ద్రవ్యం-చలామణి ఎలా?
ద్రవ్యం, బ్యాంకింగ్
-ద్రవ్య సరఫరా, భారతీయ బ్యాంకుల, నాన్ బ్యాంకుల నిర్మాణం, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు, ఆర్బీఐ ద్వారా ద్రవ్య నియంత్రణ.
-మానవ నాగరికతలో కనిపెట్టిన అత్యంత ముఖ్యమైన సాధనం ద్రవ్యం. ద్రవ్యం లేకుండా ఊహించుకోవడం దాదాపు అసాధ్యం. అందులోనూ ద్రవ్యం ద్వారా జరిగే ఎన్నో లావాదేవీలు ఆ సమాజపు నిర్మాణాన్ని నిర్దేశిస్తున్నాయి. ఇప్పుడు ప్రతి అంశం ద్రవ్యంతోనే ముడిపడి ఉంది. కానీ ఇప్పుడున్న ద్రవ్యం కంటే.. పూర్వం కూడా ద్రవ్యానికి ఎంతో పెద్ద చరిత్ర ఉంది. దీనికంటే ముందు వస్తుమార్పిడి (Barter System) పద్ధతి ద్వారా మార్కెట్ లావాదేవీలు జరిపేవారు. ఇప్పుడు కరెన్సీ వచ్చింది కానీ, పూర్వం అలాంటి కరెన్సీలు ఏవీ లేవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. అసలు ద్రవ్యం అంటే ఏమిటి? దాని చరిత్ర ఏమిటి? వస్తు మార్పిడిలో ఏర్పడిన సమస్యలు ఏమిటి? ఇప్పటివరకు వచ్చిన వివిధ ద్రవ్యాల చరిత్ర ఏమిటి? మొదలైన విషయాలను కూలంకశంగా చర్చించడమే ఈ వ్యాసం ఉద్దేశం.
-ద్రవ్యం విధులను బట్టి కూడా ద్రవ్యం అంటే ఏమిటో నిర్ణయించవచ్చు.
ద్రవ్యం విధులు
-ద్రవ్యం ముఖ్యంగా మూడు విధులను నిర్వహిస్తుంది.
అవి: 1. ప్రాథమిక విధులు
2. ద్వితీయ విధులు
3. ఇతర విధులు
ప్రాథమిక విధులు:
1. మార్పిడికి మాధ్యమంగా
2. విలువను కొలవడానికి (దేన్నైనా కొలవాలంటే ద్రవ్యరూపంలో కొలుస్తారు. ఉదా: ఇల్లును, వస్తువులను ఇది ఇంత విలువ చేస్తుందని కొలుస్తాం)
ద్వితీయ విధులు:
1. విలువైనవి దాచుకోవడానికి (ప్రతీది ద్రవ్యరూపంలోనే దాచుకుంటారు)
2. వివిధ సమయాల్లో లావాదేవీలు జరుపడానికి
3. లావాదేవీలను ద్రవ్య రూపంలో ఒక విలువను జోడించి జరుపడానికి
ఇతర విధులు:
1. బాకీలకు ఆధారం
2. ఆదాయాన్ని పంచడానికి
3. ఏదైనా ఒక విలువను సమానత్వపర్చడానికి
ద్రవ్య చరిత్ర
-ఇప్పుడున్న ద్రవ్యం కంటే ముందే లావాదేవీలకు మధ్యస్థంగా వివిధ సందర్భాల్లో ఎన్నో రకాల ప్రయత్నాలు జరిగాయి. అందులో మొదటిది వస్తుమార్పిడి పద్ధతి.
వస్తుమార్పిడి పద్ధతి (Barter System)
-దీనిలో భాగంగా వస్తువులను ఇచ్చిపుచ్చుకోవడం జరిగేది. అయితే ఒకరు ఒక వస్తువుకు బదులుగా మరో వస్తువును మార్పిడి చేసుకునేవారు. ఉదాహరణకు ఒకరు ఒక కేజీ బియ్యానికి ఒక కేజీ కందులను, ఒక ఆవుకు ఒక మేకను మార్పిడి చేసుకునేవారు.
ద్రవ్య ఆవిర్భావం
-ఒకప్పటి వస్తు మార్పిడి నుంచి నేడు కొత్తగా వచ్చిన బిట్ కాయిన్ వరకు ద్రవ్యం వివిధ రూపాంతరాలతో ఆవిర్భవిస్తూ వస్తుంది.
1. వస్తువుల ద్రవ్యం
2. లోహ ద్రవ్యం
3. పేపర్ కరెన్సీ
4. బ్యాంక్ కరెన్సీ (క్రెడిట్, డెబిట్ కార్డులు)
5. బిట్ కాయిన్స్
-ఇలా వివిధ దశల్లో వివిధ రూపాల్లో ఉన్న కరెన్సీకి ప్రతిసారీ ఏదో ఒక విధంగా నష్టాలు ఉండటం, లోటుపాట్లు ఉండటంవల్ల.. నేటికీ ద్రవ్య సమగ్ర రూపం మారుతూనే ఉంది. ఇప్పుడు ప్రతి దేశం తమ కేంద్ర బ్యాంక్ ద్వారా గ్యారంటీ ఇస్తూ ద్రవ్యాన్ని చలామణిలో ఉంచుతున్నది. దాన్నే ప్రాతినిధ్య ద్రవ్యం అంటారు.
ఫియట్ మనీ (Fiat Money)
-ప్రభుత్వం గ్యారంటీ ద్వారా ఏర్పడిన ద్రవ్యం
ఉదా: మన దేశంలో కరెన్సీ మొత్తం ఆర్బీఐ గ్యారంటీ ద్వారా ఏర్పడుతుంది.
-దీనికి అంత విలువ వచ్చేటట్టు లోహం ఉండకపోవచ్చు.
ఉదా: బంగారం అయితే ఆ కాయిన్‌ను కరిగించి అమ్మినా దాదాపు అంతే విలువ వస్తుంది. కానీ కరెన్సీ కాయిన్లకు, నోట్లకు రాదు.
దగ్గరి ద్రవ్యం (Near Money)
-ఇది సరఫరాకు, లిక్విడిటీకి సంబంధించింది. అంటే ఆర్థిక కార్యకలాపాలు జరుపడానికి ఎంత దగ్గరి కాలంలో ద్రవ్యం అందుబాటులోకి వస్తుందో ఆ ద్రవ్యాన్ని దగ్గరి ద్రవ్యం అంటారు.
-అంటే ఉదాహరణకు వంద రూపాయలతో ఏదైనా కొనుక్కోవాలంటే వెంటనే ఆ నోటును ఉపయోగించి కొనుక్కోవచ్చు. కానీ అదే వంద రూపాయల విలువగల డీడీని కానీ, చెక్‌ను కానీ ఉపయోగించి ఏదైనా కొనాలంటే కొంత సమయాన్ని, కొంత విలువను నష్టపోయి కొనాల్సి వస్తుంది.
-అంటే ఇక్కడ రూ. 100 కరెన్సీకి ఉన్నంత లిక్విడిటీ డీడీకి గానీ, చెక్కు గానీ లేదని అర్థం.
-అలాగే ఎన్నో రకాల ద్రవ్యం ఈ దగ్గరమనీకి రావడానికి కొంత సమయం, కొంత విలువను నష్టపోతుంది.
-అంటే త్వరగా ఒక వస్తువు కానీ, ద్రవ్యం కానీ మళ్లీ ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనే క్రమాన్ని బట్టి దగ్గరి ద్రవ్యంగా నిర్వచిస్తాం.
ఉదా: 1. సేవింగ్ అకౌంట్
2. ఫిక్స్డ్ డిపాజిట్లు
3. ప్రభుత్వ సెక్యూరిటీలు
4. స్వల్పకాలంలో పూర్తయ్యే బాండ్లు
5. ఎక్కువ డిమాండ్ ఉన్న విదేశీ కరెన్సీ (డాలర్, పౌండ్ మొదలైనవి)
ద్రవ్య సరఫరా
-ద్రవ్య సరఫరా కంటే ముందు, మొత్తం ద్రవ్యం అంటే ఏమిటి? అని తెలుసుకుందాం.
1. మొత్తం స్టాక్ ఆఫ్ మనీ
-ద్రవ్యాన్ని ఉత్పత్తి చేసేవారి దగ్గర, సరఫరా చేసేవారి దగ్గర, ప్రజల దగ్గర ఉన్న మొత్తం ద్రవ్యాన్ని మొత్తం స్టాక్ ఆఫ్ మనీ అంటారు.
-అంటే ద్రవ్యం సరఫరా చేసేవారు: RBI, ప్రభుత్వం
-ఇక్కడ ప్రజలు, గృహరంగం అంటే: గృహరంగం, వ్యాపార సంస్థలు, స్థానిక అధికారిక వ్యవస్థలు, కంపెనీలు మొదలైనవి.
2. ద్రవ్య సరఫరా (Money Suply)
-కేవలం ప్రజల వద్ద ఉన్న ద్రవ్యాన్ని ద్రవ్య సరఫరా అంటారు. అంటే ఉనికిలో లేకుండా ఉన్న CRRను, SLRను ద్రవ్య సరఫరాలో తీసుకోరు.
-ద్రవ్య సరఫరాలో ప్రభుత్వం దగ్గర ట్రెజరీలో ఉన్న ద్రవ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోరు. ఎందుకంటే అది చలామణిలో ఉండదు కాబట్టి.
-ద్రవ్య సరఫరాను కొలవడానికి, ఎంత ద్రవ్య సరఫరా ఉందో తెలుసుకోవడానికి RBI నాలుగు పద్ధతులను పరిగణలోకి తీసుకుంటుంది.
అవి: M1, M2, M3, M4
1. న్యారో మనీ-M1
-ప్రజల వద్ద ఉన్న మొత్తం కరెన్సీని, ప్రజలు వివిధ బ్యాంకుల్లో చేసిన డిమాండ్ డిపాజిట్లను కలిపి M1 అంటారు.
-ఇక్కడ డిమాండ్ డిపాజిట్లు అంటే…. ప్రజలు ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది.
ఉదా: సేవింగ్స్, కరంట్ అకౌంట్లు
-దీనికి సరఫరా (లిక్విడిటీ) ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. దీన్ని న్యారో మనీ అంటారు.
-ఇది అతి తొందరగా ప్రజలకు లభిస్తుంది.
M1 = ప్రజలవద్ద ఉన్న కరెన్సీ + డిమాండ్ డిపాజిట్లు (ప్రజలు వివిధ బ్యాంకుల్లో చేసినవి)
2. న్యారో మనీ-M2
-M1కి పోస్టాఫీస్ సేవింగ్స్ కూడా కలిపితే M2 వస్తుంది.
M2 = M1 + పోస్టాఫీస్ సేవింగ్స్
3. బ్రాడ్ మనీ – M3
M1కి ఫిక్స్డ్ డిపాజిట్లను (టైం డిపాజిట్లను) కూడా కలిపితే M3 వస్తుంది.
-పై నాలుగు సాధనాలను ఉపయోగించి RBI ద్రవ్య సరఫరాను కొలుస్తుంది.
M3 = M1 + టైం డిపాజిట్లు
ద్రవ్యం అంటే ఏమిటి?
-ద్రవ్యం ఎన్నో ఏండ్ల నుంచి ఎంతో మంది చేత, ఎన్నో రకాలుగా నిర్వచించడమైంది. కానీ అందరూ ఆమోదించినట్టు కింది నిర్వచనాన్ని చూసుకోవచ్చు.
-సాధారణంగా ప్రతి ఒక్కరిచేత ఆమోదం పొంది వస్తువుల మార్పిడిలో, తర్జుమాలో మధ్యస్థంగా ఉపయోగపడేదే ద్రవ్యం.
-ద్రవ్యం ఒక విలువగా, ఒక దాచిపెట్టుకునే సాధనంగా, లావాదేవీలు జరుపడానికి అందరికీ సమ్మతంగా ఉంటుంది.
వస్తుమార్పిడి వల్ల నష్టాలు, లాభాలు
-చాలా సాధారణంగా ఉండేది ఈ పద్ధతి ఇద్దరికి ఆమోదయోగ్యమైన వస్తువులు దొరకకపోవడం
-విదేశీ చెల్లింపుల పద్ధతి లేదు కార్మికుల విభజన లేకపోవడం
-సంపదపై దృష్టి లేదు కొన్ని వస్తువులు పాడైపోయే గుణం కలిగి ఉండటం
-వస్తువు సేవల చక్రీయ ప్రవాహం లేకపోవడం
-దీన్నే సమగ్ర మనీ సైప్లె/ద్రవ్య సరఫరా అంటారు.
-RBI ద్రవ్య పరపతికి M3 నే ప్రామాణికంగా తీసుకుంటుంది.
4. డియర్ మనీ (M4)
-M3కి మళ్లీ పోస్టాఫీస్ సేవింగ్స్ కూడా కలిపితే M4 వస్తుంది.
M…4 = M…3 + పోస్టాఫీస్ మొత్తం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు