మార్చి 25 వరకు నీట్ పీజీ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు

న్యూఢిల్లీ: నీట్ పీజీ (NEET PG) ప్రవేశ పరీక్షను కేంద్ర ఆరోగ్య శాఖ వాయిదావేసింది. దీంతో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE) రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది. అభ్యర్థులు మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పరీక్షకు సంబంధించిన వివరాలు nbe.edu.in, natboard.edu.in వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయి. నీట్ పీజీ పరీక్ష మే 21న జరగనున్నది.
నీట్ పీజీ కౌన్సెలింగ్, ప్రవేశ పరీక్ష తేదీలు క్లాష్ అవుతుండటంతో పలువురు అభ్యర్థులు నీట్ పీజీ 2022ని వాయిదా వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మే 21న పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ పరీక్షను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు.
నీట్ పీజీ-2022 సవరించిన తేదీలు
ఆన్లైన్ అప్లికేషన్ల దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 25
అడ్మిట్ కార్డుల విడుదల: మే 16
నీట్ పీజీ పరీక్ష తేదీ: మే 21
ఫలితాల విడుదల: జూన్ 20
వెబ్సైట్: natboard.edu.in
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
Ace questions on environment
అల్ప జాతీయాదాయం నమోదవుతున్న దేశం ఏది? (Groups Special)
మానవ శరీరం బరువులో మెదడు బరువు శాతం ఎంత?
పదార్థం పంచ స్థితి రూపం
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు