Which states do not impose presidential rule | రాష్ట్రపతి పాలన విధించని రాష్ర్టాలేవి?
1. రాజ్యాంగ లక్ష్యాలను దేనిలో పేర్కొన్నారు ?
1) ప్రాథమిక హక్కులు 2) ప్రాథమిక విధులు
3) ఆదేశిక సూత్రాలు 4) రాజ్యాంగ ప్రవేశిక
2 . కింది వాటిని జతపర్చండి.
ఎ. వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కవచం 1. హెబియస్ కార్పస్
బి. శాసనసభ స్పీకర్ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు 2. డిప్యూటీ స్పీకర్
సి. సుప్రీంకోర్టు జడ్జిని ఏ ఆధారాలపై తొలగించవచ్చు
3. నిరూపితమైన దుష్ప్రవర్తన లేక అసమర్థత
డి. లైంగిక వేధింపులకు వర్తించే చట్టాలు ఏ కేసులో నిర్దేశించబడ్డాయి 4. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్
1) ఎ-3, బి-2, సి-1, డి-4 2) ఎ-2, బి-3, సి-4, డి-3
3) ఎ-1, బి-2, సి-3, డి-4 4) ఎ-4 బి-3 సి-2 డి-1
3. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా 86వ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారు?
1) 2000 2) 2002 3) 2001 4) 1998
4. న్యాయస్థానాలు విధించిన ఒక రకమైన శిక్షను మరో రకమైన శిక్షగా మార్పు చేయడాన్ని ఏమంటారు?
1) పార్డన్ 2) రిప్రైవ్ 3) కముటేషన్ 4) రెస్పైట్
5. గణతంత్ర విధానం, పీఠికలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం అంశాలను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1) ఫ్రాన్స్ 2) జపాన్ 3) కెనడా 4) ఆస్ట్రేలియా
6. నిర్బంధ నివారక చట్టం (చట్టాన్ని అతిక్రమించనిదే ఏ వ్యక్తిని నిర్బంధించరాదు. నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల్లోపు కోర్టు ముందు హాజరుపర్చాలి) ఏ ఆర్టికల్‌లో పొందుపర్చారు?
1) 22 2) 24 3) 21 4) 25
7. స్వరణ్‌సింగ్ కమిటీ సిఫారసు మేరకు ప్రాథమిక విధులను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 51-ఏలో పొందుపరిచారు. అయితే ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1) ఫ్రాన్స్ 2) అమెరికా 3) రష్యా 4) ఆస్ట్రేలియా
8. రాజ్యసభ సభ్యునిగా ఉండి ప్రధాని పదవి చేపట్టిన రెండో వ్యక్తి ?
1) ఐకే గుజ్రాల్ 2) హెచ్డీ దేవెగౌడ
3) మన్మోహన్ సింగ్ 4) మొరార్జీదేశాయ్
9. ఇండియాలో మొదటిసారిగా 1951లో పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. అయితే అతితక్కువ కాలం రాష్ట్రపతి పాలన (7 రోజులు మాత్రమే) విధించిన రాష్ట్రం?
1) ఉత్తరప్రదేశ్ 2) జమ్ముకశ్మీర్
3) కేరళ 4) కర్ణాటక
10. పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా తిరిగి వెనుకకు పంపడాన్ని ఏమంటారు?
1) సస్పెన్సివ్ వీటో 2) అబ్సెల్యూట్ వీటో
3) పాకెట్ వీటో 4) క్వాలిఫైడ్ వీటో
11. తియ్యని నీటితో, కమ్మని పండ్లతో, చల్లటి గాలులతో, పచ్చని పైర్లతో విలసిల్లుతున్న భారతదేశాన్ని వర్ణించిన భావాత్మక వాక్యాలు దేనిలో ఉన్నాయి?
1) రాజ్యాంగ ప్రవేశిక 2) జాతీయ గేయం
3) జాతీయ ప్రతిజ్ఞ 4) జాతీయ గీతం
12. తన ఎన్నిక వివాదం గురించి తానే స్వయంగా సుప్రీంకోర్టుకు వెళ్లి తన వాదనను వినిపించిన రాష్ట్రపతి?
1) వరాహగిరి వెంకటగిరి 2) జాకీర్ హుస్సేన్
3) ఆర్ వెంకట్రామన్ 4) శంకర్‌దయాళ్ శర్మ
13. రాజ్యాంగ సవరణ విధానం, రాజ్యసభ్యుల ఎన్నికను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1) ఆస్ట్రేలియా 2) దక్షిణాఫ్రికా
3) జపాన్ 4) ఫ్రాన్స్
14. రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ ద్వారా 1956న ఏర్పాటు చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య?
1) 14, 6 2) 10,5 3) 12, 6 4) 16, 5
15. రాష్ట్రపతి వీటో చేయలేని అంశాలు ఏవి?
ఎ. రాజ్యాంగ సవరణ బిల్లులు
బి. రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు
సి. ఆస్తులను జాతీయం చేయు బిల్లులు డి. ఆర్థిక బిల్లులు
1) ఎ, సి 2) బి, డి 3) సి, డి 4) పైవన్నీ
16. న్యాయస్థానాలు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను గత కాలానికి కూడా వర్తింపజేస్తూ ఇచ్చిన తీర్పులను ఏమంటారు.
1) రెట్రాస్పెక్టివ్ 2) ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్
3) లోకస్ స్టాండీ 4) అమికస్ క్యూరీ
17. కింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యం?
ఎ. భారత రాజ్యాంగం అందమైన అతుకుల బొంత
-గ్రాన్‌విలే ఆస్టిన్
బి. భారత రాజ్యాంగం ప్రపంచం రాజ్యాంగాన్నింటిలో సర్వోన్నతమైంది – కేఎస్ హెగ్డే
సి. భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం
– సర్ ఐవర్ జెన్నింగ్స్
డి. రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు. అమలు చేసేవారిని నిందించాలి – బీఆర్ అంబేద్కర్
1) ఎ, బి 2) సి, డి 3) బి, డి 4) పైవన్నీ సరైనవే
18. అత్యధిక ప్రధానులను అందించిన రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్. అయితే అత్యధిక రాష్ట్రపతులను అందించిన రాష్ట్రం?
1) కర్ణాటక 2) మహారాష్ట్ర 3) గుజరాత్ 4) తమిళనాడు
19. ఇప్పటివరకు రాష్ట్రపతిపాలన విధించని రాష్ర్టాలేవి?
1) హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ
2) ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణ
3) మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ
4) మేఘాలయా, మణిపూర్, తెలంగాణ
జవాబులు
1-4, 2-3, 3-2, 4-3, 5-1, 6-1, 7-2, 8-3, 9-4, 10-2,
11-2,12-1, 13-2, 14-1, 15-4, 16-1, 17-4, 18-4, 19-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?