ఎస్ఐపీలు ఉత్తమం
సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) లేదా సిప్ అని ముద్దుగా పిలుచుకునే మదుపు పద్ధతి.. గత దశాబ్ద కాలంగా బహుళ జనాదరణ పొందింది. ఒక నిర్దిష్ట మొత్తాన్ని ప్రతినెలా ఒక మ్యూచువల్‌లో మదుపు చేస్తుండడాన్నే సిప్ అంటాం. కనీసంగా రూ.500 నుంచి మదుపు చేసే వెసులుబాటు ఉండడం కారణంగానే జనాదరణ పొందింది. ఈఎంఐలు తదితర నెలసరి చెల్లింపుల మాదిరిగానే నెలనెలా అకౌంట్ నుంచి మినహాయించుకునే వీలు కూడా ఒక సౌలభ్యతే. ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవడానికి కూడా ఇదొక సాధనం. మార్కెట్లో ఒడిదుడుకులలో కూడా ప్రయోజనం పొందడానికి ఎస్ఐపీలు ఉపయోగపడతాయి. ఈ ఏప్రిల్‌లో రూ.8,590 కోట్ల పెట్టుబడులు ఎస్ఐపీల ద్వారానే మదుపు జరిగిందంటే వాటికున్న ఆదరణ తెలుసుకోవచ్చు. సరళంగా అర్థం కావడం, మదుపు చేయడంలో అత్యంత ఫ్లెక్లిబిలిటీ ఉండడం వీటి ప్రత్యేకత. మదుపు చేయడంలో చాలామందికి అలసత్వం. ఈ కారణంగానే మదుపు నిర్ణయాలను వాయిదా వేస్తూ ఉంటారు. అలాంటివారికి ఆర్థిక క్రమశిక్షణ నేర్పిస్తుంది సిప్. ఓ రెగ్యులర్ ఇన్వెస్టర్‌గా మిమ్మల్ని రూపాంతరం చెందిస్తుంది. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా మదుపు చేయడం వల్ల కొంత కాలానికి సగటున మనకు తక్కువ ధరకే మ్యూచువల్ ఫండ్ యూనిట్లు లభించినట్టవుతుంది. మార్కెట్ సైకిల్స్‌ను అర్థం చేసుకోగలిగి, నష్టం వచ్చినాసరే తాను నమ్మిన మదుపునకే కట్టుబడి ఓపిగ్గా వేచి చూస్తే, దీర్ఘకాలానికి రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. నిజానికి మార్కెట్ ఒడిదుడుకులే ఎస్ఐపీ ఇన్వెస్టర్‌కు పెద్ద దీవెనెలు. మార్కెట్ పతనంలో ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలోనే అధిక రాబడులుంటాయి. ఐదేండ్ల కాలపరిమితి పెట్టుబడులపై 10శాతం కన్నా ఎక్కువ రాబడికి 64శాతం అవకాశాలుంటాయని ఇటీవలే చేసిన ఓ అధ్యయనంలో తేలింది. కానీ అదే పదేండ్ల కాలపరిమితితో మదుపు చేస్తే అవకాశాలు 78 శాతానికి పెరిగాయని ఆ అధ్యయనం తేల్చింది. ఆర్థిక క్రమశిక్షణతోపాటు దీర్ఘకాల రాబడులు కావాలనుకుంటే వెంటనే సిప్ చేయండి .
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు