Textbooks on the study of linguistics | భాషాశాస్త్ర అధ్యయన గ్రంథాలు
వర్ణనాత్మక భాషాశాస్త్రం
-పాణిని అష్టాధ్యాయ మొదలుకొని భారతీయ భాషల్లో వచ్చిన వ్యాకరణాలు ఇంచుమించుగా వర్ణనాత్మకాలే. వర్ణనాత్మక భాషాశాస్త్రంలో ధ్వని విజ్ఞానం, పదనిర్మాణం, వాక్యనిర్మాణం సంధిం మొదలైనవి.
చారిత్రక భాషాశాస్త్రం
-ప్రాచీన కాలం నుంచి ఒక భాష ఎలా క్రమపరిణామం చెందిందో సూత్రబద్ధంగా వివరించేదే చారిత్రక భాషాశాస్త్రం. అంటే భిన్నకాలాల్లో ఒకే భాషలో జరిగిన మార్పుల్ని వివరించే శాస్ర్తాన్ని చారిత్రక భాషా శాస్త్రం అంటారు. ఈ చారిత్రక పద్ధతి ఎక్కువగా యూరప్ ఖండంలో వ్యాప్తి పొందింది. చారిత్రక భాషాధ్యయనం వర్ణనాత్మక భాషాశాస్త్ర అధ్యయనం మీద ఆధారపడుతుంది.
తులనాత్మక భాషాశాస్త్రం
-రెండు లేక అంతకంటే ఎక్కువ భాషలనుగాని, మాండలికాలనుగానీ భాషాపరంగా పోల్చి చూసి ఆ భాషకు గల సంబంధాన్ని గాని, సంబంధం లేకపోవడాన్ని గాని తెలిపేది తులనాత్మక భాషాశాస్త్రం.
భాషాశాస్త్ర గ్రంథాలు-శాస్త్రవేత్తలు
-ఆంధ్రభాషా చరిత్ర-చిలుకూరి నారాయణరావు
-భాషాశాస్త్ర పరిచయం-బొడ్డుపల్లి పురుషోత్తం
-ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు-పీఎస్ సుబ్రహ్మణ్యం
-వైకృత పద స్వరూప నిరూపణము-తూమాటి దోణప్ప
-తెలుగులో అర్థపరిణామం-జీఎస్ రెడ్డి
-తెలుగు పర్యాయపద నిఘంటువు-జీఎస్ రెడ్డి
-మన లిపి పుట్టుపూర్వోత్తరాలు-తిరుమల రామచంద్ర
-ప్రౌడ వ్యారణము-బహుజనపల్లి సీతారామాచార్యులు
-తెలుగు వాక్యం-చేకూరి రామారావు
విజ్ఞాన సర్వస్వాలు
-ఖండవల్లి లక్ష్మీరంజనం- సంగ్రహాంధ్ర విజ్ఞానకోశం
-కొమర్రాజు లక్ష్మణ రావు- ఆంధ్రవిజ్ఞాన సర్వస్వము
ద్విభాషా నిఘంటువు
-సాహిత్య అకాడమీ- ఇంగ్లిష్-తెలుగు- (భౌణ్య నిఘంటువు- 1853)
-శంకరనారాయణ- తెలుగు-ఇంగ్లిష్, ఇంగ్లిష్-తెలుగు నిఘంటువులు (1900)
-జీఎన్ రెడ్డి- ఇంగ్లిష్-తెలుగు నిఘంటువు (1978)
పద్య నిఘంటువులు
-కస్తూరి రంగకవి- సాంబనిఘంటువు
-అమర సింహుడు- అమరకోశం
-పైడిపాటి లక్ష్మణకవి- ఆంధ్రనామసంగ్రహము
-ఆడిదము సూరకవి- ఆంధ్రనామశేషము
-నుదురుపాటి వేంకనకవి- ఆంధ్రభాషా వర్ణము
-గణపవరపు వేంకటకవి- వేంకటేశాంధ్రము
పద ప్రయోగ కోశం
-బూదరాజు రాధాకృష్ణ- ప్రాచీనాంధ్ర శాసనాలు (1971)
-కొట్ర లక్ష్మీ నారాయణ శాస్త్రి- లక్ష్మీనారాయణీయము (1907)
-కొట శ్యామల కామశాస్త్రి-
ఆంధ్రవాచస్ప్రత్యము (1953)
తెలుగు-తెలుగు నిఘంటువులు
-మామిడి వెంకయ్య- ఆంధ్రదీపిక
-బహుజనపల్లి సీతారామాచార్యులు- శబ్దరత్నాకరం (1885)
-చలమర్ల రంగాచార్యులు- ఆంధ్రశబ్ద రత్నాకరం (1967-70)
-ముసునూరి వెంకటశాస్త్రి- శబ్దార్ధ దీపిక
-మహంకాళి సుబ్బరాయుడు- శబ్దార్దచంద్రిక (1893)
వ్యుత్పత్తి పదకోశం
-ఎమ్ ఎమెనో, టీ బరో- ద్రావిడ భాషాపద వుత్పత్తి పదకోశం (1960)
వృత్తిపదకోశం
-భద్రిరాజు కృష్ణమూర్తి- వ్యవసాయ పదకోశం (1962), చేనేత పదకోశం (1971)
-బూదరాజు రాధాకృష్ణ- వాస్తు పదకోశం (1968), లలిత కళల పదకోశం
-జీఎన్ రెడ్డి- కుమ్మర పదకోశం (1976), వడ్రంగి పదకోశం (1983)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?