొడ్యూసర్ వాయువు రసాయనికంగా?
1) CO+H2
2) CO+H2O+N2
3) CO2+N2
4) CO+H3
41. శ్రేష్ఠమైన ఇంధనం ఏది?
1) బొగ్గు 2) కలప
3) బయోగ్యాస్ 4) చార్కోల్
42. కింది వాటిలో దహనశీల పదార్థం?
1) నేలబొగ్గు 2) లోహాలు
3) గాజు 4) సిరామిక్స్
43. గోబర్ గ్యాస్ ప్రధానంగా కలిగి ఉండేది ?
1) కార్బన్ డై ఆక్సైడ్ 2) మీథేన్
3) ఎసిటిలిక్ 4) ఇథిలీన్
44. భారీ మోటారు వాహనాలకు డీజిల్ ఇంధనంగా వాడటానికి కారణం?
1) తక్కువ రేటు
2) అధిక లభ్యత, తక్కువ కాలుష్యం
3) అధిక సామర్థ్యంతోపాటు ఎక్కువ మైలేజ్
4) ఇంజిన్‌కు తక్కువ నష్టం కలుగజేస్తుంది
45. కింది వాటిలో సిలికాన్ కలిగి ఉండేది?
1) బొగ్గు (కోత) 2) ఇసుక
3) సున్నపు రాయి 4) లవణం (సాల్ట్)
46. దహనంను రసాయనికంగా ఏమంటారు?
1) క్షయకరణం 2) ఆక్సీకరణం
3) ఇంధనం 4) ఏవీకావు
47. జీఎస్ఎల్వీ మూడో దశలో ఉపయోగించే క్రయోజనిక్ ఇంజిన్‌లో ఉపయోగించే ఇంధనం?
1) ద్రవ హైడ్రోజన్, ద్రవ ఆక్సిజన్
2) యురేనియం -235
3) ప్లుటోనియం -239
4) ఎల్పీజీ
48. పారిశ్రామికంగా బాక్సైట్ నుంచి అల్యూమినియం లోహాన్ని ఏ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు?
1) సూక్ష్మ స్ఫటీకరణం
2) అంశిక స్వేదనం
3) విద్యుత్ విశ్లేషణం 4) క్షయ కరణం
49. విషరహితమైన సంప్రదాయేతర జీవ ఇంధనం?
1) పెట్రోల్ 2) బయో డీజిల్
3) డీజిల్ 4) కిరోసిన్
50. కిందివాటిలో ఏది శిలాజ ఇంధనం కాదు?
1) పెట్రోల్ 2) కోక్
3) చార్కోల్ 4) డీజిల్
జవాబులు
1-3 2-3 3-2 4-4
5-1 6-4 7-4 8-3
9-4 10-1 11-4 12-4
13-2 14-2 15-2 16-2
17-4 18-1 19-1 20-3
21-2 22-2 23-4 24-1
25-1 26-4 27-2 28-4
29-1 30-3 31-1 32-3
33. 4 34-1 35-1 36-2
37-2 38-4 39-4 40-2
41-3 42-1 43-2 44-3
45-2 46-2 47-1 48-3
49-2 50-3
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు