Palakurti conspiracy case | పాలకుర్తి కుట్ర కేసులో అరెస్టయిన కవి?
1. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉద్యమానికి నాయకత్వం వహించిందిఎవరు?
1) సోమారపు సత్యనారాయణ
2) కాచం సత్యనారాయణ
3) కర్నె ప్రభాకర్
4) ద్యావనవల్లి సత్యనారాయణ
2. హైదరాబాద్‌లో ఎవరి ఇంట్లో జరిగిన సభలో ఆంధ్ర జనసంఘం ఏర్పడింది?
1) సురవరం ప్రతాపరెడ్డి
2) టేకుమాను రంగారావు
3) బూర్గుల రామకృష్ణారావు
4) మందుముల నరసింగరావు
3. నిజాం సైన్యాధికారి ఇద్రూస్ భారత సైన్యాధికారి జేఎన్ చౌదరి ముందు ఎప్పుడు లొంగిపోయాడు?
1) 1947 సెప్టెంబర్ 17
2) 1948 సెప్టెంబర్ 17
3) 1945 సెప్టెంబర్ 17
4) 1946 సెప్టెంబర్ 17
4. మహా కూటమి ఎప్పుడు ఏర్పడింది?
1) 2007 జనవరి 31 2) 2008 జనవరి 31
3) 2009 జనవరి 31 4) 2010 జనవరి 31
5. తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని పార్లమెంటులో ప్రకటించింది ఎవరు?
1) వీరప్ప మొయిలీ 2) చిదంబరం
3) గులాం నబీ ఆజాద్ 4) అహ్మద్ పటేల్
6. సామాజిక న్యాయం నినాదం ఇచ్చిన పార్టీ ఏది?
1) ప్రజారాజ్యం 2) నవ తెలంగాణ
3) తల్లి తెలంగాణ పార్టీ 4) ప్రజా కాంగ్రెస్ పార్టీ
7. 204 ప్రభుత్వ శాఖల్లో గిరగ్లానీ కమిటీకి సమాచారం అందించిన శాఖలు ఎన్ని?
1) 200 2) 102 3) 52 4) 99
8. అంజయ్య తర్వాత ముఖ్యమంత్రి పదవిని అధిష్టించింది ఎవరు?
1) ఎన్టీ రామారావు
2) భవనం వెంకట్రామిరెడ్డి
3) మర్రి చెన్నారెడ్డి
4) కోట్ల విజయభాస్కర్‌రెడ్డి
9. 2009లో కేసీఆర్ ఎక్కడి నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యాడు?
1) మెదక్ 2) మహబూబ్‌నగర్
3) కరీంనగర్ 4) మహబూబాబాద్
10. మన్మోహన్సింగ్ క్యాబినెట్లో కేసీఆర్‌కు రెండోసారి కేటాయించిన శాఖ?
1) కార్మిక, ఉపాధి శాఖ 2) ఓడరేవుల శాఖ
3) ఆర్థిక శాఖ 4) రైల్వే శాఖ
11. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలోని భాగస్వామ్య సంస్థలు, వాటి అధ్యక్షులను జతపర్చండి.
ఎ. తెలంగాణ ఉద్యోగుల సంఘం
1. ఎండీ మునీర్
బి. ఫోరం ఫర్ హైదరాబాద్
2. శేషురాం నాయక్
సి. లంబాడి హక్కుల పోరాట సమితి
3. సి. విఠల్
డి. సింగరేణి జేఏసీ
4. రమా మెల్కొటే
1) ఎ-1, బి-4, సి-2, డి-3
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-1, బి-4, సి-2, డి-3
12. భువనగిరి ద్విసభ్య స్థానం నుంచి రావి నారాయణరెడ్డితోపాటు పార్లమెంట్‌కు ఎన్నికైనవారు?
1) ఉప్పల మల్సూరు 2) సుంకం అచ్చాలు
3) కొండా లక్ష్మణ్ 4) కే కృష్ణమూర్తి
13. రెండోసారి తెలంగాణ ప్రజాసమితి ఆవిర్భావం ఎప్పుడు జరిగింది?
1) 1985 2) 1986 3) 1988 4) 1987
14. మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు జరిగాయి?
1) 1974 ఏప్రిల్ 12-19
2) 1975 ఏప్రిల్ 12-19
3) 1976 ఏప్రిల్ 12-19
4) 1977 ఏప్రిల్ 12-19
15. ఆంధ్ర మహాసభను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నిషేధించింది?
1) 1946 సెప్టెంబర్ 2) 1947 సెప్టెంబర్
3) 1948 సెప్టెంబర్ 4) 1949 సెప్టెంబర్
16. నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎప్పుడు స్వతంత్రతను ప్రకటించుకున్నాడు?
1) 1947 జూన్ 11 2) 1947 ఆగస్టు 11
3) 1947 ఆగస్టు 15 4) 1948 జూన్ 11
17. తెలంగాణవాదులు ఐక్యవేదికను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1996 2) 1997 3) 1998 4) 1999
18. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గ సభ్యుల సంఖ్య?
1) 10 2) 11 3) 12 4) 13
19. జయంత్‌నాథ్ చౌదరికి సలహాదారులుగా ఎంతమంది నియమితులయ్యారు?
1) ఐదుగురు 2) నలుగురు
3) ముగ్గురు 4) ఇద్దరు
20. హైదరాబాద్ రాష్ట్రంలో ద్విసభ్య నియోజకవర్గాల సంఖ్య?
1) 33 2) 23 3) 43 4) 53
21. శ్రీకృష్ణ కమిటీని కేంద్రం ఎప్పుడు ప్రకటించింది?
1) 2009 ఫిబ్రవరి 3 2) 2008 ఫిబ్రవరి 3
3) 2010 ఫిబ్రవరి 3 4) 2011 ఫిబ్రవరి 3
22. తెలంగాణలో జరిగిన ఆంధ్ర మహాసభలను ఏమంటారు?
(1)
1) నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభలు
2) బ్రిటిష్ ఆంధ్ర మహాసభలు
3) హైదరాబాద్ రాష్ట్ర ఆంధ్ర మహాసభలు
4) సీమాంధ్ర మహాసభలు
23. తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆవిర్భావ దినం?
(2)
1) 2009 అక్టోబర్ 9 2) 2010 అక్టోబర్ 9
3) 2011 అక్టోబర్ 9 4) 2012 అక్టోబర్ 9
24. తెలంగాణ వాడుక భాష పదాలను జతపర్చండి.
(3)
ఎ. ఇకమతు 1. చేపలు
బి. ఎక్క 2. తీరిక
సి. జిమ్మలు 3. ఉపాయం
డి. రికాం 4. దీపం
1) ఎ-1, బి-4, సి-3, డి-2
2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-3, బి-1, సి-4, డి-2
25. రెండు మైళ్లు బరువును మోసిన కూలీకి అణా పైసలు ఇవ్వాలని జారీ చేసిన ఫర్మానాను ఏమనేవారు? (2)
1) దున్నేవానికే భూమి 2) కోసుకు వీసం
3) వెట్టి చాకిరీ నిషేధించాలి 4) పైవేవీకావు
26. ఆంధ్ర, తెలంగాణను కలిపి విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని మొదట డిమాండ్ చేసినవారు?
1) ఆంధ్రా కాంగ్రెస్ నాయకులు
2) ఆంధ్రా కమ్యూనిస్టులు
3) ఆంధ్రా సోషలిస్టులు 4) తమిళ నాయకులు
27. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో హైదరాబాద్‌లో సభ నిర్వహించింది ఎవరు?
1) కాంగ్రెస్ 2) టీడీపీ
3) ఏపీ ఎన్జీవోలు 4) బీజేపీ
28. హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్థాన్‌లో కలపాలని పట్టుబట్టింది ఎవరు?
1) లాయక్ అలీ 2) సాలార్జంగ్
3) ఖాసీం రజ్వీ 4) ఉస్మాన్ అలీఖాన్
29. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి?
1) బిందు దిగంబరరావు 2) జీఎస్ మెల్కొటే
3) కొండా వెంకటరంగారెడ్డి
4) మర్రి చెన్నారెడ్డి
30. కేంద్ర మంత్రివర్గం నుంచి టీఆర్ఎస్ మంత్రులు కేసీఆర్, నరేంద్ర ఎప్పుడు తప్పుకున్నారు?
1) 2003 ఆగస్టు 22 2) 2004 ఆగస్టు 22
3) 2005 ఆగస్టు 22 4) 2006 ఆగస్టు 22
31. చిన్న రాష్ర్టాల ఏర్పాటుకు అనుకూలమని భారతీయ జనతాపార్టీ ఏ సమావేశంలో తీర్మానించింది?
1) హైదరాబాద్ 2) కాకినాడ
3) బొంబాయి 4) కాన్పూర్
32. నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 674ను ఎప్పుడు విడుదల చేసింది?
1) 1973 అక్టోబర్ 20 2) 1974 అక్టోబర్ 20
3) 1975 అక్టోబర్ 20 4) 1976 అక్టోబర్ 20
33. ఆరు సూత్రాల పథకంలో 5వ సూత్రం ప్రకారం రాజ్యాంగ సవరణ చేసి కేంద్రం ఏ అధికరణను చేర్చింది?
1) 371 (డి) 2) 372 (డి)
3) 374 (డి) 4) 373 (డి)
34. జైలులో ఉండి తెలంగాణ ఏర్పాటుకు నిరసనగా ఎంపీ పదవికి రాజీనామా చేసింది ఎవరు?
1) కిరణ్‌కుమార్ రెడ్డి 2) వైఎస్ జగన్
3) లగడపాటి రాజగోపాల్
4) వైఎస్ విజయమ్మ
35. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది?
1) 2013 ఆగస్టు 8 2) 2012 ఆగస్టు 8
3) 2014 ఆగస్టు 8 4) 2015 ఆగస్టు 8
36. శ్రీ కృష్ణ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య?
1) ఆరు 2) నాలుగు
3) ఐదు 4) మూడు
37. హైదరాబాద్ హిత రక్షణ సమితి ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది?
1) 1951 ఆగస్టు 2) 1952 ఆగస్టు
3) 1953 ఆగస్టు 4) 1954 ఆగస్టు
38. కేసీఆర్ దీక్ష నేపథ్యంలో కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన ఎప్పుడు చేసింది?
1) 2011 డిసెంబర్ 9 2) 2008 డిసెంబర్ 9
3) 2009 డిసెంబర్ 9 4) 2010 డిసెంబర్ 9
39. భాషా ప్రాతిపదిక రాష్ర్టాలవల్ల మెజారిటీ వర్గం ఆధిపత్యం పెరుగుతుందన్నది ఎవరు?
1) బీఆర్ అంబేద్కర్ 2) జవహర్లాల్ నెహ్రూ
3) ఇందిరాగాంధీ 4) సయ్యద్ ఫజల్ అలీ
40. మిత్రమండలి అనే సంస్థ ఎక్కడ పనిచేసింది?
1) నల్లగొండ 2) భువనగిరి
3) సూర్యాపేట 4) దేవరకొండ
41. తెలంగాణ విద్యావంతుల వేదిక ఎప్పుడు ఆవిర్భవించింది?
1) 2000 మే 2) 2002 మే
3) 2004 మే 4) 2006 మే
42. జీవో 72ను విడుదల చేసిన ముఖ్యమంత్రి ఎవరు?
1) ఎన్టీ రామారావు 2) వైఎస్ రాజశేఖర్‌రెడ్డి
3) చంద్రబాబునాయుడు
4) కోట్ల విజయభాస్కర్‌రెడ్డి
43. తల్లి తెలంగాణ పార్టీ టీఆర్ఎస్లో ఎప్పుడు విలీనమైంది?
1) 2007 జనవరి 16 2) 2008 జనవరి 16
3) 2009 జనవరి 16 4) 2010 జనవరి 16
44. తెలంగాణ బిల్లు గెజిట్‌ను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేసింది?
1) 2015 మార్చి 2 2) 2012 మార్చి 2
3) 2013 మార్చి 2 4) 2014 మార్చి 2
45. మునగాల సంస్థాన అధిపతి ఎవరు?
1) రాపాక వెంకట రామచంద్రారెడ్డి
2) రాజా నాయిని వెంకటరంగారావు
3) సంగభూపాలుడు
4) కొమర్రాజు లక్ష్మణరావు
46. పాలకుర్తి కుట్ర కేసులో అరెస్టయిన కవి?
1) వట్టికోట ఆళ్వారుస్వామి
2) గంగుల శాయిరెడ్డి
3) సుద్దాల హనుమంతు
4) బండి యాదగిరి
47. 1907 రెవెన్యూ చట్టం ఏ నిజాం పాలనలో వచ్చింది?
1) 5వ నిజాం 2) 6వ నిజాం
3) 7వ నిజాం 4) 8వ నిజాం
48. విసునూరు రామచంద్రారెడ్డి పవర్ ఆఫ్ అటార్నీగా ఎవరిని నియమించారు?
1) మిష్కిన్ అలీ 2) అనుముల రామిరెడ్డి
3) వీబీ రాజు 4) వనమాల వెంకన్న
49. తెలంగాణ రాష్ట్ర తొలి రవాణా మంత్రి?
1) తన్నీరు హరీష్‌రావు 2) ఈటల రాజేందర్
3) కేటీ రామారావు 4) పట్నం మహేందర్‌రెడ్డి
50. దున్నే వానికే భూమి అన్న నినాదం ఇచ్చిన భీమిరెడ్డి నరసింహారెడ్డి మీద కమ్యూనిస్టు పార్టీ స్పందన?
1) పార్టీ ఆంధ్ర కమిటీ బాధ్యతల అప్పగింత
2) పార్టీ నుంచి బహిష్కరణ
3) ఉద్యమ నాయకత్వ అప్పగింత
4) పార్టీ తెలంగాణ కమిటీ బాధ్యతల అప్పగింత
51. తెలంగాణ బిల్లు సందర్భంగా సోనియాగాంధీతోపాటు ఈ చిన్నమ్మను కూడా యాదికి పెట్టుకోండి అని తెలంగాణ ప్రజలను కోరింది ఎవరు?
1) మీరాకుమార్ 2) సుష్మాస్వరాజ్
3) మాయావతి 4) జయలలిత
52. నాటి ఆంధ్రప్రదేశ్‌లో రెండోసారి రాష్ట్రపతి పాలన ఎప్పుడు మొదలైంది?
1) 2015 మార్చి 2 2) 2012 మార్చి 2
3) 2013 మార్చి 2 4) 2014 మార్చి 2
53. ఆపరేషన్ పోలో జరిగినపుడు భారత రక్షణ మంత్రి ఎవరు?
1) బల్దేవ్సింగ్ 2) జయంత్‌నాథ్ చౌదరి
3) ఎల్ ఎడ్రూస్ 4) వీపీ మీనన్
54. ట్యాంక్‌బండ్ మీది ఆంధ్రా నాయకుల విగ్రహాలను ఏ సందర్భంలో తెలంగాణ ఉద్యమకారులు కూల్చివేశారు?
1) మిలియన్ మార్చ్ 2) సింహగర్జన
3) వంటావార్పు 4) సడక్‌బంద్
55. ఉన్నత ఉద్యోగాల్లోకి కూడా స్థానికులనే తీసుకోవాలన్న ఫర్మానా ఎప్పుడు జారీ అయ్యింది?
1) 1943 2) 1923 3) 1913 4) 1933
56. 1921లో హైదరాబాద్‌లో జరిగిన సంఘ సంస్కార సభకు అధ్యక్షత వహించింది ఎవరు?
1) సురవరం ప్రతాపరెడ్డి 2) కార్వే పండితుడు
3) బూర్గుల రామకృష్ణారవు
4) మర్రి చెన్నారెడ్డి
57. శ్రీకృష్ణ కమిటీ చేసిన మూడవ ప్రతిపాదన?
1) తెలంగాణ ఉద్యమాన్ని శాంతి భద్రతల సమస్యగా చూపి అణచివేయాలి
2) తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం
3) హైదరాబాద్ రాజధానిగా రాయల తెలంగాణ
4) హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ప్రతిపత్తి
జవాబులు
1-2, 2-2, 3-2, 4-3, 5-2, 6-1, 7-3, 8-2, 9-2, 10-1, 11-2, 12-2, 13-4, 14-2, 15-3, 16-1, 17-2, 18-4, 19-1, 20-1, 21-3, 22-1, 23-2, 24-3, 25-2, 26-2, 27-3, 28-3, 29-2, 30-4, 31-2, 32-3, 33-1, 34-2, 35-3, 36-3, 37-2,-3, 39-1, 40-2, 41-3, 42-3, 43-3, 44-4, 45-2, 46-2, 47-2, 48-1, 49-4, 50-2, 51-2, 52-4, 53-1, 54-1, 55-4,56-3, 57-3
Previous article
Textbooks on the study of linguistics | భాషాశాస్త్ర అధ్యయన గ్రంథాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?