Zone where there are no beasts | క్రూరమృగాలు ఉండని మండలం?
జాగ్రఫీ
1. కింది వాటిలో శీతల ఎడారి కానిది?
1) సోనారన్ 2) కలహారి
3) పెటగోనియా 4) కెనరీ
2. కోరల్ రీఫ్ లేదా ప్రవాళ బిత్తికలు/పగడాలు అన్ని పేర్లు ఒకటే. అయితే వాటికి సంబంధంలేని అంశాన్ని గుర్తించండి.
1) ప్రవాహ కీటకాలు, పురుగులు, మృతభాగాల సంచయనం వల్ల ఏర్పడుతాయి
2) స్వచ్ఛమైన ఉప్పునీటిలో పెరుగుతాయి
3) క్వీన్స్లాండ్/ఆస్ట్రేలియా అతిపొడవైన నది
4) మంచినీరుండేచోట, నదీ ముఖ ద్వారాల వద్ద (సుందర్బన్స్) కృత్రిమంగా అభివృద్ధి చేయవచ్చు. అది మనకు 2 శాతం జీడీపీని ఇస్తుంది.
3. ఓటీఈసీ/ఓషియన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ టెక్నాలజీ సముద్ర జలాల్లోని ఉష్ణోక్షిగతా వ్యత్యాసాలను ఉపయోగించి విద్యుత్‌ను/శక్తిని సృష్టించే ప్రక్రియ. ఇది మన దేశంలో ఇంకా అభివృద్ధి కాలేదు. తరంగ శక్తి, ఉష్ణశక్తి, సహజ వాయుశక్తి లాంటి సముద్ర జలాల నుంచి పొందవచ్చు. తరంగ జనిత శక్తిని వాడుకోవడంలో యూకే, జపాన్, నార్వే ముందంజలో ఉన్నాయి. సముద్ర మట్టానికి అతి దిగువన ఉండి తరంగ శక్తిపై అధికంగా ఆధారపడిన దేశాన్ని గుర్తించండి.
1) నెదర్లాండ్స్/హాలండ్ 2) బెల్జియం
3) లక్సెంబర్గ్ 4) డెన్మార్క్
4. ప్రపంచంలో అతి తక్కువ లోతున్న సముద్రం ఆజోన్/13 మీ. అత్యంత పొడవైన జలసంధి మలక్కా, ఎర్రసముద్రం, హిందూ మహాసమువూదాన్ని కలిపేది బాబ్-ఎల్-మండేబ్. ఆసియా, ఉత్తర అమెరికాను వేరుచేసేది జిబ్రాల్టర్, బాల్టిక్ సమువూదాన్ని ఉత్తర సమువూదంతో కలిపేది కీల్ కాలువ. అంటే సమువూదాలు వాటి ప్రవాహ పర్యవసానాలు ఒక దేశ ఆర్థికాభివృద్ధిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. పసిఫిక్ మహాసముద్ర కదలిక గురించి సరైనది ఏది?
1) ఉత్తర పసిఫిక్-సవ్యదిశ, దక్షిణ పసిఫిక్-అపసవ్య దిశ
2) ఉత్తర పసిఫిక్-అపసవ్యదిశ, దక్షిణ పసిఫిక్-సవ్యదిశ
3) ఎడమ నుంచి కుడికి భూమి తిరుగుతుంటే దానికి వ్యతిరేక దిశలో కదులుతుంది
4) ఎల్‌నినో, లా నినో ప్రభావాల వల్ల ఉత్తర పసిఫిక్, ఉత్తరం వైపు, దక్షిణ పసిఫిక్ దక్షిణం వైపు కదులుతూ, ధృవాలను భారంగా మారుస్తూ మంచు గడ్డలుగా మారిపోతుంది
5. ప్లవకాలు అంటే?
1) ఆక్టోపస్ పిల్లలు 2) మొక్కలు
3) తిమింగలాలు 4) సూక్ష్మజీవులు
6. ప్రపంచ పెట్రోలియ ఉత్పత్తిలో 1/5వ వంతు లేదా 4 బిలియన్ బ్యారెల్స్ సమువూదాల నుంచే డ్రిల్లింగ్ చేయబడుతుంది. ప్రపంచ బ్రొమైన్ ఉత్పత్తిలో 66 శాతం సమువూదాలదే. డైమ్సెల్ అనే పదం చేపలతో, డయాటం-సిలికాతో, లోయస్ మట్టి-పసుపురంగుతో, చిలీ దేశం-నైవూటేట్స్తో ముడిపడి ఉన్నాయి. సమువూదాల మరో ముఖ్యమైన సంపద మత్స సేకరణ. దాని గురించి సరికానిది గుర్తించండి.
1) అయన రేఖ సమువూదాల కన్నా, సమశీతోష్ణ సమువూదాల్లో అధికం
2) ఖండతీరపు అంచు (200 మీ.) వరకు చేపల వృద్ధి అధికంగా ఉంటుంది
3) గ్రాండ్ బ్యాంక్స్ (కెనడా) డాగర్ బ్యాంక్ (యూకే) చేపల ఉత్పత్తికి ప్రపంచ ప్రసిద్ధి
4) చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ 1/28వ వంతు ముందుకు జరగడం వల్ల సంభవించే పాటు పోటుల వల్ల చేపల వృద్ధి అధికం
7. ప్రపంచాన్ని ఎన్ని సహజ, ప్రకృతిసిద్ధ మండలాలుగా వర్గీకరించవచ్చు?
1) 7 2) 9 3) 11 4) 13
8. కిందివాటిలో భూమధ్య రేఖ, ఉష్ణమండల, వర్షారణ్య ప్రాంత్రం కానిది?
1) నైలునది పరివాహక ప్రాంతం
2) అమెజాన్ పరివాహక ప్రాంతం
3) కాంగోనది పరివాహక ప్రాంతం
4) ఆగ్నేయాసియా
9. భూమధ్య రేఖా మండలంలో ఏడాది అంతా రాత్రి-పగలు సమానం, శీతాకాలం ఉండదు. ప్రతిరోజు సాయంత్రం వర్షం, రేయింబవళ్ల మధ్య ఉష్ణోక్షిగతా వ్యత్యాసం చాలా తక్కువ. ఈ మండలం గురించి కింది వాటిలో సరికానిది?
1) డోల్వూడమ్స్
2) బోగోర్‌లో (జావా) 322 రోజులు ఉరుముల శబ్దం
3) రాత్రిని చలికాలంగా చమత్కరించడం
4) భూగోళం చుట్టూ ఇది ఒక అధిక పీడన మేఖల
10. భూమధ్య రేఖా మండలంలో సతత హరిత అరణ్యాలు, వెడల్పు ఆకులు, గట్టికలప వేగంగా పెరుగుతాయి. ఇవి అత్యంత దట్టమైనవి. ఈ అడవుల గురించి సరికానిది ఏది?
1) తీగజాతి చెట్లు-లయనాలు
2) వృక్షాల అగ్రభాగం పెనవేసుకుంటాయి-కెనోపి
3) జాపోటో వృక్షాల స్రావం చికిల్తో చూయింగ్ గమ్ తయారు చేస్తారు
4) రోగాలను వ్యాప్తి చేసే విష క్రిములు ఉండవు
11. భూమధ్య రేఖా ప్రాంతం అననుకూల వాతావరణం వల్ల జనసాంవూదత తక్కువ. ఇండోనేషియా తప్ప మిగతా ప్రాంతాల్లో ఆదిమ తెగలుంటాయి. తెగలు, ప్రాంతాలు కలవనిది ఎంపిక చేయండి?
1) అమెజాన్-డ్ ఇండియన్స్
2) కాంగో- పిగ్మీలు, బింటునిక్షిగోలు
3) బోర్నియో, న్యూగినియా- హెడ్‌హంటర్స్
4) శ్రీలంక-కాబూలు
12. క్రూరమృగాలు ఉండని మండలం?
1) టైగా 2) టండ్రా
3) మధ్యధరా 4) భూమధ్యరేఖ
13. అనకొండ నివాసముండే ప్రాంతం?
1) భూమధ్యరేఖ 2) చైనారీతి మండలం
3) తారాషియా 4) రుతుపవన మండలం
14. చెట్ల పై కర్రలతో అర్ధచంవూదాకారపు నివాసాలు నిర్మించుకునే ఆదిమతెగ?
1) సెమాంగ్లు 2) డయాక్స్లు
3) పిగ్మీలు 4) హెడ్ హంటర్స్
15. ఆదిమ తెగలు మారక/విస్తాపన వ్యవసాయం చేస్తారు. ఈ రకమైన వ్యవసాయానికి మలేషియాలో లడాంగ్ అని, ఫిలిప్ప్సైలో మిలాప్ అని, శ్రీలంకలో చైనా అని పిలుస్తారు. భారతదేశంలో కూడా ఈ రకమైన వ్యవసాయం చేసే గిరిజన తెగలు అనేకం ఉన్నాయి. కేరళలో పోనం, పశ్చిమ కనుమల్లో కుమారి, తెలంగాణ, ఒడిశాలో పోడు వ్యవసాయం, మధ్యవూపదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో పెండా లేదా పేషా/బెవార్ వ్యవసాయం, రాజస్థాన్‌లో వాత్రా, ఈశాన్యరాష్ట్రాల్లో జాంజాం అనే పేర్లతో పిలుస్తారు. మరి ఈ తెగల ప్రధాన వృత్తి?
1) చేపలు పట్టడం 2) వేట
3) పశుపోషణ 4) తోటల పెంపకం
16. పోడు వ్యవసాయం కోసం కొట్టివేసిన చెట్లు మళ్లీ పెరిగితే దాన్ని ఏమంటారు?
1) బెలకార్స్ 2) గౌణ అడవులు
3) బెంగోజి 4) పూనం
17. కాఫీ జన్మస్థానం ఇథియోపియా. రబ్బరు జన్మస్థానం బ్రెజిల్, ఘనా. కోకో ఎస్టేట్లకు ప్రసిద్ధి ఇండోనేషియా. రబ్బరు ఉత్పత్తికి ప్రసిద్ధి మలేషియా. అయితే బ్రెజిల్లో ఉన్న కాఫీ తోటలను/ఎస్టేట్లను ఏమని పిలుస్తారు?
1) సెడార్లు 2) ఫ్రంకోనాస్
3) ఫజెండాస్ 4) హెవియావూబాసిల్లాస్
18. సహారా ఎడారి కెనరీ శీతల ప్రవాహం వల్ల ఉద్భవించింది. దీని పొడవు 6400 కి.మీ. ఇది అమెరికా కన్నా రెండింతలు పెద్దది. భారత వైశాల్యం కంటే 16 రెట్లు పెద్దది. ఈ ఎడారి వ్యాపించని దేశాన్ని గుర్తించండి.
1) ఈజిప్టు 2) సోమాలియా
3) సౌది 4) ఇథియోపియా
19. దక్షిణార్ధగోళంలో అతిపెద్ద ఎడారి ఏది?
1) అటకామా 2) సహారా 3) అరేబియా 4) గిబ్బన్
20. సహారాలో సగం సైజు ఎడారి అరేబియా ఎడారి. 10 దేశాల్లో విస్తరించిన అరేబియాకు తూర్పు సరిహద్దు థార్ ఎడారి. ఎడారుల్లో ఇసుక పొర ఉంటే దాన్ని ఎర్గ్ అంటారు. లేకుంటే ఆ ఎడారి ప్రాంతాన్ని రెగ్/హమ్డా అంటారు. అప్పుడప్పుడు మాళి తుఫాన్లు (సైమూన్లు) ముంచెత్తుతాయి. సాధారణంగా ఎడారుల్లో చినుకు భూమిని చేరదు. విపరీతంగా కురిసే వానవల్ల తాత్కాలిక ప్రవాహాలు (వాడీలు), తాత్కాలిక సరస్సులు (ప్లయాలు) ఏర్పడుతాయి. ఈ ప్రాంతంలో ప్రవహించే నదులు నైలు/సింధు/కొలరాడో/ఆంజ్ /డార్లింగ్ లాంటివి ఎక్సోటిక్ అంటారు. మరి ఎక్సోటిక్ అంటే ఏమిటి?
1) ఎడారి ఆవిర్భావానికి ముందు పుట్టి నాగరికతలతకు దోహదకారులు
2) ఎడారిలో ఒక పాయింట్ వద్ద మునిగి మరో పాయింట్ వద్ద తేలుతూ ప్రవహించేవి
3) చాలా ఎత్తుపై పుట్టే నదులు
4) ఇతర ప్రాంతాల్లో పుట్టి ఎడారిగుండా ప్రవహించేవి
21. ‘పెరు’ దేనికి ప్రసిద్ధి?
1) ఎల్‌నినో 2) ఆంటిలోప్ 3) గ్జెరోఫైట్స్ 4) రెట్ట
22. ఎడారులు కూడా అనేక ఆదిమ జాతి తెగలకు పుట్టినిల్లు. సహారా-టౌరేగులు, అరేబియా-బిడౌన్లు, కలహారి-బుష్మెన్లు, ఆస్ట్రేలియా-బిండిబాలు, నైలునది ప్రాంతం- ఫెల్లాహిన్స్ అనే తెగలు నివసిస్తారు. అన్ని తెగల్లో బుష్మెన్ చాలా వెనుకబడి ఉన్నారు. అయితే వారి ప్రధాన వ్యాపకం?
1) పశుపోషణ 2) గుర్రాల వ్యాపారం
3) ఒంటెల వ్యాపారం 4) చురుకైన వేట
23. ప్రపంచ వేటగాళ్ల స్వర్గం అని దేన్ని అంటారు?
1) టండ్రా 2) టైగా 3) సవన్నా 4) కాంపోలు
24. స్టెప్పీలు అంటే పర్వతాల వర్షాచ్ఛాయ ప్రాంతాలు. వివిధ ఖండాల్లో వాటి పేర్లకు సంబంధించి సరికానిది?
1) ఆస్ట్రేలియా-డౌన్లు, దక్షిణావూఫికా-
2) యురేషియా-స్టెప్పీలు
3) ఉత్తర అమెరికా- ప్రయరీలు, దక్షిణ అమెరికా-పంపాలు
4) ఆర్కిటిక్ ప్రాంతం- చిమూన్స్, స్కాండినేవియా- కాంపోలు
25. మేఘరహిత ఆకాశం, తీర్ధ రహిత వర్షపాతం. కొన్నేండ్లపాటు వరుసగా వర్షాలు, మరికొన్ని ఏండ్లపాటు వరుసగా కరువులు. వడగళ్లు- పంటల సర్వనాశనం, అయినా ఆ ప్రాంతమంతా ప్రపంచ ధాన్యాగారం. చారివూతక కట్టడాలు అనేక ప్రకృతి వింతలతో తులతూగే స్టెప్పీల గురించి సరికానిది?
1) ఆల్ఫా-ఆల్ఫా 2) ఎస్టాన్షియా
3) అంగోరా, మెరినో 4) క్వెబ్రాషో
26. అధిక జనసాంవూదత గల ద్వీపం?
1) శ్రీలంక 2) మడగాస్కర్ 3) బాలి 4) జావా
27. లివింగ్ఫోసైల్ అంటే?
1) రెడ్ నెపోలియన్-బ్యాగ్స్
2) అబోరిజైన్స్-వూడస్సులు
3) నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్-సై్కసూట్స్ 4) కంగారూలు
28. నాగరికతలకు పుట్టినిల్లు మధ్యధరా ప్రకృతి సిద్ధమండలం. అంటార్కిటికాలో తప్ప అన్ని ఖండాల్లో ఈ శీతోష్ణస్థితి ఉంది. ఘనమైన చరివూతలు, విలక్షణమైన సంస్కక్షుతులు, వ్యవసాయ క్షేత్రాలు, పండ్ల తోటలు, సుగంధ ద్రవ్యాలు, సన్నని తీరమైదానాలతో పర్యాటక, సినిమా రంగాలకు పెట్టింది పేరు. మరి ఈ ప్రకృతి సిద్ధ మండలం కిందికి రానిది ఏది?
1) పెర్త్, అడిలైట్ 2) చిలీ, అర్జెంటీనా
3) కాలిఫోర్నియా, కేప్‌టౌన్ 4) సిరియా, ఇజ్రాయెల్
29. న్యూస్ ప్రింట్ కాగితం తయారవుతున్న ప్రకృతి సిద్ధమండలాన్ని గుర్తించండి.
1) కెనడా 2) టైగా 3) టండ్రా 4) భూమధ్యరేఖ పై ఉన్న దట్టమైన సతత హరిత అరణ్యాలు
30. కింది వాటిని జత చేయండి.
ఎ. స్పెక్టోస్కోప్ 1. మార్స్, జూపిటర్
బి. ఆస్ట్రలోబ్ 2. సమువూదాలు
సి. ఆస్టరాయిడ్స్ 3. భూకంపం
డి. క్రోనోమీటర్ 4. అక్షాంశాలు, రేఖాంశాలు
ఇ. పైరో మీటర్ 5. నక్షవూతాలు
ఎఫ్. మెర్కాలి 6. సూర్యుడు
1) ఎ-2, బి-1, సి-3, డి-4, ఇ-5, ఎఫ్-6
2) ఎ-4, బి-3, సి-2, డి-1, ఇ-6, ఎఫ్-5
3) ఎ-3, బి-4, సి-1, డి-2, ఇ-6, ఎఫ్-5
4) ఎ-5, బి-4, సి-1, డి-2, ఇ-6, ఎఫ్-3
5) ఎ-5, బి-6, సి-4, డి-2, ఇ-3, ఎఫ్-1
6) ఎ-6, బి-4, సి-5, డి-2, ఇ-3, ఎఫ్-1
31. జతపర్చండి.
ఎ. గురికొయ్యలు 1. 2062వ సంవత్సరం
బి. హేలి 2. 1610
సి. సోసునామీలు 3. నక్షత్రం
డి. గెలీలియాన్ చంద్రులు 4. 11 ఏండ్లు
1) ఎ-3, బి-2, సి-1, డి-4
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-4, బి-1, సి-2, డి-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?