ఎన్‌పీఎస్‌లో మొత్తం తీసుకోవచ్చు
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో మదుపు చేసిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం త్వరలో రాబోతున్నది. ఒకవేళ కార్పస్ రూ.5లక్షలకుపైగా ఉంటే పెన్షనర్లు ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు కొత్త ఆప్షన్‌ను తీసుకువచ్చే యోచనలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ఉన్నది. ప్రస్తుతం కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కొంతమందికి ఈ ప్రతిపాదన వరం కానుంది. ఎన్పీఎస్ అకౌంట్ నుంచి ప్రస్తుతం కేవలం రూ.2 లక్షల వరకే విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉన్నది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం 60 శాతం వరకు నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. 40 శాతం ప్రభుత్వ ఆమోదిత యాన్యుటీలలో మదుపు చేయాల్సి ఉంటుంది.
రెండు ఆప్షన్లు
ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ స్కీమ్‌లో రెండు ఆప్షన్లు ఉన్నాయి. టైర్-1 ఆప్షన్ అకౌంట్ పూర్తిగా పెన్షన్ అకౌంట్. టైర్-2 అకౌంట్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. ప్రస్తుతం యాన్యుటీలపై రాబ డి సగటు 5.5 శాతంగా ఉంది. ఎందులో అధిక రాబడి ఉంటే అందులోనే మదుపు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారు.
విత్‌డ్రాయల్ రూల్
కొన్ని పరిస్థితుల్లో మూడేండ్ల తర్వాత ఎన్పీఎస్ నుంచి నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే కంట్రిబ్యూషన్‌లో కేవలం 25 శాతం మొత్తాన్ని ప్రీ మెచ్యూరిటీ విత్‌డ్రాయల్ కింద అనుమతిస్తారు. పిల్లల ఉన్నత విద్య, పెండ్లి, కొత్త ఇంటి కొనుగోలు కోసం, వైద్య అవసరాల కోసం మాత్రం విత్‌డ్రాయల్‌కు అనుమతిస్తారు. మొత్తం ఎన్పీఎస్ కాలపరిమితిలో కేవలం మూడుసార్లు మాత్రమే పాక్షిక విత్‌డ్రాయల్‌కు అనుమతిస్తారు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఈ విత్డ్రాయల్స్పై పన్నుండదు.
క్రెడిట్ కార్డ్‌తో చెల్లింపు చేయవచ్చా?
ఎన్పీఎస్ చెల్లింపులు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌లతో జరపవచ్చు. కానీ ఎన్పీఎస్లాంటి రిటైర్మెంట్ ఇన్వెస్ట్‌మెంట్‌కు క్రెడిట్ కార్డుతో చెల్లించే ముందు ఒకసారి ఆలోచించండి. నిజానికి ఇన్వెస్ట్మెంట్ కూడా అప్పుచేసి చేయకూడదు. షేర్లు, మ్యూచువల్ ఫండ్ల వంటి మదుపు సాధనాలను ఎలాగైతే క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేయమో.. అలాగే ఎన్పీఎస్లను చేయొద్దు. బ్యాంకు అకౌంట్లో డబ్బు ఉన్నప్పుడు క్రెడిట్ కార్డుతో చెల్లించడం ఏమాత్రం సమంజసం కాదు. పైగా క్రెడిట్ కార్డ్ చెల్లింపుల్లో చార్జీలు ఎక్కువగా ఉంటాయి. నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లిస్తే 60 పైసలు లావాదేవీ చార్జీలు దానిపై 18 శాతం జీఎస్టి చెల్లించాలి. కానీ అదే క్రెడిట్ ద్వారా అయితే 0.9 శాతం లావాదేవీ చార్జీలతోపాటు 18 శాతం జీఎస్టీ అదనం. క్రెడిట్ కార్డ్ చెల్లింపులను వాయిదా వేస్తే పడే అదనపు చార్జీలు వడ్డీలు మరింత భారంగా మారతాయి. క్రెడిట్ కార్డ్ వ్యయాలపై వచ్చే పాయింట్ల విలువ ఇంత కన్నా ఎక్కువగా ఉంటేనే చెల్లించండి. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు లేకపోతే క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే చెల్లింపునకు కూడా పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. అయితే పన్ను మినహాయింపు కన్నా కూడా క్రెడిట్ కార్డ్ మీద చెల్లించే వడ్డీ చాలా ఎక్కువ. అది దాదాపుగా 40 శాతం పైగానే ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించే మొత్తాన్ని బిల్లు వచ్చిన వెంటనే చెల్లించగల విశ్వాసం మీకుంటేనే క్రెడిట్ కార్డ్ చెల్లింపు సరైనది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు