Indian History | 1921లో మోప్లా తిరుగుబాటు ఎక్కడ జరిగింది?
31. గాంధీ తన సత్యాగ్రహ విధానాన్ని నిష్క్రియాత్మక ప్రతిఘటన నుంచి ప్రత్యేకించారు. అలాంటి ప్రత్యేకతకు సంబంధించి, వాస్తవం కానిది/వి ఏది/వి?
ఎ. నిష్క్రియాత్మక ప్రతిఘటన అనేది తొందరపాటు చర్య కాగా సత్యాగ్రహం అనేది శారీరక శక్తి మీద ఆత్మశక్తి ఆధిక్యత మీద ఆధారపడిన నైతిక సాధనం అవుతుంది.
బి. మొదటిది బలహీనుల ఆయుధం కాగా, రెండోది ధైర్యవంతుల ఆయుధం.
సి. మొదటిది స్థిరమైనది, రెండోది గతిశీలమైనది.
డి. మొదటిది వ్యతిరేక దృక్పథం కాగా రెండోది సానుకూల దృక్పథం కలది.
ఇ. మొదటిది ప్రేమ, సహనం ద్వారా శత్రువును లొంగతీసుకోవడం రెండోది శత్రువును సంకట పరిస్థితిలో పెట్టేది.
1) బి, సి 2) ఇ
3) బి, ఇ 4) బి
32. కింది వాటిని పరిశీలించి సరైన జవాబును ఎంపిక చేయండి.
ఎ. సహాయ నిరాకరణోద్యమం భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలను స్వాతంత్య్ర సమరంలోకి తీసుకొచ్చింది.
బి. చౌరీ-చౌరాలో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది.
1) ఎ సరైంది 2) బి సరైంది
3) ఎ, బి రెండూ సరైనవి
4) ఎ, బి సరైనవి కావు
33. సత్యాగ్రహ విధానంలో వివిధ పద్ధతులున్నాయి. కింది పద్ధతుల్లో గాంధీజీ చేర్చనివి ఏవి?
ఎ. నిరాహార దీక్ష బి. హిజ్రత్
సి. స్కార్చడ్-ఎర్త్ విధానం
డి. సమ్మెలు, హర్తాళ్లు
ఇ. అజ్ఞాతవాస కార్యకలాపాలు
పై వాక్యాల నుంచి సరైన సమాధానం ఎంచుకోండి.
1) సి, ఇ 2) సి 3) ఇ 4) డి, ఇ
34. మహాత్మాగాంధీని ‘నగ్న ఫకీర్’ అని అన్నది ఎవరు?
1) అట్లీ 2) క్రిప్స్
3) చర్చిల్ 4) వేవెల్
35. సరిహద్దు గాంధీగా పిలువబడినవారు?
1) ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్
2) మహాత్మా గాంధీ
3) తిలక్ 4) మహ్మద్ అలీఖాన్
36. కిందివాటిలో గాంధీ-ఇర్విన్ ఒడంబడికలో చేర్చని క్లాజులు ఏవి?
ఎ. ఆర్డినెన్స్‌లను, నేర విచారణలను ఉపసంహరించుకోవడం
బి. అన్నిరకాల రాజకీయ ఖైదీలను విడుదల చేయడం
సి. సత్యాగ్రహాల నుంచి స్వాధీనం చేసుకొన్న ఆస్తిని తిరిగి ఇచ్చేయడం
డి. మద్యం, నల్లమందు, విదేశీ బట్టల దుకాణాల దగ్గర శాంతియుతంగా నిరసన ప్రకటించడం
ఇ. ఉప్పు సేకరించడానికి, తయారు చేసుకోవడానికి సుంకం లేకుండా భారతీయులందరికీ అనుమతించడం
1) బి 2) ఎ, బి
3) బి, డి 4) ఎ
37. బ్రిటిష్ ప్రభుత్వం ‘ఆగస్టు ఆఫర్’ ఏ సంవత్సరంలో జారీ చేసింది?
1) 1942 2) 1941
3) 1940 4) 1947
38. 1947లో హైదరాబాద్‌లో ప్రభుత్వం ఏజెంట్ జనరల్‌గా ఎవరిని నియమించింది?
1) సి.రాజగోపాలచారి
2) జె.ఎన్.చౌదరి
3) ఎమ్.కె.వెల్లోడి 4) కె.ఎం.మున్షీ
39. ‘నేను సామ్యవాదిని’ అని చెప్పిన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడెవరు?
1) జవహర్లాల్ నెహ్రూ
2) మోతీలాల్ నెహ్రూ
3) సుభాష్ చంద్రబోస్
4) ఎం.ఎన్.రాయ్
40. జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో రెండోసారి చీలిపోయింది?
1) 1922 2) 1930
3) 1916 4) 1942
41. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి ముస్లిం నాయకుడు ఎవరు?
1) సర్సయ్యద్ అహ్మద్ ఖాన్
2) బద్రుద్దీన్ త్యాబ్జీ
3) మోయిన్ హరాసత్
4) మౌలానా అబుల్ కలాం ఆజాద్
42. భారత స్వాతంత్రోద్యమ కాలంలో ‘ఆగస్టు తిరుగుబాటు’ అనేది కింది వాటిలో దేనికి సంబంధించినది?
1) స్వదేశీ ఉద్యమం
2) ఖిలాఫత్ ఉద్యమం
3) క్విట్ ఇండియా ఉద్యమం
4) బర్దోలీ సత్యాగ్రహం
43. 1921లో మోప్లా తిరుగుబాటు ఎక్కడ జరిగింది?
1) మలబార్ 2) మరాఠ్వాడా
3) విదర్భ 4) తెలంగాణ
44. భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో గాంధీజీ అధ్యక్షుడయ్యారు?
1) 1923 కాకినాడ సమావేశం
2) 1925 కాన్పూర్ సమావేశం
3) 1924 బెల్గామ్ సమావేశం
4) 1926 గౌహతి సమావేశం
45. 1946లో ‘ఇండియన్ నేవీ’ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది?
1) కలకత్తా 2) మద్రాస్
3) విశాఖపట్నం 4) బొంబాయి
46. రవీంద్రనాథ్ ఠాగూర్‌కు నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో లభించింది?
1) 1910 2) 1917
3) 1913 4) 1916
47. మహాత్మాగాంధీకి రాజకీయ గురువు ఎవరు?
1) గోఖలే 2) దాదాభాయ్ నౌరోజీ
3) రనడే 4) ఎ.వొ. హ్యూమ్
48. 1919 జలియన్ వాలా బాగ్ ఊచకోతకు నిరసనగా బ్రిటిష్ ప్రభుత్వం తనకు ప్రసాదించిన నైట్‌హుడ్ బిరుదును త్యజించినవారు ఎవరు?
1) గాంధీ 2) రవీంద్రనాథ్ ఠాగూర్
3) తిలక్ 4) చిత్తరంజన్ దాస్
49. మహాత్మాగాంధీ ప్రెసిడెంటుగా వ్యవహరించిన ఏకైక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది?
1) కరాచీ 2) నాగపూర్
3) బెల్గామ్ 4) హైదరాబాద్
50. 1928లో బర్దోలి సత్యాగ్రహ ఉద్యమం నడిపించిన నాయకుడు ఎవరు?
1) పటేల్ 2) గాంధీ
3) లాలా లజపతిరాయ్ 4) నెహ్రూ
సమాధానాలు
31. 2 32. 3 33. 1 34. 3
35. 1 36. 3 37. 3 38. 4
39. 1 40. 1 41. 2 42. 3
43. 1 44. 3 45. 4 46. 3
47. 1 48. 2 49. 3 50. 1
1. వితంతు వివాహాన్ని అధికంగా ప్రోత్సహించిన సంఘ సంస్కరణవాది ఎవరు?
1) వినాయక్ దామోదర్ సావర్కర్
2) ఈశ్వర చంద్ర విద్యాసాగర్
3) రాజా రామ్మోహనరాయ్
4) బరీంద్ర కుమార్ ఘోష్
2. రాజా రామ్మోహన్రాయ్ గురించి కింద ఇచ్చిన స్టేట్మెంట్లలో సరైనవి ఏవి?
ఎ. క్రైస్తవమతం మీద ఈయన రచించిన గ్రంథం, జీసస్కు సంబంధించిన నైతిక, ఆధ్యాత్మిక భావనలకే కాకుండా అద్భుతాలను కూడా వివరించింది.
బి. అమాయకమైన క్రైస్తవమత ప్రచారకుల దాడుల నుంచి హిందూమతాన్ని, వేదాంత తత్వాన్ని పరిరక్షించాడు.
సి. తన బ్రహ్మసమాజ సమావేశాల్లో, బ్రాహ్మాణేతరులందరినీ వేద పఠనానికి అనుమతించాడు.
డి. ఇతర మతాల్లోని ఉత్తమ ప్రబోధాలను కూడా ఈయన పొందుపరిచారు.
1) ఎ, సి 2) బి, సి
3) సి, డి 4) ఎ, డి
3. రామకృష్ణ పరమహంస అసలు పేరు ఏమిటి?
1) గదాధరుడు 2) గంగాధరుడు
3) రామచటర్జీ 4) యుగంధరుడు
4. కింది జాబితాల్లో సరైన జతలను సూచించే సంకేతం ఏది?
ఎ. దయానంద సరస్వతి 1. తులసీరామ్
బి. రామకృష్ణ పరమహంస 2. మూల శంకర్
సి. స్వామి వివేకానంద 3. గదోదర్ ఛటోపాధ్యాయ
డి. శివదయాళ్ సాహెబ్ 4. నరేంద్రనాథ్ దత్తా
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి, 1-, సి-2, డి-4
5. కింది వాటిని జతపరచండి.
ఎ. శంకరాచార్యులు 1. వైష్ణవ మతం
బి. మద్వాచార్యులు 2. అద్వైత మతం
సి. రామానుజాచార్యులు 3. ద్వైతం
డి. వల్లభాచార్యులు 4. విశిష్టాద్వైతం
ఇ. రామానందుడు 5. శుద్ధ్దాద్వైతం
1) ఎ-2, బి-3, సి-4, డి-5, ఇ-1
2) ఎ-3, బి-4, సి-1, డి-5, ఇ-2
3) ఎ-4, బి-3, సి-2, డి-1, ఇ-5
4) ఎ-2, బి-5, సి-4, డి-3, ఇ-1
6. ఆంధ్రలో పునర్వికాస ఉద్యమ పితామహుడు?
1) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
2) టి. ప్రకాశం
3) గాడిచర్ల హరిసర్వోత్తమ రావు
4) కందుకూరి వీరేశలింగం
7. సతీ నిషేధంపై చట్టం ఎప్పుడు చేశారు?
1) 1829, డిసెంబర్ 4
2) 1829, డిసెంబర్ 3
3) 1829, డిసెంబర్ 2
4) 1829, డిసెంబర్ 1
8. కింది వారిలో వితంతువుల బడి ‘శారద సదన్’ ను ప్రారంభించిందెవరు?
1) కందుకూరి వీరేశలింగం
2) పండిత రమాబాయి
3) డి.కె.కార్వే
4) సావిత్రిబాయి ఫులె
9. మూల శంకర్ ఎవరి అసలు పేరు?
1) స్వామి వివేకానంద
2) పండిత నరేంద్రజీ
3) స్వామి దయానంద సరస్వతి
4) రామకృష్ణ పరమహంస
10. సాధారణ బ్రహ్మ సమాజ్ను ప్రారంభించింది ఎవరు?
1) ఆనంద్ మోహన్ బోస్
2) కేశవ్ చంద్ర సేన్
3) రాజారామ్మోహన్ రాయ్
4) ఎంజీ రనడే
11. కింది వాటిని జతపరచండి.
ఎ. అలీఘర్ ఉద్యమం 1. మహ్మద్ ఖాసీం
బి. వహాబీ ఉద్యమం 2. గులాం అహమ్మద్
సి. అహ్మదీయ ఉద్యమం 3. సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్
డి. దియోబంద్ ఉద్యమం 4. సయ్యద్ అహమ్మద్ రాయబరేల్వి
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-3, బి-4, సి-2, డి-1
12. కింది అసోసియేషన్ల స్థాపనలకు సంబంధించిన చారిత్రక క్రమం ఏమిటి?
ఎ. ఆర్య సమాజం
బి. తత్వబోధిని సభ
సి. ప్రార్థన సమాజం
డి. రామకృష్ణ మిషన్
ఇ. దక్కన్ విద్యా సమాజం
ఎఫ్. భారత జాతీయ సామాజిక సదస్సు
1) సి, డి, బి, ఎ, ఇ, ఎఫ్
2) బి, ఇ, డి, ఎఫ్, ఎ, సి
3) ఇ, డి, బి, ఎ, సి, ఎఫ్
4) బి, సి, ఎ, ఇ, ఎఫ్, డి
13. తూర్పు ఇండియా గుత్త వ్యాపారాన్ని అంతమొందించిన చట్టం ఏది?
1) 1853 చట్టం
2) 1813 చట్టం
3) 1858 చట్టం 4) 1833 చట్టం
14. కింది వాటిలో 1856లో బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించిన చట్టం ఏది?
ఎ. హిందూ వితంతు పునర్వివాహ చట్టం
బి. సతీసహగమన నిషేధ చట్టం
సి. మత అసమానతల చట్టం
డి. సామాన్య సేవా నియుక్త చట్టం సరైన దాన్ని గుర్తించండి?
1) ఎ, సి 2) బి, డి
3) ఎ, డి 4) ఎ, బి, సి
15. జ్యోతిబా ఫులె అసలు పేరు?
1) జ్యోతిరావు మహర్
2) జ్యోతిరావు షిండే
3) జ్యోతిరావు ప్రధాన్
4) జ్యోతిరావు ఫులె
16. కింది చట్టాల్లో బ్రిటిష్ ప్రభుత్వం 1856లో ఆమోదించిన చట్టాలు ఏవి?
ఎ. హిందూ వితంతు పునర్వివాహ చట్టం
బి. సతీసహగమన నిషేధం (రెగ్యులేషన్ XVII)
సి. మత పరివర్తన హక్కుల చట్టం
డి. సాధారణ సేవల జాబితా చట్టం
సరైన సమాధానం ఎంచుకోండి?
1) ఎ, సి 2) బి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి
17. జ్యోతిరావు ఫులె నెలకొల్పిన సుప్రసిద్ధ సంస్థ?
1) సత్యశోధక్ సమాజం
2) సత్యపరివర్తన సమాజం
3) సత్యకర్తవ్య సమాజం
4) సత్యరక్షణ సమితి
18. ఒకే జాతి, ఒకే దైవం, ఒకే మతం అందరికీ అని బోధించినది?
1) భాగ్యరెడ్డి వర్మ
2) నారాయణగురు
3) జ్యోతిరావు ఫులె
4) అనీబీసెంట్
19. భారత స్వాతంత్రోద్యమ ఘట్టం నుంచి కింది అంశాలను నిర్ధారించండి.
ఎ. వీరేశలింగం పంతులు కృష్ణాపత్రికను స్థాపించారు.
బి. కృష్ణాపత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు.
1) ఎ 2) బి 3) ఎ, బి
4) ఎ, బి రెండూ కాదు
20. బ్రహ్మసమాజం ఏ రాష్ట్రంలో ఎక్కువగా ప్రభావం చూపింది?
1) బెంగాల్ 2) మహారాష్ట్ర
3) బొంబాయి 4) ఒడిశా
సమాధానాలు
1. 2 2. 1 3. 1 4. 2
5. 1 6. 4 7. 1 8. 2
9. 1 10. 2 11. 4 12. 4
13. 4 14. 3 15. 4 16. 3
17. 1 18. 2 19. 2 20. 2
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు