Telangana History | ఏ శాసనంలో విద్యామండపాల ప్రసక్తి ఉంది?
59. శాతవాహనుల కాలం నాటి శాసనాల ప్రకారం వివిధ వృత్తి పని చేసేవారిని సరిగా జతపర్చండి?
ఎ. హాలిక 1. వ్యవసాయదారులు
బి. గధిక 2. సువాసన ద్రవ్యాలు తయారు చేసేవారు
సి. ధన్నిక 3. ధాన్య వర్తకులు
డి. తిలపిసక 4. వెదురు పనివారు
ఇ. వసకర 5. గానుగ పట్టేవారు
1) ఎ-1, బి-2, సి-3, డి-5, ఇ-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1, ఇ-5
3) ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1
4) ఎ-3, బి-4, సి-2, డి-1, ఇ-5
60. కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. శాతవాహనుల కాలంలో బానిస వ్యవస్థ ఉండేది
బి. గుణాఢ్యుని బృహత్కథలో అనేక సందర్భాల్లో బానిస వ్యాపారం ప్రస్తావన ఉంది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
61. కింది ఏ కవి, తాను రాసిన గ్రంథానికి శాతవాహన రాజు ఆదరణ లేదని బాధతో తన గ్రంథంలోని పత్రాలను ఒకటి తర్వాత ఒకటి అగ్నికి ఆహుతి చేస్తుండగా, అది తెలిసిన శాతవాహన రాజు అక్కడకు వెళ్లి ఆపాడని, మిగిలిన ఆ గ్రంథంలోని కొన్ని పత్రాలు మాత్రమే లభిస్తున్నాయని చరిత్రకారులు పేర్కొంటారు?
1) గుణాఢ్యుని బృహత్కథ
2) సోమదేవసూరి కథాసరిత్సాగరం
3) క్షేమేంద్రుని బృహత్కథామంజరి
4) శర్వవర్మ కాతంత్రవ్యాకరణం
62. కింది వాటిలో సరిగా జతపరిచినవి గుర్తించండి?
కవి గ్రంథం
ఎ. ఆర్యదేవుడు- చిత్తశుద్ధి ప్రకరణ
బి. భావవివేకుడు- ప్రజ్ఞాప్రదీప
సి. బుద్ధఘోషుడు- విశుద్ధిమగ్గ
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) బి, సి 4) ఎ, సి
63. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. ఇక్ష్వాకుల కాలంలో తాత పేరు పెట్టుకునే సంప్రదాయం ప్రారంభమైంది
బి. వీరి కాలంలోనే హైందవ దేవాలయాల నిర్మాణం ప్రారంభమైంది
1) ఎ, బి 2) ఎ
3) బి 4) ఏదీకాదు
64. కింది ఎవరి కాలంలో వత్సగుల్మ ప్రముఖ విద్య, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లింది?
1) శాతవాహనులు 2) ఇక్ష్వాకులు
3) వాకాటకులు 4) విష్ణుకుండినులు
65. విష్ణుకుండినుల నాటి శాసనాలు, అవి లభించిన ప్రాంతాలను జతపర్చండి?
ఎ. తుమ్మలగూడెం రాగి శాసనం 1. నల్లగొండ జిల్లా
బి. చైతన్యపురి శిలాశాసనం 2. హైదరాబాద్
సి. కీసరగుట్ట శిలా శాసనం 3. రంగారెడ్డి జిల్లా
డి. సలేశ్వరం శిలాశాసనం 4. అమ్రాబాద్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-4, బి-2, సి-3, డి-1
66. కింది కాకతీయుల కాలం నాటి శాసనాలు, వాటిని వేయించిన రాజులు/అధికారులను జతపర్చండి?
ఎ. బయ్యారం శాసనం 1. కాకతి మైలాంబ
బి. చందుపట్ల శాసనం 2. పువ్వుల ముమ్మడి
సి. మల్కాపురం శాసనం 3. గణపతిదేవుడు
డి. మోటుపల్లి అభయ శాసనం 4. దానార్ణవుడు
1) ఎ-1, బి-2, సి-3, డి-3
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-1, సి-3, డి-3
4) ఎ-4, బి-3, సి-2, డి-1
67. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. అనుమకొండ వేయిస్తంభాల గుడి శాసనం రుద్రదేవుడు క్రీ.శ. 1063లో స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడని తెలియజేస్తుంది?
బి. చందుపట్ల శాసనం రుద్రమదేవి అంబదేవుని తిరుగుబాటు అణచే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిందని, ఆమెకు పుణ్యం లభించాలని స్థానిక సోమనాథుని గుడికి ఆమె బంటు పువ్వుల ముమ్మడి భూదానం చేశాడని తెలుపుతుంది
సి. మల్కాపురం శాసనంలో విద్యామండపాల ప్రసక్తి ఉంది
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, సి 4) బి, సి
68. కింది కాకతీయుల కాలం నాటి గ్రంథాలు, అవి తెలిపే వివరాల గురించి సరైన వాటిని జతపర్చండి?
ఎ. పండితారాధ్య చరిత్ర 1. కాకతీయుల కాలం నాటి శైవ, ఇతర మతాల వివరాలు తెలుపుతుంది
బి. శివయోగసారం 2. రాజనీతిని, రాజధర్మ స్వరూపాన్ని వివరిస్తుంది
సి. క్రీడాభిరామం 3. వరంగల్ కోటలోని ప్రజల జీవన పరిస్థితుల వర్ణన
డి. నీతిశాస్త్ర ముక్తావళి 4. గణపతిదేవుని కొలువులో ఉన్న ఇందలూరి నాయకుల చరిత్ర
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-1, బి-4, సి-3, డి-2
3) ఎ-4, బి-3, సి-2, డి-1 4) ఎ-1, బి-3, సి-2, డి-4
70. కింది కాకతీయ రాజుల సరైన క్రమాన్ని గుర్తించండి?
ఎ. మొదటి ప్రోలరాజు
బి. మొదటి బేతరాజు
సి. రెండో ప్రోలరాజు
డి. రెండో బేతరాజు
1) బి, ఎ, డి, సి 2) ఎ, బి, సి, డి
3) సి, డి, బి, ఎ 4) ఏదీకాదు
71. కాకతీయుల కాలం నాటి చెరువులు, వాటిని నిర్మించిన వ్యక్తులను జతపర్చండి?
ఎ. సెట్టికెరెయ చెరువు 1. 2వ బేతరాజు
బి. కుంద సముద్రం 2. కుందమాంబ
సి. పాకాల చెరువు 3. జగదల ముమ్మడి
డి. రామప్ప చెరువు 4. రేచర్ల రుద్రుడు
5. గణపతి దేవుడు
1) ఎ-1, బి-2, సి-3, డి-5
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-5, బి-4, సి-3, డి-2
72. కాకతీయుల కాలం నాటి పన్నులకు సంబంధించి సరిగా జతపర్చండి?
ఎ. కిళరము 1. ఉప్పు సంచులపై పన్ను
బి. అలము 2. గొర్రెల మందపై పన్ను
సి. ముదార 3. కూరగాయలపై పన్ను
డి. మడిగ సుంకం 4. దుకాణాలపై
5. మోట బావిపై
1) ఎ-2, బి-3, సి-1, డి-4
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-2, బి-1, సి-3, డి-4
73. కాకతీయుల వాస్తు-శిల్పకళ ప్రధాన లక్షణాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి?
ఎ. ఎత్తయిన అధిష్ఠానం
బి. తోరణ స్తంభాలు
సి. ఎత్తయిన విమానం
డి. రంగమండపాలు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
74. కాకతీయ రాజు గణపతి దేవుని గజసాహిణి అయిన జాయప సేనాని రాసిన గ్రంథాలను గుర్తించండి?
ఎ. నృత్య రత్నావళి బి. వాద్య రత్నావళి
సి. గీత రత్నావళి డి. సంగీత రత్నావళి
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
75. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. నాగనాథుడు సంస్కృత భాషలో మదన విలాస బాణం అనే నాటకాన్ని రచించాడు
బి. విశ్వేశ్వరుడు ‘చమత్కార చంద్రిక’ అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు
సి. శాకల్యమల్లుభట్టు నిరోష్ట్య రామాయణం, ఉదార రాఘవం అనే కావ్యాలు రచించాడు
1) ఎ, బి 2) ఎ, బి, సి 3) ఎ, సి
76. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. వెలమ నాయకుల ఆస్థానంలోని గౌరన ‘నవనాథ చరిత్ర’ అనే ద్విపద కావ్యం రాశాడు
బి. ఇదే కాలానికి చెందిన కొరవి గోపరాజు తెలుగులో ‘సింహాసన ద్వాత్రింశిక అనే కావ్యాన్ని రాశాడు
సి. పోతన సర్వజ్ఞ సింగమ భూపాలుడి ప్రియురాలిపై రాసిన శృంగార గ్రంథ- భోగినీ దండకం
డి. పోతన తాను రాసిన ‘భాగవతం’ను సర్వజ్ఞ సింగన తనకు అంకితం చేయమంటే, ఇవ్వనని నిర్భయంగా ప్రకటించి ‘శ్రీరాముని’కి అంకితమిచ్చాడు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
77. ఈ నగరం నిజంగా భూతల స్వర్గం, ఇక్కడ దొరకని వస్తువంటూ లేదు, ముసలితనంలో ఉన్న వృద్ధుడు ఈ పట్టణానికి వస్తే అతడు తన యవ్వనం తిరిగి పొందుతాడు. హైదరాబాద్ నగరంలో మంచితనానికి కొదువలేదు. అదృష్టం ఇక్కడే స్థిరపడింది. దుఃఖం, బాధలు ఇక్కడికి చేరవు అనే ఈ వాక్యాలు కింది ఏ గ్రంథంలో మనం చూడవచ్చు?
1) రిసాలా-ఇ-మిక్దరీయ
2) బసాతిన్-ఉల్-సలాతిన్
3) తారిఖ్-ఇ-కుతుబ్‌షాహీ
4) ఏదీకాదు
78. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. కుతుబ్ షాహీల కాలంలో కులవ్యవస్థ, సతీసహగమనం మొదలైన దురాచారాలు ఉండేవని తెలుస్తుంది
బి. కుతుబ్ షాహీ సుల్తానులు స్థానిక ప్రజల సామాజిక, మత విశ్వాసాల్లో, ఆచారాల్లో జోక్యం చేసుకోలేదని తెలుస్తుంది
1) ఎ, బి 2) ఎ 3) బి 4) ఏదీకాదు
79. కింది ఏ కట్టడం గురించి ప్రస్తావిస్తూ, దీన్ని పూర్తి చేయడానికి ఎనిమిదివేల మంది తాపీ మేస్త్రీలు, రెండు వేల మంది రాతి పనివారు, నాలుగు వేల మంది కూలీలు పని చేశారని, అలాగే ఈ కట్టడంలోని ఏకశిలా నిర్మాణాన్ని దాని స్థానంలో ఉంచడానికి ఆరువేల మంది కూలీలు, 1400 ఎడ్లను కట్టిన ప్రత్యేక చక్రాలున్న బండిని వినియోగించారని ‘ట్రావెర్నియర్’ పేర్కొన్నాడు?
1) గోల్కొండ కోట 2) మక్కా మసీదు
3) పురానాపూల్ 4) ఏదీకాదు
80. తెలుగులో లభించిన 1870 నాటి ఒక జానపద గీతంలో అతని తల్లిని ఉద్దేశించి ‘తాటి చెట్లకు కల్లుకుండలు కట్టడం, దించడం, వాటిలో వాటా పొందుడు నాకు రుచించవు, నా హస్తం గోల్కొండ కోట గోడపై పడాలి’ అని సర్వాయి పాపన్న వీరత్వాన్ని, నాయకత్వాన్ని ప్రస్తావించిన కింది గ్రంథాన్ని గుర్తించండి?
1) ఏ సోషల్ హిస్టరీ ఆఫ్ ది దక్కన్
2) ముంతకాబ్-ఉల్-లుబబ్
3) ఏ సోషల్ హిస్టరీ ఆఫ్ హైదరాబాద్
4) ఏదీకాదు
81. మహాలఖా చందాబాయి గురించి కింద తెలిపిన వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. నిజాం ఆస్థాన నర్తకి, అత్యున్నత ‘ఉమ్రావ్’ పదవి పొందిన మహిళ
బి. ఉర్దూలో ఆమె రాసిన 125 గజల్స్ లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి
సి. ఆమె కవిత్వాలు, ఆమె మరణం తర్వాత ‘గుల్జార్-ఎ-మహాలఖ’ పేరుతో ప్రచురితమయ్యాయి
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) బి, సి 4) ఎ, సి
82. కింది వాక్యాలు ఎవరికి సంబంధించినవి?
ఎ. 1920లో హైదరాబాద్ టెక్ట్స్‌బుక్ కమిటీ గౌరవ సభ్యురాలిగా ఎన్నికయ్యారు
బి. 1923లో ఇంటర్నేషనల్ కాంగ్రెస్ మోరల్ ఎడ్యుకేషన్ (లండన్) భారత శాఖకు గౌరవ సభ్యురాలిగా ఎన్నికయ్యారు
సి. 1908లో మూసీ నది వరదల సమయంలో బాధితులకు నిధులు సేకరించారు
1) సుఘ్రా హుమాయున్ మీర్జా
2) తయ్యబా బేగం సాహిబా
3) సరోజిని నాయుడు 4) ఎవరూకాదు
83. వెట్టి గురించి పేర్కొన్న కింది గ్రంథాలను గుర్తించండి?
ఎ. ప్రజల మనిషి బి. గంగు
సి. చిల్లరదేవుళ్లు
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) బి, సి 4) ఎ, సి
84. కింది పరిశ్రమలు, అవి స్థాపించిన సంవత్సరాలకు సంబంధించి సరైన జతలను గుర్తించండి?
ఎ. చార్మినార్ సిగరెట్ పరిశ్రమ- 1925
బి. వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ- 1930
సి. కార్ఖానా జిందాతిలిస్మాత్- 1920
డి. ఆల్విన్ మెటల్ వర్క్స్- 1942
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
85. డీబీఆర్ మిల్లును 1920లో హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లో స్థాపించారు. ఇది బయట నుంచి తెచ్చిన ముడిసరుకులతో బట్టలు తయారు చేసే పరిశ్రమ. అయితే డీబీఆర్ అంటే?
1) దివాన్ బహదూర్ రాజగోపాల్
2) దివాన్ బహదూర్ రాంగోపాల్
3) దివాన్ బహదూర్ రాజేశ్వర్
4) ఏదీకాదు
86. కింది వాటిలో సరైనవి?
ఎ. 1846లో ఉస్మానియా మెడికల్ హైస్కూల్‌ను నిర్మించారు. 1927లో మెడికల్ కాలేజీగా మారింది
బి. ఎర్రగడ్డ మెంటల్ హెల్త్ హాస్పిటల్‌ను 1908లో నిర్మించారు.
సి. నిజామియా జనరల్ హాస్పిటల్‌ను 1938లో ఏడో నిజాం నిర్మించాడు. దీన్ని ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌గా పిలుస్తున్నారు
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) బి, సి 4) ఎ, సి
సమాధానాలు
59-1, 60-3, 61-1, 62-2,
63-1, 64-3, 65-1, 66-1, 67-2, 68-2, 69-1, 70-1, 71-2, 72-1, 73-3, 74-1, 75-2, 76-4, 77-3, 78-1, 79-2, 80-1, 81-2, 82-1, 83-2, 84-3, 85-2, 86-2.
గందె శ్రీనివాస్
విషయ నిపుణులు
Dream Warriors Academy
Youtube Channel
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు