Where do parliamentary affairs begin | పార్లమెంటరీ వ్యవహారాలు వేటితో మొదలవుతాయి?
గ్రూప్స్ ప్రత్యేకం పాలిటి
1. కింది వాక్యాల్లో సరైనది.
ఎ) రాజ్యసభలోనే నామినేటెడ్ సభ్యులుంటారు. లోక్‌సభలో ఉండరు.
బి) రాజ్యాంగం ప్రకారం రాజ్యసభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయవచ్చు.
సి) నామినేట్ చేసిన సభ్యుడిని కేంద్రమంత్రిగా నియమించేందుకు రాజ్యాంగం ప్రకారం ఎటువంటి అడ్డంకి లేదు
డి) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు రెండింటిలోనూ నామినేట్ అయిన సభ్యుడు ఓటు వేయవచ్చు.
2. రాజ్యాంగ సవరణను ఎవరు మొదట చేపట్టవచ్చు?
1. లోక్‌సభ 2. రాజ్యసభ
3. రాష్ట్ర శాసనసభ 4. రాష్ట్రపతి
ఎ) 1 బి) 1, 2, 3 సి) 2, 3, 4 డి) 1, 2
3. పార్లమెంటులో నక్షత్రపు గుర్తుగల ప్రశ్నకు ఏ విధమైన సమాధానం రావాలి?
ఎ) లిఖితపూర్వక సమాధానం
బి) మౌఖిక సమాధానం
సి) సమాధానం ఇవ్వకపోవడం
డి) చర్చతో కూడిన సమాధానం
4. స్పీకర్‌కు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
ఎ) రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు
బి) లోక్‌సభ మధ్యంతరంగా రద్దయితే పదవి కోల్పోతారు
సి) తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్‌కు సమర్పిస్తారు
డి) తాను లోక్‌సభ సభ్యుడు కానవసరం లేదు.. స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత సభ్యుడు కావచ్చు
5. పార్లమెంటరీ వ్యవహారాలు వేటితో మొదలవుతాయి?
ఎ) వాయిదా తీర్మానం బి) ప్రశ్నోత్తరాల సమయం
సి) జీరో అవర్ డి) సావధాన తీర్మానం
6. ప్రాథమిక హక్కులపై కింది కేసులను పరిశీలించి జతపర్చండి.
1. సీపీఐ (ఎం) Vs భరత్ కుమార్ ఎ. లౌకిక అనేది ప్రవేశికలో అంతర్భాగం
2. అరుణ షాన్‌బాగ్ బి. జీవించే హక్కులో విద్యాహక్కు ఒక భాగం
3. ఎస్ఆర్ బొమ్మై కేసు సి. బంద్‌లు చట్ట వ్యతిరేకం
4. ఉన్నికృష్ణన్ Vs ఆంధ్రప్రదేశ్ డి. కారుణ్య మరణం నిషేధం
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-డి
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
డి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
7. ప్రాథమిక హక్కులపై కింది కేసులను పరిశీలించి జతపర్చండి.
1. చిరంజిత్లాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా
ఎ. సమానులలో మాత్రమే సమానత్వం అమలు
2. చంపకం దొరై Vs మద్రాస్ బి. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవు
3. ఇందిరాసహానీ Vs ఇండియా (మండల్ కేసు) సి. ఓబీసీల రిజర్వేషన్ చెల్లుబాటు గురించి
4. మురళీదేవ్‌రా Vs యూనియన్ ఆఫ్ ఇండియా డి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం
ఎ) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
డి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
8. సరైన సమాధానం గుర్తించండి.
ప్రతిపాదన (A): కేంద్ర మంత్రులు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు.
కారణం (R): ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారని ప్రకరణ 75(2) తెల్పుతుంది.
ఎ) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు డి) A తప్పు, R నిజం
9. సరైన సమాధనం గుర్తించండి.
ప్రతిపాదన (A): లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవీకాలం సాధారణంగా ఐదేండ్లు
కారణం (R): రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవీకాలం సాధారణంగా ఆరేండ్లు
ఎ) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు డి) A తప్పు, R నిజం
10. భారత న్యాయవ్యవస్థ పితామహునిగా పేర్కొంటారు?
ఎ) సర్ ఎలిజా ఇంపే బి) వారెన్ హేస్టింగ్
సి) కారన్ వాలీస్ డి) లార్డ్ మేయో
11. కింది వారిలో ఎవరి ఎన్నికల వివాదాలను సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది?
1. ప్రధానమంత్రి 2. రాష్ట్రపతి
3. ఉపరాష్ట్రపతి 4. స్పీకర్ 5. ముఖ్యమంత్రి
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4 సి) 2, 3, 5 డి) 2, 3
12. రాజ్యాంగంపై అంతిమ వ్యాఖ్య చేసే అధికారం ఎవరిది?
ఎ) రాష్ట్రపతి బి) పార్లమెంటు
సి) సుప్రీంకోర్టు డి) సుప్రీంకోర్టు, హైకోర్టు
13. న్యాయసమీక్ష కిందికి వచ్చేవి ఏవి?
1. పార్లమెంటు చేసిన చట్టాలు
2. రాజ్యాంగ సవరణలు
3. రాష్ట్ర విధానసభ చేసిన చట్టాలు
ఎ) 1, 2, 3 బి) 1, 3 సి) 2, 3 డి) ఏవీకావు
14. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలకు సంబంధించి కింది వాటిలో సరైనదేది?
1. పదవీలో ఉండగా తగ్గించరాదు
2. పదవీలో ఉండగా తగ్గించవచ్చు
3. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో తగ్గించవచ్చు
4. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో తగ్గించవచ్చు
ఎ) 1, 2 బి) 2, 3 సి) 1, 4 డి) 2, 4
15. గవర్నర్ కింది వారిలో ఎవరిని తొలగిస్తారు?
1. అడ్వకేట్ జనరల్ 2. వైస్ చాన్సలర్
3. ముఖ్యమంత్రి 4. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్
ఎ) 1,2,3, 4 బి) 2, 3, 4
సి) 3, 4 డి) 1, 2, 3
16. రిట్స్‌కు సంబంధించి కింది వాటిని జతపర్చండి.
1. హెబియస్ కార్పస్ ఎ. మీ అధికారమేంటి
2. కోవారెంటో బి. టు బి సర్టిఫైడ్
3. మాండమస్ సి. శరీరాన్ని కలిగి ఉండటం
4. సెర్షియోరరీ డి. మేం ఆదేశిస్తున్నాం
ఎ) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
బి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
సి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
డి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
17. రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాలకు సంబంధించి కింది వాటిని జతపర్చండి.
1. రిప్రైవ్ ఎ. శిక్షను మార్పుచేయడం
2. రెస్పైట్ బి. శిక్షను తగ్గించడం
3. రెమిషన్ సి. శిక్ష నుంచి తాత్కాలిక ఉపశమనం
4. కముటేషన్ డి. శిక్ష అమలుకాకుండా వాయిదా వేయడం
ఎ) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
బి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
18. సరైన జవాబును గుర్తించండి.
ప్రతిపాదన (A): బడ్జెట్‌ను లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి
కారణం (R): ద్రవ్య బిల్లును రాజ్యసభ గరిష్టంగా 14 రోజులు నిలుపుదల చేయవచ్చు.
ఎ) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు డి) A తప్పు, R నిజం
19. సరైన జవాబును గుర్తించండి.
ప్రతిపాదన (A): ప్రకరణ 40 గ్రామపంచాయతీల ఏర్పాటు గురించి పేర్కొంటుంది
కారణం (R): ఇది గాంధేయవాద సూత్రం కాదు
ఎ) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు డి) A తప్పు, R నిజం
20. శాసనసభ ఉన్న కేంద్ర పాలితప్రాంతాలు?
1. అండమాన్ నికోబార్ 2. ఢిల్లీ
3. చండీగఢ్ 4. పుదుచ్చేరి 5. లక్షద్వీప్
ఎ) 1, 2, 3 బి) 2, 3 సి) 2, 4 డి) 4, 5
21. పార్లమెంటు రాష్ట్ర జాబితాలో ఏ పరిస్థితిలో చట్టాలు చేయవచ్చు?
ఎ) జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో
బి) రాజ్యసభ ప్రత్యేక తీర్మానం చేసినప్పుడు
సి) అంతర్జాతీయ ఒప్పందాల అమలు విషయంలో
డి) పైవన్నీ
22. ఏ కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక హైకోర్టు ఉంది?
ఎ) పుదుచ్చేరి బి) చండీగఢ్
సి) ఢిల్లీ డి) అండమాన్ నికోబార్ దీవులు
23. రాజ్యాంగంలో జమ్ముకశ్మీర్‌కు వర్తించని అంశాలు?
1. ప్రాథమిక హక్కులు 2. ఆదేశిక సూత్రాలు
3. ప్రాథమిక విధులు 4. ఆర్థిక అత్యవసర పరిస్థితి
ఎ) 1, 2 బి) 2, 3, 4
సి) 1, 3, 4 డి) పైవేవీ కావు
24. రాజ్యాంగం ప్రకారం భారతదేశం?
ఎ) సమాఖ్య బి) అర్ధసమాఖ్య
సి) ఏక కేంద్ర లక్షణాలుగల సమాఖ్య
డి) రాష్ట్రాల సమ్మేళనం
25. 1990లో ఏ కమిషన్ సిఫారసు మేరకు అంతర్రాష్ర్ట మండలిని ఏర్పాటు చేశారు?
ఎ) సర్కారియా కమిషన్ బి) రాజ్మనార్ కమిషన్
సి) అశోక్ మెహతా కమిటీ డి) ఏదీకాదు
26. మంత్రిమండలి సమిష్టి బాధ్యతాసూత్రాన్ని ధిక్కరించడంతో కేంద్ర మంత్రిమండలి నుంచి తొలగించబడిన మంత్రులు?
1. బీఆర్ అంబేద్కర్ 2. వీవీ గిరి
3. జాన్ మథాయ్
4. సీడీ దేశ్‌ముఖ్ 5. మొరార్జీ దేశాయ్
6. వీపీ సింగ్
ఎ) 3, 5, 6 బి) 1, 3, 6
సి) 2, 3, 4 డి) పై అందరూ
27. రాష్ట్ర శాసన మండలికి గవర్నర్ కింది ఏ రంగాల వారిని సభ్యులుగా నామినేట్ చేస్తారు?
1. సాహిత్యం
2. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం
3. కళలు
4. సామాజిక సేవా రంగం 5. సహకార రంగం
ఎ) 1, 2, 3 బి) 2, 3, 5
సి) 1, 2, 3, 4 డి) పై అన్ని రంగాల వారిని
28. సరైన సమాధానం గుర్తించండి.
ప్రతిపాదన (A): ప్రకరణ 64 – ఉపరాష్ట్రపతి పదవీరీత్యా రాజ్యసభ ఛైర్మన్‌గా ఉంటారు
కారణం (R): ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్‌గా జీతభత్యాలు పొందుతారు
ఎ) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు డి) A తప్పు, R నిజం
29. సరైన సమాధానం గుర్తించండి.
ప్రతిపాదన (A): ప్రాథమిక విధులు మౌలిక రాజ్యాంగంలో ఉన్నాయి
కారణం (R): ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు
ఎ) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు డి) A తప్పు, R నిజం
30. రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని సవరించాలంటే ఏ పద్ధతిని ఉపయోగిస్తారు?
ఎ) పార్లమెంట్ సాధారణ మెజారిటీ పద్ధతి
బి) పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీ పద్ధతి
సి) పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీ పద్ధతి, సగం కన్నా ఎక్కువ రాష్ట్రాల శాసనసభల సాధారణ మెజారిటీ పద్ధతి
డి) పైవేవీకావు
31. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించాలని ఏ కమిటీ సిఫారసు చేసింది?
ఎ) బల్వంతరాయ్ మెహతా బి) అశోక్ మెహతా
సి) దంత్వాలా డి) ఎల్ఎమ్ సింఘ్వీ
32. ఏ కమిటీ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరగాలని సిఫారసు చేసింది?
ఎ) బల్వంతరాయ్ మెహతా బి) అశోక్ మెహతా
సి) దంత్వాలా డి) ఎల్ఎమ్ సింఘ్వీ
33. ఏ కమిటీ పంచాయతీ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరగాలని సిఫారసు చేసింది?
ఎ) బల్వంతరాయ్ మెహతా బి) అశోక్ మెహతా
సి) దంత్వాలా డి) ఎల్ఎమ్ సింఘ్వీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?