Miracles with online reading | ఆన్లైన్ చదువుతో అద్భుతాలు
రోజురోజుకు సాంకేతికత పెరుగుతున్నది. ఇప్పుడు అరచేతిలోనే సమస్తం. విద్యావ్యవస్థలో కూడా టెక్నాలజి పరుగులు పెడుతున్నది. విద్యార్థులు ఎక్కడికో వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని దేశ, విదేశాల్లో ఉండే ప్రముఖ బోధన రంగ నిపుణుల పాఠాలు వినే అవకాశం. ఇదే సందర్భంలో నైపుణ్యం, నాలెడ్జ్ ఉన్న సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ ఆన్లైన్లో బోధించి వేలు, లక్షల రూపాయ లు సంపాదించే అవకాశాలను ఆన్లైన్/ ఈ-లెర్నింగ్ విధానం కల్పిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆన్లైన్/ ఈ- లెర్నింగ్ అవకాశాలపై ఈ వారం ప్రత్యేకం.
స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వచ్చాక అన్ని రంగాల్లో శరవేగంగా మార్పులు వస్తున్నాయి. మూడు దశాబ్దాల కింద పాఠం అర్థం కాకుంటే, ఆయా సబ్జెక్టు టీచర్లు లేకుంటే పిల్ల లు ఏమి చేయలేని దుస్థితి. అదేవిధంగా గతంలో ఎమ్మెస్సీ, పీహెచ్డీ, బీఎడ్ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యావంతులు ఉద్యోగం కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితులు మారుతున్నాయి. 1990 దశకంలో ప్రారంభమైన ఈ -లెర్నింగ్/ఆన్లైన్ పాఠాలు అటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులకు వరంగా మారుతున్నాయి. సాంకేతిక పెరుగుతున్న కొద్ది విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. విదేశాల్లో సుమారు మూడు దశాబ్దాల కిందటే ఈ రంగం విస్తరించగా, భారత్‌లో గత ఐదారేండ్లుగా వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే పలు విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థ లు ఈ రంగంలో అడుగుపెట్టాయి.
నిరుద్యోగులకు…
ఉన్నత చదువులు చదివి ఎక్కడికో వెళ్లి, ఎవరి దగ్గరో పనిచేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండి, అనువైన సమయాల్లో బోధన చేస్తే చాలు వేల నుంచి లక్షల రూపా యల వరకు సంపాదించే అవకాశం ఆన్లైన్ ట్యూషన్స్ /ఈ-లెర్నింగ్‌తో సాధ్యమవుతుంది. కాకుంటే ఇంగ్లిష్ మీడియంలో బోధించగలిగే సామర్థ్యం ఉండాలి. ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ప్రతి గ్రామం నుంచి ఈ ఉద్యోగాలు చేసుకొ నే అవకాశం ఉంది. పలు సంస్థలు ఉన్నత, ప్రతిభావంతులైన విద్యావంతులు, అనుభవజ్ఞులకు అవకాశాలను కల్పిస్తున్నాయి.
దేశంలో అవకాశాలు
అమెరికాలో ట్యూషన్ రంగంలో ఆరు శాతం ఆన్లైన్ టీచింగ్ వల్ల వస్తుందని ఒక సర్వేలో తేలింది. ఇది ఏటేటా పెరుగుతుంది. ఇక భారత్‌లో ట్యుటోరియల్/కోచింగ్ రంగంతో వేల కోట్ల రూపాయల మార్కెట్ అవుతుంది. కానీ దీనిలో ఆన్లైన్ వాటా కేవలం రెండు నుంచి మూడు శాతం మాత్రమే ఉంది. రెండేండ్ల కింద అసోచామ్ సర్వే ప్రకారం దేశంలో ఏటా 35 శాతం ఈ-లెర్నింగ్ మార్కెట్ పెరుగు తుంది. ఇటీవల కాలంలో స్మార్ట్ఫోన్ల వాడకం పెరుగుతుండటంతో ఆన్లైన్ ట్యూషన్స్ కూడా వేగంగా వృద్ధి చెందుతున్నాయి.
నిపుణులైన అధ్యాపకుల కోసం కి.మీ.కొద్ది ప్రయాణించి పాఠాలు వినాల్సిన పరిస్థితుల నుంచి విద్యార్థికి విముక్తి కలిగే రోజులు వచ్చాయి. ఉపాధ్యాయులకు ఇష్టమైన, అందుబాటులో ఉన్న సమయంలో పాఠాలను బోధించే అవకాశం ఆన్లైన్ ట్యూషన్స్ కల్పిస్తున్నాయి.
దేశంలో ముఖ్యంగా ఐఐటీ, ఎంసెట్, మెడికల్ వంటి ప్రవేశ పరీక్షల కోసం ఇప్పటికే ఈ విధానం బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది. దేశంలోని ప్రముఖ కోచింగ్ సెంటర్లు ఇప్పటికే ఈట్యూషన్స్ను ప్రారంభించాయి. ఆకాశ్, ఫిట్జీ, ఎడెక్స్, ఖాన్ అకాడమీ, ఈ -లెర్నింగ్ సొల్యూషన్స్, వేదాం త్ వంటి సంస్థలు పలు సబ్జెక్టులను ఈ-ట్యూషన్స్/ ఈ-లెర్నింగ్ ద్వారా అందిస్తున్నాయి.
లాంగ్వేజెస్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలే కాకుండా సోషల్ సైన్సెస్, సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షలకు కోచింగ్ ఇచ్చే వారికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
-గ్రామీణ అభ్యర్థులకు : ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆర్థికంగా, కుటుంబ పరంగా ఉన్న ఇబ్బందులతో హైదరాబాద్ వంటి నగరాలకు రాలేక అవస్థ లు పడుతున్నారు. అయితే ఇటీవల గ్రామీణ ప్రాంతా ల్లో సైతం 4జీ సౌకర్యం అందుబాటులోకి వస్తుండటంతో ఆన్లైన్ ట్యూటర్స్ వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
టీచింగ్ ఎలా..
ఈ విధానం వల్ల మంచి నైపుణ్యం ఉన్న అభ్యర్థి గంటల లెక్కన లేదా రోజుల లెక్కన లేదా సబ్జెక్టు పూర్తి చేస్తే ఇంత అనే పద్ధతుల్లో ఫీజును వసూలు చేస్తారు. ముంబైకి చెందిన ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ విదేశాల్లో విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్ బోధిస్తూ ఇంటి నుంచే నెలకు సుమారు 40 -50 వేల వరకు సంపాదిస్తున్నాడు. అభ్యర్థుల అనుభవం, సబ్జెక్టుల్లో ప్రావీణ్యతను బట్టి ఆయా సంస్థలు గంటకు వందల నుంచి వేల రూపాయల వరకు చెల్లిస్తున్నాయి.
– దేశంలో కొన్ని ప్రముఖ సంస్థలు: ఖాన్ అకాడమీ (https://www.khanacademy.org), బెంగళూరులో ఐఐటీయన్లు నిర్వహిస్తున్న వేదాంత్ https://www.vedantu.com,
https://www.myprivatetutor.com,
http://www.hashlearn.com
http://www.aakash.ac.in
http://www.kautilyacareers.com
ఇవేకాకుండా పలు ఇతర సంస్థలు ఈ రంగంలో దూసుకెళ్తున్నాయి. ఇటు విద్యార్థులకు, అటు విద్యావంతులైన నిరుద్యోగులకు ఈ రంగం రానున్న రోజుల్లో మంచి భవిష్యత్‌ను ఇస్తుందనటం అతిశయోక్తి కాదు.
సమయం, డబ్బు ఆదా
ఆన్లైన్ కోచింగ్‌తో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఉన్నత విద్యావంతులు, సబ్జెక్టు నిపుణులు ఆన్లైన్ కోచింగ్‌తో తమకు వీలైన సమయంలో పాఠాలు రికార్డింగ్ చేసుకొని, వాటిని గ్రామీణ విద్యార్థులకు అందుబాటులోకి తేవడం వల్ల ఉభయులకు సమయం కలిసి వస్తుంది. అదేసమయంలో పేద విద్యార్థులకు సహా యం చేసిన వారు అవుతారు.
హైదరాబాద్ వంటి నగరాలకు రాలేక, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఉన్న విద్యార్థులు తమ ఊరిలోనే ఉండి ఆన్లైన్ పాఠాల ద్వారా సివిల్స్, గ్రూప్స్, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే, డీఎస్సీ వంటి జాబ్స్‌ను సాధించవచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. తక్కువ ఫీజుతోనే ఈ అవకాశం ఉంది. రాష్ట్రంలో మొదటిసారి మేము కౌటిల్య కెరీర్స్ పేరుమీద ఆన్లైన్ కోచింగ్ ప్రారంభించాం. మొదట్లో అంత స్పందన లేదు. కానీ రోజురోజుకు ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ సేవలను ఉపయోగించుకొంటున్నారు. అదేవిధంగా ప్రముఖ కోచింగ్ సెంటర్స్ నిపుణుల సేవలను అందరికి అందిస్తున్నామన్న తృప్తి మాకు కలుగుతుంది. ఉన్నత విద్యావంతులకు కూడా ఉపాధి లభిస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?