First public poet of Telangana | తెలంగాణ తొలి ప్రజాకవి గుణాఢ్యుడు
మన కవులు
గుణాఢ్యుడు క్రీ.పూ 200-150లో వర్థిల్లినాడని చరిత్ర చెపుతుంది. గుణాఢ్యుడు తెలుగువాడే. గుణాఢ్యుని తల్లి బ్రాహ్మణ కన్య అని తండ్రి నాగ ప్రభువు అని పురాతత్వ సాహితీవేత్తలంతా నిర్ధారణ చేశారు. ఆనాటి భాష ప్రాకృత (బ్రాహ్మీ) భాషలో కోటిగాథలు ఉండేవని వాటిలో కేవలం ఏడు సార్లు మాత్రం సంగ్రహింపబడి 274 మంది కవుల పేర్లు ఉన్నట్లుగా చరిత్ర తెలుపుతుంది. అయితే దీన్ని బట్టి చూస్తే శాతవాహన మహారాజులు ప్రాకృత భాషను ప్రత్యేకంగా ఆదరించినట్టు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రాకృత భాష మిక్కిలి ఎక్కువగా (ప్రభలముగా) ఉన్న తరుణం (కాలం)లోనే శర్వవర్మ అనే మరో సంస్కృత పండితుడు సంస్కృత భాషను ఎక్కువ ప్రచారం చేశారు.
శర్వవర్మతో పందెంలో ఓడిన గుణాఢ్యుడు అడవికి పోయి పైశాచిక భాషలో మహాబృహత్కథను రాశాడు. తన ఇద్దరు శిష్యులతో బృహత్కథను శాతవాహనుని దగ్గరకు పంపగా ఈ కథ ముఖ్యంగా ఏడు (7) లక్షల భాష నీరసమైన పైశాచిక భాష అందులో రక్తంతో రాసినది. దీన్ని తిరస్కరించగా శిష్యులు కోపంతో వెళ్లి జరిగినదంతా గుణాఢ్యునికి వివరించగా అప్పుడు గుణాఢ్యుడు రాజు ఆదరించలేదన్న కసితో ఒక్క నర వాహన చరిత్ర తప్ప తక్కిన పూర్తి భాగాన్ని కాల్చివేసెను. చివరికి రాజే స్వయంగా గుణాఢ్యుడి వద్దకెళ్లి క్షమించమని కోరాడట. అప్పుడు గుణాఢ్యుడు తన గ్రంథాన్ని రాజుకు ఇచ్చి అడవులకు వెళ్లిపోయాడు. మిగిలిన గ్రంథాన్ని గుణాఢ్యుని శిష్యులు గణదేవ నందిదేవులు వివరించారు. దీంతో రాజు ఘనంగా సన్మానించి అట్టి పూర్తి కథను విభజింపించి కథావతారమును తెల్పుట కోసం రచింపజేసెను. సోమదేవుడే దీనిని కథా సరిస్సాగరం పేరుతో సంస్కృతీకరించాడు. ఏది ఏమైనా మన ప్రపంచ వాజ్ఞయ చరిత్రలో మొదటి బృహత్కథయే కథా వాజ్ఞయమునకు మూలాధారం అని ఘంటాపథంగా చెప్పవచ్చు. మెదక్ సీమలోని కొండాపూర్ ప్రాంతంలో లభించిన తెలంగాణ (తెలుగు ప్రాంతం) సీమకిది తొలి మహాగ్రంథమని చెప్పుటలో ఎలాంటి సంశయం లేదు.
బ్రహ్మ శివకవి
బ్రహ్మ శివకవి 12వ శతాబ్దానికి చెందినవాడు. పొట్టళగెరె (పొట్లకౌరే) అనే గ్రామం అదే నేటి పొటాన్చెరువు పటాన్చెరువుగా స్థిరపడింది. పొటన్ అంటే పట్టణం, కెరె అంటే చెరువు ఇతని రచనలు కన్నడ సంస్కృతాల్లో లభ్యమవుతాయి. అయితే జైనమత ప్రబంధ కావ్యాలైన త్రైలోక్య చూడామణి-ఛత్తీస్ రత్నమాల అనే గ్రంథాలను సంస్కృత, తెలుగు, కన్నడ భాషల్లో అనువదించినట్టుగా చెపుతున్నారు.
శాతవాహన రాజ్య, ప్రశస్త పుణ్య
దేశమన నొప్పు మంజీర దేశమనగ
బౌద్ధజైన శివాచార్య సిద్దులకును
క్షేత్రమననొప్పుమెతుకు మంజీర భూమి
పొన్నగంటి తెలగనార్యకవి
అచ్చ తెనుంగు (తెలుగు) భాషలో యయాతి చరిత్రను రాసిన మొదటి తెలుగు కవి తెలగన్న. తండ్రి భావనామాత్యుడు పఠాన్చెర్వు వాడైనప్పటికినీ గొలకొండ (గోల్కొండ) నివాసి అయ్యాడు. ఈ పొన్నగంటి తెలగన్న యయాతి చరిత్ర అనే ఈ ప్రబంధమును రచించినప్పుడు అచ్చు తెనుగులోనే రచించాడు. అమీన్ఖాన్ పిలుపు మేరకు మళ్లీ పటాన్చెర్వుకు వచ్చి ఆస్థాన కవి అయినట్టు చెబుతున్నారు. ఆనాటి నుంచే మెదక్ చాళుక్యుల కాలం క్రీ.శ. 1068 నుంచి 1600 వరకు తెలుగు భాషకు ప్రాముఖ్యత చెందిన తెలుగు (తెలంగాణ) గడ్డగా పరిగణింపబడుతుంది.
కం॥ మునుమార్గ కవిత లోకం
బునవెలయగ దేశికవిత బుట్టించి తెను
గను నిలిపి రంధ్ర విషయం
బునజని చాళుక్యరాజు మొదలగు బలువుర్॥
తెలుగు భాషకు సంపూర్ణ స్వరూపం గోల్కొండ కుతుబ్షా నవాబుల కాలంలో మెదక్ జిల్లాలో ఏర్పడిందనవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?